ఓపెన్ స్కూల్ సొసైటీ పుస్తకాల పంపిణీలో జాప్యం
గుంటూరు ఎడ్యుకేషన్: దూరవిద్య ద్వారా పదో తరగతి, ఇంటర్ కోర్సుల్లో చేరిన అభ్యర్థులకు ప్రభుత్వం చుక్కలు చూపిస్తోంది. ఆగస్టులో అడ్మిషన్ పొందిన అభ్యర్థులకు డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయకుండా ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్‌ఎస్) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది.
2024–25 విద్యాసంవత్సరానికి ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో నిర్వహించిన అడ్మిషన్ల ద్వారా టెన్త్, ఇంటర్ కోర్సుల్లో దాదాపు లక్ష మంది ప్రవేశం పొందారు. వీరికి వచ్చే ఏడాది మార్చిలో పరీక్షలు జరుగుతాయి. వీరందరికీ ప్రస్తుతం గుంటూరులోని ఏపీఓఎస్ ఎస్ రాష్ట్ర కార్యాలయం నుంచి పాఠ్య పుస్తకాలను పోస్టాఫీసుల ద్వారా పంపుతున్నారు. డిసెంబర్ నెలాఖరుకు సైతం పాఠ్య పుస్తకాలు అందే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇప్పటికి 30 వేల మందికి పైగా పుస్తకాలు అందించినట్టు ఏపీఓఎస్‌ఎస్ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment