
గత కొంతకాలంగా ‘ఐస్ బాత్’(Ice bath) క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఆరోగ్యం కోసం చాలామంది ఐస్ బాత్ థెరపీని ఆశ్రయిస్తున్నారు. గతంలో అథెట్లు మాత్రమే ఐస్ బాత్ చేసేవారు. ఐస్ బాత్ అంటే చిన్నపాటి ఐస్ ముక్కలను బాత్ టబ్‌లో నింపి, ఆ నీటితో కాసేపు ఉండి, స్నానం చేయడం.
ఐస్ బాత్ సమయంలో ఆ నీటి ఉష్ణోగ్రత(Temperature) 15 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకూ ఉంటుంది. కొందరు ముంచు ముక్కలను అధికంగా వేసిన నీటితో స్నానం చేసేందుకు ఇష్టపడతారు. గత కొంతకాలంగా ఐస్ బాత్‌ను ఆశ్రయిస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. దీనికి సంబంధించిన వివరాలను పలువురు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ మాధ్యమాల ద్వారా తెలియజేస్తున్నారు.
ఐస్ బాత్ చేస్తున్న చాలామంది వ్యాయామం తరువాత వచ్చే అలసట నుంచి ఇది ఉపశమనం(Relief) కల్పిస్తుందని, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యాన్ని అందిస్తుందని చెబుతున్నారు. శారీరక నొప్పులను తగ్గించేందుకు ఐస్ బాత్ ఉపయుక్తమవుతుందని పలువురు వ్యాయామ నిపుణులు తెలిపారు. వ్యాయామం చేసిన తరువాత ఐస్ బాత్ చేస్తే శరీర కండరాలకు తిరిగి శక్తి లభిస్తుందని, వాటికి ఫ్లెక్సిబులిటీ వస్తుందని చెబుతారు. అలాగే వ్యాయమం అనంతరం వచ్చే వాపులను ఐస్ బాత్ తగ్గిస్తుంది.
ఐస్ బాత్ వలన ప్రయోజనాలు ఉన్నట్లు గానే, హాని కూడా ఉంది. తరచూ ఐస్‌బాత్ చేయడం వలన శరీరానికి వ్యాయామం ద్వారా అందే శక్తి మందగిస్తుంది. అత్యంత చల్లని నీటిలో స్నానం చేస్తే కోల్డ్ షాక్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐస్ బాత్ చేస్తున్న సమయంలో వేగంగా గాలి పీల్చుకోవడం వలన బ్లడ్ ప్రజర్ పెరిగే అవకాశం ఉంది. ఇది అనారోగ్యానికి దారి తీయవచ్చు. ఇటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: ఆస్పత్రిలో పేలిన ఏసీ.. వ్యాపించిన మంటలు
Comments
Please login to add a commentAdd a comment