ice
-
మంచు పడవ..కేవలం శిల్పం కాదు! అలా నీటిలో చక్కర్లు కొట్టేయొచ్చు!
మంచుతో రకరకాల కట్టడాల నమూనాలను, శిల్పాలను రూపొందించడం తెలిసిందే! ఇవాన్ కార్పిత్స్కీ అనే బెలారష్యన్ కళాకారుడు ఏకంగా మంచుపడవనే రూపొందించాడు. ఇది పడవ ఆకారంలో రూపొందించిన కళాఖండం కాదు, నీళ్లల్లో ప్రయాణించగలదు. హిమశిల్పాలంటే విపరీతమైన ఇష్టం ఉన్న ఇవాన్, ఏళ్ల తరబడి కఠోర సాధన చేసి రకరకాల హిమశిల్పాలను రూపొందిస్తుంటాడు. అవి కేవలం శిల్పాల్లాగానే కాదు, అచ్చంగా అసలు వాటిలా పనిచేసేలా రూపొందించడమే ఇవాన్ ప్రత్యేకత! తొలిసారిగా 2020లో అతడు మంచుతో వయోలిన్ తయారు చేసి, వార్తలకెక్కాడు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏటా శీతకాలంలో మంచుగడ్డ కట్టే ప్రదేశాలకు వెళ్లి, అక్కడ మంచు శిల్పాలను తయారు చేయడం అలవాటుగా చేసుకున్నాడు. ఈసారి శీతకాలంలో ఈ మంచుపడవను తయారు చేశాడు. బెలారష్యా రాజధాని మిన్స్క్ నగరానికి చేరువలో ఉండే స్న్యాన్స్కో రిజర్వాయర్ ఒడ్డున కూర్చుని ఇవాన్ ఈ పడవను తయారు చేశాడు. తయారీ పూర్తయ్యాక మంచుపడవలో కూర్చుని రిజర్వాయర్ నీటిలో చక్కర్లు కొట్టాడు. (చదవండి: ఆ గుహలోకి వెళ్లడమంటే.. ప్రాణాలపై ఆశ వదిలేసుకోవడమే!) -
మంచుతో నిప్పు పుట్టించవచ్చా? అదెలా సాధ్యం?
నిప్పు- నీరు ఒకదానికొకటి పూర్తిగా భిన్నమైనవి. నిప్పు ఉన్న చోట నీరు ఉండదు. నీరు ఉన్న చోట నిప్పు ఉండలేదు. అయితే ఐస్‌తో కూడా నిప్పు పెట్టొచ్చని చెబితే నమ్ముతారా? సైన్స్ సహాయంతో ఈ అద్భుతం ఎలా జరుగుతుందో ఈ కథనంలో తెలుసుకుందాం. సైన్స్ చేసే ఈ అద్భుతం 6వ తరగతి పుస్తకంలో దాగి ఉంది. ఈ ప్రయోగం కుంభాకార లెన్స్ చుట్టూ తిరుగుతుంది. లెన్స్ ఉపయోగించి సూర్యకాంతి సహాయంతో నిప్పును మండించడాన్ని మీరు చూసే ఉంటారు. మంచుతో నిప్పును పుట్టించే ప్రయోగం కూడా ఇలానే సాగుతుంది. మంచుతో నిప్పు పుట్టించాలంటే ముందుగా పారదర్శక మంచు అవసరం. ఈ పారదర్శక మంచు ముక్క కుంభాకార లెన్స్ మాదిరిగా పని చేస్తుంది. ఈ మంచు ముక్క నుంచి సూర్యకాంతిని బయటకు ప్రసరింపజేసి, అది కాగితంపై పడేలా చేస్తే, కొంత సమయం తరువాత ఆ కాగితం నుండి పొగ రావడం ప్రారంభమవుతుంది. తరువాత కాగితంపై మంటలు వ్యాపించడాన్ని గమనించవచ్చు. మంచును కుంభాకార లెన్స్‌గా ఉపయోగించి, మంటలను పుట్టించవచ్చని తెలుసుకున్నాం. అయితే మంచును కుంభాకార లెన్స్‌గా ఎలా తయారు చేయాలనే ప్రశ్న ఎదురవుతుంది. ఇందుకోసం ముందుగా పారదర్శక మంచు ముక్కను తీసుకోవాలి. చాకు సాయంతో ఆ మంచుకు లెన్స్ ఆకారాన్ని ఇవ్వాలి. తర్వాత చేతులతో రుద్ది లెన్స్ మాదిరిగా తయారు చేయాలి. లెన్స్ ఎంత పెద్దదిగా ఉంటే నిప్పు అంత ప్రకాశవంతంగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. లెన్స్ మందం 2 అంగుళాలు, వ్యాసం 6 అంగుళాలు ఉంటే అప్పుడు నిప్పు వేగంగా వ్యాపిస్తుంది. -
గడ్డకట్టిన మంచుతో భారీ రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
గడ్డకట్టిన మంచుతో శిల్పాలు చెక్కి ప్రదర్శనకు పెట్టడం చలి ప్రదేశాల్లో మామూలే! స్వీడన్లోనైతే ఏకంగా గడ్డకట్టిన మంచుతో ఒక భారీ హోటల్‌నే నిర్మించారు. ఇందులోని మంచాలు, కుర్చీలు, బల్లలు వంటివన్నీ గడ్డకట్టిన మంచుతో తయారు చేసినవే కావడం విశేషం. జేమ్స్‌బాండ్ సినిమా ‘డై ఎనదర్ డే’లో కనిపించిన భవంతి నమూనా ఆధారంగా ఈ హోటల్‌ను నిర్మించడం విశేషం. టోర్నె నదిలో గడ్డ కట్టిన మంచును తవ్వి తెచ్చి, నదికి సమీపంలోనే దీనిని ఐదువందల టన్నుల మంచుతో నిర్మించారు. ఇందులో పన్నెండు ఆర్ట్ స్వీట్రూమ్స్, ఒక డీలక్స్ స్వీట్‌రూమ్, థీమ్డ్ రూమ్‌లు, బార్ సహా పలు వసతులు ఉన్నాయి. ఈ హోటల్లో పది ఒలింపిక్ స్విమింగ్ పూల్స్, ముప్పయిమూడు చిన్న స్విమింగ్‌పూల్స్ కూడా ఉన్నాయి. లూకా రోంకొరోని నేతృత్వంలో ఇరవై నాలుగు మంది హిమశిల్పులు దీనిని నిర్మించారు. దీని లోపలి భాగంలో ఉష్ణోగ్రత మైనస్ ఐదు డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటుంది. ఇది ఏడాది పొడవునా అతిథులకు అందుబాటులో ఉంటుంది. -
4 డిగ్రీల చలిలో సమంత ఐస్‌బాత్.. ఎందుకలా?
