veniger
-
కొండెక్కిన టమాటా : బోలెడన్ని ప్రత్యామ్నాయాలు, ట్రై చేశారా?
మన వంట ఇంట్లో టమాటా లేనిదే సాధారణంగా ఏ వంటకం పూర్తికాదు. ప్రతీ కూరలో టమాటా ఉండాల్సిందే. ఇపుడేమో టమాటా కొండెక్కి కూచుంది. కిలో వందరూపాయలు పెట్టి కొనాలా? వద్దా అని వంద సార్లు ఆలోచించి. చివరికి పావుకిలోతో సరిపెట్టుకుంటున్న పరిస్థితి. అయితే ఏదైనా ఒకటి మార్కెట్లో ఆకాశాన్నంటుతున్నపుడు ప్రత్యామ్నాయం వెతుక్కోవాల్సిందే. అందుకే టమాటాకు బదులుగా, దాదాపు అదే రుచి, చిక్కదనం వచ్చేలా ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఒకసారి చూద్దాం.చింతపండు: సాధారణంగాకూరల్లో గ్రేవీ, పులుపు రుచి కోసం టమాటాను వాడతాం. కాబట్టి టమాటాకు బదులుగా చింతపండును వాడుకోవచ్చు. చిక్కదనం కూడా పొందవచ్చు. వెనిగర్: టామాటామాదిరిగానే వెనిగర్ కూడా పుల్లని రుచి కలిగి ఉంటుంది. సో.. పచ్చడి, పులుసుల్లో వెనిగర్‌తో టమాటా లోటును పూరించుకోవచ్చు. చక్కని రుచి కూడా లభిస్తుంది. మామిడి కాయ: సీజన్‌ను బట్టి పచ్చి మామిడికాయను టమాటాకు బదులుగా వాడుకోవచ్చు. చవగ్గా దొరికితే చింతచిగురు మంచిదే.మామిడి ఒరుగులు: అలాగే వేసవి కాలంలో ఎక్కువగా దొరికే మామిడి కాయలను ఉప్పు వేసి ఊరబెట్టి, బాగా ఎండబెట్టకుని నిల్వ చేసుకని, టమాటాకు బదులుగా వాడుకోచ్చు.పుల్లటి పెరుగు: పెరుగు టమాటాకు బదులు వంటల్లో వాడితే కూర గ్రేవీ వస్తుంది. చిక్క దనాన్ని, టామాటా తిన్న అనుభూతిని ఇస్తుంది. కాబట్టి టామాటాకు బదులు వెజ్, నాన్ వెజ్ అన్ని వంటకాల్లో పెరుగును వేసుకోవచ్చు. గుమ్మడి: సహజమైన తీపితో ఉండే గుమ్మడికాయను వంటకాల్లో టమాటాకు బదులు గుమ్మడికాయను వాడవచ్చు.క్యాప్సికమ్,లేదా బెల్ పెప్పర్: పసుపు, రెడ్, గ్రీన్ కలర్స్ల లభించే క్యాప్సికమ్‌ను కూరల్లో టమాటాకు బదులు, కలుపుగా వాడుకోవచ్చు. ఎలిఫెంట్ యాపిల్ : మన దేశంలో ఎక్కువగా తూర్పువైపున సాగు చేస్తారు. బంగ్లాదేశ్, మలేషియాలో ఎక్కువగా ఉంటాయి. అస్సామీ, బెంగాలీ వంటలలో ప్రత్యేక రుచి కోసం వీటిని వినియోగిస్తారు. దొరికితే ఇవి కూడా వంటలకు టమాటా రుచిని ఇస్తాయి.ఆనియన్ పౌడర్ లేదా గ్రాన్యూల్స్: మార్కెట్లోరెడీమేడ్గా దొరికే ఉల్లిపాయ పొడి ఉల్లి రుచి లోటును తీరుస్తుంది.స్ప్రింగ్ ఆనియన్స్ : నాన్‌వెజ్ లాంటి కూరల్లో స్ప్రింగ్ ఆనియన్స్ ఉపయోగించవచ్చు. చిన్న బాల్కనీల్లో , మిద్దె తోటల్లో ఈజీగా పెంచుకోవచ్చు.పీనట్ పేస్ట్: టమాటా గ్రేవీవాడే కూరల్లో పీనట్ పేస్ట్ మిక్స్ యాడ్ చేసుకోవచ్చు. వేయించిన వేరుశెనగలను మెత్తని పేస్ట్‌గా గ్రైండ్ చేసి గ్రేవీలాగా వాడుకోవడమే.టమాటా ఒరుగులువర్షాల కారణంగా సరఫరా తగ్గిపోవడం, డిమాండ్ పెరగడం, నిల్వలు తగ్గిపోవడం ధరలు పెరగడానికి కారణం. అందుకే టొమాటో తక్కువ రేటులో సులభంగా దొరికినపుడు వాటిని ఎండబెట్టి ఒరుగులు మాదిరిగా చేసుకొని నిల్వ చేసుకోవడం మరో చక్కటి పరిష్కారం. -
Kitchen Tips: కిచెన్‌లో దుర్వాసనా? యాలకులు, లవంగాలు నీటిలో వేసి వేడి చేసి
