అనంతపురం : అనంత రైతును దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ప్రస్తుతం జిల్లాలో టమాటా రైతుల పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. పంట చేతికొచ్చినా మార్కెట్ ధర నేలకు పడిపోవడంతో సరుకును ఉచితంగా పంచుతున్నారు. అనంతపురంలో ఆదివారం నాగరాజు అనే రైతు టమాటాలను ఉచితంగా పంచాడు. అనంతపురం జిల్లా నార్పల మండలం పప్పూరు బండ్లపల్లికి చెందిన రైతు అశ్వర్థ కుమారుడు నాగరాజు 150 బాక్స్ (2,250 కేజీలు) టమాటాని మార్కెట్‌కి తెచ్చాడు.అయితే కనీస ధర కూడా లేకపోవడంతో సరుకుని తీసుకువచ్చి ఎల్‌ఐజీ బస్టాండ్ సమీపంలోని లక్ష్మీనరసయ్య కాలనీలో ఉచితంగా అందరికీ పంచారు.
ఈ సందర్భంగా రైతు నాగరాజు మాట్లాడుతూ మార్కెట్ ధర చూస్తే ట్రాక్టర్ డీజిల్ ఖర్చుకు కూడా వచ్చేలా కనిపించలేదు. అంత సరుకుని వెనక్కి తీసుకెళ్లలేక ఉచితంగా ఇచ్చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.