మన వంట ఇంట్లో టమాటా లేనిదే సాధారణంగా ఏ వంటకం పూర్తికాదు. ప్రతీ కూరలో టమాటా ఉండాల్సిందే. ఇపుడేమో టమాటా కొండెక్కి కూచుంది. కిలో వందరూపాయలు పెట్టి కొనాలా? వద్దా అని వంద సార్లు ఆలోచించి. చివరికి పావుకిలోతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైనా ఒకటి మార్కెట్లో ఆకాశాన్నంటుతున్నపుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే. అందుకే టమాటాకు బదులుగా, దాదాపు అదే రుచి, చిక్కదనం వచ్చేలా ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఒకసారి చూద్దాం.
చింతపండు: సాధారణంగాకూరల్లో గ్రేవీ, పులుపు రుచి కోసం టమాటాను వాడతాం. కాబట్టి టమాటాకు బదులుగా చింతపండును వాడుకోవచ్చు. చిక్కదనం కూడా పొందవచ్చు.
వెనిగర్: టామాటామాదిరిగానే వెనిగర్ కూడా పుల్లని రుచి కలిగి ఉంటుంది. సో.. పచ్చడి, పులుసుల్లో వెనిగర్‌తో టమాటా లోటును పూరించుకోవచ్చు. చక్కని రుచి కూడా లభిస్తుంది.
మామిడి కాయ: సీజన్‌ను బట్టి పచ్చి మామిడికాయను టమాటాకు బదులుగా వాడుకోవచ్చు. చవగ్గా దొరికితే చింతచిగురు మంచిదే.
మామిడి ఒరుగులు: అలాగే వేసవి కాలంలో ఎక్కువగా దొరికే మామిడి కాయలను ఉప్పు వేసి ఊరబెట్టి, బాగా ఎండబెట్టకుని నిల్వ చేసుకని, టమాటాకు బదులుగా వాడుకోచ్చు.
పుల్లటి పెరుగు: పెరుగు టమాటాకు బదులు వంటల్లో వాడితే కూర గ్రేవీ వస్తుంది. చిక్క దనాన్ని, టామాటా తిన్న అనుభూతిని ఇస్తుంది. కాబట్టి టామాటాకు బదులు వెజ్, నాన్ వెజ్ అన్ని వంటకాల్లో పెరుగును వేసుకోవచ్చు.
గుమ్మడి: సహజమైన తీపితో ఉండే గుమ్మడికాయను వంటకాల్లో టమాటాకు బదులు గుమ్మడికాయను వాడవచ్చు.
క్యాప్సికమ్,లేదా బెల్ పెప్పర్: పసుపు, రెడ్, గ్రీన్ కలర్స్‌ల లభించే క్యాప్సికమ్‌ను కూరల్లో టమాటాకు బదులు, కలుపుగా వాడుకోవచ్చు.
ఎలిఫెంట్ యాపిల్ : మన దేశంలో ఎక్కువగా తూర్పువైపున సాగు చేస్తారు. బంగ్లాదేశ్, మలేషియాలో ఎక్కువగా ఉంటాయి. అస్సామీ, బెంగాలీ వంటలలో ప్రత్యేక రుచి కోసం వీటిని వినియోగిస్తారు. దొరికితే ఇవి కూడా వంటలకు టమాటా రుచిని ఇస్తాయి.
ఆనియన్ పౌడర్ లేదా గ్రాన్యూల్స్: మార్కెట్లోరెడీమేడ్‌గా దొరికే ఉల్లిపాయ పొడి ఉల్లి రుచి లోటును తీరుస్తుంది.
స్ప్రింగ్ ఆనియన్స్ : నాన్‌వెజ్ లాంటి కూరల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉపయోగించవచ్చు. చిన్న బాల్కనీల్లో , మిద్దె తోటల్లో ఈజీగా పెంచుకోవచ్చు.
పీనట్ పేస్ట్: టమాటా గ్రేవీవాడే కూరల్లో పీనట్ పేస్ట్ మిక్స్ యాడ్ చేసుకోవచ్చు. వేయించిన వేరుశెనగలను మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసి గ్రేవీలాగా వాడుకోవడమే.
టమాటా ఒరుగులు
వర్షాల కారణంగా సరఫరా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడం ధరలు పెరగడానికి కారణం. అందుకే టొమాటో తక్కువ రేటులో సులభంగా దొరికినపుడు వాటిని ఎండబెట్టి ఒరుగులు మాదిరిగా చేసుకొని నిల్వ చేసుకోవడం మరో చక్కటి పరిష్కారం.
Comments
Please login to add a commentAdd a comment