కొన్ని రకాల వంటకాలు చేసినపుడు వంట గదిలో వాసనలు అలాగే ఉండిపోతాయి. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి సులువైన చిట్కాలు మీకోసం.. చేపల వాసన పోవాలంటే కిచెన్‌లో చేపల వాసనను పోగట్టడానికి నిమ్మకాయ చాలా బాగా పనిచేస్తుంది. గిన్నెలో వేడి నీరు తీసుకుని.. దానిలో నిమ్మరసం పిండండి. మీగిలిన తొక్కలను కూడా నీటిలోనే వేయండి. దీన్ని ఒక స్ప్రే డబ్బాలో పోసి వంటగదిలో స్ప్రే చేస్తే వాసన పోతుంది. నిమ్మకాయతో ఇలా మీ వంట గదిలో ఏదైనా ఘాటైన వాసన వస్తుంటే. నీటిలో నిమ్మకాయను సగం కట్ చేసి వేయండి. దీన్ని పది నిమిషాలు మరగనివ్వండి. తర్వతా గ్యాస్ కట్టేసి అలా వదిలేయండి. ఇలా చేస్తే మీ వంట గదిలోని ఘాటైన వాసన నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. దానిలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ వస్తాయి. సుగంధ ద్రవ్యాలతో.. యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క.. లాంటి సువాసన వెదజల్లే మసాలా దినుసులను తీసుకొని వాటిని నీటిలో వేసి బాగా వేడిచేయాలి. ఇవి నీటిలో వేసి వేడి చేస్తే వంటగదిలో సువాసనలు వ్యాపిస్తాయి. వంటగదిలోని దుర్వాసన పోతుంది. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని స్ప్రే బాటిల్లో వేసి మీ ఇంట్లో స్ప్రే చేస్తే మంచి వాసన వస్తుంది. ఇది రూమ్ ఫ్రెష్నర్గా కూడా పనికొస్తుంది. వెనిగర్ ►ఇంట్లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసనను వెనిగర్ ఈజీగా పొగొడుతుంది. ►దీనికోసం మూడు గిన్నెల్లో వెనిగర్‌ని పోసి కిచెన్‌లో మూడు చోట్ల ఉంచాలి. ►10 నుంచి 15 నిమిషాల్లో మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ►అయితే ఈ వాసన మరీ ఎక్కువగా ఉంటే.. వెడల్పాటి గిన్నెలో నీరు, వెనిగర్ తీసుకుని, దానిలో నిమ్మతొక్కలు వేయాలి. ►తర్వాత ఈ నీటిని గ్యాస్ ఉంచి సువాసనలు వెదజల్లేంత వరకు సిమ్‌లో పెట్టి వేడి చేయాలి. ►తర్వాత స్టౌ ఆఫ్ చేసి అలా ఉంచేస్తే కాసేపటికి కిచెన్‌లో దుర్వాసన పోతుంది. కమలా తొక్కలతో.. ►డస్ట్బిన్లోని చెత్త కారణంగా కొన్ని సార్లు వంటగదిలో దుర్వాసన వస్తుంది. ►ఈ సమయంలో ఒక గిన్నెలో నీరు పోసి దానిలో కాస్త దాల్చినచెక్క, కొన్ని కమలా తొక్కలు వేసి సన్నని సెగపై ఐదు నిమిషాలు మరిగించండి. ►గిన్నెను అలాగే ఉంచేస్తే.. దుర్వాసన పోయి.. సువాసన వస్తుంది. ►ఇక మీ వంటగదిలో కూర మాడిన వాసనలు పోగొట్టుకోవాలంటే... వంట గది తలుపులు, కిటికీలు తెరిచి ఉంచితే సరి! చదవండి: Psychology: అక్కలకు ఇంకా పెళ్లి కాలేదు! కుటుంబం ఇలా.. ఒత్తిడిలో సాఫ్ట్వేర్ ఇంజినీర్.. పరిష్కారం? మెదడులో కలవరం.. ఫిట్స్‌తో తస్మాత్ జాగ్రత్త -
అమ్ముడుపోని చెరకుతో వెనిగర్ తయారీ.. భారీ లాభాలు గడిస్తున్న యూపీ రైతు
చెరకును ఫ్యాక్టరీ వాళ్లు కొనకపోతే రైతుకు ఏం చేయాలో తోచదు. అయితే, అమ్ముడు పోని చెరకుతో వెనిగర్ తయారు చేసి చక్కని ఆదాయం గడిస్తూ ఆశ్చర్యపరుస్తున్నది ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం. సీతాపూర్ జిల్లా చావ్‌బిర్వ గ్రామానికి చెందిన 50 ఏళ్ల రామ్‌కిషోర్ మిశ్రా, ఆయన సోదరులు హిమాంశు మిశ్రా, శ్యాంకిశోర్ మిశ్రాలతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. తమకున్న 50 ఎకరాల్లో చాలా ఏళ్లుగా చెరకుతోపాటు ఇతర పంటల సాగుతోపాటు పశుపోషణ చేస్తున్నారు. గతంలో