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉన్నారు. స్నేహితులతో కలిసి ఇండోనేషియాలోని బాలిలో ఎంజాయ్ చేస్తోంది. అక్కడి వింత ప్రదేశాలను సందర్శిస్తూ వాటికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ నాలుగు డిగ్రీల చలిలో ఆరు నిమిషాల పాటు ఐస్‌బాత్ చేసింది. దీనికి సంబంధించిన వీడియోని ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ‘మయోసైటిస్ చికిత్సలో భాగంగా ఈ ఐస్‌బాత్ థెరపీ చేసుకున్నారా?’అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. కాగా, గతంలో కూడా సామ్ ఐస్‌బాత్ చేసింది. ఐస్ గడ్డలు ఉన్న టబ్‌లో కూర్చొని ‘ఈ ఐస్ బాత్ రికవరీ సమయం తీవ్రంగా బాధిస్తుంది’అని అప్పట్లో పేర్కొంది. (చదవండి: బుల్లితెర నటి ఐవీఎఫ్.. నాలుగో ప్రయత్నంలో విజయం.. కానీ..) ఐస్ బాత్ ఎందుకు చేస్తారు? చల్లటి నీటిలో కాసేపు అలానే ఉండటం ఐస్‌బాత్. క్రీడాకారులు, అధికంగా జిమ్ చేసేవారు అప్పుడప్పుడు ఐస్‌బాత్ చేస్తుంటారు. అలా చల్లటి నీటిలో కూర్చోవడం వల్ల వ్యాయామం చేసి అలసిపోయిన కండరాలు త్వరగా రిలాక్స్డ్ స్థితిలోకి వస్తాయి. అలాగే రక్త ప్రసరణ సులభతరం అవుతుంది. హృదయ స్పందన రేటు సరిగా ఉంటంది. శ్వాసపై నియంత్రణ పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. సమంత ఎక్కువగా వ్యాయామం చేస్తుంది. అందుకే ఆమె ఐస్‌బాత్ చేసి ఉండోచ్చు. సినిమాలకు బ్రేక్ సమంత దాదాపు ఏడాది కాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా సమంత తరచూ అనారోగ్యానికి గురవుతుంది. అందుకే కొంతకాలం వరకు సినిమాలకు బ్రేక్ ఇచ్చి, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సమంత నిర్ణయించుకున్నారట. అందుకే ఇప్పటికే తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి నిర్మాతలకు అప్పగిస్తున్నారట. ఏడాది కాలం పూర్తిగా తన వ్యక్తిగత జీవితంపై దృష్టిపెట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించిన సిటడెల్ వెబ్ సిరీస్‌తో పాటు ఖుషి సినిమా విడుదలకు రెడీగా ఉన్నాయి. ఈ రెండు రిలీజ్ అయిన తర్వాత సమంత ఇక వెండితెరపై కనిపించదు. ఆమెను మళ్లీ తెరపై చూడాలంటే కనీసం ఏడాదిన్నర ఆగాల్సిందే. -
గడ్డకట్టిన నయాగరా జలపాతం.. అద్భుత దృశ్యాలు
న్యూయార్క్: అమెరికాలో మంచు తుపాను(Bomb cyclone) విలయం కొనసాగుతూనే ఉంది. ఈ శతాబ్దంలోనే ఎన్నడూ ఎరుగనటువంటి చలి గాలులు, విపరీతంగా కురుస్తోన్న మంచు ధాటికి దేశమంతా అతలాకుతలమైంది. 4వేలకుపైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల దేశవ్యాప్తంగా 60 మందికిపైగా మరణించారు. విద్యుత్తు సరఫరా నిలిచిపోవటంతో పలు ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లాయి. ముఖ్యంగా న్యూయార్క్, బఫెలో కౌంటీలో నెలకొన్న దుర్భర పరిస్థితులను సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న చిత్రాలు, వీడియోలు చూపుతున్నాయి. బఫెలో కౌంటీలో వాహనాల్లోనే గడ్డకట్టుకుపోయి మరణించిన సంఘటనలూ ఉన్నాయి. అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లో నమోదవుతున్నాయి. దీంతో నయాగరా జలపాతం గడ్డకట్టుకుపోయింది. దీంతో పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాన్ని చూసి ముగ్ధులైపోతున్నారు. నయాగరాకు 25 మైళ్ల దూరంలో బఫెలో ఉంటుంది. అయితే, నయాగరాలో కొన్ని ప్రదేశాల్లో నీరు గడ్డకట్టినా.. ప్రవాహం కారణంగా కొన్ని చోట్ల మాత్రం జలపాతం పరవళ్లు తొక్కుతోంది. గట్టకట్టుకుపోయిన నయాగరా జలపాతం ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. నయాగరా ఫాల్స్ న్యూయార్క్ స్టేట్ పార్క్ ప్రకారం ప్రతి సెకనుకు 3,160 టన్నుల నీరు జలపాతం నుంచి పడుతుంది. ఈ నీరు ప్రతి సెకనుకు 32 అడుగుల వేగంతో ప్రయాణిస్తుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సందర్భాల్లో నయాగరా నదిపై మంచు గడ్డకడుతుందని అధికారులు తెలిపారు. ఇలా మంచుతో ఏర్పడిన బ్రిడ్జ్‌పై నడవటాన్ని నిషేధించారు. 1912, ఫిబ్రవరి 4 నయాగరా నదిపై ఏర్పడిన మంచు వంతెనపైకి వెళ్లి ముగ్గురు చనిపోయిన క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. The day after the great freeze, my family and I went to #NiagraFalls. The #NiagraRiver below it had ice thick enough for you *to technically* get to #Buffalo, #NewYork by foot! Was it an intriguing and surreal Arctic experience for a kid from California, yes! pic.twitter.com/MAC8IIfjZc — Escondido Weather Observer (CoCoRaHs: CA-SD-197) (@KCAESCON230) December 23, 2022 ఇదీ చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
మళ్లీ తెరపైకి జాంబీ వైరస్!.. పెను విపత్తుకు దారి తీయొచ్చా?
మాస్కో: ప్రమాదకరమైన జాంబీ వైరస్. రష్యాలో అతి శీతల ప్రాంతమైన సైబీరియాలోని ఓ సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల నడుమ గడ్డకట్టిన స్థితిలో నిద్రాణంగా పడి ఉంది. దాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే లక్షణమున్న ఈ వైరస్ కరోనాను మించిన పెను ఆరోగ్య విపత్తుకు దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇలాంటి దాదాపు రెండు డజన్ల పురాతన వైరస్‌లను శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో గుర్తించారు. గ్లోబల్ వార్మింగ్ దెబ్బకు నిత్యం సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో కూడా మంచు పలకలు వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. దాంతో ఇంతకాలంగా వాటి కింద నిద్రాణంగా ఉన్న ఇలాంటి ప్రమాదకర వైరస్‌లెన్నో ఒళ్లు విరుచుకుని మానవాళిపైకి వచ్చి పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందమే 2013లో ఇలాగే 30 వేల ఏళ్ల నాటి వైరస్‌లను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ పండోరా వైరస్ ఎడొమాగా పేర్కొనే జాంబీ వైరస్‌ను కనిపెట్టిందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. -
సౌర వలయాలు
ఫొటోల్లో కన్పిస్తున్నది సూర్యుని చుట్టూ ఏర్పడ్డ వెలుతురు వలయం (సన్ హాలో). రెండో ఫొటోలోది భూమ్మీద నుంచి కన్పిస్తున్నది కాగా, మొదటి ఫొటోలోనిదేమో అంగారకునిపై నుంచి కన్పించిన సన్ హాలో. అరుణ గ్రహంపై జీవం ఆనవాళ్లను అన్వేషించే క్రమంలో పెర్సెవరెన్స్ రోవర్ ఈ అరుదైన దృగ్విషయాన్ని గత డిసెంబర్లో అనుకోకుండా క్లిక్‌మనిపించింది. 2021 డిసెంబర్ 15న వాటిని నాసాకు పంపింది. సన్ హాలో భూమి పై నుంచి తరచూ కనిపిస్తూనే ఉంటుంది గానీ అంగారకునిపై నుంచి కంటబడటం ఇదే తొలిసారని స్పేస్ సైన్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన ప్లానెటరీ సైంటిస్టు మార్క్ లేమన్ చెప్పారు. 2020లో నాసా ఈ రోవర్‌ను అంగారకునిపైకి పంపించడం తెలిసిందే. ఏమిటీ సన్ హాలో...? మేఘాల్లో అసంఖ్యాకమైన సూక్ష్మ మంచు స్ఫటికాలుంటాయి. కాంతి వాటి గుండా సాగే క్రమంలో అప్పడప్పుడూ విడిపోవడంతో పాటు వక్రీభవనం కూడా చెందుతుంటుంది. ఫలితంగా ఒక్కోసారి ఇంద్రధనుస్సును తలపించే కాంతి వలయాలు ఏర్పడతాయి. నిర్దిష్ట కోణం నుంచి చూసినప్పుడు ఇవి వృత్తాకారంలో కనువిందు చేస్తాయి. వాటిని సన్ హాలోగా పిలుస్తారు. ఇలా భూమ్మీది నుంచి కన్పించే వలయాలు సాధారణంగా 22 డిగ్రీల కోణంలో ఏర్పడేవి అయుంటాయని అమెరికాలోని ఇల్లినాయీ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అయితే భూమితో పోలిస్తే అంగారకునిపై నీటి శాతం అత్యల్పం. అక్కడ అత్యధికంగా ఉండేది కార్బన్ డయాక్సైడే. కాబట్టి పెర్సెవరెన్స్ రోవర్ అందించిన ఫొటోలు నిజంగా సన్ హాలోకు సంబంధించినవేనా అని శాస్త్రవేత్తలు మీమాంసలో పడ్డారు. బహుశా రోవర్ తాలూకు కెమెరా కోణం వల్ల అలాంటి వెలుతురు వలయం ఏర్పడి ఉండొచ్చన్న అభిప్రాయమూ వ్యక్తమైంది. అయితే చివరికి ఇది దుమ్మూ ధూళి వల్ల ఏర్పడ్డది కాదని, సన్ హాలోయేనని తేల్చారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
‘మంచు’కొస్తోందా..?
