వెనిగర్... సూపర్!
విదేశాల్లో వెనిగర్‌ను విరివిగా ఉప యోగిస్తారు కానీ మన దగ్గర చాలామందికి వెనిగర్ ఎందుకు వాడతారో కూడా సరిగ్గా తెలియదు. నిజానికి ఇంట్లో ఒక్క వెనిగర్ డబ్బా ఉంటే... చాలా పనులు చిటికెలో అయిపోతాయి.
వెనిగర్‌లో ముంచిన బట్టతో తుడిస్తే టైల్స్, అల్మరాలు, ఫ్రిజ్ వంటివన్నీ కళకళలాడతాయి! బట్టలపై పడిన మరకల్ని తేలికగా వదిలిస్తాయి కాస్త వెనిగర్‌ను జుట్టుకు పట్టించి, కాసేపాగి తలస్నానం చేస్తే, కండిషనర్‌తో పని ఉండదిక! ఫ్లవర్ వాజ్‌లోని నీటిలో కాస్త వెనిగర్ వేస్తే పూలు ఎక్కువ సేపు తాజాగా ఉంటాయి ఓ చెంచాడు వెనిగర్ వెక్కిళ్లను చప్పున ఆపేస్తుంది నీటిలో వెనిగర్‌ను కలిపి చల్లితే, చీమలు దరిదాపుల్లోకి కూడా రావు! వెనిగర్‌లో ముంచిన బట్టతో బాగా రుద్ది, ఆ తర్వాత లాగేస్తే, కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు తేలికగా ఊడి వస్తాయి కూరల్లో కారం, మసాలా ఎక్కువైన ప్పుడు కాస్త వైట్ వెనిగర్ కలిపితే ఘాటు తగ్గు తుంది! వెనిగర్ కలిపిన నీటిని చల్లితే మొక్కలకు పురుగు పట్టదు.