ఫ్యాక్టరీకి తోలగా మిగిలిపోయిన చెరకు వృథా అయ్యేది. ఇలా మిగిలిన చెరకును ఎలా ఉపయోగించాలా అని కొద్ది నెలల క్రితం ఆలోచిస్తుండగా.. చిన్నప్పుడు తమ బామ్మ తయారు చేసిన ఆరోగ్య పానీయం వెనిగర్ (సిర్కా) గుర్తొచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా వెనిగర్ తయారు చేసి, ప్లాస్టిక్ బాటిల్స్‌లో నింపి రిటైల్ మార్కెట్లో అమ్మటం ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. దగ్గరి పట్టణ ప్రాంతాలకే కాకుండా రాజస్థాన్ మార్కెట్ల నుంచి కూడా వీరికి ఆర్డర్లు వస్తుండటం విశేషం. ఇప్పటికే 7 వేల లీటర్లు విక్రయించారు. ప్రతి నెలా రూ. 20 వేల వరకు వెనిగర్ ద్వారా ఆదాయం గడిస్తున్నారు. ఇంతకీ దీన్ని ఎలా తయారు చేస్తున్నారంటే.. చెరకు రసాన్ని పరిశుభ్రమైన ప్లాస్టిక్ డ్రమ్స్లో నింపి, గ్యాస్ బయటకు పోయేందుకు చిన్న బెజ్జం ఉంచి, బిగుతుగా మూత పెట్టేస్తారు. మూడు నెలల తర్వాత మూత తీసి.. అప్పటికే సిద్ధంగా ఉన్న పాత వెనిగర్‌ను ఈ డ్రమ్ముల్లో మజ్జిగ తోడు మాదిరిగా కొద్ది పరిమాణంలో కలుపుతారు. మరో మూడు నెలలకు.. (అంటే మొత్తం ఆర్నెల్లకు) వెనిగర్ వినియోగానికి సిద్ధమవుతుందని హిమాంశు మిశ్రా తెలిపారు. అయితే, దీనికి తేమ చేతులు తగలకూడదు. పరిశుభ్రత పాటించకపోతే మొత్తం పాడై చెడువాసన వచ్చి పనికిరాకుండా పోతుందన్నారు. వెనిగర్‌ను ఏ దశలోనూ మెటల్ కంటెయినర్లలో పోయకూడదు. ఫైబర్ లేదా ప్లాస్టిక్ డ్రమ్ములు, సీసాలు వాడాలి. 600 ఎం.ఎల్. ప్లాస్టిక్ సీసాల్లో నింపి, రూ. 70కి విక్రయిస్తున్నారు. ఖాళీ బాటిల్ రూ.7, స్టిక్కర్ రూ.5తో కలిపి ఒక సీసా వెనిగర్ ఉత్పత్తి ఖర్చు రూ. 25 వరకు అవుతుందని హిమాంశు వివరించారు. వెనిగర్‌ను తీసుకునే వారికి రక్తపోటు తగ్గుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, పొట్ట భాగంలో కొవ్వు కరుగుతుందని, జీర్ణశక్తి పెరుగుతుందని, చర్మ సౌందర్యం ఇనుమడిస్తుందని మిశ్రా సోదరులు చెబుతున్నారు. తయారైన తర్వాత రెండేళ్లు ఇది నిల్వ ఉంటుందంటున్నారు. -
వెనిగర్... సూపర్!
విదేశాల్లో వెనిగర్‌ను విరివిగా ఉప యోగిస్తారు కానీ మన దగ్గర చాలామందికి వెనిగర్ ఎందుకు వాడతారో కూడా సరిగ్గా తెలియదు. నిజానికి ఇంట్లో ఒక్క వెనిగర్ డబ్బా ఉంటే... చాలా పనులు చిటికెలో అయిపోతాయి. వెనిగర్‌లో ముంచిన బట్టతో తుడిస్తే టైల్స్, అల్మరాలు, ఫ్రిజ్ వంటివన్నీ కళకళలాడతాయి! బట్టలపై పడిన మరకల్ని తేలికగా వదిలిస్తాయి కాస్త వెనిగర్‌ను జుట్టుకు పట్టించి, కాసేపాగి తలస్నానం చేస్తే, కండిషనర్‌తో పని ఉండదిక! ఫ్లవర్ వాజ్‌లోని నీటిలో కాస్త వెనిగర్ వేస్తే పూలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి ఓ చెంచాడు వెనిగర్ వెక్కిళ్లను చప్పున ఆపేస్తుంది నీటిలో వెనిగర్‌ను కలిపి చల్లితే, చీమలు దరిదాపుల్లోకి కూడా రావు! వెనిగర్‌లో ముంచిన బట్టతో బాగా రుద్ది, ఆ తర్వాత లాగేస్తే, కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు తేలికగా ఊడి వస్తాయి కూరల్లో కారం, మసాలా ఎక్కువైన ప్పుడు కాస్త వైట్ వెనిగర్ కలిపితే ఘాటు తగ్గు తుంది! వెనిగర్ కలిపిన నీటిని చల్లితే మొక్కలకు పురుగు పట్టదు.