కొన్నేళ్ల క్రితం కాలిఫోర్నియాలో కమలా పండ్లు గడ్డకట్టిపోయేంత స్థాయిలో మంచు కురిసింది. అలాగే ఆఫ్రికాలోని సహారా ఎడారిపై మంచు దుప్పటిలా పరుచుకుంది. అసాధారణ రీతిలో కొన్నిచోట్ల అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఇంకొన్ని చోట్ల వెన్ను వణికించే స్థాయిలో చల్లదనం కనిపించాయి కూడా. ఇవన్నీ యాదృచ్ఛికం అనుకునేందుకు వీల్లేదంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి మొత్తాన్ని ప్రభావితం చేయగలిగిన శక్తి ఉన్న సూర్యుడిపై జరిగే కార్యకలాపాలకూ వీటికి సంబంధం ఉందన్నది వీరి వాదన. సన్‌స్పాట్స్‌కు, మంచుకు లింకేంటి? సన్‌స్పాట్స్‌లో హెచ్చుతగ్గులకు.. భూమిపై మంచు పడేందుకు సంబంధం ఉంది. సన్‌స్పాట్స్ ఎక్కువ ఉన్నప్పుడు సూర్యుడిపై జరిగే పేలుళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉంటే సూర్యుడి నుంచి ఎగజిమ్మే ప్లాస్మా కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ అధిక ప్లాస్మాలోని కణాలు కాస్తా భూ అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా వాతావరణం పైపొరల్లో భారీస్థాయి మేఘాలు ఏర్పడతా యని అంచనా. సూర్యరశ్మి తగ్గిపోయేందుకు, అదే సమయంలో అధిక వర్షాలు/వరదలకూ ఇది కారణమవుతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సూర్య రశ్మి తగ్గిపోతే భూ ఉష్ణోగ్రతలూ తగ్గిపోతాయి. ఎంత? ఎక్కడ? ఎలా? 1645 నాటి పరిస్థితులను తీసుకుంటే.. అప్పట్లో సూర్యుడి నుంచి వెలువడే శక్తి ప్రతి చదరపు మీటర్‌కు మూడు వాట్ల వరకూ తగ్గిందని లెక్క. ఈ చిన్న మార్పుకే బ్రిటన్ మొదలుకొని అనేక యూరోపియన్ దేశాలు మంచులో కూరుకుపోయాయి. నదులు గడ్డకట్టిపోయాయి. శీతాకాలం ఎక్కువ సమయం కొనసాగింది. సూర్యుడిపై సన్‌స్పాట్స్ వేగం పుంజుకోకపోతే ఈసారి కూడా భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ సెల్సియస్ వరకూ పడిపోతుందని అంచనా. అదే జరిగితే భూ ఉత్తరార్ధ గోళంలో చాలాదేశాల్లో మంచు ప్రభావం చాలా ఎక్కువ అవుతుంది. ఆర్కిటిక్, అంటార్కిటికా ప్రాంతాల్లోనూ మంచు కురవడం ఎక్కువ అవుతుంది. 2020 సెప్టెంబర్ తరువాత సన్‌స్పాట్స్ ఏర్పడటం కొంచెం ఎక్కువైనప్పటికీ.. 2023 నాటికి అది పతాకస్థాయికి చేరుకుని 2030 నాటికి కనిష్టానికి చేరతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. సూర్యుడి నుంచి వెలువడే రేడియోధార్మికత రానున్న 30 ఏళ్లలో ఏడు శాతం వరకూ తక్కువ కావొచ్చని అంటున్నారు. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) మాత్రం ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదని అంటోంది. సన్‌స్పాట్స్ తగ్గినా.. దాని ప్రభావం కంటే కాలుష్యం కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం ఆరు రెట్లు ఎక్కువని చెబుతోంది. అంటే.. సూర్యుడిపై ఏర్పడే మచ్చలు వందేళ్లపాటు తక్కువగా ఉన్నా.. భూమి ఉష్ణోగ్రతలు మాత్రం పెద్దగా తగ్గవని అంటోంది. అంతా సూర్య భగవానుడి మహత్తు.. ► మినీ మంచుయుగం గురించి అర్థం చేసుకోవాలంటే సూర్యుడి గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అయ స్కాంత శక్తి తీవ్రతల్లో తేడాల కారణంగా సూర్యుడిపై పెద్ద పెద్ద పరిమాణాల్లో మచ్చల్లాంటివి ఏర్పడుతుంటాయి. వీటి సంఖ్య కొన్నేళ్లు పెరుగుతూ.. ఇంకొన్నేళ్లు తగ్గుతూ ఉంటాయి. ఈ కాలాన్ని సోలార్ సైకిల్ అం టారు. 1912 నుంచి 24 సోలార్ సైకిల్స్ పూర్తి కాగా.. ఇప్పుడు 25వ సైకిల్ నడుస్తోంది. 2019లో వందేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువస్థాయిలో సన్‌స్పాట్స్ ఏర్పడగా ఆ తరువాతి ఏడాది పెరగడం మొదలవుతుందని శాస్త్రవేత్తలు లెక్కలేశారు. కానీ, 2020 సెప్టెంబర్ వరకూ ఈ సన్‌స్పాట్స్ పెరగలేదు. అప్పుడెప్పుడో 1645–1710 సంవత్సరాల మధ్య ఇలాగే సూర్యుడిపై అతి తక్కువ సన్‌స్పాట్స్ ఏర్పడ్డాయని.. మాండర్ మినిమం అని పిలిచే ఈ కాలంలోనే భూ ఉత్తరార్ధ గోళం మంచులో మునిగిపోయిందని చెబుతున్నారు. అందుకే ఈసారి కూడా అలాగే జరిగే అవకాశం ఉందన్న అంచనా ఏర్పడింది. -
లడఖ్ మంచుకొండల్లో ట్రెక్కింగ్.. ఫోటోలు వైరల్
లడఖ్: లడఖ్‌లో ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీల ట్రెక్కింగ్‌ను ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు దళాలు నిర్వహించారు. ఈ ట్రెక్కింగ్‌లో 100 మంది బార్డర్ పోలీసులు పాల్గొన్నట్లు తెలిపారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను లడఖ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధా కృష్ణ మథూర్ శనివారం ప్రారంభించారు. ఈ పోటీలు జరగటం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. ఐస్ వాల్ క్లైంబింగ్ పోటీలను నిర్వహించిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ రాధా కృష్ణ అభినందించారు. Ladakh: Watch the glimpses of the Ice wall climbing competition in Ladakh organised for the 1st time in the Country by North West Frontier ITBP, Leh. More than 100 climbers are taking part.#Himveers@nwftr_itbp pic.twitter.com/KeOCtkBrfD — ITBP (@ITBP_official) February 27, 2022 ఆయన మాట్లాడుతూ.. ఐటీబీపీ 1962లో ఏర్పాటు చేయబడిందని తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఐటీబీటీ దేశానికి రక్షణగా నిలుస్తోందని అన్నారు. బార్డర్ పోలీసుల ట్రెక్కింగ్‌కు సంబంధించిన వీడియో, ఫోటోలను ఐటీబీపీ తన అధికారిక ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Some glimpses of Ice Wall Climbing Competition in Ladakh organised for the 1st time in the Country by HQrs NW Frontier ITBP, Leh.#Himveers#IceWallClimbing pic.twitter.com/Mp2qLHTtFc — ITBP (@ITBP_official) February 27, 2022 -
గ్రీన్‌ల్యాండ్ కరుగుతోంది!
గ్రీన్‌ల్యాండ్‌లో మంచు అనుకున్న దానికంటే వేగంగా కరిగిపోతోంది. దీంతో సముద్రమట్టాలు పెరిగిపోతూ భయాందోళనలు రేపుతున్నాయి. గత రెండు దశాబ్దాల్లో 4,700 గిగాటన్నుల (4,70 లక్షల కోట్ల టన్నులు) హిమం కరిగిపోయిందంటే ఏ స్థాయిలో కరిగిందో అంచనావేయొచ్చు. కరిగిన నీళ్లన్నీ అమెరికాలో చేరితే ఆ దేశం 1.5 అడుగుల మేర మునిగిపోతుందని ఇటీవలి ఓ అధ్యయనంలో పరిశోధకులు చెప్పారు. ఆ అధ్యయనం విశేషాలు తెలుసుకుందామా..! 2002 నుంచి గ్రీన్లాండ్లో కరిగిన మంచు వల్ల సముద్ర మట్టాలు 1.2 సెంటీమీటర్ల మేర పెరిగినట్లు గుర్తించారు. ఏప్రిల్ 2002–ఆగస్టు 2021 మధ్య కాలంలో గ్రేవిటీ రికవరీ క్లైమెట్ ఎక్స్పరిమెంట్ (గ్రేస్) ఉపగ్రహాల నుంచి సేకరించిన వివరాలతో డెన్మార్స్ పరిశోధకులు తాజాగా అధ్యయనం చేశారు. మంచు ఫలకాల అంచుల్లో ఎక్కువ కరిగినట్లు వీరి పరిశోధనలో వెల్లడైంది. అయితే ఫలకల మధ్యప్రాంతంలో మంచు పరిమాణం ఒకింత పెరిగిందని, ఇది పెరగడానికి కారణం హిమపాతమని పరిశోధకులు చెప్పారు. ముఖ్యంగా ఉపరితల జలాలు పెద్దమొత్తంలో వేడెక్కుతున్న పశ్చిమ గ్రీన్లాండ్ తీరంలో ఎక్కువ మంచు కరిగింది. ముఖ్యంగా వాతావరణ మార్పుల వల్ల గ్రీన్లాండ్, అంటార్కిటికాలో పెద్దమొత్తంలో మంచు కరిగిపోవడం వల్ల సముద్రమట్టాలు పెరుగుతున్నాయని నాసా చెప్పింది. అంటార్కిటికాలో కరిగితే.. అంటార్కిటికాలోని మంచు ఫలకాలన్నీ కరిగితే ప్రపంచవ్యాప్తంగా సముద్రమట్టాలు 60 మీటర్లు పెరుగుతాయని అమెరికాకు చెందిన జాతీయ మంచు సమాచార కేంద్రం వెల్లడించింది. అదే గ్రీన్లాండ్లోని ఫలకాలన్నీ కరిగితే సముద్రమట్టాలు 7.4 మీటర్ల మేర పెరుగుతాయని పేర్కొంది. 2019లో నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం భూతాపస్థాయి ఇప్పుడున్న ప్రకారమే ఉంటే గ్రీన్లాండ్ వల్ల ఈ శతాబ్దం చివరినాటికి సముద్రమట్టాలు 7–13 సెం.మీ. పెరుగుతాయని అంచనా. సముద్రమట్టం ఒక్క సెం.మీ పెరిగితే దానివల్ల 60లక్షల మంది వరదముంపు బారిన పడతారని నాసాకు చెందిన ఆండ్రూ షెఫర్డ్ పేర్కొన్నారు. 2300 నాటికి 4 అడుగులు... ♦2015 ప్యారిస్ వాతావరణ ఒప్పందం ప్రకారం అన్ని దేశాలు నడుచుకున్నా 2300 సంవత్సరం నాటికి సముద్రమట్టాలు 4 అడుగులు పెరుగుతాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ♦సముద్రమట్టాల పెంపుతో షాంఘై నుంచి లండన్ దాకా ఉన్న నగరాలతోపాటు సముద్రమట్టానికి దిగువన లేదా సమీపంలో ఉన్న ఫ్లోరిడా లేదా బంగ్లాదేశ్‌లకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. ♦ఈ ముప్పు తప్పించాలంటే మనం కర్భన ఉద్గారాలను వీలైనంత త్వరగా నియంత్రించాల్సిన అవసరం ఉందని జర్మనీ శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. ♦ఈ శతాబ్దం రెండో సగానికి వచ్చే నాటికల్లా కర్భన ఉద్గారాలను జీరోస్థాయికి తీసుకురావాలని పర్యావరణ ఒప్పందాలు ఇప్పటికే లక్ష్యం విధించాయి. ♦పరిశ్రమల నుంచి పెద్దమొత్తంలో విడుదలయ్యే వాయు కాలుష్యం వల్ల మహాసముద్రాల మట్టాలు విపరీతంగా పెరిగిపోతాయి. ♦పర్యావరణ ఒప్పందాల అమలు జాప్యం పెరిగేకొద్దీ కర్భన ఉద్గారాలు మరింతగా పెరిగి 2300 నాటికి సుమద్రమట్టాలు అదనంగా 20 సెం.మీ. మేర పెరుగుతాయి. –సాక్షి, సెంట్రల్ డెస్క్ -
వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం
సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. దంచికొట్టిన వానతో జనజీవనం స్తంభించి, పంటలన్నీ దెబ్బతిన్నాయి. నర్సంపేట డివిజన్లో కుండపోతగా రాళ్లవాన కురిసింది. ఇటుకాలపల్లి, అకులతండ, ఇప్పల్ తండ, నల్లబెల్లి, దుగ్గొండి ప్రాంతాల్లో కుండపోతగా కురిసిన రాళ్లవానతో అపార నష్టం సంభవించింది. గాలివాన వడగళ్లతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సప్లై నిలిచిపోవడంతో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. గాలివానతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ఐస్ గడ్డలు పడ్డట్లు రాళ్లవాన కురిసింది. మిర్చి పత్తితోపాటు పండ్లతోటలకు అపార నష్టం వాటిల్లింది.వరద నీటితో రోడ్లన్నీ జలమయం కావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పర్యటించి పరిస్థితిని పర్యవేక్షించారు. సహాయక చర్యలకై అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులను ప్రజలను కోరారు. హనుమకొండ, మహబూబాబాద్, ములుగు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. ఆకస్మాత్తుగా కురిసిన వర్షంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరంగల్ నగరంలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పలుచోట్ల చిన్నసైజులో వడగళ్లు కూడా పడ్డాయి. విద్యుత్‌సరఫరాలో అంతరాయమేర్పడింది. వరద నీటితో డ్రెయినేజీ వ్యవస్థ స్తంభించడంతో రోడ్లపై నీరు నిలిచిపోయి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. వరంగల్ చౌరస్తా, బీటు బజారు, మేదరవాడ, అండర్ బ్రిడ్జి, తదితర రహదారుల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోయింది. వరంగల్ స్టేషన్‌రోడ్డు, జేపీఎన్ రోడ్డు, పోచమ్మమైదాన్ నుంచి ములుగు రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు అసంపూర్తిగా ఉండటంతో వర్షం నీరు భారీగా నిలిచిపోయి వాహనదారులకు ఎటూ వెళ్లే మార్గం లేకుండా పోయింది. ప్రధాన జంక్షన్లు, రహదారుల్లో పెద్ద ఎత్తున వర్షం నీరు నిలిచిపోయింది. వరంగల్, హనుమకొండ, కాజీపేటలోని పలు లోతట్టు ప్రాంతాల్లో మోకాల్లోతు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
77 ఏళ్ల వయసు ... స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్! అయినా ఐస్ స్కేటింగ్ చేశాడు!!
