ప్రస్తుతం అత్యంత ఖరీదైన వస్తువుల్లో టమాటా కూడా చేరిపోయింది. కొనుగోలు చేయడానికి ఆలోచిస్తే పరవాలేదు, కొన్నది వండుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది, మళ్ళీ కొనగలమో లేదో అని. టమాట రేటు ఆకాశానికి చేరిన వార్త తెలుసుకుందో ఏమో వంటింట్లో ఉంచిన టమాటాల వద్ద ప్రత్యక్షమైంది ఒక కోడె నాగు. అక్కడే ఉండి వాటి జోలికి ఎవ్వరూ రాకుండా కాపలా కాసింది.
పాములు సాధారణంగా ఇళ్లల్లోకి వచ్చినా మనుషుల కంట పడకుండా ఎక్కడో మూల వెలుతురు పడని చోట నక్కి ఉంటాయి లేదా ఏదైనా కలుగులోకి దూరి దాక్కుంటాయి. కానీ ఒక తాచు పామును టమాటాలు ఆకర్షించాయో లేక వాటి ధర ఆకట్టుకుందో గాని ఇంట్లోకి చొరబడి అవి ఉన్న ప్లేటును చుట్టుకుని కాపలాగా కూర్చుంది. ఎవరైనా వాటి జోలికి వస్తే చాలు కాటేసేందుకు పడగ విప్పి బుసలు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే విశేష స్పందన వచ్చింది.
టమాటా ధర రోజురోజుకూ పెరుగుతూ సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉంది. రెండు నెలల క్రితం రూ.20 ఉండే కిలో టమాటా చూస్తుండగానే సెంచరీ పూర్తి చేసుకుని డబుల్ సెంచరీ వైపుగా పరుగులు తీస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే వీటి ధర ఇప్పటికే రూ.200 మార్కు అందుకుని రూ. 250 చేరుకునే క్రమంలో ఉంది.
ఇది కూడా చదవండి: పోక్సో చట్టం దుర్వినియోగం.. బాంబే హైకోర్టు కీలక తీర్పు
Comments
Please login to add a commentAdd a comment