
రైతు కుటుంబాలకు నగదు పంపిణీ
లకారం(కోదాడరూరల్): మండల పరిధిలోని గోండ్రియాల పీఏసీఎస్‌లో సభ్యత్వం కలిగి అనారోగ్యంతో స్థానిక మహిళ రైతు నెల్లూరి రోశమ్మ, లకారం చెందిన కంకణాల జయరాజులు ఇటీవల మృతి చెందారు. వారి దహన సంస్కారాల నిమిత్తం మంజూరైన రూ.10 వేల నగదును వేర్వేరుగా బుధవారం సంఘ చైర్మన్ బుర్రా న ర్సింహారెడ్డి మృతుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఈఓ జి.శ్రీనివాసరెడ్డి, సర్పంచ్‌లు టి.సక్కుబాయి, ఎం.పద్మ, ఎంపీటీసీ సభ్యులు ఎన్.వీరభద్రరావు, రామకృష్ణ, డైరెక్టర్లు జి.శ్రీనివాసరావు, జి. వెంకటేశ్వర్లు, జగన్‌మోహన్‌నావు, బి.వెంకటేశ్వర్లు, ఎం.సత్యవతి, కె.ఆలీసు, రోజానమ్మ, కార్యదర్శి టి.నరసింహారావు, కె.వెంకటరత్నం, జి.వీరమల్లు పాల్గొన్నారు.