Subsidized prices
-
ఢిల్లీలో సబ్సిడీ రేటుకే
సాక్షి, న్యూఢిల్లీ: టమాటాలను అధిక ధరలకు విక్రయిస్తూ సామాన్యుల జేబుకు చిల్లుపెడుతున్న దళారుల ధరల దోపిడీ నుంచి సామాన్యులకు కాస్తంత ఉపశమనం కలి్పంచే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచి్చంది. ఢిల్లీ సహా జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్)లో సబ్సిడీ ధరకే కేజీ రూ.65కు టమాటాలు విక్రయిస్తోంది. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం ఢిల్లీలో మొబైల్ వ్యాన్లను జెండా ఊపి ప్రారంభించారు. మరో నాలుగు రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయని నిధి ఖరే చెప్పారు. నేషనల్ కోఆపరేటివ్ కన్జూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్సీసీఎఫ్) కు చెందిన వ్యాన్లో ఢిల్లీసహా శివారులోని 56 ప్రాంతాల్లో రూ.65కే టమాటాలు విక్రయిస్తున్నారు. టమాటా పండించే ప్రధాన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఇటీవల తుపాన్లు, వరదల కారణంగా టమాటా దిగుబడి బాగా తగ్గింది. దీంతో దళారులు ఒక్కసారిగా టమాటా రేటు పెంచేశారు. ప్రస్తుతం ఢిల్లీసహా రాజధాని శివారు ప్రాంతాల్లో కిలో టమాటా ధర రూ.100 నుంచి రూ.120 పలుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలకు నేరుగా హోల్సేల్ మార్కెట్ల నుంచి కొనుగోలు చేసి టమాటా కిలో రూ.65కే అందించాలని కేంద్రం నిర్ణయించడం తెల్సిందే. -
మళ్లీ రిలయన్స్ బంకులు షురూ
న్యూఢిల్లీ: డీజిల్ ధరలపై ప్రభుత్వ నియంత్రణ తొలగింపు నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్) బంకులు తెరుచుకుంటున్నాయి. గతంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ(ఓఎంసీ) సబ్సిడీ ధరల దెబ్బకు తట్టుకోలేక మూసేసిన వాటిలోని ఐదో వంతు(230)బంకుల్లో విక్రయాలను మళ్లీ ప్రారంభించినట్లు ఆర్ఐఎల్ వెల్లడించింది. మూడో క్వార్టర్ ఫలితాల అనంతరం ఇన్వెస్టర్లకు ఈ విషయాన్ని తెలిపింది. 2008 మార్చి నాటికి ఆర్ఐఎల్ తనకున్న మొత్తం 1,432 బంకులనూ మూసివేసింది. కాగా, తమ మొత్తం బంకుల నెట్వర్క్ను ఏడాది వ్యవధిలో తిరిగి ప్రారంభించే సన్నాహాల్లో ఉన్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. గతేడాది అక్టోబర్లో మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు డీజిల్ రేట్లపై నియంత్రణను తొలగించడం తెలిసిందే. ఇప్పటికే ఎస్సార్ కూడా...: 2010 సంవత్సరం జూన్లో అప్పటి యూపీఏ ప్రభుత్వం పెట్రోలు ధరలపై నియంత్రణలను ఎత్తివేయడంతో మరో ప్రైవేటు చమురు రిటైలర్ ఎస్సార్ తమకున్న 1,400 మేర అవుట్లెట్లలో పెట్రోలు విక్రయాలను ప్రారంభించింది. డీజిల్ డీకంట్రోల్ నేపథ్యంలో తమ బంకులన్నింటిలో డీజిల్ విక్రయాలను కూడా మొదలుపెట్టింది. దీంతోపాటు బంకుల సంఖ్యను 1,600కు పెంచుకుంది. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్యను 2,500కు చేర్చే ప్రయత్నాల్లో ఉంది.