77 year Old Astrophysicist Battling Stage 4 Prostate Nails Ice Skating: మనషి ఎప్పుడూ నిత్య విద్యార్థిలా చివరి దశ వరకు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే ఆచరణ వరకు వస్తే అంతగా ఎవరూ పూర్తి స్థాయిలో చేయడానికి ఆసక్తి చూపరనే చెప్పాలి. ఏదో ఒక కారణంతో మన కలలను, లక్ష్యాలను వదిలేసి మనం ఇంతవరకే సాధించగలం అని సరిపెట్టేసుకుంటారు. కానీ ఇక్కడొక వృద్ధుడు మరణానికి దగ్గరలో ఉన్నా కూడా ఐస్ స్కేటింగ్ చేయాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. అసలు విషయంలోకెళ్లితే...రిచర్డ్ ఎప్స్టీన్ అనే 77 ఏళ్ల వృద్ధుడు రెండేళ్లకు పైగా క్రానిక్ లింఫాటిక్ లుకేమియా (సిఎల్‌ఎల్)తో పోరాడి బయట పడిన తర్వాత మళ్లీ 2020లో స్టేజ్ 4 ప్రోస్టేట్ క్యాన్సర్ భారిన పడతాడు. అయితే అవేమి ఆ వృద్ధడు పెద్దగా పట్టించకోడు. పైగా ఐస్ స్కేటింట్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాదు దీని కోసం ఒక స్కేటింగ్ టీచర్ వద్ద ట్రైయినింగ్ కూడా తీసుకుంటాడు. ఈ మేరకు అతని కూతురు మహిళ రెబెకా బాస్టియన్ తన తండ్రి విజయవంతంగా ఐస్ స్కేటింగ్ నేర్చుకోవడమే కాక గురువుతో కలిసి స్కేటింగ్ చేస్తున్న వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంది. అంతేకాదు తన తండ్రి ఖగోళ శాస్త్రవేత్త అని మౌంట్ రైనర్‌ను అధిరోహించిన సాహసి అని కూడా వెల్లడిస్తుంది. పైగా నేర్చకునే వయసు అయిపోయింది, నా పరిస్థితి ఏం బాగోలేదు అని కూర్చోకూడదని కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ జీవితాన్ని ఆస్వాదించాలంటూ ట్విట్టర్లో పేర్కొంటుంది. అయితే ప్రసుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా ఓ లుక్ వేయండి. My father is 77 years old and has stage 4 prostate cancer. He decided to learn how to ice skate a few years ago, and just did this performance with his teacher. For anyone that thinks it’s too late to try something new… ❤️ pic.twitter.com/0SZ3FmbNGE — Rebekah Bastian (@rebekah_bastian) December 9, 2021 -
పెట్రోల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే కాలుష్యం ఎక్కువ?
కాప్-26 స్కాట్లాండ్లోని గ్లాస్గోలో నవంబర్ 1 నుంచి 12 వరకు జరుగుతోంది. ఈ వాతావరణ సదస్సులో పర్యావరణ సమస్యలపై ప్రపంచం దృష్టి సారించడంతో రాబోయే కాలంలో కాలుష్యం తగ్గించాలని అన్నీ దేశాలు భావిస్తున్నాయి. ఎక్కువగా పరిశ్రమలు, వాహనాల చేత వాయు కాలుష్యం ఏర్పడుతుంది. పెట్రోల్ వాహనాల వల్ల వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ఎక్కువ శాతం దేశాలు అభిప్రాయపడుతున్నాయి. ఇంధనాన్ని మండించడం వల్ల ప్రత్యక్ష కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాల్లో దాదాపు పావు వంతు రవాణా రంగం బాధ్యత వహిస్తుంది. అందులో ప్యాసింజర్ కార్లు 45% ఉన్నాయి. ఈ సవాలు నుంచి బయటపడేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఒక సమాధానంగా కనిపిస్తున్నాయి. అయితే, ఇక్కడే మనం ఒక చిన్న విషయం తెలుసుకోవాల్సి ఉంది. ఒక వాహనం తయారు కావాలంటే 20,000 నుంచి 30,000 విడిభాగలు అవసరం. ఈ విడిభాగల తయారీ కోసం కొన్ని వేల టన్నుల అల్యూమినియం, ఉక్కు ఇతర పదార్థాలు అవసరం. ఈ ముడి పదార్ధాల తయారీ సమయంలో పరిశ్రమల ద్వారా ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుంది. ఐసీఈతో పోలిస్తే సంప్రదాయ అంతర్గత కంబస్టివ్ ఇంజిన్(ఐసీఈ)తో పోలిస్తే బ్యాటరీ-ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేటప్పుడు విడుదల చేసే గ్రీన్ హౌస్ వాయువులు అధిక భాగాన్ని కలిగి ఉంటాయి. ప్రస్తుతం ఈవీ ఉత్పత్తి ఊపందుకోవడంతో బ్యాటరీ ఉత్పత్తి, పరిశోధనలు, అమ్మకాలు పెరుగుతున్నాయి. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వల్ల గ్రీన్ హౌస్ ఉద్గారాలు 2040 నాటికి 60% కంటే ఎక్కువకు పెరగబోతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే కంపెనీ తెలిపింది. ఈ సంస్థ "సరఫరా గొలుసులో డీకార్బనైజేషన్ ప్రాముఖ్యతను విస్మరించలేము" అని గ్రీన్ పీస్ ఈ వారం ప్రచురించిన నివేదికలో పేర్కొంది. (చదవండి: ఇది ట్రక్కు కాదు నడిచే ఇళ్లు.. అచ్చంగా హీరోల తరహాలో) ఈ నివేదికలో పేర్కొన్నట్టు మనం ఒకదాని గురుంచి తెలుసుకోవాలి.. మెరుగైన ఈవీ బ్యాటరీలను తయారు చేయడానికి, రేంజ్ ఎక్కువగా రావడానికి సాంకేతిక నిపుణులు భారీ పరిమాణంలో బ్యాటరీలను తయారు చేయాల్సి ఉంటుంది. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల బరువు పెరుగుతుంది. ఇతర భాగాల బరువు + బ్యాటరీ బరువు కలిపితే వాహనం బరువు పెరుగుతుంది. దీంతో మొత్తంగా వాహనం బరువు పెరగడం చేత మళ్లీ రేంజ్ సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమస్యను అరికట్టడం కోసం కార్ల కంపెనీలు తేలికపాటి బరువు ఉండే అల్యూమినియం వినియోగం వైపు దృష్టి పెడుతున్నారు. సాంప్రదాయ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాల్లో 45% లోహాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నారు నివేదికలో పేర్కొంది. అల్యూమినియం డిమాండ్ పెరగడం చేత లోహ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. ఉత్పత్తి పెరగడంతో వాయు కాలుష్యం అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ రకంగా చూస్తే పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల వల్లే ఎక్కువ వాయు కాలుష్యం మరింత తీవ్రమవుతోంది. (చదవండి: ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!) ఇంకా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ కోసం పవర్ అవసరం అనే విషయం అందరికీ తెలిసిందే. ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ వల్ల విద్యుత్ కి డిమాండ్ పెరుగుతుంది. దీంతో విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రభుత్వాలు, కంపెనీలు థర్మల్ కర్మాగారాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ సౌర విద్యుత్ ఆప్షన్ ఉన్న ప్రస్తుతం మన దేశంతో సహ ఇతర దేశాలలో ఇంకా అంత ఎక్కువగా అందుబాటులోక రాలేదు. అందుకని ఎలక్ట్రిక్ వాహన సంస్థలు, ప్రభుత్వాలు ఈ సమస్యల మీద కూడా దృష్టి సారించాల్సిన అవసరం వచ్చింది. -
మంచు హోటల్: ఎండాకాలంలో కూడా కరగదట
ఎంత పెద్ద ఐసు గడ్డ అయినా రెండు నిమిషాలు ఎండలో పెడితే కరగడం మొదలు పెడుతుంది. అటువంటిది ఐస్‌తో నిర్మించిన ఓ హోటల్ ఎండాకాలంలో కూడా కరగదట. ఏ సీజన్లోనైనా ఈ ఐస్ హోటల్ పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తుందని హోటల్ యాజమాన్యం చెబుతోంది. ఎండలో కూడా కరగని చిత్రమైన హోటల్ ఉత్తర స్వీడన్‌లోని జకాస్జర్వీ అనే గ్రామంలో ఉంది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ హోటల్లో అనేక మంచు కళా ఖండాలతో ఆకర్షణీయమైన డిలక్స్ సూట్లు ఉన్నాయి. హోటల్ మొత్తాన్నీ స్టీల్, కాంక్రీట్‌తో నిర్మించారు. పై కప్పును 20 సెంటీమీటర్ల ఇన్సులేషన్‌తో నిర్మించడం వల్ల ఎండాకాలం లో కూడా హోటల్ కరగదు. ఇన్నీ హంగులున్న ఈ హోటల్ పేరు ‘ఐస్ హోటల్ 365’ పేరుకు తగ్గట్టుగానే ఇది సంవత్సరం మొత్తం పర్యాటకులకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ హోటల్లో ఎంతో సౌకర్యవంతమైన బెడ్స్, టాయిలెట్స్ ఉన్నాయి. మొత్తం తొమ్మిది రకాల డిలక్స్ రూంలను మూడు పద్దతుల్లో అందుబాటులో ఉంచుతారు. స్వీడన్‌లోని కిరుణ ఎయిర్‌పోర్టు నుంచి ఈ హోటల్‌కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ప్రతిఏటా ఈ హోటల్‌ను 50 నుంచి 60 వేలమంది వరకు సందర్శిస్తుంటారు. ఐస్ తో తయారు చేసిన ఈ హోటల్ 2016 నవంబర్ నుంచి పర్యాటకులకు అందుబాటులో ఉంది. -
చిన్ననాటి ఐస్ గోలా తాతకు కేటీఆర్ భరోసా
సాక్షి, హైదరాబాద్ : సాక్షి, హైదరాబాద్: ముప్పై ఏళ్ల క్రితం అబిడ్స్‌లోని గ్రామర్ స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూలు ముందు ఐస్ గోలా అమ్మిన సయ్యద్ అలీని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు గురువారం కలిశారు. సయ్యద్ అలీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు వేశారు. ‘ఇంకా ఐస్ గోలా అమ్ముతున్నావా? కుటుంబం పరిస్థితి ఎలా ఉంది, పిల్లలు ఏం చేస్తున్నారు, ఆరోగ్యం ఎలా ఉంది’అని కేటీఆర్ వాకబు చేశారు. ‘ఆరోగ్యం అంతగా సహకరించడం లేదు. గత ఏడాది మేలో గుండె శస్త్ర చికిత్స జరిగింది. పొట్ట గడవడంకోసం ఇంకా ఆ స్కూల్ వద్దే ఐస్ గోలాలు అమ్ముతున్నాను’అని సయ్యద్ అలీ బదులిచ్చాడు. సయ్యద్ అలీకి నిలువ నీడ కూడా లేదని మాటల్లో తెలుసుకున్న కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘మీకు వెంటనే ఒక ఇల్లు మంజూరు చేస్తాను. నెలవారీ వృద్ధాప్య పెన్షన్ మంజూరు చేయిస్తాను. మీ కుమారులకు సరైన ఉపాధి చూపిస్తాను’అని కేటీఆర్ మాట ఇచ్చారు. సయ్యద్అలీకి ఇచ్చిన హామీల అమలుకోసం వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. కేటీఆర్ గురించి చాలా విన్నానని, నిజంగా ఇలా కలుస్తానని తానెప్పుడూ అనుకోలేదని ఈ సందర్భంగా సయ్యద్ అలీ ఆనందం వ్యక్తం చేశారు. తన కష్టాలను విన్న వెంటనే స్పందించి ఆదుకోవడానికి ముందుకు వచ్చిన కేటీఆర్‌కు సయ్యద్‌అలీ ధన్యవాదాలు తెలిపారు. మహబూబ్అలీ అనే యువకుడు రెండు వారాల క్రితం కేటీఆర్‌కు ఒక ట్వీట్ చేశాడు. ‘‘కేటీఆర్ సాబ్... మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీకు ఐస్‌గోలా అమ్మిన వ్యక్తి (చావూష్) మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు’ అని ఆ ట్వీట్లో పేర్కొ న్నాడు. కేటీఆర్ వెంటనే స్పందించి ‘తప్పకుండా కలుస్తాను. చావూష్ గురించి ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి’అని బదులిచ్చాడు. బేగంపేటలోని తన క్యాంపు కార్యాలయానికి గురువారం రావాలని సయ్యద్‌అలీని కోరాడు. సయ్యద్‌అలీని కలిసిన సమయంలో కేటీఆర్ చిన్ననాటి జ్ఞాపకాలతో ఉద్వేగానికి లోనయ్యారు. ట్విట్టర్లో కేటీఆర్ స్పందన -
అమెరికాను వణికిస్తున్న ఆర్కిటిక్ చలి
షికాగో: భీకరస్థాయిలో విరుచుకుపడుతున్న ఆర్కిటిక్ చలి దెబ్బకు అమెరికాలో లక్షలాది ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇళ్లలోనే ఉండిపోవాలని చాలా సంస్థలు తమ ఉద్యోగులకు సమాచారమిచ్చాయి. చాలా రాష్ట్రాల్లో పాఠశాలలు, వ్యాపార, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ఇప్పటికే 2000కుపైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఎలాంటి విపత్కర వాతావరణ పరిస్థితిల్లోనైనా ఉత్తరాలను బట్వాడా చేసే ‘యూఎస్ పోస్టల్ సర్వీస్’ సైతం ఇండియానా, మిషిగాన్, ఇల్లినాయిస్సహా 5 రాష్ట్రాల్లో తన సేవలను అర్ధంతరంగా నిలిపేసింది. ఉత్తర డకోటా, దక్షిణ డకోటా మొదలుకొని ఓహియో దాకా (1,930 కిలోమీటర్ల పొడవునా) డజనుకుపైగా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు ఇటీవల కాలంలో ఎన్నడూలేనంతటి కనిష్టస్థాయిలకు పడిపోయాయి. ఆరుబయటకెళ్లి ఎక్కువసేపు మాట్లాడొద్దని, సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని అమెరికన్ పౌరులను జాతీయ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. షికాగోలో ఉష్ణోగ్రత ఏకంగా మైనస్ 30 సెల్సియస్‌గా నమోదైంది. షికాగోలో మైనస్ 50కి సైతం పడిపోయే ప్రమాదముంది. అంటార్కిటికా ఖండంలోని కొన్నిచోట్ల సైతం ఇంతటి చలిలేదు. నార్త్ డకోటాలో ఉష్ణోగ్రత మైనస్ 35 డిగ్రీ ఫారన్‌హీట్‌గా నమోదైంది. కొన్ని రైళ్ల సర్వీసులనైనా నడిపేందుకు వీలుగా, మంచును కరిగించేందుకు షికాగోలో రైళ్ల పట్టాల దగ్గర సిబ్బంది మంటలు అంటించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఇల్లినాయిస్, మిషిగాన్, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో వాతావరణ ఎమర్జెనీ ప్రకటించారు. కెనడాలో సైతం చలి విజృంభిస్తోంది. ట్రంప్ వ్యంగ్య ట్వీట్: అమెరికాను మంచుదుప్పటి కప్పేసిన వేళ అధ్యక్షుడు ట్రంప్ తన వాదనను వ్యంగ్యంగా తెరపైకి తెచ్చారు. భూతాపం(గ్లోబల్ వార్మింగ్) అనేదే లేదని వాదించే ట్రంప్ బుధవారం.. ‘గ్లోబల్ వార్మింగ్ ఎక్కడ? త్వరగా అమెరికాకు వచ్చెయ్. ఈ చలిలో మాకు నీ అవసరం చాలా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. దీనిపై జాతీయ వాతావరణ శాఖ ఘాటుగా స్పందించింది. ‘చలి తుపాన్లు వచ్చినంతమాత్రాన గ్లోబల్ వార్మింగ్ అనేది లేదని కాదు’అంటూ ట్వీట్ చేసింది. -
కొండంత విషాదం... కడసారి చూపుకోసం..
సాక్షి, కొడిమ్యాల(చొప్పదండి): ఆపద్దర్మ మంత్రులు వచ్చారు.. పరామర్శించి, ఎక్స్‌గ్రేషియా ప్రకటించి వెళ్లారు. అధికారులు వచ్చారు.. సహాయక చర్యలు పరిశీలించి వెళ్లారు. వైద్య సిబ్బంది గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. కానీ మృతి చెందినవారిని అందరూ గాలికొదిలేశారు. మృతి చెందిన వారి బంధువులెవరు.. వారి ఆర్థిక, కుటుంబ పరిస్థితులేంటని పట్టించుకున్న నాదుడే లేడు. అయినవారి కడసారి చూపు కోసం ఫ్రీజర్ బాక్స్(ఐస్ బాక్స్)లో పెట్టే ఆర్థిక స్థోమత లేక మృతదేహాలను మంచు గడ్డలతో కప్పి పెట్టారు. ఈ హృదయవిదారక దృశ్యాన్ని చూసి కొడిమ్యాల మండల ప్రజలు చలించపోతున్నారు. కొండగట్టు ఘాట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కొడిమ్యాల మండలంలో విషాదాన్ని నింపింది. ఈ మండలానికి చెందిన వారే సుమారు 49 మందికి పైగా మృత్యువాతపడ్డారు. దీంతో ఈ మండలంలో మరణించిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఈ మండలంలోని పలు గ్రామాల ప్రజలు ఉపాధి కోసం పరాయి దేశానికి వలస వెళ్లారు. కొండగట్టు ఘాట్‌రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తమ వారు మరణించిన విషయం తెలుసుకొని కడసారి చూపుకోసం హుటాహుటిని స్వస్థలానికి బయలుదేరారు. వారు వచ్చే వరకు మృతదేహాలను భద్రపరిచేందుకు ఫ్రీజర్లు అందుబాటులో లేక.. ఉన్నా వాటికి అద్దె కట్టే ఆర్థిక స్థోమత లేక.. అధికారులు పట్టించుకోకపోవడంతో మంచు గడ్డలతో మృతదేహాలని కప్పిపెట్టారు. కొండగట్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. 57 మంది దుర్మరణం -
కూల్ కిల్లర్..
దురాజ్‌పల్లి (సూర్యాపేట) :ఎండాకాలంలో ప్రజలంతా చల్లదనం కోసం తహతహలాడుతుంటారు. ఇంట్లో ఉంటే ఫ్యాన్, క్యూలర్, ఏసీలను వినియోగించక తప్పడం లేదు. భయటకు వెలితే నీడ కోసం వెతుకులాడుతుంటారు. ఈ సమయంలో ముఖ్యంగా ప్రజలకు చల్లటి నీరు, పానీయాలు తాగుతుంటారు. అయితే చల్లని పానీయాల కోసం వ్యాపారులు ఐస్ వాడుతారనేది అందరికీ తెలిసిన విషయమే.. రోడ్లపై ఉన్న బండ్ల దగ్గర నుంచి దుకాణాల వరకు అందరు ఐస్ ముక్కలను ఉపయోగించి పానీ యాలు తయారుచేస్తుంటారు. వాటిని మనం తాగేస్తుంటాము కానీ.. అందులో వాడుతున్న ఐస్ ఎంతమాత్రం నాణ్యమైనదని ఆలోచించం. ఈ ఐస్ ఏ మాత్రం నాణ్యమైనది కాదని, ప్రజలు అనారోగ్యం బారిన పడేలా చేస్తోందని వైద్యులు, నిపుణులు అంటున్నారు. అవగాహన లేక.. ప్రజలకు సరైన అవగాహన లేక ఆర్యోగానికి ప్రమాదకరమైన ఐస్ కలిపిన శీతల పానీయాలు తాగి అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ ఐస్ నాణ్యమైనది కాదని వ్యాపారులకు కూడా తెలిసే వాడుతున్నారు. ప్రజల ఆర్యోగాలతో వారికి పని లేదు తమ వ్యాపారాలు నడిస్తే చాలు. సాధారణగా పండ్ల రసాలు ఆర్యోగానికి చాలా మంచివి. కాని అందులో కలిపే ఐస్‌తో మొత్తం ప్రమాదం పొంచి ఉన్నది. సాధారణంగా శీతల పానీయాలలో ఎడిబుల్ ఐస్ ప్లాంట్లలో తయారైన ఐస్‌ను మాత్రమే వాడాలి. కాని జిల్లాలో ఎక్కడా ఎడిబుల్ ఐస్ ప్లాంట్లు లేవు. ఉన్నవన్నీ పారిశ్రామిక అవసరాల కోసం ఐస్ తయారు చేసే ప్లాంట్లు మాత్రమే ఉన్నాయి. ఈ ఐస్ కేవలం చేపలు, రొయ్యలు, మృతదేహాలు నిల్వ చేయడం కోసమే వాడాలి. ఐస్ కలిపిన పానీయాలు తాగితే అంతే.. ఐస్ తయారీ బ్లాకులలో వాడే ఉప్పు నీరు చాలా కాలం పాటు ప్లాంట్‌లో కదలకుండా ఉండిపోతుంది. ఈ నీటిలో ప్రమాదకరం బ్యాక్టీరియాలు ఉంటాయి. అందరూ ఐస్‌లో బ్యాక్టీరియా ఉండదని భావిస్తారు. కాని అది నిజం కాదు. నీరు గడ్డ కట్టినప్పుడు అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్లు నిద్రావస్థలోనికి వెలుతాయి. సాధారణ ఉష్ణోగ్రత రాగానే అవి తమ జీవన ప్రక్రియను మళ్లీ ప్రారంభిస్తాయి. ఐస్ ప్యాక్టరీలలో ఎటువంటి సురక్షిత విధానాలు పాటించరు. అందువల్ల ఐస్‌లో కొల్లి బ్యాక్టీరియా, రోటా, హెపటైటిస్ వంటి వైరస్లు ఉంటాయి. ఇలాంటి ఐస్ కలిపిన పానీయాలు తాగితే జలుబు, దగ్గు, కామెర్లు, విరేచనాలు వంటి జబ్బులు వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఫ్రిజ్‌లో నీటిని ఉంచుకొని తాగడమే మేలు. రోజూ రూ.75వేల వ్యాపారం జిల్లా కేంద్రంతోపాటు కోదాడ, తుంగతుర్తి, తిరుమలగిరి, హుజూర్నగర్ వంటి ప్రధాన పట్టణాలలో పారిశ్రామిక, సాధారణ అవసరాలకు వినియోగించే ఐస్ ఫ్యాక్టరీలు సుమారు 15వరకు ఉన్నాయి. వీటిలో జిల్లా కేంద్రంతో పాటు కోదాడలో ఉన్న ఐస్ఫ్యాక్టరీలకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. రోజు సుమారు రూ.5వేల నుంచి ఏడు వేల వరకు వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. సరాసరి రోజుకు రూ.5వేల చొప్పున బేరం జరిగితే రూ.75వేల ఠివరకు ఐస్‌ను అమ్ముతున్నట్టు తెలుస్తోంది. నెలకు రూ.22.50లక్షల వ్యాపారం చేస్తున్నారు. అలాగే జిల్లాలో పండ్ల రసాలను, నిమ్మ సోడాలను ఇతర పదార్థాలను ఐస్ వేసి అమ్మే వ్యాపారులు సుమారు 700పైనే ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా సూర్యాపేట, కోదాడలో 500 వరకు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు రూ.500 నుంచి రూ.వెయ్యి వ్యాపారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఒక్క ఐస్ సాధారణ బాక్స్ సుమారు పది కేజీలు రూ.100పెట్టి కొనుగోలు చేస్తున్నారు. అత్యంత ప్రమాదకరం..! పారిశ్రామిక అవసరాల కోసం తయారు చేసిన ఐస్‌ను ప్రజలు నేరుగా తీసుకోకూడదు. కాని వ్యాపారులు తమ అవసరాకోసం ఈ ఐస్నే వాడుతున్నారు. చెరుకు రసం, లస్సీ, ఫ్రూట్ జ్యూస్‌లు, నిమ్మరసం, షోడా, సుగంధ పానీయాల తయారీలో ఈ ఐస్‌ను వాడుతున్నారు. ఈ ఐస్ అతి సాధారణమైన నీటితో తయారు చేస్తారు. అంతే కాకుండా ఈ ఐస్ తయారి సమయంలో ఐస్ బ్యాకులు ఉప్పు నీటిలో మునిగి ఉంటాయి. ఉప్పునీరు తీసుకున్న చల్లదానాన్ని ఈ బ్లాక్ గ్రహించి దీనిలో దీనిలో ఉన్న నీటిని గడ్డకట్టేలా చేస్తున్నది. కొన్ని సందర్భలాలో ఉప్పు నీరు బ్లాక్‌లోకి నేరుగా చేరుతున్నది. ఇది అత్యంత ప్రమాదకరంమైనది. -
ఐస్ క్రికెట్ : మళ్లీ ఓడిన సెహ్వాగ్ టీం
సెయింట్ మోర్టిజ్ : సీనియర్ క్రికెటర్ల ఐస్ క్రికెట్ రెండో రోజు సైతం సరదాగా సాగింది. ఈ మ్యాచ్‌లోనూ భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ డైమండ్స్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఆఫ్రిది రాయల్స్ గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన సెహ్వాగ్ డైమండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. 206 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్రిది రాయల్స్ జట్టు 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. జాక్వస్ కల్లీస్(90 నాటౌట్), ఒవైస్ షా(37 నాటౌట్)గా నిలిచారు. డైమండ్స్ జట్టు బౌలింగ్‌లో దారుణంగా విఫలమమడంతో రాయల్స్ జట్టు అలవోక విజయం సాధించింది. అంతకు ముందు డైమండ్స్ జట్టులో సైమండ్స్ (67), మహ్మద్ కైఫ్ (57), సెహ్వాగ్ (48) పరుగులు చేశారు. చాల రోజుల అనంతరం బ్యాట్ పట్టిన ఈ సీనియర్ క్రికెటర్లు అద్భుత షాట్లతో అభిమానులను అలరించారు. ఇక బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో సైతం ఆఫ్రిది జట్టే గెలుపొందిన విషయం తెలిసిందే. -
చూసేద్దామా... ఐస్ క్రికెట్!
సెయింట్ మోరిట్జ్ (స్విట్జర్లాండ్): నేలపై క్రికెట్ సాధారణం. బీచ్‌లో క్రికెట్ కొంచెం కష్టం. మరి హిమ తాపంలో ఐస్ క్రికెట్ సంక్లిష్టం. కానీ ఈ తరహా క్రికెట్‌కు ప్రపంచ దిగ్గజాలు సై అంటున్నారు. భారత్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్, కైఫ్, జహీర్ ఖాన్, అగార్కర్, రమేశ్ పవార్ కొత్త థ్రిల్‌కు సిద్ధమయ్యారు. ఇతర దేశాల నుంచి కలిస్, గ్రేమ్ స్మిత్, వెటోరి, దిల్షాన్, మలింగ, అక్తర్, షాహిద్ ఆఫ్రిది తదితర పేరొందిన క్రికెటర్లు బరిలోకి దిగుతున్నారు. దీంతో స్విస్‌లో ఐస్ క్రికెట్ హంగామా దిగ్గజాలతో జరుగనుంది. ఐస్‌పై ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమ కార్పెట్ పిచ్‌పై రెండు టి20 మ్యాచ్‌లు నిర్వహిస్తారు. ఇక్కడ రాత్రి అయితే ఉష్ణోగ్రతలు–20 డిగ్రీ సెల్సియస్‌కు పడిపోతాయి. రక్తం గడ్డకట్టే పరిస్థితిలో ఆడే ఆట ఇది. ప్రపంచ దిగ్గజాలను టీమ్ రాయల్స్, బడ్రుట్ ప్యాలెస్ డైమండ్స్ జట్లకు ఎంపిక చేశారు నిర్వాహకులు. గురువారం, శుక్రవారం ఒక్కో మ్యాచ్ జరుగుతుంది. ►మ.గం.3.30 నుంచి సోని ఈఎస్‌పీఎన్‌లో ప్రత్యక్ష ప్రసారం -
మంచు కొండలా మారిన నయాగరా
-
ఒంటి చేత్తో ఐస్ బద్ధలు కొట్టి నదిలో సాహసం
-
ఒంటి చేత్తో ఐస్ బద్ధలు కొట్టి నదిలో సాహసం
బీజింగ్ : సాధారణంగా చలి అంటేనే బయటకు వెళ్లే సాహసం చేయలేము. ఒక వేళ బయటకు వచ్చినా ఆ పని ముగించుకొని వెంటనే వెళ్లిపోతుంటాం. అలాంటిది కటిక చలికంటే భయంకరంగా ఉండే మంచుగడ్డకట్టుకుపోయిన నదిలో దిగి సాయం చేసే సాహసం సాధ్యమవుతుందా.. బహుషా అది అందరికీ సాధ్యం కాదేమో.. చైనాలో ఓ వ్యక్తి మాత్రం ప్రాణాలకు తెగించాడు. ఉదయాన్ని బైక్‌పై వెళుతున్న షి లై (54) అనే వ్యక్తి మంచుగడ్డకట్టుకుపోయిన నదిలో ఓ పెద్దావిడ పడిపోయి ఉండటాన్ని గమనించాడు. వెంటనే తన బైక్ ఆపేసి నదిలోకి పరుగులు తీశాడు. నదిలో నుంచి ఆమెను బయటకు లాగుతూ అడ్డుగా ఉన్న ఐస్‌ను తనఒంటి చేత్తో బలంగా మోది పగులగొట్టాడు. అతడి తెగింపును చూసి మరో వ్యక్తి తోడుగా వచ్చాడు. ఎట్టకేలకు ఆ ఇద్దరు కలిసి ఆ పెద్దావిడను సురక్షితంగా బయటపడేశారు. అనంతరం ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన జరిగినప్పుడు తాను పెద్దగా ఆలోచించలేదని, తన పని తాను చేసి వెంటనే ఇంటికి వెళ్లి ఓ గిన్నెలో అల్లం నీరు తాగి ఆఫీసుకు వెళ్లిపోయానని వివరించాడు. కాగా, అతడి సాహసానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
విత్తన భాండాగారంలో వరద బీభత్సం
నార్వే: ప్రపంచం అంతమైపోతే వ్యవసాయ ఉత్పత్తులు తర్వాత జనించే జీవికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న విత్తన భాండాగారంలో వరద బీభత్సం సృష్టించింది. నార్వేకు చేరువలోని స్పిట్బర్గ్ మంచు ద్వీపంలో ఉన్న ఈ భాండాగారంలోకి మంచు కరిగిన నీరు వరదగా పోటెత్తింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో కరిగిన మంచునీరు ఓ టన్నెల్ ద్వారా భాండాగారంలో పోటెత్తింది. అయితే, విత్తనాలను దాచి ఉంచిన ప్రదేశంలోకి నీరు చేరలేదని తెలిసింది. భాండాగారంలో మిగిలిన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాస్తవానికి విత్తన వాల్ట్‌లో అన్ని పనులను కంప్యూటర్లే నిర్వర్తిస్తాయి(మనుషులు ఎవరూ అందులో ఉండరు). కానీ ఈ అనుకోని సంఘటనతో కొందరు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు. -
రికార్డు స్థాయిలో కరుగుతున్న మంచు
వాషింగ్టన్: గ్లోబల్ వార్మింగ్ ప్రభావమో ఏమోకానీ ఇరు ధ్రువాల వద్ద మంచు రికార్డు స్థాయిలో మంచు కరుగుతోంది. అర్కిటిక్ వద్ద ఈ ఏడాది చలికాలంలో మంచు రికార్డుస్థాయిలో తక్కువస్థాయిలో ఉండగా, ఇక అంటార్కిటిక్ ధ్రువం వద్ద కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు వెల్లడించారు. 1979 నుంచి ఉపగ్రహాలు ఈ రెండు ధ్రువాల వద్ద సముద్రహిమస్థాయిని నిరంతరాయంగా అంచనా వేస్తుండగా ఈ ఏడాది అత్యంత తక్కువగా ఉన్నట్టు తేలింది. ప్రస్తుతం 16.21 కి.మీ విస్తీర్ణంలో ధ్రువాల వద్ద సముద్రహిమం వ్యాపించి ఉంది. 1981–2010 మధ్యకాలం నాటితో పోలిస్తే ఇది రెండు మిలియన్ చదరపు కి.మీ కంటే ఇది తక్కువ. సముద్రహిమం మెక్సికో కంటే పెద్దదైన సముద్రహిమభాగం కరిగిపోయినట్టు తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్లోబల్ వార్మింగ్... అంటార్కిటికా ధ్రువాన్ని సైతం కబళించివేస్తోందని నాసాకు చెందిన వాల్ట్ మీయర్ పేర్కొన్నారు. మార్చి రెండో వారం నుంచి సెప్టెంబర్ రెండోవా రం మధ్యకాలంలో ఆర్కిటిక్ సముద్రంతోపాటు దానికి సమీపంలోని సముద్రాలపై ప్రవహించే హిమం మరింత కిందికిదిగిపోతూ ఉంటుంది.