విత్తన భాండాగారంలో వరద బీభత్సం | 'Doomsday' seed vault in the Arctic has FLOODED after soaring global temperatures caused permafrost to melt | Sakshi
Sakshi News home page

విత్తన భాండాగారంలో వరద బీభత్సం

Published Mon, May 22 2017 6:42 PM | Last Updated on Wed, Aug 1 2018 3:59 PM

విత్తన భాండాగారంలో వరద బీభత్సం - Sakshi

విత్తన భాండాగారంలో వరద బీభత్సం

నార్వే: ప్రపంచం అంతమైపోతే వ్యవసాయ ఉత్పత్తులు తర్వాత జనించే జీవికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న విత్తన భాండాగారంలో వరద బీభత్సం సృష్టించింది. నార్వేకు చేరువలోని స్పిట్‌బర్గ్‌ మంచు ద్వీపంలో ఉన్న ఈ భాండాగారంలోకి మంచు కరిగిన నీరు వరదగా పోటెత్తింది.

ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో కరిగిన మంచునీరు ఓ టన్నెల్‌ ద్వారా భాండాగారంలో పోటెత్తింది. అయితే, విత్తనాలను దాచి ఉంచిన ప్రదేశంలోకి నీరు చేరలేదని తెలిసింది. భాండాగారంలో మిగిలిన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాస్తవానికి విత్తన వాల్ట్‌లో అన్ని పనులను కంప్యూటర్లే నిర్వర్తిస్తాయి(మనుషులు ఎవరూ అందులో ఉండరు). కానీ ఈ అనుకోని సంఘటనతో కొందరు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement