స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి వింత ప్రదేశాలను సందర్శిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్‌బాత్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ‘మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ ఐస్‌బాత్ థెరపీ చేసుకున్నారా?’అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా, గతంలో కూడా సామ్ ఐస్‌బాత్ చేసింది. ఐస్ గడ్డలు ఉన్న టబ్‌లో కూర్చొని ‘ఈ ఐస్ బాత్ రికవరీ సమయం తీవ్రంగా బాధిస్తుంది’అని అప్పట్లో పేర్కొంది.
(చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..)
ఐస్ బాత్ ఎందుకు చేస్తారు?
చల్లటి నీటిలో కాసేపు అలానే ఉండటం ఐస్‌బాత్. క్రీడాకారులు, అధికంగా జిమ్ చేసేవారు అప్పుడప్పుడు ఐస్‌బాత్ చేస్తుంటారు. అలా చల్లటి నీటిలో కూర్చోవడం వల్ల వ్యాయామం చేసి అలసిపోయిన కండరాలు త్వరగా రిలాక్స్‌డ్ స్థితిలోకి వస్తాయి. అలాగే రక్త ప్రసరణ సులభతరం అవుతుంది. హృదయ స్పందన రేటు సరిగా ఉంటంది. శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సమంత ఎక్కువగా వ్యాయామం చేస్తుంది. అందుకే ఆమె ఐస్‌బాత్ చేసి ఉండోచ్చు.
సినిమాలకు బ్రేక్
సమంత దాదాపు ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సమంత తరచూ అనారోగ్యానికి గురవుతుంది. అందుకే కొంతకాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సమంత నిర్ణయించుకున్నారట. అందుకే ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి నిర్మాతలకు అప్పగిస్తున్నారట. ఏడాది కాలం పూర్తిగా తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన సిటడెల్ వెబ్ సిరీస్‌తో పాటు ఖుషి సినిమా విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత సమంత ఇక వెండితెరపై కనిపించదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలంటే కనీసం ఏడాదిన్నర ఆగాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment