
కేజీ టమాటా రూ.65కే విక్రయాలు ప్రారంభించిన కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: టమాటాలను అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్న దళారుల ధరల దోపిడీ నుంచి సామాన్యులకు కాస్తంత ఉపశమనం కలి్పంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచి్చంది. ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో సబ్సిడీ ధరకే కేజీ రూ.65కు టమాటాలు విక్రయిస్తోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం ఢిల్లీలో మొబైల్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. మరో నాలుగు రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయని నిధి ఖరే చెప్పారు.
నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌సీసీఎఫ్) కు చెందిన వ్యాన్‌లో ఢిల్లీసహా శివారులోని 56 ప్రాంతాల్లో రూ.65కే టమాటాలు విక్రయిస్తున్నారు. టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల తుపాన్లు, వరదల కారణంగా టమాటా దిగుబడి బాగా తగ్గింది. దీంతో దళారులు ఒక్కసారిగా టమాటా రేటు పెంచేశారు. ప్రస్తుతం ఢిల్లీసహా రాజధాని శివారు ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.120 పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు నేరుగా హోల్‌సేల్ మార్కెట్‌ల నుంచి కొనుగోలు చేసి టమాటా కిలో రూ.65కే అందించాలని కేంద్రం నిర్ణయించడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment