temparature
-
యూపీలో వడదెబ్బకు 33 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం నాడు కాన్పూర్‌లో దేశంలోకెల్లా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాన్పూర్‌లో పగటి ఉష్ణోగ్రత 46.3 డిగ్రీలుగా నమోదయ్యింది. రాత్రి 35.2 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యింది.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. శనివారం వివిధ ప్రాంతాల్లో వడదెబ్బకు 31 మంది మృతి చెందారు. సోమవారం వరకు పరిస్థితులు ఇలాగే ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కాన్పూర్, బుందేల్‌ఖండ్‌లో ఎండ వేడిమి కారణంగా శనివారం 20 మంది మృతిచెందారు.వీరిలో కాన్పూర్‌లో ఎనిమిది మంది, చిత్రకూట్‌లో ఆరుగురు, మహోబాలో ముగ్గురు, బందా, హమీర్‌పూర్‌లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. ఇదేవిధంగా వారణాసి పరిసర ప్రాంతాల్లో ఎండ వేడిమికి 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో వారణాసిలో ఏడుగురు, బల్లియాలో ముగ్గురు, మీర్జాపూర్లో ఇద్దరు, ఘాజీపూర్, సోన్‌భద్రలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.జోనల్ వాతావరణ కేంద్రం సీనియర్ వాతావరణ నిపుణులు అతుల్ కుమార్ సింగ్ మాట్లాడుతూ రాబోయే నాలుగైదు రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తా ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపారు. -
భానుడి భగభగలు: ట్రాన్స్ఫార్మర్ల ముందు కూలర్లు, ఫ్యాన్లు
ఉత్తరాదిన భానుడు భగభగ మండిపోతున్నాడు. దీంతో సామాన్యులు, జంతువులు, పక్షులే కాదు చివరికి విద్యుత్ పరికరాలు కూడా ఆ వేడిని తట్టుకోలేకపోతున్నాయి. విపరీతమైన ఎండ వేడిమికి విద్యుత్ శాఖకు చెందిన పరికరాలు గరిష్ట లోడ్ కారణంగా అత్యంత వేడిగా మారుతున్నాయి.పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న సమయంలో విద్యుత్ లోడ్ కారణంగా ట్రాన్స్ఫార్మర్ల ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లో అవి పేలిపోయే ప్రమాదం ఉంది. అందుకే వాటిని చల్లబరచేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది టాన్స్ఫార్మర్ల ముందు ఫ్యాన్లు, కూలర్లు అమరుస్తున్నారు.మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లోని చంబల్ కాలనీలోని విద్యుత్ గ్రిడ్‌లోని ట్రాన్స్ఫార్మర్, బీపీఎల్ కూడలిలోని విద్యుత్ గ్రిడ్ ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. వీటిని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు విద్యుత్ పంపిణీ సంస్థలు కూలర్లు, ఫ్యాన్లను వినియోగిస్తున్నాయి. తద్వారా వారు విద్యుత్‌ను సక్రమంగా, అంతరాయం లేకుండా సరఫరా చేయగలుగుతున్నారు.సాధారణంగా విద్యుత్ సబ్‌స్టేషన్‌లోని ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రత స్థిరంగా ఉండాలి. అయితే వేడి కారణంగా ట్రాన్స్ఫార్మర్లోని ఆయిల్ వేడెక్కితే, దాని ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా పేలుడు సంభవించే ప్రమాదం ఉంది. అలాగే ట్రిప్పింగ్ జరిగే అవకాశం కూడా ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఉష్ణోగ్రతను స్థిరంగా నిర్వహించడానికి వాటి మందు కూలర్లు ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్‌లోని పలు జిల్లాల్లో ఇటువంటి ప్రయోగాలు జరుగుతున్నాయి. -
ఇసుకలో అప్పడం కాల్చిన జవాను
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఎండ వేడిమిలో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.రాజస్థాన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఒక వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు. తాజాగా బికనీర్‌లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఎండలు ఏ రీతిలో ఉన్నాయో తెలియజేసేందుకు బీఎస్ఎప్ జవాను ఒకరు వినూత్న ప్రయోగం చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.బీఎస్ఎఫ్ జవాను ఎండకు అత్యంత వేడిగా మారిన ఇసుకతో ఒక అప్పడాన్ని కాల్చారు. ఈ వీడియోను చూస్తే.. ప్రతికూల పరిస్థితుల్లో సైతం మన దేశ సరిహద్దులలోని సైనికులు ఎలా విధులు నిర్వహిస్తున్నారో గమనించవచ్చు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు మనమంతా ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తుండగా, దేశ సరిహద్దుల్లోని జవానులు ఉక్కపోత మధ్యనే విధులు నిర్వహిస్తున్నారు. వైరల్ అయిన ఈ వీడియో బికనీర్‌లోని ఖాజువాలా సమీపంలోని పాక్ సరిహద్దులలోనిది. రాజస్థాన్‌లో హాటెస్ట్ సిటీగా బికనీర్ పేరుపొందింది. उफ ये गर्मी! बीकानेर में 47 डिग्री पार पहुंचा पारा, तपती रेत पर @BSF_India जवान ने सेंका पापड़। इतनी गर्मी में भी जवान सीमा पर निभा रहे फर्ज... देखें वीडियो #summersafety पूरी खबर पढ़ें- https://t.co/ToEeaJcxG9 pic.twitter.com/yyCajuv1lt— Amar Ujala (@AmarUjalaNews) May 22, 2024 -
గడ్డకట్టే చలిలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సాహసం..! ఐతే..
చైనాలోని యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సిద్ధార్థ్ ఛటర్జీ చేసిన యోగా నెట్టింట సంచలనం రేపుతుంది. మైనస్ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో 'ఓం' కార పఠనంతో బ్రీతింగ్ వ్యాయామాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి గల వీడియోని ఛటర్జీ "బ్రీతింగ్ ఫర్ గుడ్ హెల్త్" అనే పేరుతో పోస్ట్ చేశారు. ఆయన ఆ వీడియోలో బీజింగ్‌లోని గడ్డకట్టుకుపోయిన సరస్సుపై కూర్చొని శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేశారు. ఇది శారీరక, మానసికి ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ వ్యాయామాలని వీడియో ప్రారంభంలోనే చెప్పారు. పొట్టను లోపలకి, బయటకు వదిలేలా లోతైన శ్వాస వ్యాయామాలు 'ఓం' కార పఠనంతో మొదలవ్వుతుందని అన్నారు. మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు మొదట పని శ్వాస పీల్చుకోవడం. ఇక ఆఖరి పని దాన్ని విడిచిపెట్టయడమే అని చెప్పారు. ఇర ఆయన ఆ ఎముకలు కొరికే చలిలో పొట్టకు సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజుల తోపాటు శీర్షాసనం వంటివి యోగాసనాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాకుండా ఈ వ్యాయామాల వల్ల కరోనా వంటి మహమ్మారిల నుంచి తట్టుకునేలా రోగనిరోధక శక్తిని అందిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆయన 2020లొ చైనాలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్తగా నియమితులైన టైంలో అధిక కొలస్ట్రాల్, బీపీ, అధిక హృదయ స్పందన రేటు, ప్రీ డయాబెటిక్, ఒబెసిటీ వంటి సమస్యలతో బాధపడుతుండేవారు. ఆ తర్వాత ఈ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, సరైన జీవన శైలితో అనూహ్యంగా 25 కిలోల బరువు తగ్గడం జరిగింది. ఇక భారత్‌కి చెందిన ఛటర్జీ చైనాలోని యూఎన్ కార్యాలయానకి అధిపతిగా నియమించడం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఎందుకంటే తూర్పు లడఖ్ ప్రతిసష్టంభన, భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతల నడుమ ఆయన నియామకం జరగడమే అందుకు కారణం. కాగా, ఛటర్జీ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వలస వచ్చిన కుటుంబం. చిన్నప్పుడు బాల్యంలో ఆయన పోలియో బాధితుడు. సరైన చికత్స తీసుకుని పోలియో నుంచి పూర్తిగా రికవరయ్యాడు. ఆ తర్వాత 1981లో రెండో ప్రయత్నంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. అక్కడ నుంచి ఆయన ప్లేయర్‌గా, బాక్సర్‌గా మారి ఎన్నో టైటిల్స్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలైట్ పారా రెజిమెంటల్‌లో చేరారు. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లి అక్కడ ఐవీ లీగ్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎన్ మిషన్కి నాయకత్వం వహించారు. ఆయన భార్య బాన్ హ్యూన్ హీ భారత్‌లోని యూనిసెఫ్ సామాజిక విధానానికి చీఫ్‌గా ఉన్నారు. ఆయన దౌత్యవేత్తగా తన 24 ఏళ్ల కెరీర్లో కెన్యా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్ (డార్ఫర్), ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా చైనా పొరుగు దేశం ఇరాకీ కుర్దిస్తాన్ వంటి దేశాలలో పనిచేశారు. ఛటర్జీ యూఎన్ శాంతి పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), UNICEF, UN పాపులేషన్ ఫండ్ (UNFPA), రెడ్ క్రాస్ ఉద్యమం, UNOPS,UN భద్రతలలో కూడా పనిచేశారు. తన దౌత్యపరమైన పనుల తోపాటు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరిచేలా..ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకుని యాక్టివ్‌గా ఉండేలా చేసే శ్వాస వ్యాయమాలను సాధన చేస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు సిద్ధార్థ్ ఛటర్జీ. VIDEO | Siddharth Chatterjee, the head of the #UN in China, is making waves on Chinese social media where he showcased his tough yoga and fitness exploits, including breathing exercises in sub-zero temperatures, which he says helped him to maintain physical and mental… pic.twitter.com/4q5nifvJHC — Press Trust of India (@PTI_News) April 16, 2024 (చదవండి: మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?) -
నిడమనూరు@44.5 రాష్ట్రం నిప్పుల కొలిమి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడి భగభగలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. వేగంగా వీస్తున్న వడగాడ్పులు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలో ఈ స్థాయిలో వరుసగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడం గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ మూడో వారం లేదా చివరి వారంలో వడగాడ్పుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కానీ ఈసారి మొదటి వారం నుంచే వేడి గాలులు వీయడం ప్రారంభమైంది. వాతావరణంలో మార్పులే ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమని అధికారులు వివరిస్తున్నారు. సోమవారం సాధారణం కంటే 1.6 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు: ఏప్రిల్ 8న రాష్ట్రంలో నమోదు కావాల్సిన సగటు ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్ కాగా 40.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. సాధారణ సగటు కంటే 32 జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రత నమోదు కాగా... 14 జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో 42 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో సాధారణం కంటే 3 డిగ్రీ సెల్సీయస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాష్ట్రవ్యాప్తంగా 16 ప్రాంతాలు అధిక ఉష్ణోగ్రతలతో కుతకుతలాడాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీ సెల్సీయస్ కంటే అధికంగా నమోదైంది. సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం కావడంతో తక్కువ ఉష్ణోగ్రత నమోదైనప్పటికీ వాతావరణంలో తేమ శాతం పెరగడంతో ఉక్కపోత అధికంగా ఉంది. తప్పనిసరైతేనే బయటకెళ్లాలి రానున్న రెండ్రోజులు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జోగుళాంబ గద్వాల, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, ములుగు, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీ సెల్సీయస్ నుంచి 44 డిగ్రీ సెల్సీయస్ మధ్యన నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం నుంచి రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మంగళ, బుధ వారాల్లో ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి జిల్లాల్లోని కొన్నిచోట్ల వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. అత్యవసర పనులుంటే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మంగళ, బుధ వారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. -
గడ్డ కడుతున్న హిల్ స్టేషన్స్, వణుకుతున్న జనం: నిపుణుల ఆందోళన
తమిళనాడులోని కొన్ని జిల్లాలు, పర్వత ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల సెల్సియస్‌కు చేరడానికి చేరువలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రధాన హిల్ స్టేషన్ ఊటీలో 2.3 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా , నీలగిరిలోని శాండినాళ్ల రిజర్వాయర్ ప్రాంతంలో ఉష్ణోగ్రత జీరో డిగ్రీలకు పడిపోయింది. ఫలితంగా ఉదయం భారీ మంచు కప్పేయడంతో సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. ఊటీ, నీలగిరి కొండ ప్రాంత వాసులు విపరీతమైన చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో పాటు దట్టమైన పొగమంచుతో స్థానికులు ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఇంతకుముందెన్నడూ చూడలేదని వాపోతున్నారు. మరోవైపు పర్యావరణ వేత్తలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడులోని ఈ ప్రాంతం మరికొన్ని రోజుల్లో గట్టకట్టుకు పోతుందంటూ హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్, ఎల్-నినో ప్రభావం వల్ల ఈ మార్పు వచ్చిందని నీలగిరి ఎన్వైర్ మెంట్ సోషల్ ట్రస్ట్ (NEST)కి చెందిన వి శివదాస్ చెబుతున్నారు.చలి తీవ్రత ముదురుతోందని ఇలాంటి వాతావరణ మార్పు నీలగిరికి పెద్ద సవాల్ అని, దీనిపై అధ్యయనం జరగాలని అన్నారు.అంతేకాదు ఈ వాతావరణ పరిస్థితి పెద్ద ఎత్తున చేపట్టిన టీ ప్లాంటేషన్‌కు కూడా సవాల్‌గా మారింది. అధికారిక సమాచారం ప్రకారం, ఉదగమండలంలోని కాంతల్, తలైకుంటలో ఒక డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది, బొటానికల్ గార్డెన్లో 2 డిగ్రీల సెల్సియస్ , శాండినాళ్లలో 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో చాలా చోట్ల, ప్రజలు చలి మంటలు వేసుకుంటూ వెచ్చగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే రాబోయే నెలల్లో వ్యవసాయం ఇతర ఉత్పత్తిపై ప్రభావం చూపుతుందని భయాందోళన వ్యక్తం చేశారు స్థానిక రైతులు. ముఖ్యంగా క్యాబేజీలపై వాతావరణం ప్రభావం చూపిందని కూరగాయల రైతులంటున్నారు. అటు చలిగాలుల కారణంగా పని నిమిత్తం త్వరగా ఇంటి నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని ప్రభుత్వ ఉద్యోగి ఎన్ రవిచంద్రన్ తెలిపారు. దట్టమైన పొగమంచు కమ్ముకున్న దృశ్యాలు పర్యాటకులను అబ్బుర పరుస్తున్నప్పటికీ గతకొన్ని రోజులుగా పాటు, విపరీతమైన చలితో ప్రజలు ఇళ్లలోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్వాసలో ఇబ్బందులు, తీవ్రమైన తలనొప్పి, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో అక్కడి జనం అల్లాడిపోతున్నారు. #WATCH | Tamil Nadu: Temperature dips to 0°C in the Sandynalla reservoir area in Tamil Nadu's Nilgiris. Hill station Ooty recorded 2.3°C resulting in heavy frost in the morning. pic.twitter.com/MBqR7c6B9z — ANI (@ANI) January 18, 2024 -
ఢిల్లీని కబళించిన చలి పులి.. పొగమంచుతో తగ్గిన విజిబులిటీ!
దేశ రాజధాని ఢిల్లీలో నేడు (ఆదివారం) చలి మరింత పెరిగింది. పొగమంచు కారణంగా విజిబులిటీ మరింత తగ్గింది. ఇటువంటి వాతావరణంలో రోడ్డు రవాణా, రైలు రవాణా, విమానాల రాకపోకలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం ఉదయం ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉంది. శనివారం 5.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవగా, ఇది సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువ. మరోవైపు ఆదివారం ఉదయం 8.30 గంటలకు సఫ్దర్జంగ్లో 700 మీటర్ల విజిబిలిటీ లెవల్ మాత్రమే ఉంది. పాలెంలో ఇది 800 మీటర్లుగా ఉంది. ఆదివారం ఆకాశం నిర్మలంగా ఉంటుందని, కాస్త ఎండగా ఉండే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 24 నుండి 25 డిగ్రీలు మధ్య ఉండవచ్చు. వారమంతా ఇదే వాతావరణం కొనసాగనుంది. ఈ వారంలో ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఇది కూడా చదవండి: ‘రాత్రుళ్లు ఎవరూ బయట నిద్రించకుండా చూడండి’ -
ఢిల్లీలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
దేశ రాజధాని న్యూఢిల్లీలో వరుసగా రెండో రోజు కనిష్ట ఉష్ణోగ్రత పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదైంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే మూడు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉండవచ్చు. ఈ సమయంలో ఉదయం తేలికపాటి పొగమంచు కూడా ఉండనుంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్‌గా ఉండి, ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రెండు రోజుల తర్వాత అంటే రాబోయే సోమవారం నాడు ఢిల్లీలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ ప్రకారం ఢిల్లీలోని లోధి రోడ్లో శుక్రవారం కనిష్ట ఉష్ణోగ్రత 9.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 26.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం ఉదయం అంటే ఈరోజు వాతావరణంలో పొగమంచు వ్యాపించింది. పగటిపూట తేలికపాటి సూర్యరశ్మి ఉండనుంది. ఇది కూడా చదవండి: రాజస్థాన్ ఎవరిదో! -
అగ్రరాజ్యంలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం.. గత రికార్డులు బద్దలు కొడుతూ..
నైరుతి అమెరికాలో ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయికి చేరాయి. ఇది 110 మిలియన్లకు మించిన ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. ఈ నేపధ్యంలో అమెరికాలోని 38 నగరాల్లో ఉష్ణోగ్రత రికార్డులు బద్దలయ్యే అవకాశం ఉందని సమాచారం. లాస్ వెగాస్‌లో వేడిగాలులతో కూడిన ఉష్ణోగ్రత రికార్డు గరిష్ట స్థాయి 117F (47.2C)కు చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దక్షిణ ఐరోపాను కూడా తాకాయి. కెనడా చరిత్రలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు అడవుల్లో కార్చిచ్చుకు కారణంగా నిలుస్తున్నాయి. మానవ కార్యకలాపాలతో ముడిపడిన వాతావరణ మార్పులు ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతోందని శాస్త్రవేత్తలు చాలా కాలంగా హెచ్చరిస్తూ వస్తున్నారు. రంగంలోకి అగ్నిమాపకదళ సిబ్బంది నైరుతి యుఎస్‌లోని పలు ప్రాంతాలలో, లాస్ ఏంజిల్స్ శివార్లలో వందలాది మంది అగ్నిమాపకదళ సిబ్బంది ఉష్ణోగ్రతలను చల్లబరిచేందుకు తమవంతు ప్రయత్నాలను చేస్తున్నారు. నేషనల్ వెదర్ సర్వీస్ (ఎన్డబ్లుఎస్) తెలిపిన వివరాల ప్రకారం కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో ఉష్ణోగ్రతలు ఆదివారం 128F (53.9C)కి చేరుకున్నాయి. ఇది భూమిపై అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన ప్రదేశంగా గుర్తింపు పొందింది. అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా లాస్ వెగాస్‌లోని రద్దీగా ఉండే వీధులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. హోటళ్ల ఫౌంటైన్లలోకి ప్రజలు ప్రవేశించకుండా సెక్యూరిటీ గార్డులు పర్యవేక్షిస్తున్నారు. వీధులలో చెమటతో తడిసిపోతూ.. స్ట్రిప్‌లోని అత్యంత ప్రజాదరణ పొందిన హోటళ్లు, కాసినోలకు వెళుతున్న యువకులు ఈ వేడిని తట్టుకోలేకపోతున్నాం అని తెలిపారు. లాస్ వెగాస్‌లో ఏకాస్త భవనం నీడ కనిపించినా, చిన్న చెట్టు నీడ వచ్చినా జనం అక్కడ సేద తీరుతున్నారు. కాసినోల లోపల ఎయిర్ కండిషనింగ్ అధికంగా ఉంచారు. వీధులలో చెమటతో తడిసిపోతున్న వ్యక్తులు కనిపిస్తూ ఇంతటి ఉష్ణోగ్రతలు ఎప్పుడూ చూడలేదని వాపోతున్నారు. ఎల్ పాసో, టెక్సాస్‌లో 100.4F (38C) అంతకంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫీనిక్స్, అరిజోనాలో ఉష్ణోగ్రతలు 17 రోజులుగా 109.4F (43C) కంటే ఎక్కువగా ఉన్నాయి. ఆదివారం నాడు దట్టమైన మేఘాల కారణంగా ప్రజలకు స్వల్పంగా ఉపశమనం లభించింది. అయితే పగటి ఉష్ణోగ్రతలు 114F (45.5C) గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇది కూడా చదవండి: ఒక్క ఎమోజీ చాలు.. జైలుకు పంపడానికి..! ‘శీతలీకరణ కేంద్రాలు’గా పబ్లిక్ భవనాలు రాబోయే రోజుల్లోనూ ఇదేస్థాయి ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని పిల్లలు, గర్భిణులు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారు ఎండలోకి వెళ్లకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. కాలిఫోర్నియా, నెవాడాలోని కొన్ని ప్రాంతాల్లోని పబ్లిక్ భవనాలు ‘శీతలీకరణ కేంద్రాలు’గా మార్చారు. జనం ఇక్కడ వేడి నుంచి ఉపశమనం పొందవచ్చని ప్రభుత్వం తెలిపింది. అయితే వేసవి తీవ్రతలను చూడాలని కోరుకునే పర్యాటకులను ఈ వాతావరణం ఆకర్షిస్తోందని కొందరు అధికారులు తెలిపారు. వారు దీనిని హ్యాపీ డెత్ డే అని పిలుస్తున్నారన్నారు. హీట్ డోమ్ కారణంగా.. ఏదైనా ఒక ప్రాంతంలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగినపుడు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో వాతావరణ పీడనం ఎక్కువగా ఉంటే, ఆ వేడి ఎటూ విస్తరించలేక అక్కడే కేంద్రీకృతం అవుతుంది. అదే సమయంలో ఎండ కొనసాగుతూ ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగిపోతాయి. దీనినే హీట్ డోమ్ అని అంటారు. వాతావరణంలో ఆకస్మిక మార్పుల వల్ల ఇటువంటి హీట్ డోమ్ ఏర్పడుతుంది. వచ్చే వారం మధ్య నాటికి హీట్ డోమ్ దక్షిణ అమెరికా అంతటా విస్తరించనున్నదని వాతావరణ ఛానెల్ తెలిపింది. కెనడాలో కొనసాగుతున్న కార్చిచ్చు కారణంగా అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. న్యూయార్క్ గవర్నర్ కాథీ హోచుల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పారిశ్రామిక యుగం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకూ ప్రపంచంలో ఇప్పటికే 1.1C మేరకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలు ఉద్గారాలకు కోత విధించకపోతే ఉష్ణోగ్రతలు ఇలా పెరుగుతూనే ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇది కూడా చదవండి: వేలానికి 121 ఏళ్ల క్యాడ్బరీ చాక్లెట్.. నాటి తీయని వేడుకకు గుర్తుగా.. -
ఎంతసేపు ఫ్రిజ్‌లో ఉంచినా మద్యం గడ్డకట్టదు.. ఎందుకంటే?
ఈ రోజుల్లో చాలామందికి మద్యం అలవాటు ఉంది. మద్యాన్ని చాలామంది చల్లగా తాగేందుకు లేదా, ఐస్ ముక్కలు వేసుకుని తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే మద్యాన్ని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా అది ఎందుకు గడ్డకట్టదో మీకు తెలుసా? దీనికి వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సంగతి తెలుసుకునేముందు ఏ ద్రవ పదార్థమైనా ఏ విదంగా గడ్డ కడుతుందో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ లిక్విడ్లోనూ దాని అంతర్గత ఉష్ణోగ్రత ఉంటుంది. అది దాని వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అది ఉన్న వాతావరణంలోని ఉష్ణోగ్రత తగ్గితే దానిలోని అణువులు ఒకదానికొకటి మరింత దగ్గరవుతాయి. ఫలితంగా ద్రవ పదార్థం గడ్డకట్టే స్థితికి చేరుకుంటుంది. ద్రవ పదార్థం గడ్డకట్టడమనేది వివిధ కారణాలపై ఆధారపడివుంటుంది. మద్యంలో ఉండే ఆర్గానిక్ మాలిక్యూల్స్ దానిని గడ్డకట్టనీయకుండా చేస్తాయి. ద్రవపదార్థం గడ్డకట్టడం అనేది దాని ఘనీభవనస్థానంపై ఆధారపడి ఉంటుంది. ప్రతీ పదార్థానికి దాని ఘనీభవన స్థానం వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు నీటినే తీసుకుంటే అది జీరో డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఘనీభవిస్తుంది. అంటే నీటి ఘనీభవన స్థానం జీరో డిగ్రీ సెంటీగ్రేడ్. మద్యం విషయానికొస్తే దాని ఘనీభవన స్థానం 114 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ కారణం చేతనే మద్యం గడ్డ కట్టాలంటే 114 డిగ్రీ సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. మన ఇళ్లలో ఉండో ఫ్రిజ్‌లలో 0 నుంచి -10 లేదా అత్యధిక ఉష్ణోగ్రత -30 డిగ్రీ సెంటీగ్రేడ్‌గా ఉంటుంది. అందుకే మద్యాన్ని ఇంటిలోని ఫ్రిజ్‌లో ఎంతసేపు ఉంచినా గడ్డకట్టదు. ఇది కూడా చదవండి: తొలి హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్‌కు 56 ఏళ్లు.. ఆరోజు జరిగిందిదే.. -
వారం రోజులుగా వాతావరణంలో మార్పులు.. అనారోగ్యంతో ప్రజలు సతమతం
సాక్షి, ఆదిలాబాద్: మహాశివరాత్రి దాటితే వేసవి ఎండలు ప్రారంభమైనట్లు భావిస్తుంటారు. కానీ ఈసారి శివరాత్రి కంటే ముందే ఎండకాలం మొదలైనట్లు వాతావరణం కనిపిస్తోంది. గడిచిన వారం రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో రాత్రివేళ చలి తీవ్రత సైతం కొనసాగుతోంది. భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పల్లెల్లో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరాలతో సతమతం అవుతున్నారు. తగ్గని చలి.. ఓ వైపు పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలు దాటుతుండగా, చలి మాత్రం తగ్గడం లేదు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలోనే ఉంటున్నాయి. గురువారం తెల్లవారు జామున సిర్పూర్(యూ)లో 9.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, బజార్హత్నూర్(ఆదిలాబాద్) 9.8, బేల(ఆదిలాబాద్)లో 10.3, కవ్వాల్ టైగర్ రిజర్వు జన్నారం(మంచిర్యాల)లో 10.5, బోరజ్(ఆదిలాబాద్)లో 10.6, కెరమెరి(కుమురంభీం)10.9, వాంకిడి(కుమురంభీం) 10.9, జైనథ్(ఆదిలాబాద్) 11.2, ఉట్నూర్ ఎక్స్‌రోడ్డు(ఆదిలాబాద్) 11.3, నేరడిగొండ(ఆదిలాబాద్) 11.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికి తోడు శీతల గాలులు వీస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మండుతున్న ఎండలు.. సాధారణంగా మార్చి నుంచి ఎండల తీవ్రత కనిపిస్తుంది. ప్రస్తుతం చలితోపాటు మండుతున్న ఎండలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులను తిప్పలు పెడుతున్నాయి. పగటి రాత్రి ఉష్ణోగ్రతల మధ్య భారీ వ్యత్యాసం ఉంటోంది. తాజాగా కుమురంభీం జిల్లా బెజ్జూర్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుగా నమోదైంది. అసాధారణ వాతావరణ పరిస్థితులతో రోగాలు చుట్టుముట్టే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలతోపాటు మైదాన ప్రాంతాల్లోనూ వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. ప్రధానంగా జలుబు, దగ్గు, గొంతు నొప్పితో ప్రజలు బాధపడుతున్నారు. తీవ్రత అధికంగా ఉన్నవారు నిర్లక్ష్యం చేయొద్దని, తప్పనిసరిగా ఆస్పత్రుల్లో సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. వైద్యులను సంప్రదించాలి వాతావరణ మార్పులతో ఇన్ఫెక్షన్లు ఎక్కువయ్యాయి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. మంచు కురిసే సమయాల్లో ఎక్కువగా బయట తిరుగొద్దు. దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. – నవత, వైద్యురాలు, కౌటాల వారం రోజులుగా రోగుల తాకిడి వారం రోజులుగా జిల్లాలోని ప్రభు త్వ ఆస్పత్రులకు 60శాతం రోగుల తాకిడి పెరిగింది. ఎక్కువగా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో వస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు శరీరం అలవాటు పడేందుకు సమయం పడుతుంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. – ప్రభాకర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో, కుమురంభీం -
ఇక లంబసింగి.. లెక్క పక్కా..!
సాక్షి, విశాఖపట్నం: లంబసింగి.. ఈ పేరు వింటే అందరికీ గుర్తుకొచ్చేది అందమైన, ఎత్తయిన కొండ ప్రాంతం. రాష్ట్రంలో అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఓ కుగ్రామం. పర్వత శ్రేణుల్లో మంచు సోయగాలతో పర్యాటకులను అమితంగా ఆకర్షించే పర్యాటక ప్రదేశం. ఆంధ్రా కశీ్మరుగా ఖ్యాతి గడించింది. ‘0’(సున్నా) డిగ్రీల కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతల నమోదుతో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అందుకే శీతాకాలం వచ్చిందంటే చాలు.. లంబసింగికి టూరిస్టులు క్యూ కడతారు. దేశ, విదేశాల నుంచి వచ్చి వాలతారు. అక్కడ ప్రకృతి అందాలను తనివి తీరా ఆస్వాదిస్తారు. శీతాకాలంలో లంబసింగిలో ‘జీరో’ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట! అంటూ జనం తరచూ విశేషంగా చర్చించుకుంటారు. కానీ ఆ లెక్క పక్కా కాదని ఎంతమందికి తెలుసు? అక్కడ ఉష్ణోగ్రతలను గాని, వర్షపాతాన్ని గాని నమోదు చేసే యంత్రాంగం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో లంబసింగి ఉంది. ఇక్కడికి 19.7 కిలోమీటర్ల దూరంలోని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్‌ఏఆర్‌ఎస్)లో నమోదయ్యే కనిష్ట ఉష్ణోగ్రతల కంటే లంబసింగిలో రెండు డిగ్రీలు తక్కువగా రికార్డయినట్టు చెబుతున్నారు. ఉదాహరణకు చింతపల్లిలో 2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైతే లంబసింగిలో ‘0’ డిగ్రీలు రికార్డయినట్టు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లూ దీనినే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లంబసింగిలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ (ఏడబ్ల్యూఎస్)ను ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. దీనిని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఏర్పాటు చేయాల్సి ఉంది. గతంలో దీనిపై కొంత కసరత్తు జరిగినా ఆ తర్వాత మరుగున పడింది. లంబసింగిలో ఏఆర్జీ.. తాజాగా భారత వాతావరణ విభాగం (ఐఎండీ) లంబసింగిలో ఆటోమేటిక్ రెయిన్ గేజ్ (ఏఆర్జీ) స్టేషన్‌ను మంజూరు చేసింది. లంబసింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) సమీపంలో దీనిని ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేశారు. ఈ ఏఆర్జీ ఏర్పాటయితే ఆ ప్రాంతంలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలతో పాటు వర్షపాతం, గాలిలో తేమ శాతం రికార్డవుతాయి. దీని నిర్వహణను విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం (సీడబ్ల్యూసీ) చూస్తుంది. మరికొన్నాళ్లలో లంబసింగిలో ఏఆర్జీ సిస్టం అందుబాటులోకి వస్తుందని, అప్పటినుంచి అక్కడ కచ్చితమైన వాతావరణ సమాచారం రికార్డవుతుందని సీడబ్ల్యూసీ డైరెక్టర్ సునంద ‘సాక్షి’కి చెప్పారు. సముద్రమట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో.. లంబసింగి తూర్పు కనుమల పర్వత శ్రేణుల్లో ఎత్తయిన ప్రదేశంలో దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది. చుట్టూ కాఫీ తోటలు, యూకలిప్టస్ చెట్లతో నిండి ఉంటుంది. సముద్రమట్టానికి అరకు 2,700 అడుగులు, చింతపల్లి 2,800 అడుగుల ఎత్తులోనూ ఉంటే లంబసింగి 3,000 అడుగుల (వెయ్యి మీటర్ల) ఎత్తులో ఉంది. దీంతో లంబసింగి శీతాకాలంలో పొగమంచు దట్టంగా అలముకుని ఆహ్లాదం పంచుతుంది. మంచు ఐస్‌లా గడ్డ కట్టుకుపోతుంది. అంతేకాదు.. అత్యల్ప (0–3 డిగ్రీల) ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. లంబసింగి అందాలను చూడడానికి వచ్చే పర్యాటకుల కోసం పర్యాటకశాఖ గుడారాలను కూడా ఏర్పాటు చేసింది. కొర్రబయలు నుంచి లంబసింగి.. లంబసింగికి కొర్రబయలు అనే పేరు కూడా ఉంది. కొర్ర అంటే కర్ర. బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా చలికాలంలో మంచు తీవ్రతకు ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారని, అందుకే కొర్రబయలు పేరు వచ్చిందని చరిత్ర కారులు చెబుతారు. -
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 20 రైళ్లు ఆలస్యం
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఢిల్లీని గురువారం ఉదయం పొగమంచు కప్పేసింది. మంచు కారణంగా 20 వరకు రైళ్లు 1.30 గంటల నుంచి 4.30 గంటల పాటు ఆలస్యంగా నడిచాయి. ఢిల్లీలోని పాలం, సఫ్దర్‌జంగ్ విమానాశ్రయాల్లో 200 మీటర్ల దూరం పైబడి ఉన్న వస్తువులు కనిపించలేదని పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లో 40 రోజులపాటు కొనసాగే తీవ్రమైన శీతాకాల సీజన్ ‘చిల్లా–ఇ–కలాన్’ప్రభావం గురువారం కనిపించింది. లోయలోని చాలా ప్రాంతాల్లో మంచి నీటి పైపులు, దాల్ సరస్సు ఉపరితలం గడ్డకట్టుకుపోయాయి. బుధవారం రాత్రి శ్రీనగర్‌లో కనిష్ట ఉష్ణోగ్రత –5.5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఈ సీజన్లో ఇదే అత్యల్పమని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి –4.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపుల్లో ఒకటైన పహల్గాంలో అత్యల్పంగా –6.8 డిగ్రీలు, గుల్మార్గ్లో –5.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే రెండు మూడు రోజుల్లో కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం లేదా తేలిక పాటి మంచు కురియవచ్చని ఐఎండీ అంచనా వేసింది. డిసెంబర్ 21న మొదలైన ఈ చిల్లా–ఇ–కలాన్ సీజన్ జనవరి 30వ తేదీ వరకు ఉంటుంది. -
తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలి
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
-
వర్షాకాలంలో పెరుగుతున్న ఉష్ణతాపం.. వైజాగ్ వాసుల అవస్థలు
సాక్షి, విశాఖపట్నం: ప్రస్తుతం వర్షాకాలం నడుస్తోంది. కానీ వాతావరణం వేసవి అనుభూతిని కలిగిస్తోంది. ఒకపక్క ఉష్ణతాపం, మరోపక్క ఉక్కపోత వెరసి జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాలు, వాయుగుండాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఆ సమయంలో చల్లదనం పరచుకుంటున్నా, అవి బలహీన పడ్డాక సూర్యుడు చుర్రుమంటున్నాడు. కొద్దిరోజుల నుంచి ఈ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో వీటి తీవ్రత ఒకింత ఎక్కువగానే ఉంటోంది. కొన్నాళ్లుగా విశాఖపట్నంలో సాధారణం కంటే 2–4 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇవి వేడిని వెదజల్లుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఆకాశంలో కొద్దిపాటి మబ్బులు కమ్ముకుంటున్నా వాతావరణంలో అంతగా చల్లదనం కనిపించడం లేదు. మేఘాలు కనుమరుగయ్యాక భానుడు ప్రతాపం చూపుతున్నాడు. కొద్దిపాటి సమయానికే సూర్య తాపం తీవ్రత పెరిగి చిర్రెత్తిస్తున్నాడు. మరోవైపు దీనికి ఉక్కపోత కూడా తోడవుతోంది. సాధారణంగా ఇతర ప్రాంతాలకంటే ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉక్కపోత అధికంగా ప్రభావం చూపుతుంది. వేసవిలో మరింత తీవ్రరూపం దాలుస్తుంది. కానీ ప్రస్తుతం వర్షాల సీజనే అయినా అధిక ఉష్ణోగ్రతలతో పాటు ఉక్కపోత కూడా కొనసాగుతోంది. ఫలితంగా జనానికి ముచ్చెమటలు పోస్తున్నాయి. దీంతో వేసవి సీజనులో మాదిరిగా పగలే కాదు.. రాత్రి వేళల్లోనూ ఇళ్లలో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలను విరివిగా వినియోగిస్తూ ఉపశమనం పొందుతున్నారు. ఇదీ కారణం.. కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు/ద్రోణులు గాని, ఆవర్తనాలు గాని లేవు. దీంతో వర్షాలు కూడా కురవడం లేదు. ప్రస్తుతం పశ్చిమం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఇలా విశాఖలో గాలిలో తేమ శాతం 60 నుంచి దాదాపు 90 శాతం వరకు ఉంటోంది. సాధారణంగా గాలిలో తేమ 50 శాతం ఉంటే ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది. అంతకుమించితే ఉక్కపోత ప్రభావం మొదలవుతుంది. (క్లిక్: గిరిజనులకు పీఎంఏవై ఇళ్లు ఇవ్వండి) ఆకాశంలో మేఘాలు ఏర్పడుతున్నా అవి వచ్చి పోతున్నాయి తప్ప స్థిరంగా ఉండడం లేదు. దీంతో సూర్య కిరణాలు నేరుగా భూ ఉపరితలంపైకి ప్రసరిస్తున్నాయి. ప్రస్తుతం విపరీతమైన ఉక్కపోతకు గాలిలో అధిక తేమ, ఉష్ణోగ్రతలు పెరుగుదలకు మేఘాలు, వర్షాలు లేకపోవడం వంటివి కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిస్థితి బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం వంటిది ఏర్పడే వరకు కొద్దిరోజుల పాటు కొనసాగుతుందని వీరు పేర్కొంటున్నారు. (క్లిక్: గిరిజనులకు విలువిద్యలో శిక్షణ) -
రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు... ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: భానుడి ప్రతాపానికి చిగురుటాకులా అల్లాడిపోతోంది ఢిల్లీ. రానున్న నాలుగైదు రోజులు వాతావరణం పొడిగా ఉండి, తీవ్ర వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదీగాక శనివారం ఒక్కరోజే 47 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతను నమోదు చేసింది. దీంతో ఢిల్లీలో వేడుగాలులు అధికమవుతాయని, వడ దెబ్బ అధికంగా ఉంటుందని ప్రజలను హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. అంతేకాదు ఢిల్లీలో కనీసం ఐదు వాతావరణ స్టేషన్లో 45 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రతను నమోదు చేశాయి. దీనికి తోడు ప్రస్తుతం ఢిల్లీ పీల్చే వాయువులో కూడా నాణ్యత లేక ఉక్కిరబిక్కిరి అవుతోంది. పైగా ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది అసలు అధిక ఉష్ణోగ్రతలు అంటే.. వాతావరణ శాఖ వివరణ ప్రకారం...గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా అంటే సాధారణం కంటే కనీసం 4.5 నాచ్‌లు ఎక్కువగా ఉంటే గరిష్ట ఉష్ణోగ్రతగా ప్రకటిస్తారు. అంతేకాదు 6.5 నాచ్‌లు అధికంగా ఉంటే తీవ్ర ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు. వాస్తవంగా ఒక ప్రాంతం ఉష్ణోగ్రత గరిష్టంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను నమోదు చేసినప్పుడు అధిక ఉష్ణోగ్రతగా ప్రకటిస్తారు. గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీ సెల్సియస్ మార్క్‌ను దాటితే తీవ్రమైన ఉష్ణోగ్రతగా పరిగణిస్తారు. i) Increase in rainfall activity likely over South Peninsular India from 07th June. ii) Intense spell of rainfall over Northeast India and Sub-Himalayan West Bengal & Sikkim during next 5 days. pic.twitter.com/UFLgM7b6sF — India Meteorological Department (@Indiametdept) June 4, 2022 (చదవండి: భారత్‌లో కరోనా టెన్షన్.. కేంద్రం అలర్ట్) -
నల్లగొండ ఎండ దేశంలో – 1, ప్రపంచంలో – 6
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఏటా మే నెలలో దంచికొట్టే ఎండలు ఈ ఏడాది మార్చిలోనే మండిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే నల్లగొండ జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా యి. దేశంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల జాబితాలో నల్లగొండ మొదటిస్థానంలో నిలువగా, ప్రపంచంలో 6వ స్థానంలో(17వ తేదీన) నిలిచింది. ఈసారి ముందుగానే.. మార్చి నెలలోనే మండుటెండలు కాస్తుండటంతో జనాలు వేసవి తాపానికి తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం పూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు ఇళ్లనుంచి బయటికొచ్చేందుకు జంకుతున్నారు. ఫలితంగా జనసంచారం లేక రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఎండ తీవ్రత తగ్గిన తర్వాతనే బయటికొస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. గతేడాది మేలో 40 డిగ్రీల పైచిలుకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే ఈసారి మార్చిలోనే 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై దేశంలోనే నల్లగొండ ఎండ తీవ్రతలో మొదటి స్థానంలో ఉండగా ప్రపంచంలో 6వ స్థానంలో నిలిచిందని ఎల్డొరాడో వెదర్ సంస్థ తెలిపింది. గతేడాదితో పోలిస్తే అధిక ఉష్ణోగ్రతలు గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈసారి జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు భారీగా పెరిగింది. గత సంవత్సరం మార్చి 11న గరిçష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్‌గా నమోదుకాగా, ఈనెల 11న 39 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇలా గత సంవత్సరం మార్చి నెలంతా 38 డిగ్రీలలోపే గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటే ఈసారి ఇప్పటికే 43.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు ఇలా తేదీ 2021 మార్చి 2022 మార్చి 11 36.0 39.0 12 37.5 39.5 13 38.0 39.2 14 38.2 40.0 15 38.5 41.5 16 37.8 42.4 17 38.0 43.5 18 36.0 40.0 19 35.0 39.5 -
‘గుడ్’మార్నింగ్.. పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. శనివారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే మెదక్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 9.5 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 32.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాష్ట్రానికి దక్షిణ, నైరుతి దిశల నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని సూచించింది. -
తెలంగాణలో వేగంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఉష్ణోగ్రతలు పతనమవుతున్నాయి. ఆగ్నేయ భారతదేశం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తుండడంతో పాటు, వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో కొన్నిచోట్ల గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తోంది. బుధవారం రాష్ట్రంలో గరిష్టంగా ఖమ్మంలో 31.2 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా ఆదిలాబాద్‌లో కనిష్టంగా 11.2 డిగ్రీలు నమోదయ్యింది. చాలాచోట్ల సాధారణం కంటే 3.65 డిగ్రీల మేర తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వాతావరణంలో వేగంగా వస్తున్న మార్పులతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. సరైన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. తగిన దుస్తులు ధరించాలి చలికాలంలో శరీర ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతాయి. ఆ సమయంలో శరీరంలో ఎక్కు వ భాగం కవర్ అయ్యే విధంగా దుస్తులు ధరించాలి. ∙చలి సమయంలో వీలైనంత వరకు బయట తిరగకుండా పనులు త్వరగా ముగించుకుని ఇంటికి చేరుకోవాలి. చలికాలంలో రాత్రి వేళ గుండెపోటులు ఎక్కువగా నమోదవుతుంటాయి. మధ్యరాత్రి, తెల్లవారుజాముల్లో హార్ట్ ఎటాక్‌కు ఆస్కారం ఉంటుంది. చలికి రక్తనాళాల్లో ప్రసరణ తగ్గిపోవడం, రక్తం గడ్డకట్టడంతో ఈ పరిస్థితి తలెత్తుతుంది. హృద్రోగులు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవాళ్లు తప్పకుండా స్వెట్టర్స్ వేసుకుని ఉండాలి. ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలున్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. చలిగాలుల ప్రభావంతో ఇలాంటి వాళ్లు త్వరగా అనారోగ్య సమస్యలకు గురి కావొచ్చు. అలాంటివాళ్లు ఇబ్బందులు తలెత్తితే వీలైనంత త్వరితంగా వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. చలికాలంలో కాలుష్య ప్రభావంతో పొగమంచుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. మధ్యరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. వాతావరణ పరిస్థితులను గమనించి ప్రయాణాలు సాగించడం మంచిది. చలికాలంలో మితిమీరిన ఎక్సర్సైజులు చేయడం కూడా మంచిది కాదు. మరో వారం పాటు ఇలాంటి మార్పులు గత రెండు,మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు వేగంగా తగ్గిపోతున్నాయి. వాతావరణంలో మరో వారం రోజుల వరకు ఇలాగే మార్పులు నమోదవుతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కొంచెం అటుఇటుగా ఉన్నాయి. – నాగరత్న, వాతావరణ శాఖ అధికారి సమయానికి మందులు వేసుకోవాలి దీర్ఘకాలిక సమస్యలున్న వాళ్లు సరైన సమయానికి మందులు వేసుకోవాలి. వైద్యులు సూచించిన సమయాల్లో కాకుండా ఆలస్యంగా మందులు వేసుకుంటే ఇబ్బందులు తప్పవు. ప్రస్తుతం కోవిడ్–19 వ్యాప్తి కొనసాగుతున్నందున జలుబు, జ్వరం, దగ్గు వస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈ లక్షణాలు తీవ్రమైతే కోవిడ్–19 పరీక్ష చేయించుకోవాలి. పరీక్ష ఫలితం వచ్చే వరకు వేచిచూడకుండా వైద్యుల సూచనలతో తగిన విధంగా మందులు వాడాలి. స్వీట్లు, ఐస్‌క్రీమ్, కూల్‌డ్రింక్స్‌ను వీలైనంత తగ్గించాలి. తాగునీరు కూడా చల్లగా కాకుండా గోరువెచ్చగా చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ వైద్య కళాశాల -
పగడపు దిబ్బల ఉనికి దట్టమైన మేఘాలతోనే సాధ్యం!
పెరుగుతున్న కాలుష్యం, పంటల కోసం విచ్చలవిడిగా వాడుతున్న పురుగుల మందులు తదితర కారణాల వల్ల సముద్రాల్లో అరుదైన పగడపు దిబ్బలు అంతరించిపోతున్నాయి. మరి దీనికి పరిష్కారం కనుక్కునే ప్రయత్నంలో శాస్త్రవేత్తలు సరికొత్త ఆధునిక టెక్నాలజీతో ఈ పరిస్థితిని అదుపు చేయాలని చూస్తున్నారు. అదేంటే తెలుసుకుందామా! ఆస్ట్రేలియా: పగడపు దిబ్బుల గురించి చిన్నప్పుడూ కథలుగా విని ఉన్నాం గానీ వాటి గురించి పూర్తిగా తెలియదు. పగడపు దిబ్బలు సముద్రం అడుగ భాగాన ఏర్పడి ఎన్నో జీవరాశులకు నిలయంగా ఉంటాయి. పగడపు పాలిప్స్ నుంచి పగడపు దిబ్బలు ఏర్పడతాయి. చాలా పగడపు దిబ్బలు స్టోనీ పగడాల నుంచి ఏర్పడతాయి. పగడపు దిబ్బలు వెచ్చని, నిస్సారమైన నీటిలో ఉత్తమంగా పెరుగుతాయి. అలాంటి ప్రస్తుతం పర్యావరణ కాలుష్యం కారణంగా వాతావరణ మార్పుల వల్ల అత్యధిక ఉష్ణోగ్రతలు కారణంగా అవి కనుమరగయ్యే ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. (చదవండి: రూ. 8 కోట్లకు అమ్ముడుపోయిన ‘ది కంజురింగ్’ దెయ్యాల కొంప) దీంతో శాస్త్రవేత్తలు క్లౌడ్ బ్రైటెనింగ్ ప్రాజెక్ట్ చేపట్టి ఆ పగడపు దిబ్బలను సంరక్షించుకునే సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగాంగా శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియాలో ఈశాన్య తీరంలో ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద పగడపు దిబ్బలు ఉన్న ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గించేలా సముద్ర జలాలను ఆకాశంలోకి వెదజల్లే టర్బైన్ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో సముద్ర జలాలు ఆవిరిగా మారి సూక్ష్మమైన ఉప్పు కణాలు మాత్రమే వాతావరణంలో తేలుతాయని, వాటి చుట్టూ నీటి ఆవిరి ఘనీభవించి మేఘాలుగా ఏర్పడతాయని సదరన్ క్రాస్ యూనివర్శిటీ సీనియర్ లెక్చరర్ డేనియల్ హారిసన్ వెల్లడించారు. ఈ విధంగా కొన్ని నెలలు తరబడి చేస్తే మునపటి వాతావరణంలా మార్పు చెంది పగడపు దిబ్బలు సురక్షితంగా ఉంటాయంటున్నారు. వేసవిలో అత్యంత వేడుగాలుల కారణంగా పగడపు దిబ్బలు ఏవిధంగా తమ సహజ రంగును కోల్పోయి పాలిపోయి కనుమరుగయ్యే స్థితిలో ఉందో పరిశోధనల ద్వారా తెలుసుకోవడంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టామని చెప్పారు. సూర్య కాంతి ఎక్కువ్వడంతో సముద్రపు నీరు వేడిక్కి పాలిపోతుందని వెల్లడించారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించగలిగితే వేసవి కాలంలో కనీసం 6% ఉష్ణోగ్రత తగ్గితే పగడపు దిబ్బలు పాలిపోకుండా కాపాడగలం అని హారిసన్ పేర్కొన్నారు. దట్టమైన మేఘాల వల్లే కలుగు ప్రయోజనాలను కూడా ఈ పరిశోధనలు ద్వారా తెలుసుకోగలిగమని వివరించారు. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతరించిపోతున్న ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో ఆస్ట్రేలియా ప్రసిద్ధి గ్రేట్ బారియర్ రీఫ్లో ఉన్న భారీ పగడపు దిబ్బలు ఉండటంతోనే ఈ ప్రాజెక్టును చేపట్టినట్లు హారిసన్ పేర్కొన్నారు. (చదవండి: నా కెరియర్లో విచిత్రమైన ఒప్పందం : సత్య నాదేళ్ల) -
అధిక ఉష్ణోగ్రత! కారణం ఏంటంటే..
అధిక ఉష్ణోగ్రతలు.. అది కూడా మంచుమయమైన అంటార్కిటికాలో పెరుగుతుండడంపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేస్తోంది. విశేషం ఏంటంటే.. ఇప్పటిదాకా ఈ గడ్డపై అత్యధిక ఉష్ణోగ్రత ఈ ఏడాదిలోనే నమోదు అయ్యిందని జులై 1న ఒక ప్రకటన విడుదల చేసింది యూఎన్వో. న్యూయార్క్: ఈ ఏడాది ఫిబ్రవరి 6న అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో 18.3 డిగ్రీల సెల్సియస్ (64.9 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది. దీంతో ఇప్పుడు అంటార్కిటికా సైతం వేగంగా వేడెక్కుతున్న ప్రాంతాల్లో ఒకటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇక అంటార్కిటికాలో గత 50 ఏళ్లలో దాదాపు మూడు డిగ్రీల సెల్సియస్ మేరకు సగటు ఉష్ణోగ్రత పెరిగినట్లు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ పెటేరి తాలాస్ చెప్పారు. దీనికి సంబంధించిన రిపోర్టును ఆయన గురువారం వెల్లడించారు. వేడికి కారణం మంచు కొండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధిక పీడనం కారణంగా ఫోహెన్ ప్రభావం ఏర్పడుతుంది. అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమని UN డబ్ల్యూఎంవో(వరల్డ్ మెటియోరోలాజికల్ ఆర్గనైజేషన్) రిపోర్టు వెల్లడించింది. ఫోహెన్ ప్రభావం వల్ల.. మంచు కొండలకు ఒకవైపు నుంచి వీచే సాధారణ గాలులు.. కొండ అంచు నుంచి మరో వైపునకు వీచేటప్పుడు వేడెక్కుతాయి. ఈ ఫలితమే అత్యధిక వేడి, ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ దిగువ గాలుల ఫలితంగా.. అంటార్కిటికాలోని ఎస్పెరంజా స్టేషన్, సేమౌర్ ద్వీపంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. గతంలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఏర్పడినట్లు నివేదికలో పొందుపరిచారు. ఇంతకు ముందు.. గతంలో 2015, మార్చి 24న అంటార్కిటికాలో అత్యధికంగా 17.5 డిగ్రీల సెల్సియస్ (63.5 డిగ్రీల ఫారెన్‌హీట్) ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడి ఎస్పెరంజా పరిశోధనా కేంద్రంలో ఈ ఉష్ణోగ్రత నమోదైనట్లు డబ్ల్యూఎమ్ఓ తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రికార్డు స్థాయిలో నమోదైన 18.3 డిగ్రీల సెల్సియస్ కొత్త రికార్డు కూడా అర్జెంటీనాలోని అదే స్టేషన్లో నమోదైనట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ నేపథ్యంలో వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను నియంత్రించేందుకు అంటార్కిటిక్ ట్రీటీ సిస్టంతో కలిసి పనిచేస్తున్నట్లు ప్రొఫెసర్ తాలాస్ చెప్పారు. చదవండి: తొలిసారి నీలి తిమింగలం పాట! -
మే నెల రికార్డు: వేసవి చేసిన మేలు
ప్రతి యేటా మండుటెండలు, తీవ్ర వడగాడ్పులతో దడ పుట్టించే మే నెల ఈ సారి మాత్రం ప్రతాపం చూపించలేదు. మే లో దాదాపు 25 రోజుల పాటు సాధారణం, అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలే నమోదవడంతో వడగాడ్పుల ప్రభావం కనిపించలేదు. మే ఆఖరులో ఒకింత ఉష్ణోగ్రతలు పెరిగినా అదుపు తప్పకపోవడంతో తీవ్ర వడగాడ్పులు వీయలేదు. ఫలితంగా ఈ ఏడాది ఒక్క వడదెబ్బ మరణం కూడా నమోదు కాలేదు. అయితే ఈ ఏడాది వడగాడ్పులు ఒక నెల ముందుగా ఏప్రిల్ ఆరంభం నుంచే మొదలై 7 రోజుల పాటు ప్రభావం చూపాయి. ఇలా ఏప్రిల్ 1న ప్రకాశం జిల్లా కురిచేడు, పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడుల్లోను, కృష్ణా జిల్లాలో కొన్నిచోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే 5–8 డీగ్రీలు అధికం కావడంతో కొన్నిచోట్ల వడగాడ్పులు, అక్కడక్కడా తీవ్ర వడగాడ్పులు వీచాయి. దీంతో మే లో ఉష్ణతీవ్రత ఇంకెంత ఉధృతం అవుతుందోనని ఆందోళన వ్యక్తమైంది. కానీ, మే మొదటి 3 వారాలూ రాష్ట్రంలో పలుచోట్ల సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మే నాలుగో వారం ఆఖరులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో 42 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికం. ఇలా మే లో ఏపీలోని 670 మండలాల్లో 32 మండలాలకే వడగాడ్పులు పరిమితమయ్యాయి. సాధారణం కంటే 6 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైతేనే తీవ్ర వడగాడ్పులు వీస్తాయి. కానీ ఈ మే లో ఒక్కరోజూ తీవ్ర వడగాడ్పులు నమోదు కాలేదు. రాష్ట్రంలో యేటా మే లో సాధారణం కంటే గరిష్టంగా 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదై తీవ్ర వడగాడ్పులు వీచి పెద్ద సంఖ్యలో మరణాలు సంభవిస్తుంటాయి. అప్పుడప్పుడూ చల్లదనం.. ఏపీలో 2014–2019 మధ్య కాలంలో వడగాడ్పులు వీచాయి. గతేడాది వడదెబ్బ మరణాలు సంభవించలేదు. ఈ వేసవిలోనూ అదే పరిస్థితి కొనసాగింది. పైగా ఈ ఏడాది మే లో రుతుపవనాల ముందస్తు సీజను ప్రభావంతో మధ్యమధ్యలో వర్షాలు కురిశాయి. మేఘాలు ఆవరించడంతో అప్పుడప్పుడూ చల్లదనమూ పరచుకుంది. ఇలా మే నెల మండుటెండలు, వడగాడ్పులు లేకుండా ఊరటనిచ్చింది. గత కొన్నేళ్లలో మే లో ఇలాంటి పరిస్థితి లేదని వాతావరణ నిపుణులు తెలిపారు. పశ్చిమ ఆటంకాల వల్లే.. మే నెలలో వడగాడ్పుల తీవ్రత లేకపోవడానికి ఉత్తర భారత్‌లో పశ్చిమ ఆటంకాలే (వెస్టర్న్ డిస్టర్బెన్స్–పశ్చిమం నుంచి తూర్పు దిశగా వీచే గాలుల) కారణం. వీటి ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. సాధారణంగా ఇవి ఫిబ్రవరి, మార్చితో తగ్గుముఖం పడతాయి. కానీ ఏప్రిల్, మే వరకూ అక్కడ కొనసాగాయి. వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై కూడా పడింది. అందుకే మే నెలలో రాష్ట్రం వైపు రాజస్థాన్, ఉత్తరాది నుంచి వేడి/వడగాలులు ఈసారి రాలేదు. మే నెలలో ఇలాంటి పరిస్థితి అరుదు. – రాళ్లపల్లి మురళీకృష్ణ, ఐఎండీ రిటైర్డ్ అధికారి -
సమ్మర్ ఎఫెక్ట్: కరెంట్ మోత.. బిల్లుల వాత!
సాక్షి, సిటీబ్యూరో: ఎండలు భగ్గుమంటున్నాయి. గ్రేటర్లో పగటి ఉష్ణోగ్రతలు సగటున40 డిగ్రీలు దాటుతున్నాయి. ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం నగరవాసులు ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లో కరెంట్ మోత మోగుతోంది. సాధారణంగా ఫిబ్రవరి వరకు నెలకు 150 యూనిట్లలోపు వాడే వినియోగదారులు ప్రస్తుతం 250– 300 యూనిట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఫలితంగా మీటరు గిర్రున తిరిగి.. స్లాబ్‌రేట్ మారి నెలసరి విద్యుత్ బిల్లులు అమాంతం పెరిగిపోయాయి. ఇటీవల వినియోగదారుల చేతికందిన మార్చి నెల బిల్లులే ఇందుకు నిదర్శనం. భారీగా పెరిగిన బిల్లులతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై ఉపాధి అవకాశాలు కోల్పోయి రోడ్డున పడ్డ సగటు జీవులకు ఇవి మరింత భారంగా మారుతున్నాయి. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో.. ►నగరంలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లున్నాయి. గత మార్చి వరకు రోజూ పగటిపూట పీక్ అవర్‌లో కరెంట్ డిమాండ్ 2500 నుంచి 2700 మెగావాట్లకు మించలేదు. తాజాగా ఇది 2900 నుంచి 3000 మెగావాట్లు నమోదవుతోంది. రాత్రి వేళల్లోనూ రికార్డు స్థాయిలో డిమాండ్ నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యుత్ సబ్స్టేషన్లు, ఫీడర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ►సామర్థ్యానికి మించి డిమాండ్ నమోదవుతుండటంతో విద్యుత్ ఫీడర్లు తరచూ ట్రిప్పవుతున్నాయి. కరెంట్ సరఫరా నిలిచిపోతోంది. ఎప్పకప్పుడు డీటీఆర్లను పెంచకపోవడం, లూజ్లైన్లను సరిచేయక పోవడమే ఇందుకు కారణం. వేసవిలో తలెత్తే సాంకేతిక సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పీక్ అవర్‌లోనూ ఇంజినీర్లు వినియోగదారులకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. -
భానుడి భగ భగలు..
-
తెలంగాణలో భానుడి భగ భగలు.. కారణం ఇదేనా!
హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వడగాడ్పులు, ఉక్కపోత పెరగడంలో జనం విలవిల్లాడుతున్నారు. బుధవారం భద్రాచలంలో రాష్ట్రంలోనే అధికంగా 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని.. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో 38.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 3.9 డిగ్రీలు ఎక్కువగా నమోదుకావడం గమనార్హం. హైదరాబాద్, వరంగల్, దుండిగల్, హకీంపేట కేంద్రాల్లో మినహా రాష్ట్రమంతటా 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఆదిలాబాద్‌లో తక్కువగా 19.2 డిగ్రీలు నమోదైంది. మిగతా అంతటా 20 డిగ్రీల కంటే ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వడగాడ్పులు రాష్ట్రానికి ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. ఎత్తు తక్కువగా ఉండడం, వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఇవి వడగాడ్పులుగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణం, వరంగల్ పట్టణం, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరో నాలుగు రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలి.. మండుతున్న ఎండలు, వడగాడ్పుల ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించాలని.. చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి విశ్రాంతి ఇవ్వాలని సూచించింది. ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీళ్లను తాగించాలని.. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఎండల తీవ్రతను తట్టుకొనేందుకు.. నూలు దుస్తులు ధరించడం, కళ్లజోడు పెట్టుకోవడం, బయటికి వెళ్లినప్పుడు గొడుగుని ఉపయోగించడం, చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిక ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ 2, 3, 5 తేదీల్లో కోస్తా ఆంధ్ర, యానాంలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయిని.. 30, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. -
శరీర ఉష్ణోగ్రతను విద్యుత్తుగా మార్చేస్తుంది..
ఫొటో చూడగానే.. అదేం విచిత్రమైన ఉంగరం రా బాబూ అనిపించిందా? నిజమే ఉంగరం ఆకారం కొంచెం విచిత్రంగా ఉంది కానీ ప్రయోజనం? అబ్బో ఈ రింగు చాలా హాట్ గురూ అనేంత బాగుంటుంది. ఇది మన శరీర ఉష్ణోగ్రతను విద్యుత్తుగా మార్చేస్తుంది.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడో శాస్త్రవేత్తలు దీన్ని సృష్టించారు. థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ (టీఈజీ)లు కొత్తేం కాకున్నా.. దీనికి మాత్రం ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన పరిసరాల్లోని ఉష్ణోగ్రతకు, శరీరంలోని వేడికి మధ్య ఉన్న తేడా ఆధారంగా విద్యుత్తు ఉత్పత్తి చేస్తుంది ఈ పరికరం. పాలీమైన్ అనే ప్రత్యేక పదార్థంతో తయారైన ఈ ఉంగరం పైభాగంలో చిన్న సైజు టీఈజీలు ఉంటాయి. చర్మం ఎంత మేరకు ఈ పాలీమైన్ పదార్థానికి అతుక్కుని ఉందో అంత విద్యుత్తు తయారు చేయగలదు. కచ్చితమైన లెక్కలు కావాలంటే ప్రతి చదరపు సెంటీమీటర్‌కు ఒక వోల్టు విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. వాచ్‌లు, ఫిట్నెస్ ట్రాకర్లకు ఈ విద్యుత్తు సరిపోతుంది. చేతికి తొడుక్కునే కడియం లాంటిది తయారు చేస్తే విద్యుదుత్పత్తి 5 వోల్టుల వరకు పెంచొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
దారుణం.. ప్రాణం తీసిన జలుబు
కశ్మీర్: వాతావరణ మార్పులు, డస్ట్ ఎలర్జీ ఉన్నవారు జలుబుతో బాగా ఇబ్బంది పడతారు. ముఖ్యంగా వర్షా కాలం, చలి కాలల్లో ఈ సమస్య కాస్త తీవ్రంగా ఉంటుంది. డాక్టర్ దగ్గరకు వెళ్లడం.. చిట్కాలు పాటించడం వంటి చేసి తగ్గించుకుంటాం. కానీ జలుబుతో మృతి చెందడం అనేది చాలా చాలా అరుదు.. ఒకరకంగా చెప్పాలంటే అసంభవం కూడా. చివరకు సైనస్ లాంటి సమస్య ఉన్నా మరణించడం మాత్రం జరగదు. కానీ జమ్మూ కశ్మీర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. విపరీతంగా జలుబు చేసి.. ఇదర్దు సంచార జాతి పిల్లలు మరణించారు. వివరాలు.. ఓ సంచార జాతి కుటుంబం దక్షిణ కశ్మీర్‌లోని దేవ్సార్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. వారికి ఇల్లు లేదు. ఓ టార్పాలిన్ టెంట్లో ఉంటున్నారు. మాములు రోజుల్లో అయితే ఈ టెంట్ వారిని రక్షించేది. కానీ ఇది శీతాకాలం. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయి మంచు కురుస్తుంది. ఈ అతి శీతల వాతావరణం నుంచి టెంట్ ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయింది. దాంతో ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులకు జలుబు చేసింది. అది కాస్తా తీవ్రంగా మారి తీవ్రమైన జ్వరం వచ్చి చిన్నారులు ఇద్దరు మరణించారు. (చదవండి: ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా.. జాగ్రత్త!) ఇక ఈ విషాదం గురించి తెలిసిన అనంతరం స్థానికులు వారికి తమ ఇళ్లలో ఆశ్రయం కల్పించారు. ఈ సందర్భంగా ఓ అధికారి మాట్లాడుతూ.. ‘చిన్నారులిద్దరు బ్రైనల్ లామర్ గ్రామంలోని అడవుల్లో నివసిస్తున్న బేకర్వాల్ కుటుంబానికి చెందినవారు. వీరికి ఇల్లు లేదు. టార్పాలిన్ టెంట్లోనే నివాసం ఉంటారు. దాంతో చిన్నారులిద్దరికి జలుబు చేసి తీవ్ర రూపం దాల్చి మరణించారు. మరో ఇద్దరు సభ్యులకు కూడా అనారోగ్యంగా ఉండటంతో కుల్గాం ఆస్పత్రికి తరలించాము’అన్నారు. ఇక మృతుల కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. పిల్లలు మరణించారనే వార్త తెలిసిన తర్వాత అధికారులు వచ్చి బ్లాంకెట్స్ ఇచ్చి వెళ్లారు అన్నారు. ప్రస్తుతం కశ్మీర్లో చలి తీవ్రంగా ఉంది. దాదాపు 40 రోజుల పాటు దారుణంగా భయపెట్టే ఈ కాలాన్ని స్థానికులు చిల్లై కలాన్ అంటారు. డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకు ఉండే ఈ చిల్లై కలాన్‌లో ఉష్గోగ్రతలు దారుణంగా పడిపోతాయి. దాల్ సరస్సుతో సహా నీటి వనరులన్ని గడ్డకడతాయి. -
చలితో వణుకుతున్న తెలుగు రాష్ట్రాలు
సాక్షి, విశాఖపట్నం: మధ్య భారతదేశం నుంచి వస్తున్న చలిగాలుల ప్రభావంతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. విశాఖ మన్యంలో చలిపులి పంజా విసురుతుంది. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుతుండడంతో గిరిజనులు గజగజ వణుకుతున్నారు. మంగళవారం చింతపల్లిలో 6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం ఉదయం పదిగంటలకు కూడా పొగమంచు వీడలేదు. ఉపరితలంపై ఏర్పడిన అధికపీడనంతో పాటు ఈశాన్యగాలులు తక్కువ ఎత్తులో వీస్తున్న కారణంగా చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. మరోవైపు సముద్రతీరం నుంచి వీస్తున్న వెచ్చటి గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతున్నా రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం పడిపోతున్నాయి. నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా అర్లిటిలో 4.3 డిగ్రీలు నమోదు అయ్యాయి. కుమ్రంబీమ్ జిల్లా గిన్నేదరిలో 4.4,డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో చలికి ప్రజలు వణికిపోతున్నారు. చదవండి: బైబై.. డీలక్స్ బస్సుకు సెలవు! ముఖ్యంగా రాయలసీమలోని కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలతో పాటు గుంటూరు, కృష్ణాజిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీల వరకు, విశాఖ ఏజెన్సీలో 1 నుంచి 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏజెన్సీలో వీస్తున్న గాలుల ప్రభావంతో విశాఖలో చలి పెరుగుతోంది. మంగళవారం రికార్డు స్థాయిలో సాధారణం కంటే 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. క్రమంగా కోస్తాతీర ప్రాంతాల్లోనూ చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ చైనా సముద్రంలో ప్రస్తుతం తుపాను కేంద్రీకృతమై ఉందని ఐఎండీ వెల్లడించింది. ఇది క్రమంగా బలహీనపడుతూ బంగాళాఖాతం వైపు చేరుకుంటుందని, క్రమంగా శ్రీలంక తీరం వైపు కదలనుందని తెలిపారు. దీని కారణంగా ఈ నెలాఖరులో దక్షిణకోస్తా జిల్లాలో ఒకటి రెండు చోట్ల వర్షపాతం నమోదయ్యే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో మినుములూరులో 7, అరకులోయలో 10.4, నందిగామలో 12.2, విశాఖలో 13.8, కళింగపట్నం, అమరావతిలో 15.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చదవండి: తెలంగాణ గజగజ -
తెలంగాణ గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. సీజన్ మధ్యస్థానికి రావడం.. ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు నమోదు కావడంతో పాటు ఉత్తర, ఈశాన్య దిశల నుంచి గాలులు వీస్తుండటంతో చలి ప్రభావం పెరుగుతోంది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రత కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారిలో 4.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యల్పం. రాత్రి, ఉదయం పూట చలి తీవ్రత అధికంగా ఉంటోంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు ఖమ్మం జిల్లాలోని పమ్మి వద్ద 35 డిగ్రీలుగా నమోదైంది. సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను వాతావరణ శాఖ విడుదల చేసింది. ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 4.6 డిగ్రీలు, తాంసీలో 4.9 డిగ్రీలు, వికారాబాద్‌లో 5 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. (చదవండి: రోజంతా గజగజ..) రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే.. 22 జిల్లాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కనిష్ట ఉష్ణోగ్రత బీహెచ్ఈఎల్లో 10 డిగ్రీలు నమోదైంది. రానున్న మూడ్రోజుల పాటు ఇదే తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అలాగే రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణం నమోదవుతుందని వెల్లడించింది. -
ఢిల్లీలో అత్యంత శీతల అక్టోబర్
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ వాసులు గత 58 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత శీతల పరిస్థితులను ఈ అక్టోబర్ నెలలో చవిచూశారు. 1962 అక్టోబర్ నెల సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 16.9 డిగ్రీల సెల్సియస్ కాగా దాదాపు 62 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో ఈ ఏడాది అక్టోబర్‌లో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రతలు 17.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. సాధారణంగా ఢిల్లీలో సరాసరి కనిష్ట ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలుగా ఉంటుంది. ఢిల్లీలో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో 12.5 డిగ్రీలు కాగా.. దాదాపు 26 ఏళ్ల తర్వాత, 1994 తర్వాత ఇంత తక్కువగా నమోదైందని ఐఎండీ పేర్కొంది. గాలి వేగం మందగించడం, ఆకాశం మేఘావృతమై ఉండటమే ఈ పరిస్థితికి కారణమని ఐఎండీకి చెందిన కుల్దీప్ శ్రీవాస్తవ వివరించారు. ఏటా సాధారణంగా ఇదే సమయంలో కనిష్ట ఉష్ణోగ్రత 15–16 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుందని తెలిపారు. ఢిల్లీలో ఆల్‌టైం కనిష్ట ఉష్ణోగ్రత 1937 అక్టోబర్ 31వ తేదీన 9.4 డిగ్రీలుగా నమోదు అయ్యింది. -
24 గంటలూ రేడియేషన్ ప్రభావం..
హరితం హననం. శతాబ్దాలుగా తోటల నగరం(భాగ్)గా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇపుడు హరిత వాతావరణం రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో పచ్చదనం కనుమరుగవుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం మహానగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలో 30 శాతం గ్రీన్‌బెల్ట్ (హరిత వాతావరణం)ఉండాల్సి ఉండగా..నగరంలో కేవలం 8 శాతమే ఉండడంతో ప్రాణవాయువు తక్కువై సిటీజనులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో: ‘భాగ్’ నగరం ఇప్పుడు భానుడి భగభగలతో నిప్పుల కొలిమిలా మారింది. కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరంలో ఇప్పుడు అతినీలలోహిత వికిరణం(అల్ట్రావయొలెట్ రేడియేషన్)తీవ్రత ‘11’ పాయింట్లకు చేరుకోవడంతో సెగ..భగలతో సిటీజనులు విలవిల్లాడుతున్నారు. రేయింబవళ్లు వికిరణ తీవ్రత, అధిక వేడిమి తగ్గకపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణంగా యూవీ ఇండెక్స్ 8 పాయింట్లు దాటితే అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కానీ ప్రస్తుత తరుణంలో 11 పాయింట్లు దాటడంతో సిటీజన్లు కళ్లు, చర్మ సమస్యలతో బాధపడుతున్నారు. గ్రేటర్ విస్తీర్ణంలో హరితం శాతం 8 శాతానికే పరిమితం కావడం, ఊపిరి సలపని రీతిలో నిర్మించిన బహుళ అంతస్తుల కాంక్రీటు, గాజు మేడల నుంచి ఉష్ణం వాతావరణంలో తేలికగా కలవకుండా భూ ఉపరితల వాతావరణానికే పరిమితం కావడంతో ప్రస్తుతం వికిరణ తీవ్రత పెరిగి ఒళ్లు, కళ్లు మండిపోతున్నాయని సిటీజనులు గగ్గోలు పెడుతున్నారు. యూవీ సెగ..భగలతో అవస్థలివీ... ♦ అతినీలలోహిత వికిరణ తీవ్రత (యూవీ ఇండెక్స్)పెరగడంతో ఓజోన్ పొర మందం తగ్గి ప్రఛండ భానుడి నుంచి వెలువడే యూవీ రేస్ నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. దీంతో అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మండడం, రెటీనా దెబ్బతినడం వంటి విపరిణామాలు తలెత్తుతున్నాయి. ♦ యూవీ సూచీ 12 పాయింట్లు దాటితే చర్మ క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచిఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్‌లు ధరించాలని, ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు గొడుకు తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. గ్రేటర్లో తగ్గుతోన్న హరితం.. మహానగరంలో పచ్చదనం తగ్గుతోంది. గతేడాది హరిత హారంలో భాగంగా 95 శాతం ఇళ్లలో పెంచుకునే కరివేపాకు, తులసి, ఉసిరి, క్రోటన్స్, పూల మొక్కలు పంపిణీ చేశారని..బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారులు, పార్కులు, ఖాళీ స్థలాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఏపుగా పెరిగి ఆక్సిజన్ శాతాన్ని పెంచే రావి, మద్ది, మర్రి, చింత వంటి మొక్కలు ఇందులో 5 శాతం మాత్రమే నాటినట్లు పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో గ్రేటర్లో గ్రీన్‌బెల్ట్ 8 శాతానికే పరిమితమైందని వాపోతున్నారు. ఇలా చేస్తే మేలు.. ♦ నగరంలో హరిత భవనాలు, హరిత వాతావరణం ఏర్పాటు చేయాలి. ♦ ప్రధాన రహదారులు, చెరువుల చుట్టూ మొక్కలు నాటి గ్రీన్‌బెల్ట్ రూపొందించాలి. ♦ సువిశాల ప్రాంగణాల్లో బహుళ అంతస్తుల భవంతులు నిర్మిస్తున్నవారు విధిగా కొంత విస్తీర్ణంలో మొక్కలు పెంచుతామని, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే వారికి జీహెచ్ఎంసీ భవన నిర్మాణ అనుమతులు మంజూరు చేయాలి. ♦ నూతనంగా ఏర్పడిన కాలనీల్లో 30 శాతం గ్రీన్‌బెల్ట్ ఉండేలా చూడాలి. వాతావరణ శాఖ హైఅలర్ట్.. ♦ ప్రస్తుతం నగరంలో అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాల్పుల నేపథ్యంలో వాతావరణ శాఖ పలు జాగ్రత్తలు సూచించింది. అవి ఇలా.. ♦ అధికంగా మంచినీరు తాగాలి. గుండె జబ్బులు, ఎపిలెప్సి, కిడ్నీ, లివర్ జబ్బులున్నవారు జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనలు తీసుకోవాలి. ♦ వడదెబ్బ బారిన పడకుండా ఓఆర్ఎస్, లస్సీ, లెమన్ వాటర్, బటర్‌మిల్క్ అధికంగా తీసుకోవాలి. ♦ ఎండలో బయటకు వెళ్లే సమయంలో క్యాప్,అంబ్రెల్లా తీసుకెళ్లాలి. ♦ మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలి. ♦ అధిక జ్వరం, తలనొప్పి, శ్వాసలో ఇబ్బందులు తలెత్తితే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ♦ మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్యన ఎండ వేడిమికి గురికాకుండా జాగ్రత్తపడాలి. ఏసీలు, కూలర్లకు గిరాకీ నగరంలో వేసవితాపం, వేడిగాలులు, రేడియేషన్ తీవ్రత అనూహ్యంగా పెరగడంతో గ్రేటర్ సిటీజనులు ఏసీలు, కూలర్ల కొనుగోలుకు ఆయా దుకాణాలకు పరుగులు తీశారు. సోమ, మంగళవారాల్లో పలు ఎలక్ట్రానిక్ షోరూంలు అత్యధిక రద్దీతో కిటకిటలాడాయి. ఇప్పటికే ఏసీలు, కూలర్లు వినియోగిస్తున్న వారు సైతం వాటి నిర్వహణ, మరమ్మతుల కోసం టెక్నీషియన్లను ఆశ్రయిస్తున్నారు. సంబంధిత విడిభాగాలను విక్రయిస్తున్న దుకాణాలకు పరుగులు తీశారు. ఇదే అదునుగా వ్యాపారులు వాటిపై 20–30 శాతం అధిక ధరలకు విక్రయిస్తున్నారని వినియోగదారులు వాపోయారు. ధరల నియంత్రణపై ప్రభుత్వం శ్రద్ధచూపాలని కోరుతున్నారు. -
భానుడి ప్రతాపం: తీసుకోవలసిన జాగ్రత్తలు
సాక్షి, విజయవాడ : గడిచిన రెండు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. రానున్న మూడు రోజులపాటు వేడి గాలులతో పాటు ఎండ మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ అలర్ట్ ప్రకటించింది. ఎండ తీవ్రత ఎక్కువగా పెరుతుండటంతో ప్రజలకు పలు సూచనలు, సలహాలు చేసింది. (తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పులు) ఎండ తీవ్రంగా ఉన్నపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు చేయవలసినవి ▶ వేడిగా ఉన్న రోజులలో తప్పనిసరిగా గొడుగు వాడాలి ▶ తెలుపురంగు గల పలుచటి కాటన్ వస్త్రాలను ధరించాలి ▶ నెత్తికి టోపీ, లేదా రుమాలు పెట్టుకోవాలి ▶ ఉప్పు కలిపిన మజ్జిగ లేదా గ్లూకోజు నీరు తాగొచ్చు లేదా ఓరల్ రి హైడ్రేషన్ ద్రావణము తాగొచ్చు ▶ వడదెబ్బకు గురైనవారిని శీతల ప్రాంతానికి వెంటనే చేర్చి తడిగుడ్డతో శరీరమంతా తూడవాలి ▶ వడదెబ్బకు గురి అయినవారిలో మంచి మార్పులు లేనిచో శీతల వాతావరణంలో దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలి ▶ మంచి నీరు ఎక్కువగా గాలి ▶ ఇంటి నుంచి బయటకు వెళ్ళేముందు ఒక గ్లాసుమంచి నీరు తాగాలి ▶ ఎండలో బయటి నుంచి వచ్చిన వెంటనే చల్లని నిమ్మరసముగాని, కొబ్బరి నీరు లేదా చల్లని నీరు తాగాలి ▶తీవ్రమైన ఎండలో బయటకి వెళ్ళినప్పుడు అనారోగ్య సమస్య ఏర్పడితే దగ్గరలో వున్న వైద్యుణ్ణి సంప్రదించి ప్రాధమిక చికిత్స పొంది వడ దెబ్బ బారిన పడకుండా కాపాడుకోవాలి ❌ చేయకూడనివి ▶ సూర్య కిరణాలకు, వేడి గాలికి గురి కాకుడదు ▶ వేడిగా ఉన్న సూర్య కాంతిలో గొడుగు లేకుండా తిరుగరాదు ▶ వేసవి కాలంలో నలుపురంగు దుస్తులు, మందంగా ఉండే దుస్తులు ధరించరాదు ▶ నెత్తికి టోపి లేక రుమాలు లేకుండా సూర్య కాంతిలో తిరుగరాదు ▶ వడదెబ్బకు గురి అయిన వారిని వేడి నీటిలో ముంచిన బట్టతో తుడువరాదు ▶మధ్యాహ్నం తరువాత ఆరుబయట ఎక్కువ శారీరక శ్రమతో కూడిన పని పనిచేయరాదు ▶ ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపిపదార్ధములు మరియు తేనె తీసుకోకూడదు ▶శీతలపానీయాలు, మంచు ముక్కలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన అనారోగ్యము ఏర్పడుతుంది -
వీలైనంత ఎక్కువసార్లు నీరు తాగండి
సాక్షి, అమరావతి: రోహిణి కార్తెకు ఎండలు మండనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) బుధవారం హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పుల ముప్పు పొంచి ఉందని తెలిపింది. రాయలసీమతోపాటు కోస్తాంధ్రలోనూ ఎండలు భగ్గుమంటాయని చ్చరించింది. ఈ ఏడాది ఐఎండీ ఇలాంటి వడగాడ్పు హెచ్చరికలు జారీ చేయడం ఇదే ప్రథమం. (నేపాల్‌ది ఏకపక్ష చర్య.. అంగీకరించం: భారత్) రెంటచింతల @47.2 రెంటచింతల (మాచర్ల): గుంటూరు జిల్లాలోని రెంటచింతల నిప్పుల కొలిమిని తలపిస్తూ ‘మంట’చింతలగా మారింది. ఇక్కడ మూడు రోజులుగా 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 47.2 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలుగా నమోదైంది. గతంలో ఇక్కడ అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రికార్డు ఉంది. బుధవారం రాష్ట్రంలో పలుచోట్ల 42–43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని ఐఎండీ అమరావతి డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. గుంటూరు జిల్లా జంగమేశ్వరపురంలో 44, విజయవాడలో 43.5, మచిలీపట్నంలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పారు. రోళ్లు పగిలే ఎండలు ♦ ఈనెల 25వ తేదీ ఉదయం రోహిణి కార్తె ప్రవేశించనుంది. దీనికి ముందస్తు సంకేతంగా ఈనెల 22 నుంచి ఎండలు భగ్గుమనడంతోపాటు వడగాడ్పులు కూడా వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. ♦ ఐఎండీ కూడా ఇవే హెచ్చరికలు జారీ చేసింది. శుక్ర, శని, ఆది వారాల్లో యానాంతోపాటు ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ♦ అక్కడక్కడా వడగాడ్పులు కూడా వీచే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ పేర్కొంది. వైద్యుల సూచనలివీ.. ♦ రోహిణి కార్తె సమీపించినందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ♦ వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వేడివల్ల డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఎక్కువ. ♦ నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ♦ వేడి నుంచి కొంత ఉపశమనం కోసం లేత రంగులో ఉండే వదులైన దుస్తులు ధరించాలి. ♦ ఎండ వేళ వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా టోపీ లేదా తలపాగా ధరించాలి. లేదంటే గొడుగు వాడాలి. ♦ శరీరంలో నీరు, లవణాలు చెమట వేడివల్ల ఎక్కువగా బయటకు వెళ్లే అవకాశం ఉన్నందున ఉప్పు కలిపిన మజ్జిగ ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. ♦ వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు గది వాతావరణం కొంత చల్లగా ఉండేలా కిటికీలకు వట్టివేళ్లు లాంటివి కట్టి.. నీరు చల్లడం లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి. -
పగలే ‘సెగ’లాయె..
సాక్షి కడప/సిటీ : సూర్య ప్రతాపానికి జనం జంకుతున్నారు. భానుడు భగభగ మండిపోతుండడంతో ప్రజలు ఉదయం నుంచే బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. గత ఏడాది వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా, వడదెబ్బతో పలువురు మరణించారు. ప్రస్తుతం సాయంత్రం సమయంలో కూడా వేడి ప్రభావం తగ్గడం లేదు. సెగ కూడా కనిపిస్తోంది. ఈనెల ప్రారంభం నుంచి 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. వారం రోజులుగా కడపలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత దాటుతోంది. కరోనా నేపథ్యంలో జనం బయటకు రాకపోవడంతో కొంత మేలు జరుగుతోంది. రాబోయే రెండు రోజుల్లో జిల్లాలో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని జిల్లా కలెక్టరు హరికిరణ్ బుధవారం హెచ్చరించారు. వృద్ధులు, పిల్లలపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. అధిక ఉష్ణోగ్రతల వల్ల జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. తాగునీరు తగినంతగా తీసుకోవాలి. పలుచని వస్త్రాలు ధరించాలని, అత్యవసర వైద్య సేవలకు వచ్చేవారు టోపీ ధరించాలి. లేదా గొడుగు లేదా వస్త్రం లాంటివి ధరించాలి. అత్యవసరమైతే వైఎ స్సార్ టెలి మెడిసిన్ వైద్య సేవలకు టోల్‌ఫ్రీ నెంబరు 14410 లేదా టెలీకన్సెల్టెన్సీ కోసం 08562–244437, 244070 ఫోన్ చేసి వైద్య సేవలు పొందవచ్చునని కలెక్టరు సూచించారు. -
భానుడి భగభగ
సాక్షి, సిటీబ్యూరో: భానుడి ప్రతాపానికి శుక్రవారం సిటీజన్లకు ‘ఫ్రై’ డేను తలపించింది. గరిష్ఠంగా 40.7 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం. సాధారణం కంటే 2 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. పగటి వేళ భానుడు ప్రతాపం చూపినప్పటికీ.. ఉపరితల ద్రోణి ప్రభావంతో సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30– 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచాయి. రానున్న 24 గంటల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. మధ్యాహ్నం ఉష్ణోగ్రతలు పెరగడంతో నగరంలో ఏసీలు, రిఫ్రిజిరేటర్ల వినియోగం పెరిగింది. దీంతో కరెంట్ వినియోగం సైతం అనూహ్యంగా పెరిగింది. ఎండా.. ఠండా.. నగరంలో మధ్యాహ్నం వేళ ఎండ.. సాయంత్రం వేళ ఠండా వాతావరణం విభిన్న వాతావరణ పరిస్థితులకు అద్దం పడుతోంది. తెలంగాణ, రాయలసీమ, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా 0.9 కి.మీ ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో పెద్దగా తేడాలు ఉండవని.. అక్కడక్కడా సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకశాలున్నట్లు తెలిపింది. శుక్రవారం గాలిలో తేమ 68 శాతంగా నమోదైందని పేర్కొంది. అనూహ్యంగా పెరిగిన కరెంట్ వినియోగం.. నగరంలో పగటి ఉష్ణోగ్రతలు హెచ్చుతుండటంతో ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం పెరుగుతోంది. కరెంట్ వినియోగం కూడా క్రమంగా పెరుగుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో మెజారిటీ సిటీజన్లు ఇళ్లకే పరిమితం కావడం, ఎండలు పెరగడంతో మొన్నటి వరకు గ్రేటర్ పరిధిలో 40 మిలియన్ యూనిట్ల మేర ఉన్న విద్యుత్ వినియోగం శుక్రవారం 45 మిలియన్ యూనిట్ల మేర నమోదైందని సీపీడీసీఎల్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సీజన్లో గృహ అవసరాలకు విద్యుత్ వినియోగం క్రమంగా పెరిగే అవకాశాలున్నాయని.. అయితే లాక్డౌన్ నేపథ్యంలో వాణిజ్య, పారిశ్రామిక అవసరాలకు కరెంట్ వినియోగం పెరిగే అవకాశాలు లేవని స్పష్టం చేశాయి. -
ఈసారి వడగాల్పులు తక్కువే!
ఈ వేసవిలో మండుటెండలు.. వడగాల్పులు తగ్గనున్నాయి. మహానగర వాసులకు ఉపశమనం లభించనుంది. రానున్న మే నెలలో పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది మే నెలలో గ్రేటర్ పరిధిలో గరిష్టంగా 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. ఈ నెలాఖరుకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేరరికార్డయ్యే అవకాశాలున్నట్లు ప్రకటించింది. సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజనులకు ఇది ఉపశమనం కలిగించే వార్త్త. ఈసారి వేసవిలో మండుటెండలు.. వడగాల్పుల నుంచి నగరవాసులకు ఉపశమనం లభించనుంది. అతినీలలోహిత వికిరణత (యూవీ రేడియేషన్) సైతం పరిమితం కానుండటం విశేషం. పగటి ఉష్ణోగ్రతలు మే నెలలో గరిష్టంగా 42 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది మే నెలలో గ్రేటర్ పరిధిలో గరిష్టంగా 44 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. ఈ నెలాఖరుకు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మేర రికార్డయ్యే అవకాశాలున్నట్లు ప్రకటించింది. తగ్గనున్న యూవీ రేడియేషన్ సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో నగరంలో పది పాయింట్లకు పైగా యూవీ రేడియేషన్ (అతినీలలోహిత వికిరణత) ఇండెక్స్ నమోదవుతుంది. ప్రస్తుతం 8 పాయింట్లు మేనెలలో 9 పాయింట్ల మేర ఇండెక్స్ నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సూర్యుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాల తీవ్రతను యూవీ ఇండెక్స్ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ ఇండెక్స్ పది పాయింట్లు దాటితే చర్మం, కళ్లు, ఇతర సున్నిత భాగాలు దెబ్బతింటాయి. ప్రధానంగా ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు యూవీ ఇండెక్స్ ప్రభావం అధికంగా ఉంటుంది. మూడోవారంలో మాత్రమే.. గతేడాది మే నెలలో సరాసరిన 44 రోజుల పాటు వడగాల్పులు వీయడంతో వందలాది మంది వడదెబ్బకు గురయ్యారు. ఈసారి సరాసరిన 15, 20 రోజులు మాత్రమే.. అదీ మే మూడోవారంలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉండదు అసాధారణ వాతావరణ పరిస్థితులు, అధిక ఎండలు, వడగాల్పులకు కారణమయ్యే ఎల్‌నినో ప్రభావం ఈ వేసవిలో ఉండదు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏప్రిల్ రెండోవారంలోనే 40 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ప్రస్తుతం 37, 38 డిగ్రీలు మాత్రమే నమోదవుతుంది. ఈనెలాఖరుకు 40 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉంది. పలు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మేనెలలో 45 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నప్పటికీ.. గ్రేటర్ హైదరాబాద్‌లో 42 డిగ్రీలు.. అదీ కొన్ని రోజుల పాటు మాత్రమే నమోదయ్యే పరిస్థితులు ఉంటాయని అంచనా వేస్తున్నాం.–రాజారావు, వాతావరణశాఖ శాస్త్రవేత్త, బేగంపేట్ -
ఈసారి నడి వేసవిలో నిప్పుల వాన
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉంటాయని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. భూతాపం కారణంగా సాధారణం కంటే 1 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతుందని తెలిపింది. నడి వేసవిలో నిప్పుల వాన కురిపించేంతలా ఎండలు కాస్తాయని వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు పైగా నమోదు కావొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూ తాపంతో వాతావరణంలో వస్తున్న పెను మార్పులే దీనికి కారణమని చెబుతున్నారు. ఎండల తీవ్రత మార్చి 2వ వారం నుంచే మొదలుకానుంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. మే నెల నుంచి వడగాడ్పుల ప్రభావం: వాతావరణ శాఖ నివేదిక ప్రకారం... మే నెల మొదటి వారం నుంచి వడగాడ్పుల ప్రభావం మొదలు కానుంది. గతేడాదితో పోల్చిచూస్తే.. వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవడం ఉపశమనం కల్గించినా.. అదే సమయంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదు కానుండడంతో జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధిక రోజులు నమోదు కానున్నాయి. -
చలి తగ్గింది..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి ప్రభావం క్రమంగా తగ్గుతోంది. పగటి, రాత్రివేళల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.ఆదివారం నగరంలో పగటిపూట 31.7 డిగ్రీలు, రాత్రివేళల్లో 19.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇవి సాధారణ సగటు కంటే ఏకంగా నాలుగు డిగ్రీలు అధికం కావటంవిశేషం. ఇదిలా ఉంటే మాల్దీవులలో ఏర్పడ్డఉపరితల ఆవర్తనం కూడా ఉష్ణోగ్రతలపై ప్రభావం చూపిందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. -
ఈ ఏడాది డిసెంబర్లో చలి కాస్త తక్కువే..
సాక్షి, సిటీబ్యూరో: డిసెంబర్..ఒకప్పుడు తీవ్రమైన చలితో గజగజ వణికించేది. చలిగాలుల తీవ్రత, పొగ మంచుతో ఉక్కిరిబిక్కిరి చేసేది. ఈ ఏడాది డిసెంబర్ మాత్రం గతంతో పోలిస్తే కొంత మేర ఊరటనిచ్చింది. చలి ఉన్నా గత స్థాయిలో వణికించడం లేదు. ఈసీజన్లో ఇప్పటి వరకునగరంలో రాత్రి వేళల్లోసాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీనికి భిన్నంగా పగటి వేళల్లో సాధారణఉష్ణోగ్రతల కంటే తక్కువనమోదవుతుండడం విశేషం. కొద్ది రోజులుగా కోమోరిన్ ప్రాంతం నుండి దక్షిణ తమిళనాడు వరకు 0.9 కి.మీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతుండటం వల్లే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. గజగజ లేకుండానే నగరాన్ని గజగజ వణికించే డిసెంబర్ మాసంలో ఇప్పటి వరకు 15 డిగ్రీలకు తగ్గకుండా ఉష్ణోగ్రతలే నమోదు కాలేదు. బుధవారమైతే ఏకంగా 19.6 డి డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణ సగటుతో పోలిస్తే ఏకంగా ఐదు డిగ్రీలు అధికం. అయితే గత చరిత్ర పరిశీలిస్తే వాతావరణ చరిత్రలో అత్యల్ప ఉష్ణోగ్రతలన్నీ డిసెంబర్ మాసంలోనే నమోదయ్యాయి. హైదరాబాద్ చరిత్రలో అత్యల్ప ఉష్ణోగ్రత 1966 డిసెంబర్ 14న 7.1 డిగ్రీలు నమోదైతే, గతేడాది డిసెంబర్ 31న 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఇదిలా ఉంటే ఉపరితల ద్రోణి తీవ్రత తగ్గితే నగరానికి తూర్పు దిశ నుండి గాలుల తీవ్రత పెరిగితే జనవరి మొదటి వారంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఒక వేళ ద్రోణి తీవ్రత తగ్గకపోతే చలి తీవ్రత లేకుండానే శీతాకాలం ముగిసిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. -
వడగాల్పులు ఎలా, ఎందుకు వస్తాయి?
సాక్షి, న్యూఢిల్లీ : గత మూడు దశాబ్దాలుగా ఎన్నడు లేనివిధంగా దేశవ్యాప్తంగా సుదీర్ఘంగా వీస్తున్న వడగాడ్పులకు 200 మందికిపైగా మరణించారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడమే సుదీర్ఘ వడగాడ్పులకు కారణం. మత్యువాత పడిన వారిలో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదవాళ్లే. వడగాడ్పులంటే కేవలం వేడి గాలులుగానే భావించరాదు. ఈ వేడి గాడ్పుల్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడమే కాకుండా తేమ శాతం (ఉక్క) ఎంత ? సూర్యుడి నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వచ్చే రేడియేషన్ ప్రభావం ఎంత? అన్న అంశాల ఆధారంగా ప్రజలపై వడ గాడ్పుల ప్రభావం ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉండి, ఎక్కువ తేమ ఉన్న, ఎక్కువ ఉష్ణోగ్రత ఉండి, తక్కువ తేమ ఉన్నా వేడి ప్రభావం ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు 43 శాతం ఉష్ణోగ్రత ఉండి, గాలిలో తేమ 40 శాతం ఉన్నా, ఉష్ణోగ్రత 33 శాతం ఉండి, తేమ 95 శాతం ఉంటే ప్రభావం ఒకే స్థాయిలో ఉంటుంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాలకన్న పట్టణ ప్రాంతాల్లో, ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల సెల్సియస్ వరకు ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఇదివరకే తేల్చి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి కారణం. పగటి ఉష్ణోగ్రతను గ్రహించిన కాంక్రీటు నిర్మాణాల నుంచి రాత్రి పూట ఉష్ణం బయటకు వెలువడడమే. గ్రామీణ ప్రాంతాల్లో చెట్లు చేమలు ఎక్కువగా ఉండడం, పట్టణ ప్రాంతాల్లో చెట్లు తక్కువగా ఉండి, కాంక్రీటు నిర్మాణాలు ఎక్కువగా ఉండడం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడానికి కారణం. పట్టణంలో పేదలు నివసించే ప్రాంతంలో ఉష్ణోగ్రత మరీ ఎక్కువగా ఉంటుంది. వారిళ్లు చిన్నగా, దగ్గరదగ్గరగా ఉండడం, వెంటిలేటర్లు లేని రేకుల షెడ్లు అవడం అందుకు కారణం. బయట 41 డిగ్రీల సెల్సియస్ ఉంటే వారి రేకుల ఇళ్లలో 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. బయట ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు పడిపోయినప్పటికీ పేదల ఇళ్లలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంటుందని ‘కౌన్సిల్ ఆన్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్’కు చెందిన నిపుణులు హెమ్ ధొలాకియా తెలిపారు. పేదల ఇళ్లు ఏ ప్రాంతంలో ఉన్నాయన్న అంశంపై కూడా వారి ఇళ్లలోని ఉష్ణోగ్రత ఆధారపడి ఉంటుంది. కొండ ప్రాంతంలో ఉంటే పగలు వేడి, రాత్రి చల్లగా, పట్టణం మధ్యలో ఉంటే మరో విధంగా ఉంటుంది. వడగాడ్పులు ఎప్పుడు వస్తాయి? కొండ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత కనీసం 30 డిగ్రీల సెల్సియస్ దాటితే వడగాడ్పులు వీస్తాయి. అదే కోస్తా ప్రాంతంలో 37 డిగ్రీలు దాటితే, మైదాన ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ దాటితే వడ గాల్పులు వీస్తాయి. దేశంలో గత 15 ఏళ్లుగా వడగాడ్పుల తీవ్రత పెరిగింది. అందుకు కారణం వాతావరణంలో వచ్చిన మార్పులు ఒకటైతే పట్టణ ప్రాంతాల్లో కాంక్రీటు నిర్మాణాలు భారీగా పెరిగి పోవడం మరో కారణం. ఓ ప్రాంతంలో వరుసగా రెండు రోజుల ఉష్ణోగ్రత 45 డిగ్రీలు కొనసాగితే ‘నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ’ మార్గదర్శకాల ప్రకారం నివారణ చర్యలు తీసుకోవాలి. అంటే రోడ్లను నీటితో తడపడం, చెట్లు ఎక్కువగా ఉన్న పార్కులను 24 గంటలపాటు తెరచి ఉంచడం, ప్రజలకు మజ్జిగ కేంద్రాలను ఏర్పాటు చేయడం, పేదలను వేసవి శిబిరాలకు తరలించడం లాంటి చర్యలు తీసుకోవాలి. అత్యధికంగా రాజస్థాన్‌లో 51 డిగ్రీలు ఈసారి దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్‌లోని చురు ప్రాంతంలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత వరుసగా మూడు రోజులు కొనసాగింది. బీహార్, గుజరాత్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండింది. ఒక్క బీహార్లోనే ఈసారి వడగాడ్పులకు 70 మందికి పైగా మరణించారు. ఈసారి దేశంలోని 65.39 శాతం మంది ప్రజలు 40 శాతానికిపైగా ఉష్ణోగ్రతలో సంచరించారని, వారిలో 37 శాతం మంది రోజుకు పది గంటలకుపైగా ఉష్ణోగ్రతకు గురయ్యారని శాటిలైట్ ఛాయాచిత్రాల ద్వారా ‘డబ్లూఆర్ఐ ఇండియా సస్టేనబుల్ సిటీస్’కు చెందిన సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పీ. రాజ్ భగత్ తేల్చి చెప్పారు. ‘వాయు’ తుపాను కారణంగా ఈసారి రుతుపవనాల్లో జాప్యం జరిగిందని ఆయన తెలిపారు. 1992 నుంచి 2015 మధ్య వడ దెబ్బకు దేశంలో 22,562 మంది మరణించడంతో దేశంలోని ప్రతిన గరం ‘హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్’ను అమలు చేయాలని కేంద్ర వాతావరణ శాఖ ఆదేశించింది. అయితే నగరపాలికా సంస్థలు చలి వేంద్రాలు ఏర్పాటు చేయడం మినహా పెద్దగా నివారణ చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. క్లైమెట్ స్మార్ట్ నగరాలు అవశ్యం నగరాల్లో ఉష్ణోగ్రతలు పెరగకుండా నివారించేందుకు ‘క్లైమెట్–స్మార్ట్ నగరాలు’ శరణ్యమని నిపుణులు తెలియజేస్తున్నారు. వీధుల్లో, ప్రభుత్వ స్థలాల్లో, పార్కుల్లో చెట్లు పెంచడం, నీటి నిల్వ కుంటలను ఏర్పాటు చేయడం, అందరికి అందుబాటులోకి ప్రభుత్వ నల్లాలు తీసుకరావడం, వేడి గాలులను తట్టుకునేలా ఇళ్ల నిర్మాణం, ఏర్ కూలర్లలో కనీస ఉష్ణోగ్రతను 18 నుంచి 24కు పెంచడం, వాహన కాలుష్యాన్ని నియంత్రించడం లాంటి చర్యలు ‘క్లైమెట్–స్మార్ట్ నగరాలు’ ప్రణాళికలో ఉంటాయి. -
ఆ ఐదు ‘అగ్గి’!
సాక్షి, సిటీబ్యూరో: ఈసారి గ్రేటర్లో ఎండలు మండిపోయాయి. కొన్ని ప్రాంతాలైతే నిప్పుల కొలిమిని తలపించాయి. ప్రధానంగా నగరంలోని ఐదు ప్రాంతాల్లో అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అసాధారణ స్థాయిలో జూపార్క్ ప్రాంతంలో నాలుగు రోజుల పాటు సరాసరిన 43.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవ్వగా... మైత్రీవనంలో 43.4, మాదాపూర్‌లో 43.2, బీహెచ్ఈఎల్, నాంపల్లి ప్రాంతాల్లో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ఆయా ప్రాంతాల్లో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జూపార్క్‌లోని పక్షులు, జంతువులు, వీధి కుక్కలు విపరీత ప్రవర్తనకు గురయ్యాయి. వీధి కుక్కలు దాడి చేయడంతో ఎన్జీఆర్ఐ, మౌలాలి ప్రాంతాల్లో పలువురు గాయాలపాలయ్యారు. కాగా ఈసారి ఏప్రిల్, మేలో చాలా ప్రాంతాల్లో దాదాపు 20 రోజులు 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో హరితం 8శాతానికి పడిపోవడం, యూవీ (అతినీలలోహిత కిరణాలు) రేడియేషన్ ఇండెక్స్ 11 పాయింట్ల గరిష్టానికి చేరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. యూవీ సెగలు.. యూవీ ఇండెక్స్ (అతినీలలోహిత వికిరణ తీవ్రత) పెరగడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బహుళ అంతస్తుల భవంతులు, గాజు మేడలతో ఉష్టం వాతావరణంలో తేలికగా కలవకుండా భూఉపరితల వాతావరణానికే పరిమితం అవుతోంది. ఫలితంగా వికిరణ తీవ్రత పెరుగుతోంది. దీంతో ఓజోన్ పొర మందం తగ్గి భానుడి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు నేరుగా భూ వాతావరణంలోకి చేరుకుంటున్నాయి. ఇవి నేరుగా భూ వాతావరణంలోకి చేరడంతో పాటు మనుషులపై పడుతుండడంతో కళ్లు, చర్మ సంబంధ వ్యాధులు వస్తున్నాయి. అధిక సమయం ఎండలో తిరిగితే కళ్లు, చర్మం మండడం, రెటీనా దెబ్బతినడం లాంటి విపరిణామాలు తలెత్తుతున్నాయి. యూవీ సూచీ సాధారణంగా 7పాయింట్లకు పరిమితమైతే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ 10 పాయింట్లు నమోదైతే చర్మం, కళ్లకు ప్రమాదం ఉంటుంది. ఇక 12 పాయింట్లు దాటితే చర్మ కేన్సర్లు పెరిగే ప్రమాదం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు వికిరణ తీవ్రత నుంచి రక్షణ పొందేందుకు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవాలని, చలువ కళ్లద్దాలు, క్యాప్ ధరించాలని, గొడుకు వినియోగించాలని సూచిస్తున్నారు. హరితం హననం.. తోటల నగరంగా ప్రసిద్ధి చెందిన భాగ్యనగరంలో ఇప్పుడు హరితం హననమవుతోంది. రోజురోజుకూ తగ్గుముఖం పడుతోంది. రహదారులు, బహుళ అంతస్తుల భవంతులు శరవేగంగా విస్తరిస్తుండడంతో హరిత వాతావరణం క్రమేణా కనుమరుగవుతోంది. దీంతో నగర పర్యావరణం త్వరగా వేడెక్కుతోంది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం జీహెచ్ఎంసీ పరిధిలో 30శాతం గ్రీన్ బెల్ట్ (హరిత వాతావరణం) ఉండాలి. కానీ నగరంలో కేవలం 8 శాతమే గ్రీన్‌బెల్ట్ ఉండడంతో ప్రాణవాయువు కరువైంది. అంతేకాదు ఒకప్పుడు ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు నగర వాతావరణం ఉపశమనం కలిగిస్తుందనే పేరుండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. దాన్ని మనమే చేజేతులా దూరం చేసుకుంటున్నాం. రహదారుల విస్తరణ, బహుళ అంతస్తుల భవంతులు, వాణిజ్య సముదాయాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడం... అందుకు తగిన విధంగా హరిత వాతావరణం లేకపోవడం... వాహనాలు, పరిశ్రమల నుంచి కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ తదితర వాయువుల ఉద్గారాలు పెరిగి వేసవి తాపం నగరవాసులను ఉక్కిరిబిక్కిరి చేస్తోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక ఏర్పాట్లు.. అధిక ఉష్ణోగ్రతలతో జూపార్క్‌లో జంతువులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. పులులు, పక్షుల ఎన్‌క్లోజర్స్ చుట్టూ గోనె సంచులు ఏర్పాటు చేసి వాటిపై నీటిని విరజిమ్మేందుకు స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశాం. కొన్ని ఎన్‌క్లోజర్స్‌లో కూలర్లు సైతం పెట్టాం. ప్రతి గంటకూ ఉష్ణోగ్రతల్లో మార్పులను తెలుసుకొని జంతువులు డీహైడ్రేషన్‌కు గురికాకుండా చర్యలు తీసుకుంటున్నాం. తాగే నీటిలో గ్లూకోజ్ కలపడంతో పాటు మల్టీ విటమిన్స్ కలిపి అందజేస్తున్నాం. జూపార్క్‌లో సుమారు 1600 జంతువులను వేసవి తాపం ఉక్కిరిబిక్కిరి చేసినప్పటికీ వాటి పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. – క్షితిజ, జూపార్క్ క్యూరేటర్ -
గొంతెండుతోంది
తిరుపతి అన్నమయ్య సర్కిల్: జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వరుణుడు ముఖం చాటేశాడు. 65శాతం లోటు వర్షపాతం నమోదు కావడంతో జిల్లాలో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో సగటు నీటిమట్టం 50.21మీటర్ల దిగువకు పడిపోయింది. జిల్లావ్యాప్తంగా 80శాతం బోర్లు ఎండిపోయాయి. పశ్చిమ మండలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో పడమర మండలాల్లో భూగర్భజలాలు 98 మీటర్ల దిగువకు చేరుకున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. జిల్లాలోని 66 మండలాల్లో సుమారు 1,225 గ్రామ పంచాయతీల్లో తాగునీటి సమస్య త్రీవంగా ఉంది. ప్రధానంగా 4 వేల గ్రామాలు నీటికోసం అల్లాడుతున్నాయి. గత ప్రభుత్వం తాగునీటి సమస్య పరిష్కారంలో నిర్లక్ష్యం వహించడంతో జిల్లా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణం జిల్లాలో తాగునీటి సమస్యను గుర్తించి తగు ఏర్పాట్లు చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు నిర్లక్ష్యం వహించారు. వేసవిలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్లతో, బోర్ల సహాయంతో అందించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ప్రతి మండలంలోనూ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. బిందెలతో కార్యాలయాల వద్ద ధర్నాలు చేసినా పట్టించుకున్న నాథుడు లేడు. కొన్ని ప్రాంతాల్లో అధికారులు 15రోజులకొకసారి ఒక ట్యాంకర్‌ను పంపి చేతులు దులుపుకుంటున్నారు. జిల్లాలో తాగునీటి సమస్య పరిష్కరించడానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు గొప్పలు చెప్పుకున్న గత ప్రభుత్వం ఎక్కడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన దాఖలాలు లేవు. కరువు కాటకాలతో అల్లాడుతున్న పశ్చిమ ప్రాంతాల ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. మాటలకే పరిమితమైన ప్రాజెక్టులు జిల్లాలో నీటి వనరులు ఆశించినంత మేర లేకపోవడం, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత పాలకుల అలసత్యం ప్రజల పాలిట శాపంగా మారింది. అరణియార్ ప్రాజెక్ట్‌లో నీరు లేకపోవడం, స్వర్ణముఖి నదిలో ఇసుక మాఫియా తవ్వకాలతో పరీవాహక ప్రాంతాలు ఎడారిగా మారాయి. ఈ క్రమంలో గ్రామీణులు సైతం తాగునీరు కొనుగోలు చేయకతప్పడం లేదు. గ్రామాల్లో చేతిపంపులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. నీటి మాఫియా ఆగడాలు జిల్లాలో తాగునీటి సమస్యను గుర్తించిన కొందరు గత ప్రభుత్వం అండదండలతో మాఫియాగా ఏర్పడి కోట్లలో వ్యాపారం చేసుకుంటున్నారు. ప్రభుత్వ భూముల్లో, స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాలలో విచ్చలవిడిగా బోర్లు వేసి కోట్లకు కోట్లు దండుకుంటున్నారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోనే 200వరకు బోర్లు వేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. అడ్డుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు, అధికారులు మామూళ్ల మత్తులో పడి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ నీటికి రూ.800 నుంచి రూ.1,200 వరకు వసూలు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు రూ.5 నుంచి 6కోట్ల వ్యాపారం నడుస్తున్నట్లు సమాచారం. తిరుపతి నగరంలోనే రోజుకు రూ.2 నుంచి 3కోట్ల వ్యాపారం జరుగుతోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జూన్ నుంచి క్యాన్ వాటర్ రూ.30 జిల్లాలో తాగునీటి సమస్య తారస్థాయికి చేరడంతో ఆర్ఓ ప్యూరిఫైడ్ వాటర్ప్లాంట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నగరాల్లో ప్రతి సందులోనూ వాటర్ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 20లీటర్ల వాటర్ క్యాన్ రూ.10 నుంచి రూ.20వరకు విక్రయిస్తున్నారు. దీన్ని జూన్ ఒకటో తేదీ నుంచి రూ.30కి పెంచాలని వాటర్‌ప్లాంట్ అసోసియేషన్ నిర్ణయించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇదే నిజమైతే సామాన్యులు తాగునీరు కొనలేని పరిస్థితి. గత ప్రభుత్వం ప్రజల దాహార్తిని తీర్చడానికి ఎన్టీఆర్ సుజల స్రవంతి పేరుతో రూ.2కే 20లీటర్ల నీరు అంటూ ఆర్భాటంగా పథకాన్ని ప్రవేశపెట్టింది. సమగ్రంగా అమలు చేయకపోవడంతో ప్రారంభంలోనే నీరుగారిపోయింది. -
నిప్పుల గుండాలుగా తెలుగు రాష్ట్రాలు
-
బెదిరిపోతున్న బెజవాడ వాసులు..
సాక్షి, అమరావతి/ హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పుల గుండాలను తలపిస్తున్నాయి. భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు అల్లాడుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్నిగుండాన్ని తలపిస్తోంది. రోహిణీ కార్తె ప్రవేశించిన ఒక రోజులోనే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. సాధారణం కంటే మూడు, ఆరు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అట్టుడికిపోతున్నాయి. జనం ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. గుంటూరు, కృష్ణా, చిత్తూరు, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. గుంటూరు జిల్లా రెంటచింతల మండలంలోని జంగమహేశ్వరంలో 46డిగ్రీలు, తిరుపతి, విజయవాడ, రాజధాని అమరావతిలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా నమోదవుతాయని అంచనా వేస్తున్నారు. మరో వారంపాటు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఏపీలో కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. రాత్రి వేళ పలుచోట్ల 28 నుంచి 33 డిగ్రీలు నమోదవుతున్నాయి. అంటే ఇవి సాధారణం కంటే నాలుగు, ఆరు డిగ్రీలు అధికం. ఫలితంగా రాత్రి వేళ కూడా ఉష్ణతీవ్రతతో కూడిన గాలులు వీస్తున్నాయి. మరోవైపు వడగాల్పులకు విజయనగరం జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో ఇద్దరు మృతిచెందినట్టు సమాచారం. బెదిరిపోతున్న బెజవాడ వాసులు భానుడు ప్రతాపానికి బెజవాడ వాసులు బెదిరిపోతున్నారు. రోళ్లు పగిలే రోహిణీ కార్తె ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. రోహిణీ కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతుండటం, గాలిలో తేమ శాతం పెద్దఎత్తున పడిపోతుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని 20 ప్రాంతాల్లో 47 డిగ్రీలు కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం, నిజామాబాద్‌లో 17, హైదరాబాద్‌లో 20 శాతానికి గాలిలో తేమ శాతం పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోని 20 గ్రామాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో... వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల జిల్లా వేమన్‌పల్లి మండలం నీల్వాయి గ్రామంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని ప్లానింగ్ డెవలప్మెంట్ సొసైటీ వెల్లడించింది. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కన్నీటి గంగమ్మ!
అనంతపురం అగ్రికల్చర్: కీలకమైన నైరుతి రుతుపవనాలతో పాటు ఈశాన్య రుతుపవనాలు కూడా ఈ ఏడాది ప్రభావం చూపకపోవడంతో వర్షం జాడ కరువైంది. తిత్లీ, ఫొణి లాంటి తీవ్రస్థాయి తుపాన్లు సంభవించినా.. జిల్లాలో కనీసం తుంపర్లు కూడా పడని పరిస్థితి. అడపాదడపా గాలి చినుకులు, అకాల వర్షాలు తప్ప భారీ వర్షం లేకపోయింది. తీవ్ర వర్షాభావం కారణంగా భూగర్భజలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్నాయి. భూగర్భ జలశాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 151 గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఫీజోమీటర్లలో నమోదైన నీటిమట్టం చూస్తే ఆందోళన కలిగిస్తోంది. తాజాగా జిల్లా సగటు నీటి మట్టం 25 మీటర్లుగా నమోదైంది. పరిమితికి మించి భూగర్భ జలాలను తోడేస్తుండటంతో ఏకంగా 54 మండలాలు డేంజర్ జోన్లో ఉండగా.. మిగతా 9 మండలాలు మాత్రమే సేఫ్‌జోన్ ఉన్నట్లు ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ పి.పురుషోత్తమరెడ్డి తెలిపారు. గతేడాది అంటే 2018 మే నెల విషయానికి వస్తే సగటు నీటి మట్టం 19.80 మీటర్లుగా ఉంది. అంటే గతేడాదితో పోలిస్తే 5.23 మీటర్లు లోతుకు నీటి మట్టం పడిపోవడం గమనార్హం. గాండ్లపెంటలో 90 మీటర్లలో పాతాళగంగ జిల్లా సగటు నీటిమట్టం 25 మీటర్లుగా నమోదైనా.. కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా క్షీణించింది. గాండ్లపెంటలో 90 మీటర్లు చూస్తే కానీ నీటిచుక్క కనిపించే పరిస్థితి లేదు. లేపాక్షి, తలుపుల, అమరాపురం, కంబదూరు, గుడిబండ, గుమ్మఘట్ట, సోమందేపల్లి, పెనుకొండ, కుందుర్పి, అగళి, పుట్లూరు, యల్లనూరు, యాడికి, శెట్టూరు, రొద్దం, హిందూపురం,రామగిరి, ముదిగుబ్బ, పరిగి, తనకల్లు, పుట్టపర్తి, అనంతపురం, బత్తలపల్లి, బ్రహ్మసముద్రం, రాప్తాడు, ఎన్పీ కుంట.. ఇలా చాలా మండలాల్లో ఉన్న ఫీజోమీటర్లలో 40 నుంచి 80 మీటర్ల లోతులో నీళ్లు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. 151 ఫీజోమీటర్లను పరిశీలిస్తే అందులో 103 ఫీజోమీటర్లలో నమోదైన నీటిమట్టం ఆందోళన కలిగిస్తోంది. 43 శాతం లోటు వర్షపాతం: జిల్లా వార్షిక సాధారణ వర్షపాతం 552 మి.మీ., కాగా అందులో జూన్ ఒకటి నుంచి ఇప్పటివరకు 541 మి.మీ వర్షం కురవాల్సి ఉంది. అయితే 308 మి.మీ., వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో సాధారణం కన్నా 43 మి.మీ., లోటు నమోదు కావడం గమనార్హం. గత 140 సంవత్సరాల చరిత్రలో ఈ స్థాయి లోటు వర్షపాతం నమోదు కావడం ఇదే మొదటిసారి. వర్షం, జలాల పరిస్థితి ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ఒక జూన్ నెలలో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదు కాగా.. మిగతా నెలల్లో వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో కొన్ని మండలాల్లో నెలల తరబడి వాన చినుకు పడలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఖరీఫ్, రబీలో 250 పైగా వర్షపాతం విరామాలు(డ్రైస్పెల్స్) నమోదు కావడం వర్షాభావ తీవ్రతను తెలియజేస్తోంది. దీంతో దాదాపు 20 లక్షల ఎకరాల్లో వేసిన పంటలన్నీ ఎండిపోయి రైతులకు రూ.4 వేల కోట్లకు పైగా అపార నష్టాన్ని మిగిలింది. ఎండుతున్న పండ్ల తోటలు: 43 శాతం లోటు వర్షాలు, సగటున 25 మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోవడం, వీటికి తోడుగా 42 నుంచి 44 డిగ్రీలతో భానుడు భగ్గుమంటుండటంతో పండ్లతోటలు నిట్టనిలువునా ఎండిపోతున్నాయి. అధికారిక అంచనాల మేరకు 5వేల ఎకరాల్లో మల్బరీ (పట్టు) తోటలు, 12వేల ఎకరాల్లో పండ్లతోటలు ఎండిపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2.30 లక్షల బోరుబావుల్లో దాదాపు 82వేల బోరుబావుల్లో నీళ్లు రాక ఒట్టిపోయినట్లు అంచనా వేస్తున్నారు. దీంతో 42వేల హెక్టార్ల పండ్లతోటలు నీటిఎద్దడి బారిన పడ్డాయి. వాటిని కాపాడుకునేందుకు జిల్లా రైతులు భగీరథ యత్నాలు కొనసాగిస్తున్నారు. ఓ పక్క లక్షలకు లక్షలు అప్పులు చేసి కొత్తగా 500 నుంచి 800 అడుగులు, కొన్ని ప్రాంతాల్లో వేయి అడుగుల వరకు బోరుబావులు తవ్విస్తున్నా 10 శాతం కూడా ఫలితం దక్కని పరిస్థితి ఉంది. మరోపక్క ట్యాంకర్లు పెట్టి కిలోమీటర్ల కొద్దీ నీళ్లు తరలించి తోటలకు ఇస్తున్నా బతికించుకోలేకపోతున్నారు. విపత్తు సంభవిస్తుందని తెలిసినా ప్రభుత్వ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఐదు, పదేళ్లు పెంచి పోషించిన పండ్లతోటలు కళ్లముందే ఎండిపోతుండటంతో కన్నీరుమున్నీరవుతున్న పరిస్థితి నెలకొంది. రక్షకతడులు (లైఫ్‌సేవింగ్ ఇరిగేషన్స్) ఇస్తామంటూ ఇటీవల ఉద్యానశాఖ ప్రకటించినా మొక్కుబడిగా సాగుతోంది. అలాగే పశుగ్రాసం సమస్య పట్టిపీడిస్తోంది. కొనడానికి కూడా దొరక్కపోవడంతో 10 లక్షల పశుసంపద, 48 లక్షల జీవసంపదను బతికించుకోవడం కష్టంగా మారింది. వేలాది సంఖ్యలో పాడి పశుసంపద కేరళ, తమిళనాడు, తెలంగాణా ప్రాంతాల్లో ఉన్న కబేళాలకు తరలిస్తున్న దుస్థితి. మొత్తం మీద ఈ ఏడాది వేసవి ముగిసే నాటికి పట్టు, పాడి, పండ్లతోటల రైతులకు సుమారు రూ.500 కోట్లకు పైగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అంచనా. -
వేసవి తుపానులు ఊరకే రావు!
సాక్షి, న్యూఢిల్లీ : గత వారం ఒడిశాను అతలాకుతలం చేసిన ‘ఫొని’ తుపానుకు 38 మంది మృత్యువాత పడిన విషయం తెల్సిందే. ఇది వేసవి కాలపు తుపాను. గత 150 ఏళ్లలో ఇది రావడం మూడోసారి మాత్రమే. వాతావరణంలో అనూహ్యంగా మార్పులు వచ్చి బంగాళా ఖాతం జలాలు వేడక్కెడం వల్ల ఈ తుపాన్లు వస్తున్నాయి. భూతాపోన్నతి పెరగడం వల్లనే భూ వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తాయన్న విషయం తెల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రత ఇప్పటికే 46 డిగ్రీల మార్పును దాటిందంటే ఈసారి ఉష్ణోగ్రత తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీస్తున్నాయి. భూగర్భ జలాలు బాగా అడుగంటిపోయాయి. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల సుడి గాలులు, తుపానులు చెలరేగి ప్రకృతి నష్టాలతోపాటు మాన ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవిస్తాయని అందరికి తెల్సిందే. తెలియనిది మరొకటి ఉంది. పర్యావరణ పరిరక్షణ లోపించి వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవించడం వల్ల జన్యుపరమైన నష్టం. అంటే కొన్ని జీవరాశులు పూర్తిగా నశించి పోవడం. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు కోటి జీవరాశులు ఉండగా, వాటిలో ఇప్పటికే దాదాపు పది లక్షల జీవరాశులు నశించి పోయాయని శాస్త్రవేత్తలు తెలిపారు. దాదాపు నెలన్నరపాటు కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ కారణంగా వాతావరణంలో వస్తున్న అనూహ్య మార్పులను దేశ ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు లేదుగానీ పట్టించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్నికల సందర్భంగా దేశంలోని దరిద్రం నుంచి దాష్టీకం వరకు, ఆకలి నుంచి అన్నపానీయాల వరకు, ఉపాధి నుంచి పదోన్నతుల వరకు, వైద్యం, విద్య, మౌలిక సదుపాయాలన్నీ చర్చకు వస్తాయిగానీ ఏనాడు వాతావరణ మార్పుల అంశం మాత్రం రాదు. కానీ ఈసారి మాత్రం వచ్చింది. ముక్తిసరికైనాగానీ పాలకపక్ష బీజేపీ, విపక్ష కాంగ్రెస్ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో కొన్ని పేజీలను వాతావరణ మార్పులకు కేటాయించాయి. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని చెప్పాయి. పునర్వినియోగ ఇంధనంపై దృష్టిని కేంద్రీకరిస్తామని, అడవులను పెంచే రాష్ట్రాలకు ‘గ్రీన్ బోనస్’ ఇస్తామని బీజేపీ వాగ్దానం చేయగా, దేశంలోని జల వనరులను సంరక్షిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. గత 50 ఏళ్లలో వాతావరణ మార్పుల వల్ల దేశ జీడీపీ పురోగతిలో 30 శాతం కుంటుపడింది. అంటే వాతావరణ పరిస్థితులు సవ్యంగా ఉన్నట్లయితే నేడు మన జీడీపీ రేటు మరో 30 శాతం ఎక్కువ ఉండేది. పర్యావరణ పరిస్థితులను పరిరక్షించడంలో భాగంగా ప్రపంచంలోనే తొలి దేశంగా బ్రిటన్ ‘క్లైమేట్ ఎమర్జెన్సీ’ని ప్రకటించింది. భారత్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
నిప్పుల కుంపటి
ఒంగోలు సిటీ: ఎండ నిప్పులు చెరిగింది. ఉదయం నుంచే వేడి గాలులు. బయట అడుగు పెడితే నిప్పుల కుంపట్లో పెట్టినట్లే. రోడ్లు నిప్పుల కొలిమిని తలపించాయి. కాలు పెడితే మండుతున్న రోడ్లపై జన సంచారం లేదు. ఆది, సోమవారాలు పెరిగిన ఉష్ణోగ్రతలతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్నారు. మరో రెండు రోజుల పాటు ఇదే తరహాలో అగ్నిగుండం తరహా ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు ఒంగోలులో 45.08 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. సాయంత్రానికి 46 డిగ్రీలు చేరుకున్నట్లుగా అధికారులు చెప్పారు. దర్శి, కురిచేడుల్లో అత్యధికంగా 48 డిగ్రీలు నమోదైంది. యర్రగొండపాలెంలో 46.76 డిగ్రీలు, చీమకుర్తిలో 46.69, కనిగిరి 46.52, దోర్నాలలో 46.44, త్రిపురాంతకం 46.52, మద్దిపాడులో 46.30, టంగుటూరులో 46.22, మార్కాపురం 46, సంతనూతలపాడులో 45.54, కురిచేడులో 45.37 డిగ్రీలు ఇలా 45 డిగ్రీలకుపైగా 17 మండలాల్లోఉష్ణోగ్రతలు నమోదైనట్లుగా అధికారులు చెబుతున్నారు. ఉదయం ఏడు గంటల నుంచి భానుడి భగభగలు మొదలయ్యాయి. ఉక్కపోతలు రాత్రి 9 గంటలైనా తగ్గడం లేదు. వడగాలులు తీవ్రంగా ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ పరిశోధన అధికారులు ప్రజలను హెచ్చరించారు. మరో మూడు రోజుల పాటు వడగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. క్రమంగా పెరుగుతున్న వడదెబ్బ మృతులు: జిల్లాలో మూడు రోజుల నుంచి నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకు 16 మంది వడదెబ్బతో మృతిచెందారు. ఆదివారం అత్యధికంగా జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సంతనూతలపాడులో 46.9 డిగ్రీలు, దొనకొండలో 45.9 డిగ్రీలు నమోదయ్యాయి. అలాగే జిల్లాలోని 17 మండలాల్లో 45 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ నుంచి ఇలా తప్పించుకోవాలి: ఎండ తీవ్రతకు గురికాకుండా జాగ్రత్తలను పాటిస్తే వడదెబ్బకు గురికాకుండా తప్పించుకోవచ్చు. ♦ తెలుపు రంగున్న పలుచటి కాటన్ వస్త్రాలు ధరించాలి. తలపై టోపీ, తలపాగా కట్టుకోవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ తీసుకోవాలి. ఓఆర్ఎస్ వంటి ద్రవాలు తాగవచ్చు. ♦ వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాలి. వడదెబ్బకు గురైన వారిని తడిగుడ్డతో శరీరం అంతా రద్దుతుండాలి. ఐస్ నీటితో బట్టను తడిపి శరీరమంతా తుడవాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల కంటే తక్కువ స్థాయికి వచ్చే వరకు ఇలా చేయాలి. ♦ ఎండ నుంచి రాగానే చల్లని నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, చల్లని నీరు తీసుకోవాలి. తీవ్రమైన ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం మొదలై ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తితే దగ్గరలోని వైద్యున్ని సంప్రదించాలి. ప్రాథమిక చికిత్స పొంది వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవాలి. ♦ ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు బయట తిరగకూడదు. ఉదయాన్నే అత్యవసర పనులుంటే ముగించుకోవాలి. ప్రధానంగా ఉపాధి హామీ కూలీలు పది గంటల తర్వాత పని చేయడం ప్రమాదకరం. ♦ ఎండలో బయట నుంచి వచ్చిన వెంటనే తీపి పదార్థాలు, తేనె తీసుకోకూడదు. శీతల పానీయాలు తీసుకుంటే గొంతుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. -
మండుతున్న సూరీడు
అనంతపురం అగ్రికల్చర్ సూరీడు అగ్నిగోళమై మండుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలకు ‘అనంత’ అట్టుడుకుతోంది. వేసవితాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. మండేఎండలకు తోడు ఉక్కపోత, వడగాల్పుల తీవ్రత అధికం కావడంతో ప్రజలకు ముచ్చెమటలు పడుతున్నాయి. సోమవారం తాడిమర్రిలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా రొళ్లలో 24.6 డిగ్రీలు కనిష్టం నమోదైంది. అనంతపురం, పెద్దవడుగూరు, పామిడి 43.4 డిగ్రీలు, తాడిపత్రి, యాడికి 43.2 డిగ్రీలు, గుంతకల్లు 43.1 డిగ్రీలు ఉండగా, పుట్లూరు, యల్లనూరు, తనకల్లు, కదిరి, బుక్కపట్నం, రాయదుర్గం, గుమ్మఘట్ట, రాప్తాడు, కనగానపల్లి, ముదిగుబ్బ, పెద్దపప్పూరు, ధర్మవరం, ఓడీ చెరువు, బత్తలపల్లి, కూడేరు, బుక్కరాయసముద్రం, నార్పల, అగళి, గాండ్లపెంట, ఆత్మకూరు, లేపాక్షి, బెళుగుప్ప, గార్లదిన్నె, గుత్తి, శెట్టూరు, శింగనమల, కంబదూరు మండలాల్లో కూడా 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో గరిష్టంగా 37 నుంచి 39 డిగ్రీలు, కనిష్టం 25 నుంచి 30 డిగ్రీల మధ్య కొనసాగాయి. గాలిలో తేమశాతం ఉదయం 54 నుంచి 62, మధ్యాహ్నం 24 నుంచి 32 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో వీచాయి. బత్తలపల్లి, గుమ్మగట్ట, బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, కళ్యాణదుర్గం, నల్లచెరువు, రాయదుర్గం, పుట్లూరు, పామిడి, వజ్రకరూరు, యాడికి, చెన్నేకొత్తపల్లి, తలుపుల మండలాల్లో గాలివేగం ఎక్కువగా నమోదైంది. -
భానుడి భగభగ
మంచిర్యాల అగ్రికల్చర్ : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఉమ్మడిజిల్లా అగ్నిగుండలా తలపిస్తుంది. ఆదివారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరకుంటుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 35 డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా వేడిగాలుల ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతుండడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బదాటికి మార్చి నుంచి ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు ఒకరిద్దరు చొప్పున వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గుబావులు, ఓపెన్‌కాస్టులు ఉన్న ప్రాంతాల్లో ఆదివారం మధ్నాహ్నం ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో ఓపెన్ కాస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు అల్లాడిపోయారు. అడవులు అంతరిస్తుండటం, జలాశయాలు అడుగంటడం.. తదితర కారణాల వల్ల ఎండ తీవ్రత ఏటేటా పెరుగుతోంది. సాయత్రం 6 గంటలు దాటితే కాని జనాలు బయటికి రాని పరిస్థితి. వాహన చోదకులు ముఖానికి రక్షణ లేకుండా బయటకు రావడం లేదు. అడవుల జిల్లాగా పెరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాగులు, బోరు బావులుల్లో నీరు అడుగంటుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి తలెత్తుతోంది. మే నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. భానుడు.. బ్యాండ్ బాజా ఇదే నెలలో అత్యధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఇటు ఎండలతో ఇళ్లలో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రయాణాలు చేసేటప్పుడు... ►శరీరాన్ని పట్టుకునేలా ఉండే దుస్తులను కాకుండా కొద్దిగా వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు. ►సాధ్యమైనంత మేరకు ఉదయం చల్లగా ఉన్న సమయంలోనే వివాహాలకు బయలుదేరాలి. అక్కడ బంధువులతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం వరకు ఉంటే మేలు. ► ముఖ్యంగా వ్యాన్, లారీల్లో వెళ్లాల్సి వస్తే.. వాటిపై తాటిపత్రిలాంటివి వేసుకోవాలి. ఇరుకుగా కాకుండా తక్కువ మోతాదులో మందిని తరలించేలా ఏర్పాటు చేసుకోవాలి. ►తప్పనిసరిగా తగినంత మేర చల్లని నీటిని తీసుకెళ్లాలి. ►వాహనాలపై వెళ్లాల్సి వస్తే తల, ముక్కు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్, కర్చీఫ్ కానీ కట్టుకోవాలి. కళ్లకు చల్లని చలువ అద్దాలు పెట్టుకోవాలి. గోడుగు, టోపి వెంట తీసుకెళ్తే మేలు. ►నీళ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. ఎండకు తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తీసుకోకూడదు. ►త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. ► తక్కువ మోతాదులో ఎక్కువసార్లు నీటిని తాగాలి. ►నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తాగాలి. ►సోడియం, పొటాషియం ఉన్న ద్రవపదార్థాలు తీసుకోవాలి. ►వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి. ►నుదుటిపై తడిగుడ్డ వేసి తడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి. ►బీపీ లేదా పల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. ►గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి. ►నీరు ఎక్కువగా తాగించాలి. ►అవసరాన్ని బట్టి వైద్యుడికి చూపించి ప్రాథమిక చికిత్స అందించాలి. వారంరోజుల్లో నమోదైన ఉష్ణోగ్రతలు తేదీ కనిష్టం గరిష్టం 22 27.6 40.8 23 27.5 39.8 24 27.4 42.3 25 26.8 43.3 26 29.8 44.3 27 32.4 44.8 28 32.5 45.3 జిల్లాలో ఐదేళ్లలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు, ప్రాంతాలు సంవత్సరం ప్రాంతం ఉష్ణోగ్రత 26–04–2014 దండేపల్లి 46.3 29–04–2015 దండేపల్లి 45.6 26–04–2016 దండేపల్లి 48.8 21–04–2017 జన్నారం 45.0 21–04–2018 దండేపల్లి 44.3 27–04–2019 దండేపల్లి 45.3 -
గతితప్పిన రుతురాగం.. పెరుగుతున్న వేసవి నిడివి
సాక్షి, హైదరాబాద్: మొన్నటి శీతాకాలంలో ఎన్నడూ లేనంత చలిని రాష్ట్ర ప్రజలు చవిచూశారు. మూడు, నాలుగు రోజులపాటు తీవ్ర చలిగాలులతో జనం అసౌకర్యానికి గురయ్యారు. మార్చి మధ్యలో ప్రారంభం కావాల్సిన వేసవి.. ఫిబ్రవరి నుంచే ఎండలతో ఠారెత్తిం చింది. ఎండలు దంచుతుండగానే వాతావర ణంలో మార్పులతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వడగళ్ల వానలు కురిశాయి. అంతలోనే పరిస్థితి మారి ఇప్పుడు మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా జూన్ నుంచే వర్షాకాలం షురూ కావాల్సి ఉండగా జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఇలా రుతువులు గతి తప్పి జనజీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. వాతావరణం ఎప్పు డెలా మారుతుందో అంతుబట్టడం లేదు. ఈ పరిస్థితి వాతావరణ అధికారులను కూడా తికమక పెడుతోంది. వారిచ్చే హెచ్చరికలు ఒక్కోసారి అటు–ఇటు అవుతున్నాయి. ఈ తీవ్రమైన వాతావరణ పరిస్థితులకు గ్లోబల్ వార్మింగే కారణమని వాతావరణ నిపుణులు అంటున్నారు. తీవ్రమైన కాలుష్యం, చెట్లను తెగ నరకడం, పట్టణీకరణ తదితర కారణాల వల్లే పరిస్థితి మరింత దిగజారిందనేది వారివాదన. రెండు, మూడు దశాబ్దాలుగా వాతావరణంలో ఊహించలేని మార్పులు సంభవిస్తున్నాయి. వాతావరణంలో సంభవించిన మార్పుల వల్ల సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో అకాలవర్షాలు (గాలివానలు, వడగండ్లు) ఇబ్బందికరంగా మారాయి. వాతావరణంలో వేడి ఎక్కువవడం కారణంగానే ఇలాంటి విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. సీజన్లో వచ్చే మార్పులు పంట కాలంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. రైతులు జూన్ నుంచే సాగుకు సిద్ధమవుతుంటారు. కానీ వర్షాలు ఆగస్టు, సెప్టెంబర్లలో పడుతుండటంతో అప్పటికే పంట చేజారిపోతోంది. రబీ కాలాన్ని ఖరీఫ్ ఆక్రమిస్తుంది. గతి తప్పిన రుతువులతో పంటల దిగుబడిపైనా ప్రభావం చూపుతోంది. దీంతో తెలంగాణలో వ్యవసాయం అదుపుతప్పింది. ఎండలు, అకాల వర్షాలతో రైతన్న కుదేలు వాతావరణ మార్పుల వల్ల ఒక్కోసారి అధిక ఎండలు, ఆ వెంటనే అకాల వర్షాలు తెలంగాణ వ్యవసాయాన్ని కుదేలు చేశాయి. సీజన్లు సరైన సమయాల్లో రానందున ఎప్పుడేం జరుగుతుందో రైతుకు అంతుబట్టడంలేదు. 2018–19 వ్యవసాయ సీజన్‌ను పరిశీలిస్తే జూన్ నెలలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాక చివరి రెండు వారాల్లో సాధారణం కంటే 15% అధికంగా వర్షాలు కురిశాయి. దీంతో రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. అవి మొక్క దశలో ఉండగా జులైలో 30% లోటు వర్షాపాతం నమోదైంది. దీంతో వేసిన పంటలు ఎండ తీవ్రతకు మాడిపోయాయి. ఆగస్టులో మళ్లీ 18% అధిక వర్షపాతం నమోదైంది. దీంతో రైతులు వరి నాట్లకు ఉపక్రమించారు. కానీ అప్పటికే వేసిన పత్తి పంటపై తీవ్రమైన ప్రభావం పడింది. సెప్టెంబర్ నాటికి సరికి మళ్లీ వర్షాలు 35% అధికంగా కురిశాయి. దీంతో తెలంగాణలో దాదాపు సగం విస్తీర్ణంలో సాగు చేసిన పత్తి పంటకు గులాబీరంగు పురుగు సోకింది. అసందర్భంగా కురుస్తున్న వర్షాలతో పత్తి దిగుబడి 30% తగ్గింది. మొత్తంగా చూస్తే 2018–19లో 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో రబీ అనుకున్న స్థాయిలో సాగు కాలేదు. పైగా సాగునీటి వనరులున్న చోట.. ఇటీవల కురిసిన అకాల వర్షాలు వరిపంటను నాశనం చేశాయి. రబీ మొదలయ్యాక గత 4నెలల కాలంలో అకాల వర్షాలు, వడగళ్ల వానలు పంటలను దెబ్బతీశాయి. గత డిసెంబర్లో పెథాయ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో 42 మండలాల్లో పంటనష్టం వాటిల్లింది. వరి, మొక్కజొన్న, వేరుశనగ, ఆవాలు, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జనవరిలో వచ్చిన అకాల వర్షాలతో కరీంనగర్, పెద్దపల్లి, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 14 మండలాల్లోని 104 గ్రామాల్లో వేసిన పంటలకు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో వివిధ జిల్లాల్లో కురిసిన అకాల, వడగండ్ల వర్షాలకు 12,990 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. తాజాగా ఈ నెలలో కురిసిన అకాల వర్షాలు, వడగళ్ల వానలకు లక్ష ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. ఇవన్నీ వాతావరణ మార్పుల కారణంగా సంభవించిన పరిణామాలే కావడం గమనార్హం. వాతావరణ మార్పుల వల్లే ఇలాంటి అకాల వర్షాలు, వడగళ్ల వానలు సంభవిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. డేంజర్ జోన్లో తెలంగాణ దేశంలో వడగాడ్పులు అధికంగా వచ్చే డేంజర్ జోన్లో తెలంగాణ ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొన్నిచోట్ల 47–49 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గతేడాది కంటే అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డు అవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆదిలాబాద్, భద్రాచలం వంటి చోట్ల 48–49 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. హైదరాబాద్‌లో 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశముంది. అంతేకాదు వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల వడగాడ్పులు వచ్చే రోజుల సంఖ్య పెరుగుతోంది. వేసవిలో ఏదో ఒక నిర్దిష్టమైన రోజున సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రత కంటే.. ఐదారు డిగ్రీలు అధికంగా ఉంటే వాటిని వడగాడ్పులు అంటారు. సాధారణం కంటే ఏడు డిగ్రీల వరకు అధికంగా నమోదైతే తీవ్రమైన వడగాడ్పులుగా పరిగణిస్తారు. కొన్నిసార్లు 45 డిగ్రీలు ఆపైన ఉష్ణోగ్రతలు నమోదైతే కూడా వడగాడ్పులుగానే పరిగణిస్తారు. 47 డిగ్రీల వరకు చేరుకుంటే తీవ్రమైన వడగాడ్పులుగా గుర్తిస్తారు. ఇలాంటి వడగాడ్పులు తెలంగాణలో ఈసారి 20 రోజుల వరకు నమోదయ్యే అవకాశముంది. 2016 వేసవిలో ఏకంగా 27 రోజులుపాటు తెలంగాణలో వడగాడ్పులు ప్రతాపం చూపించాయి. వీటి కారణంగా రాష్ట్రంలో భారీ సంఖ్యలో మరణాలు నమోదయ్యాయి. 2015లో అత్యధికంగా 541 మంది వడదెబ్బతో చనిపోయారు. తేమశాతం పెరగడంతోనే భగభగ ఇక ఉష్ణోగ్రత సాధారణంగా ఉన్నా గాలిలో తేమ శాతం పెరిగితే ఎండ తీవ్రత అధికంగా ఉండనుంది. ఉదాహరణకు ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదై, గాలిలో తేమ 75% ఉంటే, దాని ప్రభావం 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. 31 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండి.. తేమ 100% ఉంటే అది కూడా 49 డిగ్రీల ఉష్ణోగ్రతతో సమానం. కాబట్టి ఉష్ణోగ్రత సాధారణమైన తేమ శాతాన్ని బట్టి కూడా వేసవి తీవ్రతను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు పట్టణీకరణ వల్ల కాలుష్యం, కాంక్రీటు, తారు రోడ్లు, సిమెంటు భవనాలు, ఇతరత్రా నిర్మాణాల వల్ల కూడా వేడి తీవ్రత మరింత పెరుగుతుంది. ఎంత ఎండాకాలమైనా ఒకప్పుడు హైదరాబాద్ చల్లగానే ఉండేదన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఎండలతో మండిపోతుంది. తెలంగాణలో ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది సాధారణం కంటే 0.5 నుంచి 1 డిగ్రీ అధికంగా ఉష్ణోగ్రతలుంటాయి. అంటువ్యాధుల విజృంభణ 2030 నాటికి వాతావరణఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పెరిగితే జరిగే విధ్వంసం ఊహకందదని ఐక్యరాజ్యసమితి గతేడాది స్పష్టం చేసింది. దాని ప్రభావం వల్ల భారత్‌లో వాతావరణ మార్పులతో అతివృష్టి, అనావృష్టి సంభవిస్తాయని తెలిపింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడం వల్ల కీటకాలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు, డెంగీ, మలేరియా వంటి జ్వరాలు తీవ్రరూపం దాలుస్తాయని హెచ్చరించింది. ఒకవైపు ఆహార కొరత, మరోవైపు అనారోగ్యం కారణంగా లక్షలాది మంది మృత్యువాతపడతారు. అంతేకాదు ఎండ తీవ్రతకు కిడ్నీ వ్యాధులు పెరుగుతాయి. చర్మ క్యాన్సర్లు వచ్చే అవకాశముంది. ఎండల నుంచి, వడగాడ్పుల నుంచి జాగ్రత్తలు తీసుకోకపోతే పిల్లలు, పెద్దల్లో ఇతరత్రా అనారోగ్య సమస్యలు వస్తాయి. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలి. పంట దిగుబడులపై పెను ప్రభావం వాతావరణ మార్పులు, భూతాపం వల్ల వ్యవసాయ, అనుబంధ రంగాలకు పెను విపత్తు ముంచుకురానుంది. కొన్ని దశాబ్దాలుగా వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో వ్యవసాయ పంట దిగుబడులు, పంటల ఉత్పాదకత, పశు సంపద, పాల దిగుబడిపై ప్రభావం పడిందని కేంద్రం ఒక నివేదికలో వెల్లడించింది. 2030 నాటికి దేశంలో వరి, గోధుమ దిగుబడిపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నివేదికలో ప్రస్తావించిన ముఖ్యంశాలు.. ఖరీఫ్‌లో వర్షానికి, వర్షానికి మధ్య ఎక్కువ రోజుల అంతరాయం (డ్రైస్పెల్) ఏర్పడటం, రబీ సీజన్లో సగటు ఉష్ణోగ్రతలు పెరగడంతో పంటల దిగుబడి తగ్గుతుంది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 2 డిగ్రీలు పెరిగితే వరి ధాన్యం దిగుబడి హెక్టారుకు 10 క్వింటాళ్ల వరకు తగ్గుతుంది. వడగాడ్పులు వీచే ప్రాంతాల్లో పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గి రైతులు ఆదాయం కోల్పోతారు. వడదెబ్బ కారణంగా కోళ్లు చనిపోయి పౌల్ట్రీ రంగంలో నష్టాలు పెరుగుతాయి. వాతావరణకాలాలు మారే కొద్దీ సముద్రంలో చేపల ఉత్పత్తిపైనా ప్రభావం పడుతుంది. కరువు, వరదల వల్ల ఉద్యాన పంటలైన పళ్లు, కూరగాయల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లనుంది. కోస్తా, తీరప్రాంతాల్లో సముద్రమట్టం పెరగడం, తుఫాన్లు, పెనుతుఫాన్ల వల్ల ఉప్పునీరు సారవంతమైన భూముల్లోకి వచ్చి చౌడు నేలలుగా మారుస్తోంది. పంటలకు వచ్చే చీడపీడల బాధ అంతకంతకు పెరుగుతుంది. చిరుధాన్యాలు, నూనె గింజలు, పప్పుదినుసుల దిగుబడి గణనీయంగా తగ్గనుంది. చిరుధాన్యాల కొరత 2025 నాటికి 33%, 2050 నాటికి 43 శాతానికి పెరగనుంది. పప్పుధాన్యాల కొరత 7శాతానికి పెరగనుంది. 2050 నాటికి దేశంలో సగటున ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీల వరకు పెరుగుతాయి. 2020 నాటికి అనేక పంటల ఉత్పాదకత స్వల్పంగా తగ్గుతుంది. 2100 నాటికి 10 నుంచి 40 శాతానికి తగ్గుతుంది. పదేళ్లలో మరిన్ని మార్పులు గత పదేళ్లలో వాతావరణంలో పెనుమార్పులు సంభవించాయి. ప్రతీ ఏడాదీ మార్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. సాధారణం కంటే కనీసం మూడు, నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెలలో వడగాడ్పుల దినాలు మరింతగా పెరిగే అవకాశముంది. వాతావరణంలో వేడి పెరగడం వల్లే గాలివానలు, వడగండ్లు పెరుగుతున్నాయి. సీజన్లలో మార్పులు వస్తున్నాయి. అయితే ఏమేరకు వచ్చాయన్న దానిపై పరిశీలించాలంటే వందల ఏళ్ల వాతావరణ మార్పులను అధ్యయనం చేయాల్సి ఉంటుంది. – వైకే రెడ్డి, డైరెక్టర్, హైదరాబాద్ వాతావరణ కేంద్రం -
చెమటలు కక్కి..
ఎండలు మండిపోతున్నాయి.. భూమి సెగలు కక్కుతోంది. కాలు కింద పెడితే భగ్గుమంటోంది. పార పట్టుకుంటే బొబ్బలొస్తున్నాయి..కాసింత సేపు సేదదీరుదామంటే నీడకూడా కరువు..దాహమేసినా ఇంటినుంచి తెచ్చుకున్న నీళ్లే గతి. మజ్జిగ చుక్కకూ మంగళం పాడారు. ఎండకు కళ్లు తిరిగినా.. చిన్న గాయమైనా మందులు అందుబాటులో లేక ఆస్పత్రికి పరుగు తీయాల్సిన పరిస్థితి. అయినా నాలుగు వేళ్లు నోట్లో వెళ్లేందుకు నిరుపేదలంతా ‘ఉపాధి’ బాట పట్టారు. కనీస సౌకర్యాలు లేకపోయినా రక్తాన్ని స్వేదంగా మార్చి బతుకుపోరు సాగిస్తున్నారు. కనీస సౌకర్యాల కోసం కేంద్రమే డబ్బులిస్తున్నా.. అవన్నీ దిగమింగుతున్న సిబ్బంది ‘ఉపాధి’ కూలీలకు నరకం చూపుతున్నారు. అనంతపురం టౌన్ : రోజురోజుకూ భానుడు మండిపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 డిగ్రీల పైనే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. స్థానికంగా వ్యవసాయ పనులేవీ లేవు. దీంతో నిరుపేదలంతా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. అయితే పనులు చేసే చోట వసతులు కల్పించాల్సిన అధికార యంత్రాంగం తమకు పట్టనట్లు వ్యవహరిస్తోంది. దీంతో కూలీలు పనుల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్‌కార్డులు జిల్లాలో 7,85,227 లక్షలు ఉండగా.. 18.23 లక్షల మంది ఉపాధి కూలీలు పనులు చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కూలీలు పని చేస్తున్న ప్రదేశాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లా ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో కూలీలు ఎండల్లో పనిచేసేందుకు భయపడుతున్నారు. నీడలేదు...మందులు కరువు ఉపాధి పనులు చేసే ప్రదేశంలో ఎక్కడా టెంట్లు లేవు.. ఎండలోనే ఉపాధి కూలీలు పనులు చేస్తూ ఎండవేడిమికి తాళలేక అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటలకే భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉపాధి కూలీలకు విధిగా మజ్జిగ, నీటి సౌకర్యం కల్పించాల్సి ఉన్నా...అధికారులు ఆ మేరకు చర్యలు తీసుకోవడం లేదు. ఉపాధి కూలీలకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉన్నా... అవి మాత్రం పని ప్రదేశంలో ఎక్కడ కనిపించడంలేదు. కొన్ని ప్రాంతాల్లో మూడేళ్ల క్రితం అందజేసిన మెడికల్ బాక్సులనే వినియోగిస్తున్నారు. వీటిలో ఒక్క అయోడిన్ మినహా అన్ని కాలం చెల్లడంతో ఎక్కడ కూడా ప్రథమ చికిత్సా బాక్సులను వినియోగించడం లేదు. రోజురోజుకూ పడిపోతున్న హాజరు శాతం భానుడి భగభగ మంటున్నా...అధికారులు ఉపాధి కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. దీంతో ఉపాధి కూలీలు పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలోనే రోజుకు లక్ష మందికి పైగా ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ..హాజరు శాతం దారుణంగా పడిపోయింది. వసతులు కల్పించకుంటే చర్యలు : జ్యోతిబసు, డ్వామా పీడీ పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు అన్ని రకాల వసతులు కల్పించాలి. విధిగా టెంట్లను ఏర్పాటు చేయడంతోపాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి. క్షేత్రస్థాయిలో నీడ కల్పించే దిశగా ఏపీఓలు చొరవ చూపాలి. కూలీలకు వసతులు కల్పించకుంటే చర్యలు తీసుకుంటాం. -
‘అప్పు’ముప్పురంబు.. తిరగకపోతే టార్చర్ ఉండు..
రాజమహేంద్రవరం నగరంలో అప్పుల అప్పారావు అంటే ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. ఎందుకంటే ఆయన అంతగా ఫేమస్.. ఇంతకీ ఆయన ఎవరనేగా మీ ఆత్రుత.. కంగారు పడకండి.. ఇంకెవరు మన స్థానిక ప్రజాప్రతినిధే. ఓ పార్టీలో గెలిచి మరో పార్టీ గూట్లోకి వెళ్లి పబ్బం గడుపుకుంటున్న ఆ నేత రాజమహేంద్రవాసులను ఎవరినడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఒక్కసారి ఈయన వద్ద అప్పు తీసుకున్న ఏ రాజకీయనాయకుడైనా ఆయన చుట్టూ తిరగాల్సిందే. అదేంటీ? అప్పు తీసుకున్న వాడు తప్పించుకు తిరుగుతాడు గానీ, ఈయన చుట్టూ తిరగడమేంటనేగా మీ డౌటు.. ఆ సందేహం కూడా తీరుతుంది ముందు మీరు పూర్తిగా చదవండి... సాక్షి ప్రతినిధి, కాకినాడ : చోటా రాజకీయ నాయకులు అడిగిన వెంటనే అప్పు ఇచ్చే సామర్థ్యం ఆయనకు ఉంది. లక్షల్లో అప్పులు పొందే నాయకులను అప్పు కట్టాలని అడిగే ప్రయత్నం చేయడు ఆ అప్పుల అప్పారావు. ఇక్కడే తిరకాసు ఉంది. అప్పు తీసుకున్న ఏ చోటా నాయకుడైనా ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉండాల్సిందే. అప్పారావు పార్టీ మారితే అతడితో పాటు పార్టీ మారాల్సిందే. ఒకవేళ పార్టీ మారేందుకు ఇష్టం చూపనివారు, తనవెంట పార్టీ మారని వారికి వెంటనే మొదలవుతుంది టార్చర్. తన బాకీ అణాపైసలతో చెల్లించి నీ ఇష్టం వచ్చినట్లు వెళ్లిపోవచ్చని హుకుం జారీ చేస్తారు. ఈ బాధ భరించలేక అప్పులు తీర్చే సత్తా లేక.. చోటా నాయకులు ఆయన వెంట పార్టీ మారక తప్పదు. ఇలా మాజీ కార్పొరేటర్లు, పలు బ్యాంక్‌ల మాజీ డైరెక్టర్లు ఇష్టం లేకపోయినా పార్టీ మారి వెళ్లిన వాళ్లున్నారు. ఇప్పుడు ఆయన కోడలు ఎన్నికల బరిలో ఉన్నారు. అప్పులు తీసుకున్నోళ్లందరూ ఓటు వేయాలని పట్టుబడుతున్నారు. లేదంటే నయా పైసా వదలకుండా కట్టాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో తమకు అనుకూలంగా పనిచేస్తే అప్పు మాఫీ చేస్తానని కూడా అంటున్నారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. హాట్‌పోట్లు ఎదుర్కొని.. అమలాపురం: పోలింగ్ తేదీ దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు ప్రచారం జోరును పెంచారు. మరింత ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే వారి ప్రచారంపై భానుడు తీవ్ర ప్రతాపాన్ని చూపుతున్నాడు. నడినెత్తిన నిప్పులు కురిపిస్తుండడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు, ద్వితీయశ్రేణి నేతలు, వారి మద్దతుదారులు చెమటలు కక్కుతున్నారు. జిల్లా వ్యాప్తంగా గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆది, సోమవారం ఎండతీవ్రత మరింత పెరిగింది. మిట్టమధ్యాహ్నం గరిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగాయి. ఏజెన్సీలోని చింతూరులో జిల్లాలోనే అత్యధికంగా 41 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత, 25 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తరువాత రాజమహేంద్రవరం 39 డిగ్రీలు గరిష్ఠంగా, 24 కనిష్ఠంగాను, కాకినాడ గరిష్ఠంగా 37, కనిష్ఠంగా 25, అమలాపురం గరిష్ఠంగా 36, కనిష్ఠంగా 24, ఏజెన్సీ డివిజన్ కేంద్రమైన రంపచోడవరంలో గరిష్ఠంగా 32, కనిష్ఠంగా 23, చివరకు జిల్లాలో అత్యంత చల్లని ప్రాంతమైన మారేడుమిల్లిలో సైతం గరిష్ఠంగా 31, కనిష్ఠంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిట్టమధ్యాహ్నం పెరిగిన ఉష్ణోగ్రతలు ఎన్నికల ప్రచారానికి తీవ్ర అవాంతరాన్ని సృష్టిస్తోంది. ఎండవేడి తాళ్లలేని అభ్యర్థులు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ప్రచారాన్ని నిలిపివేస్తున్నారు. ప్రచారానికి వస్తున్న పార్టీ కార్యకర్తలు, అద్దె కార్యకర్తలు సైతం ఇంటింటా తిరిగి ప్రచారం చేయడానికి ఆపసోపాలు పడుతున్నారు. -
సమ్మర్ మాస్క్
సాక్షి సిటీబ్యూరో: భానుడు భగ్గుమంటున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండ నుంచి రక్షణ పొందేందుకు సిటీజనులు వివిధ ఉపశమన మార్గాలను ఎంచుకుంటున్నారు. గతంలో అందరూ ముఖానికి రుమాళ్లు కట్టుకునేవారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చాయి. కొంతకాలంగా సమ్మర్ మాస్క్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. యువతీ యువకులకు వేర్వేరుగా ప్రత్యేకమైన మాస్క్‌లు మార్కెట్లోకి వచ్చాయి. ఎండ నుంచి రక్షణ పొందడానికి వీరు మాస్క్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యాపారులు పేర్కొంటున్నారు. ‘ప్రతిఏటా సరికొత్త మాస్క్‌లను తయారు చేయిస్తాం. ఈసారి కూడా ట్రెండ్‌కు అనుగుణంగా విభిన్నంగా ఉత్పత్తులు తయారు చేయించాం. ఇప్పటి వరకు మహిళలు చున్నీతో ముఖాన్ని కవర్ చేసుకునేవారు. అయితే అంతా కంఫర్టబుల్‌గా లేకపోవడంతో.. వారికోసం ప్రత్యేకంగా మాస్క్‌లను తయారు చేయించామ’ని మదీనా సర్కిల్లోని మహ్మద్ క్యాప్మార్ట్ నిర్వాహకులు ఇల్యాస్ బుఖారీ తెలిపారు. ఈ కొత్త మాస్క్ లైట్‌వెయిట్‌తో పాటు వందశాతం కాటన్‌తో తయారైందని చెప్పారు. -
మండుతున్న కొండ
తిరుమల: భానుడి ప్రతాపంతో జనాలు విలవిలలాడుతున్నారు. తిరుపతిలో సుమారు నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక తిరుమలలో మునుపెన్నడూ లేని విధంగా సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఈ సీజన్లో బుధవారం 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శేషాచలంకొండల్లోనూ వడగాడ్పులు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. దీంతో శ్రీవారి భక్తులు అవస్థలు పడుతున్నారు. ఆలయానికి వెళ్లిన భక్తులు ఎండలో నడిచేందుకు కష్టాలు పడుతున్నారు. గుడ్డిలో మెల్లగా టీటీడీ చేపట్టిన చర్యలు భక్తులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. వేసవిని తట్టుకునేలా... తిరుమల నాలుగు మాడ వీధుల్లో పాదరక్షలు నిషేధం. దీంతో భక్తులు భానుడి తాపం తట్టుకునేందుకు వీలుగా చలువ పెయింట్స్, నీరు ఎప్పటికప్పుడు చల్లుతూ కొంతవరకు ఉపశమనం ఇస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేసవికి తగ్గట్టుగానే ఉపశమన చర్యలు చేపట్టారు. నాలుగు మాడ వీధుల్లో వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద తాగునీటితో పాటు పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లను సిద్ధం చేశారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా భక్తులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు చేపట్టారు. -
తాడిమర్రి @ 40
అనంతపురం అగ్రికల్చర్: చలికాలం పూర్తి కాకుండానే భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కనిపించాల్సిన పరిస్థితి ఫిబ్రవరిలోనే కనిపిస్తోంది. వేసవి రాక మునుపే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదువుతున్నాయి. తాడిమర్రిలో గురువారం అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అగళిలో 14.8 డిగ్రీల కనిష్టం ఉండగా.. మిగతా మండలాల్లో 16 నుంచి 22 డిగ్రీల మధ్య కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 72 నుంచి 78, మధ్యాహ్నం 22 నుంచి 34 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది వేసవితాపం తారస్థాయిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
మండుతున్న భానుడు!
శ్రీకాకుళం, ఆమదాలవలస: వేసవి పూర్తిగా రాకముందే భానుడు భగభగ మండుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచి ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జనం ఆందో ళన చెందుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నా యి. మధ్యాహ్నం వేళ రోడ్లన్నీ జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండలకు కారణాన్ని ఆమదాలవలస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ జె.జగన్నాథం వివరించారు. ఈ నెల 19, 20, 21 తేదీల్లోపగటి ఉష్ణోగ్రతలు 34, 35, 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు చెప్పారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగు తూ వస్తున్నాయన్నా రు. రాత్రి వేళల్లో 14 నుంచి 16 డిగ్రీల వర కూ నమోదవుతున్నాయన్నారు. పగటిపూట ఉష్ణోగ్రత కంటే రాత్రి పూట ఉష్టోగ్రతలు సగం కంటే ఎక్కువ వ్యత్యా సం ఉందన్నారు. దీనికి ఆకాశంలో మేఘాలు లేకపోవడంతో పాటు పవనాలూ లేకపోవడమేనన్నారు. దీని కారణంగానే పొగమంచు కూడా కురుస్తోందని వివరించారు. మంచు ప్రభావం మామిడి, జీడిమామిడి పూతపై ఉంటుందన్నా రు. ఈ పరిస్థితిలో యాజమాన్యం పద్ధతుల్లో మంచు నుంచి సోకుతున్న వ్యాధులకు తగిన మందులు వినియోగించాలని రైతులకు సూచిం చారు. పొడి వాతావరణ తేమగా ఉందని.. ఉద యం 6 గంటల సమయంలో 87 శాతం ఉన్నటు వంటి తేమ సాయంత్రమయ్యేసరికి 23 శాతానికి చేరుకుంటోందన్నారు. దీనికి సముద్రం వైపు నుంచి గాలులు వీయకుండా భూభాగం నుంచి మాత్రమే గాలులు వీయడమేనన్నారు. అతి నీలలోహిత కిరణాల ప్రభావం వాస్తవంగా ఆరు నుంచి ఏడు పాయింట్లు ఉండాల్సి ఉండగా ప్రస్తు తం పది పాయింట్ల వరకు ఉంటోందని.. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. ప్రస్తుతం కాస్తున్న ఎండలో తిరిగే వారికి చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఇదే వాతావరణం మరికొద్ది రోజులు ఉంటుందన్నారు. బయటకు రాలేకపోతున్నాం వారం రోజులుగా ఎండలు మండుతున్నాయి. ఉదయం పది గంటలు దాటితే రోడ్లపైకి రాలేకపోతున్నాం. పగటిపూట ఎండ, రాత్రయ్యే సరికి చలి కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో అనా రోగ్యం పాలవుతున్నాం. – పొన్నాడ రామారావు, ఆమదాలవలస -
తక్కువ మాట్లాడండి.. ఊపిరి ఎక్కువ తీసుకోవద్దు!
న్యూయార్క్: మాట్లాడకుండా, ఊపిరి తీసుకోకుండా ఎలా ఉంటారు? అయినా.. ఇవేం పిచ్చి సూచనలు? ..ఇవే కదా మీ అనుమానాలు! తొందరపడి అక్కడి అధికారులను తిట్టుకోవద్దు. నిజానికి ప్రజల ప్రాణాలు కాపాడేందుకే అధికారులు ఈ రకమైన సూచనలు చేశారు. అసలు విషయమేంటంటే.. చలి అమెరికాను గడ్డకట్టించేస్తోంది. మనదగ్గర ఉష్ణోగ్రతలు ఏడెనిమిది డిగ్రీలకు పడిపోతేనే గజగజా వణికిపోతున్నాం. అమెరికాలోనైతే ఏకంగా మైనస్ 50 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయట. దీంతో అమెరికా రాజధాని వాషింగ్టన్, విస్కాన్సిన్, ఇలినాయిస్, మిచిగాన్ తదితర ప్రాంతాల్లో ‘మంచు ఎమర్జెన్సీ’ని ప్రకటించారు. ఈ సందర్భంగా వాతావరణశాఖ అధికారులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. సెకన్లలోనే ఒళ్లు మొద్దుబారేలా చేసే చలివాతావరణం ఆవరించి ఉందని.. బయటకు వెళ్లేటప్పుడు పెద్దగా ఊపిరి తీసుకోవద్దని, ఇతరులతో తక్కువగా మాట్లాడాలని సూచించారు. అలాగే ఇటువంటి చలి వాతావరణంలో బయట 10 నిముషాలకు మించి ఉంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు. రానున్న రెండుమూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశముందని చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఒకవేళ వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
కప్పేసిన పొగ మంచు.. 16 రైళ్లు ఆలస్యం
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది. చలితీవ్రత పెరగడంతో దేశ రాజధాని ఢిల్లీలో దట్టమైన పొగ మంచు అలుముకుంది. దీంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. పొగ మంచు కారణంగా 16 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. పొగమంచు కారణంగా విమాన సర్వీసులకు కూడా తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఒకవైపు చలి, మరోవైపు ఆలస్యం కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక రహదారులపై కూడా పొగమంచు ఏర్పడడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల హెడ్లైట్లు వేసుకున్నా ప్రయాణించలేని పరిస్థితి ఏర్పడింది. ఉదయం బయటకు రావాలంటే స్థానికులు జంకుతున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లమీదకు రావడం లేదు. -
వణుకుతున్న రాష్ట్రం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం వణికిపోతున్నారు. గత 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా భీంపూర్ మండలం అర్లి–టీలో ఏకంగా 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఈ సీజన్లో ఇదే మొదటిసారి. అలాగే కొమురంభీం జిల్లా తిర్యాని మండలం గిన్నధరి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 సెంటీమీటర్ల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ సహా ఆ జిల్లాలోని రాంనగర్, కొమురంభీం జిల్లా లింగాపూర్, సంగారెడ్డి జిల్లా అలగోల్లో 4 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఆరేడు డిగ్రీల వరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు తగ్గాయి. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో తీవ్రమైన చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, మెదక్, వరంగల్ రూరల్ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలుల తీవ్రత ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 2 నుంచి 5 వరకు వరకు ఆయా జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని, చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. -
గజ..గజ..గజ
9 డిగ్రీల కనిష్టస్థాయికి ఉష్ణోగ్రతలు l వణుకుతున్న జనం ∙పడిపోయిన పగటìజగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్ చలి తీవ్రత రోజు..రోజుకు పెరిగిపోతోంది. రాత్రి వేళనే కాదు.. పగటి ఉష్ణోగ్రతలు సైతం పడిపోతున్నాయి. రాత్రి వేళనైతే కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోయాయి. వారం రోజులుగా చలి తీవ్రత పెరగడంతో ఉదయం పది దాటందే జనం బయటకు రావడం లేదు. సాయంత్రం ఐదు గంటలు అయ్యిందంటే ఇళ్లకు చేరుకుంటున్నారు. 6 నుంచి 8 కి.మీ వేగంతో చలిగాలులు గంటకు 6 నుంచి 8 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈ గాలులు జనవరి 2 వరకు ఉండే అవకాశం ఉంది. గరిష్ట(పగటి) ఉష్ణోగ్రతలు 27–29 డిగ్రీల సెల్సియస్ వద్ద, కనిష్ట(రాత్రి) ఉష్ణోగ్రతలు 11–12 డిగ్రీల సెల్సియస్ వద్ద కదలాడుతున్నాయి. గాలిలో తేమశాతం పెరిగింది, ఉదయం 50–62 శాతం, మధ్యాహ్నం 25–35 శాతంగా నమోదవుతున్నాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా జిల్లా ప్రజానీకాన్ని అప్రమత్తం చేయాలని కలెక్టర్ శరత్ వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. చలి ప్రభావంతో స్వెట్టర్లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. ఒక్కో స్వెట్లర్ మొన్నటి వరకు రూ.300 నుంచి రూ.350 ఉండగా, ప్రస్తుతం రూ.400కు విక్రయిస్తున్నారు. చలితో వరినారుకు కష్టం రెండు రోజుల పాటు చలి ప్రభావం ఎక్కువగా ఉండడంతో వరినారుకు ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త ఉమారెడ్డి తెలిపారు. ఇందుకోసం వరి నారు మడిలో రాత్రి వేళలో నీరు తీసి ఉదయాన్నే నీరు పెట్టాలని కోరారు. వరినారుపై రాత్రి వేళల్లో కవర్లు కప్పి, ఉదయం తీసివేస్తే చలి ప్రభావానికి గురికాకుండా ఉంటుందన్నారు. చలిపై అప్రమత్తం చలితీవ్రత నుంచి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలన్న కలెక్టర్ శరత్ ఆదేశాలతో వైద్యశాఖ కదిలింది. చలి వల్ల కలిగే నష్టాల గురిం చి అవగాహన కల్పించేందుకు వైద్యాధికారులు ప్రణాళికలు తయారు చేశారు. డీఎంహెచ్‌వో శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రజా ఆరోగ్య రక్షణలో భాగం గా చర్యలు చేపట్టారు. చలికాలంలో వచ్చే అనారోగ్య సమస్యలు, నివారణ చర్యలు, పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు. వచ్చే వ్యాధులు జలుబు, ఆయాసం, ఆస్తమ, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండడం, పిల్లికూతలు, జ్వరం, దగ్గు, ఒల్లునొప్పులు, కళ్ల నుంచి నీరుకారడం, చెవినొప్పి, చెవి నుంచి చీము కారడం, చర్మం పొడిబారడం, డొక్కలు ఎగురవేయడం వంటి సమస్యలు వస్తాయి. చలి నుంచి ఇలా కాపాడుకోవాలి మంచు పడుతున్న సమయంలో బయటకు పోరాదు. స్వెట్టర్లు, మఫ్లర్లు ధరించాలి. చెవులలోకి గాలి వెళ్లకుండా వస్త్రధారణ చేసుకోవాలి. వేడి ఆహారపదార్థాలు తీసుకోవాలి. గోరువెచ్చని నీరు తాగాలి. చర్మం పొడిబారకుండా ఏదైన లేపనం, కొబ్బరినూనె, వ్యాజిలెన్ రాసుకోవాలి. చిన్నపిల్లలకు శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోకుండా ఉన్ని దుస్తులు వేయాలి. గర్భిణులు చాలా జాగ్రత్తగా ఉండాలి. -
దేశవ్యాప్తంగా తగ్గిన ఉష్ణోగ్రతలు..
-
చలి చంపేస్తోంది!
న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: చలి గజగజ వణికిస్తోంది. తెలుగు రాష్ట్రాలతోసహా దేశ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణంకంటే తక్కువకి పడిపోయాయి. సాధారణంగా శీతాకాలంలో ఉత్తరాది నుంచి మధ్య భారతం మీదుగా తెలంగాణ నుంచి ఒడిశా వరకు చలిగాలులు బలంగా వీస్తాయి. తెలంగాణ, ఏపీలలో పొడి వాతావరణం ఉండటం వల్ల ఆ గాలుల ప్రభావం తీవ్రంగా ఉండి ఉష్ణోగ్రతలు పడిపోతాయి. ముఖ్యంగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రతి ఏడాది ఇలా నాలుగైదుసార్లు జరుగుతుం ది. గతవారంలో పెథాయ్ తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తే, ఇప్పుడు ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి దుప్పట్లో ఉత్తర భారతం ఉత్తరభారతం చలి గుప్పిట్లో చిక్కుకుంది. పంజాబ్, హరియాణా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ తదితర రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. పలు ఉత్తరాది రాష్ట్రాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఒకట్రెండు రోజుల్లో రెండు డిగ్రీలకు పడిపోయే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గడ్డకట్టిన దాల్ సరస్సు చలితో జమ్ము కశ్మీర్ వాసులు గజగజలాడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 11 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 6.8 డిగ్రీలకు పడిపోయాయి. ఫలితంగా ప్రఖ్యాత దాల్ సరస్సులో కొంత భాగం గడ్డ కట్టింది. వాటర్ పైపులలో కూడా నీరు గడ్డ కట్టేయడంతో ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. ఇలా సరస్సులు కూడా గడ్డ కట్టేయడం గత పదకొండేళ్లలో ఇప్పుడే జరిగింది. ఇక కార్గిల్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెల్సియల్ నమోదైంది. తెలంగాణలో పొడి వాతావరణం ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. అలాగే ఆగ్నేయ బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం ప్రాంతాలలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం వచ్చే రెండ్రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు తెలిపారు. దీనివల్ల ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలలో వచ్చే రెండ్రోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. వణుకుతున్న హైదరాబాద్ వేగంగా పడిపోతున్న కనిష్ట ఉష్ణోగ్రతలతో హైదరాబాద్ గజగజలాడుతోంది. మంగళవారం కనిష్టంగా 16.3 డిగ్రీలు, గరిష్టంగా 31.5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాధారణంకంటే 2–3 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలితీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాగల మూడురోజుల్లో నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకు చేరుకునే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. గాలిలో తేమ శాతం కూడా 44 శాతానికి తగ్గడంతో చలితీవ్రత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉదయం, రాత్రి వేళల్లో వీస్తోన్న శీతలగాలులు వృద్ధులు, రోగులు, చిన్నారులను గజగజలాడిస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ‘సాక్షి’కి తెలిపారు. -
వణుకుతున్న ఇందూరు
ఇందూరు (నిజామాబాద్ అర్బన్): చలి పులి పంజా విసురుతోంది. ఐదు రోజులుగా జిల్లాలో మారుతున్న వాతావరణంతో అక్కడక్కడా వర్షాలు కురుస్తుండగా, చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. మంచు వాతావరణం ఏర్పడి రోజంతా చలి గాలులు వీస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా చలి గాలుల తీవ్రత పెరిగి జిల్లా వాసులను ఇబ్బందులు పెడుతున్నాయి. దీంతో జనం బయటకు రావాలంటేనే జంకుతున్నారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు కొలిచిన ఉష్ణోగ్రతను చూస్తే 17.5 డిగ్రీలు నమోదైంది. ఒక్క రోజు వ్యత్యాసంలోనే ఏకంగా ఒకటిన్నర డిగ్రీలు పడిపోయింది. ముఖ్యంగా పెరుగుతున్న చలి తీవ్రతకు చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యం భారిన పడుతున్నారు. పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరాలకు గురికావడంతో ఆస్పత్రులకు తాకిడి పెరిగింది. స్వెట్టర్లు వినియోగించినా అవి చలి నుంచి స్వల్వంగానే రక్షిస్తున్నాయి. రాత్రుల్లో నిద్రపోయే సమయంలో దుప్పట్లు ఒకటికి రెండు వినియోగించాల్సి పరిస్థితి ఏర్పడింది. ఫ్యాన్లకు ఏ మాత్రం పని చెప్పడం లేదు. ఇటు పనులపై, ఉద్యోగ రీత్యా ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు ముఖాలకు మాస్క్‌లు, చేతులకు గ్లౌజ్‌లు ధరించి అన్ని జాగ్రత చర్యలు తీసుకుంటున్నారు. స్కూల్‌కు వెళ్లే చిన్న పిల్లలు ఇబ్బందులు పడుతూ వెళ్తున్నారు. -
చలిస్తున్న విశాఖ
సాక్షి, విశాఖపట్నం: విశాఖపై చలి పంజా విసురుతోంది. రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోంది. వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. రాష్ట్రంలో కెల్లా విశాఖలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం విశేషం. గడచిన వారం రోజులను పరిశీలిస్తే రాత్రి ఉష్ణోగ్రతలు ఏడు డిగ్రీలు తక్కువకు పడిపోయాయి. ఈ నెల 19న నగరంలో కనిష్ట ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలు నమోదు కాగా సోమవారం 16 డిగ్రీలకు పడిపోయింది. ఇది సాధారణంకంటే ఐదు డిగ్రీలు తక్కువ. మరోవైపు విశాఖ ఏజెన్సీలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. లంబసింగిలో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
గ్రేటర్లో పెరిగిన ఉక్కపోత..!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల ప్రభావం తగ్గడంతో గత 2 రోజులుగా గ్రేటర్ పరిధిలో పగటి ఉష్ణోగ్రతలతోపాటు ఉక్కపోత పెరగడంతో సిటీజన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదవుతోన్న ఉష్ణోగ్రతలతోపాటు గాలిలో తేమ శాతం 67 నుంచి 52 శాతానికి తగ్గడంతో ఉక్కపోత, పొడి వాతావరణంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోందని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. మరో 5 రోజులు నగరంలో ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని.. అక్కడక్కడా తేలికపాటి జల్లులు మాత్రమే కురిసే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అసాధారణమేమీ కాదని.. ఈ సీజన్లో రుతుపవనాల ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టడం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడకపోవడం వంటివే దీనికి కారణమని విశ్లేషించారు. సోమవారం నగరంలో గరిష్టంగా 33.2 డిగ్రీలు, కనిష్టంగా 23.9 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాగల 24 గంటల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప హెచ్చుతగ్గులుంటాయని వాతావరణ శాఖ తెలిపింది. -
మండుతున్న సూరీడు
ఐరోపాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు.స్వీడన్లో కార్చిచ్చులు వ్యాపిస్తున్నాయి. జపాన్‌లో ఎండల ధాటికి జనం ప్రాణాలు కోల్పోతూ ఉంటే.. అమెరికన్లూ ఉక్కబోత తట్టుకోలేకపోతున్నారు. ఇక సౌదీ అరేబియా గురించి ప్రత్యేకంగా చెప్పనే అక్కర్లేదు ఆ దేశం,ఈ దేశం అని కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు భానుడి ప్రతాపానికి అల్లాడిపోతున్నాయి. 2018 సంవత్సరం ఎండల్లో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఎందుకీ ఎండలు ? ఈ ఏడాదే ఎందుకింత మంటలు ? ఎండలు మండిపోయేందుకు పలు కారణాలున్నాయని రీడింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫసర్ లెన్ షాఫ్రే అంటున్నారు. వాతావరణంలో గాలి పీడనం ఎక్కువగా ఉన్నప్పుడు ఉష్ణోగ్రతలు పెరగడం సహజం. బలంగా వీచే గాలుల కారణంగా కొద్దికాలంలోనే పీడనం తగ్గిపోయి వాతావరణం చల్లబడుతూంటుంది. అయితే ఈ ఏడాది గాలులు చాలా మందగమనంతో వీస్తూండటం వల్ల అధిక పీడన పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగాయి. ఫలితంగా బ్రిటన్ తదితర దేశాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడం లేదు. గాలులు ఎంత వేగంతో వీస్తాయన్నది ఉత్తరార్ధ, దక్షిణార్ధ గోళాల్లోని ఉష్ణోగ్రతల మధ్య ఉన్న తేడాపై ఆధారపడి ఉంటుంది. వేగం తక్కువగా ఉండటంతో ఈ ఏడాది దక్షిణార్ధ గోళం నుంచి బయలుదేరిన గాలులు యూరోపియన్ దేశాలకు చేరేందుకు ఎక్కువ కాలం పడుతోంది. అంతేకాకుండా దిశకూడా మార్చుకోవడంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. భూతాపోన్నతీ కారణమే.. పెట్రోలు, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకం వల్ల భూమి క్రమేపీ వేడెక్కుతోందని మనకు తెలుసు. కొన్నిదేశాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండేందుకు ఈ భూతాపోన్నతి కూడా కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉత్తర అట్లాంటిక్ సముద్ర ఉపరితలంపై వస్తున్న అనూహ్య మార్పుల కారణంగా బ్రిటన్, ఐర్లండ్ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫసిఫిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగిన కారణంగా ఏర్పడే ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి లానినో పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఈ ఏడాది ఏప్రిల్ వచ్చేసరికి లానినో బలహీనమై ఎల్‌నినో పరిస్థితులు వచ్చేశాయి. దీంతో బ్రిటన్‌లో పొడి వాతావరణం నెలకొని ఉక్కబోత భరించలేని స్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ప్రపంచంలో 1976 సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా రికార్డులకెక్కింది. ఈ ఏడాది వివిధ దేశాల్లో ఇదే పరిస్థితి కొనసాగితే ఆ నాటి పరిస్థితే మళ్లీ పునరావతమవుతుందని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూకేలో 400 ఏళ్ల రికార్డులు బద్దలు ఇంగ్లండ్‌లో ఎండలు ఏ స్థాయికి చేరుకున్నాయంటే గత నాలుగు వందల ఏళ్ల రికార్డులు బద్దలైపోయాయి. 1600 సంవత్సరం తర్వాత ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకు చేరుకోవడం ఈ ఏడాదే.. ఎప్పుడూ 20 నుంచి 25 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఇంగ్లండ్‌లో ఈ వారం ఏకంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై జనాల్ని బెంబేలెత్తిస్తోంది. స్వీడన్లో ఈ శతాబ్దంలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదై కార్చిచ్చులు చెలరేగుతున్నాయి. గత కొన్ని రోజులుగా స్వీడన్లో ఉత్తరాన ఉన్న లాప్‌ల్యాండ్ నుంచి దక్షిణాదిన ఉన్న గోటాల్యాండ్ వరకు 44 ప్రాంతాల్లో అడవులు దగ్ధమవుతున్నాయి. అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో రికార్డు స్థాయిలో 38 డిగ్రీల సెల్సియస్ నమోదైతే సౌదీ అరేబియాలో 46 డిగ్రీలు దాటి పోయాయి. జపాన్‌లో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోవడంతో ఎండ వేడికి తట్టుకోలేక ప్రజలు ప్రాణాలే కోల్పోతున్నారు. గత వారంలోనే 65 మంది మరణిస్తే, మరో 22 వేల మంది వడదెబ్బ తగిలి ఆస్పత్రి పాలయ్యారు. దీంతో ఆ దేశం ఎండల్ని ఒక ప్రకృతి వైపరీత్యంగా ప్రకటించింది.. ప్రపంచ దేశాల్లో ఈ ఎండల తీవ్రత ఆగస్టు నెలాఖరువరకు కొనసాగే అవకాశాలున్నాయని గ్లోబల్ ఫోర్కాస్ట్ సిస్టమ్, నేషనల్ ఓషన్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్లు అంచనా వేస్తున్నాయి. -
తీర ప్రాంతాలకు వాతావరణ కేంద్రం హెచ్చరిక
సాక్షి, విశాఖపట్నం: కోస్తా తీర ప్రాంతాలలో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నేడు కోస్తా తీరంలో వేడి గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ కోస్తాలో 40 నుంచి 45 డిగ్రీలు, ఉత్తర కోస్తాలో 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదయ్యె అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. -
దంచికొట్టిన ఎండలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్‌లలో 40 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి. హైదరాబాద్‌లో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వడదెబ్బకు నలుగురు మృతి వడదెబ్బతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్‌లో ఐదుగురు మృతిచెందారు. మంచిర్యాల దండెపల్లి మండలం తాళ్లపేటకు చెందిన ఖమ్రొద్దీన్ (46), నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన కుంచెపు నడి పన్న (47), మామడ మండలం కమల్పూర్ గ్రామానికి చెందిన గనిమెన సా యన్న (60) వడదెబ్బతో మృతిచెందారు. ఖానాపూర్ మండలం రాజూరా గ్రా మానికి చెందిన మేకల కాపరి చిలివేరి వెంకట్రాములు(40) వడదెబ్బతో సోమ వారం రాత్రి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) గ్రామానికి చెందిన బానోత్ గోబ్రియా(50) మంగళవారం వడ దెబ్బతో మరణించాడు. అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో వర్షం కురువడంతో శనగ పంటకు స్వల్పంగా నష్టం చేకూరింది. వివిధ పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పట్టణం గరిష్టం రామగుండం 42 ఆదిలాబాద్ 42 నిజామాబాద్ 42 భద్రాచలం 41.6 మెదక్ 40.5 మహబూబ్‌నగర్ 40.2 ఖమ్మం 40 హన్మకొండ 39.5 హైదరాబాద్ 39.4 నల్లగొండ 39.2 ఏపీలో రెంటచింతల 43.6 విజయవాడ 39.5 తిరుపతి 39 విశాఖపట్నం 37 -
మన సిటీ చాలా సెన్సిటివ్..!
సాక్షి, హైదరాబాద్ : ఎండాకాలం ఇంకా పూర్తిగా మొదలుకానేలేదు.. అప్పుడే ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలో మార్చి ప్రారంభం నుంచే పగటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. మానవ శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు(98.6 ఫారిన్‌హీట్స్). అదే స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలనూ నగరవాసులు తట్టుకోలేకపోతున్నారు. దీనికి తోడు కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో రేడియేషన్ సూచీ పది పాయింట్ల మేర నమోదవుతోంది. ఉక్కపోత, వేసవితాపాన్ని తట్టుకునేందుకు ఏసీ లు, కూలర్లు, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్ల వినియోగం కొద్దిరోజులుగా విపరీతంగా పెరిగింది. దీంతో సిటీలో విద్యుత్ వినియోగం అనుహ్య స్థాయికి చేరింది. సాధారణంగా సాయంత్రం పీక్ అవర్(ఆరు నుంచి పది గంటలు)లో మాత్రమే కనిపించే విద్యుత్ వినియోగం గత కొద్ది రోజులు గా అర్ధరాత్రి తర్వాత కూడా రికార్డ్ స్థాయిలో నమోదవుతోంది. సాధారణ రోజుల్లో రాత్రిపూట విద్యుత్ వినియోగం 800 మెగావాట్లు ఉండగా, ప్రస్తుతం రాత్రి పూట 1,200 మెగావాట్లకు పైగా విద్యుత్ వినియోగం నమోదు అవుతుండటం గమనార్హం. గ్రేటర్ చరిత్రలో రాత్రి వేళల్లో ఇంత భారీగా విద్యుత్ వినియోగం జరగడం ఇదే ప్రథమమని డిస్కం పేర్కొంది. పెరిగిన ఏసీలు.. కూలర్లు.. ఒకప్పుడు ఏసీలు, కూలర్లు, రిఫ్రిజిరేటర్లు ధనవంతుల నివాసాల్లోనే కన్పించేవి. ప్రస్తుతం ఇవి ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణం అయ్యాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆయా కంపెనీలు.. బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుని వడ్డీ లేకుండా రుణాలు మంజూరు చేస్తున్నాయి. దీనికి తోడు గతంతో పోలిస్తే ఏసీల ధరలు కొంత తగ్గుముఖం పట్టడం, సులభ వాయిదాల పద్ధతుల్లో కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో మధ్యతరగతి వారు వీటి కొనుగోలుకు వెనకాడటం లేదు. ఇక ఐటీ, అనుబంధ సంస్థలు అర్ధరాత్రి కూడా తెరిచే ఉంటున్నాయి. ఈ సమయంలో ఏసీలు ఆన్‌లో ఉండటం వల్ల కూడా విద్యుత్ వినియోగం పెరగడానికి మరో కారణం. ఆసక్తికర అంశం ఏమిటంటే అర్ధరాత్రి తర్వాత (గది చల్లబడిన తర్వాత) బంద్ కావాల్సిన ఏసీలు.. తెల్లవార్లూ ఆన్‌లోనే ఉండటంతో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం.. గ్రేటర్ పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 42 లక్షలు గృహ, ఏడు లక్షలకుపైగా వాణిజ్య కనెక్షన్లు.. చిన్న, మధ్య, భారీ పరిశ్రమల కనెక్షన్లు మరో యాభై వేల వరకు ఉన్నాయి. పగలు నమోదైన ఉష్ణోగ్రతలు రాత్రి పొద్దుపోయిన తర్వాత కూడా చల్లబడటం లేదు. దీంతో ఏసీలను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య రెట్టింపైంది. జనవరిలో సగటు విద్యుత్ వినియోగం 34–36 మిలియన్ యూనిట్లు(ఎంయూ) ఉండగా, ప్రస్తుతం అది 54 ఎంయూలకు చేరింది. మార్చి చివరి నాటికి 60–65 ఎంయూలకు చేరుకునే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో డిమాండ్‌ను తట్టుకునేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాం. అన్ని సబ్స్టేషన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని ఇప్పటికే పెంచాం. - శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్, సీపీడీసీఎల్ -
మండుతున్న ఎండలు!
సాక్షి, మచిలీపట్నం: భానుడు ప్రతాపం చూపుతున్నాడు. మార్చి ప్రారంభంలోనే పగటి ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. మూడు రోజులుగా ఉష్ణోగ్రతల పెరుగుదల ఎక్కువగా ఉంది. రెండు రోజులుగా మచిలీపట్నంలో 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వివరాలు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 35 డిగ్రీల మేరకు నమోదయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరితో పోల్చితే ప్రస్తుతం ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే వింత పరిస్థితి ఎదురవుతోంది. రాత్రిళ్లు విపరీతమైన చలి, ఉదయం 8 గంటల వరకు పొగమంచుతో కూడిన చలి ఉంటుండగా.. ఉదయం 10 గంటలు సమిపిస్తుండగానే ఒక్కసారిగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంటోంది. వేడి గాలులు, వేడి తీవ్రత అధికమవుతోంది. వెరసి రాత్రిళ్లు చలికి వృద్ధులు వణుకుతుండగా.. ఉదయం ఎండ వేడిమి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో బట్టి చూస్తే.. జిల్లాలో వేసవి ఉపశమన చర్యలకు తక్షణం యంత్రాంగం ఉపక్రమించాల్సిన అవసం ఎంతైనా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏటా వేసవిలో వేసవిలో ఉపశమన చర్యలను కట్టుదిట్టుంగా అమలు చేయడంలో యంత్రాంగం విఫలమవుతోంది. గత ఏడాది వడదెబ్బ నుంచి ప్రజలను కాపాడటం కోసం పెద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినా క్షేత్ర స్థాయిలో మాత్రం ఇది సరిగా అమలు కాలేదు. ప్రస్తుతం అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం అన్ని గ్రామాలతో పాటు నగరాలు, పట్టణాల్లో ఎద్ద ఎత్తున చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. మార్చి ఒకటి నుంచి జూన్ 30 వరకు చలివేంద్రాలు నిర్వహించాలని సూచిస్తున్నారు. దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారాన్ని తీసుకుని చలివేంద్రాల్లో తాగునీటితో మజ్జిగ కూడా పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటే మరింత మేలు జరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మార్చి ఒకటో తేదీ నుంచి వేసవి తీవ్రత అధికమైన పరిస్థితిలో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎక్కడా కార్యాచరణ ప్రారంభం కాలేదు. వెంటాడుతున్న నిర్లక్ష్యం.. వేసవిలో ప్రజలను వడగాలులు, వేడిమి నుంచి కాపాడటంలో వైద్య, ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో మేరకు వైద్య బృందాలను ఏర్పాటు ఉంటుంది, వేసవిలో జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పనులను నిత్యం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చేపట్టవద్దన్న ఆదేశాలున్నా ఇంత వరకు కూలీలకు అమలు చేసినా దాఖలాలు లేవు. ఉపాధి కూలీలకు పని ప్రదేశంలో నీడ కోసం షామియానాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. స్థానికంగా వీరికి మజ్జిగ ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదు. ప్రతి సారీ నిధుల గోల... వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, తాగునీరు, మజ్జిగ అందజేయండి. అని ఉన్నతాధికారులు సూచిస్తున్నా మండల స్థాయిలో దీని అమలు మాత్రం అగ్యగోచరంగా మారుతోంది. నిధుల విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని మండల స్థాయి అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వీటి అమలులో వారు వెనుకంజ వేస్తున్నారు. గత ఏడాది కూడా మండలాలు, పురపాలక సంఘాలకు బాధ్యతలు అప్పజెప్పగా తూతూ మంత్రంగా నిర్వహించారు. రెండు రోజులు కేంద్రాలు పెట్టి మూడో రోజు ఎత్తేశారు. అసలే పరీక్ష కాలం.. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు జరుగుతుండగా.. త్వరలో పదో తరగతి, డిగ్రీ పరీక్షలు మొదలు కానున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలల్లో తాగునీటి సౌకర్యం కల్పించడంపై నిర్వాహకులు దృష్టి సారించాల్సి ఉంది. -
తిరుమలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
-
ఫిబ్రవరిలోనే పెరిగిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: ఫిబ్రవరి నెల ముగియకముందే రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు రెండు డిగ్రీల వరకు అధికంగా రికార్డు అయ్యాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్‌లో రెండు డిగ్రీలు ఎక్కువగా 36 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, భద్రాచలం, మెదక్, నిజామాబాద్, రామగుండంలలో 35 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రత కూడా సాధారణం కంటే ఒక డిగ్రీ చొప్పున అధికంగా నమోదవుతోంది. భద్రాచలం, ఖమ్మంలలో 21 డిగ్రీలు, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ, రామగుండంలలో 20 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడే 36–37 డిగ్రీల వరకు పగటి ఉష్ణోగ్రతలు నమోదవడంపై అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. వాస్తవంగా ఫిబ్రవరి నెలలోనూ కాస్తంత చలి వాతావరణం నెలకొని ఉంటుంది. కానీ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో ఇక అసలైన వేసవి తడాఖా ఎలా ఉంటుందా అని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
చలి సంపేత్తోంది..!
అనంతపురం : చలి సంపేత్తోంది బాబాబోయ్ అంటున్నారు జిల్లా జనం. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో చలి తీవ్రత పెరిగింది. మడకశిర మండలం ఆర్.అనంతపురంలో ఆదివారం ఉదయం 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తనకల్లులో 11.9, అగళిలో 12.5, రొద్దంలో 12.8 డిగ్రీలకు పడిపోయింది. అమడగూరు 13.1 డిగ్రీలు, సోమందేపల్లి 13.3, చిలమత్తూరు, నల్లమాడ, గుత్తిలో 13.5, కనగానపల్లి 13.7, గాండ్లపెంట 13.8, పెనుకొండ 13.9 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 14 నుంచి 17 డిగ్రీల మధ్య ఉంటోంది. పగటి ఉష్ణోగ్రతలు జిల్లా అంతటా 27 నుంచి 30 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ ఉదయం 78 నుంచి 90 శాతం మధ్య రికార్డయింది. ఈశాన్య, ఆగ్నేయ గాలులు గంటకు 6 నుంచి 10 కి.మీ. వేగంతో వీచాయి. సాయంత్రం, ఉదయం శీతలగాలులు ఇబ్బంది పెడుతున్నాయి. ఈసారి జిల్లావ్యాప్తంగా మంచి వర్షాలు పడటం, చెరువులు, కుంటల్లోకి నీరు చేరడం, పంటలు, కొండలు, అటవీ ప్రాంతం పచ్చదనం సంతరించుకోవడంతో సహజంగానే చలి పెరిగింది. తమిళనాడు, కేరళలో అల్పపీడనం, వాయుగుండాల ప్రభావంతో ఈనెల మొదట్లో వారం పది రోజులపాటు మేఘాలు ఆవరించడంతో చలి తీవ్రత అంతగా లేదు. కానీ వారం రోజులుగా వాతావరణం మారడంతో చలిపులి ప్రజలను వణికిస్తోంది. సాయంత్రం 6 నుంచి ఉదయం 8 గంటల వరకు చలి ఎక్కువగా ఉంటోంది. వేకువజామున మంచు దుప్పటి పరుచుకుంటోంది. పిల్లలు, వృద్ధులు, రోగులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే పరిస్థితి ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మడకశిర, హిందూపురం, కదిరి, కళ్యాణదుర్గం, పెనుకొండ ప్రాంతాల్లోనూ చలి ఎక్కువగానే ఉంటోంది. -
మన్యంలో మంచు దుప్పటి
సాక్షి, విశాఖ: మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. గత వారం రోజులుగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకు, పాడేరు, లంబసింగి, మినుమలూరు ప్రాంతాల్లో పది గంటలు దాటిన సూర్యుడు కనిపించకుండా తెల్లటి పొగమంచు కమ్మేసింది. శుక్రవారం రాత్రి మినమలూరులో 9 డిగ్రీలు, పాడేరులో 11 డిగ్రీలు, లంబసింగిలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఏజెన్సీలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్టణం: విశాఖ జిల్లాలోని ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతున్నాయి. లంబసింగిలో 11, చింతపల్లిలో 13 డిగ్రీల కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం పూట మొత్తం మంచుతో కప్పబడి ఉన్నట్లుగా ఉంటోంది. అంతేగాక మధ్యాహ్నం 12 గంటలు అయినా సూర్యుడు కనిపించని పరిస్థితి నెలకొంది. అయితే... అక్టోబర్ చివరి వారంలోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం విశేషం. ప్రతి ఏడాది నవంబర్ చివరి వారం, డిసెంబర్, జనవరిలో కనీస ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా ఈ ఏడాది ముందుగానే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి పులి చంపేసేటట్లుగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు. -
విత్తన భాండాగారంలో వరద బీభత్సం
నార్వే: ప్రపంచం అంతమైపోతే వ్యవసాయ ఉత్పత్తులు తర్వాత జనించే జీవికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో నిర్వహిస్తున్న విత్తన భాండాగారంలో వరద బీభత్సం సృష్టించింది. నార్వేకు చేరువలోని స్పిట్బర్గ్ మంచు ద్వీపంలో ఉన్న ఈ భాండాగారంలోకి మంచు కరిగిన నీరు వరదగా పోటెత్తింది. ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోవడంతో కరిగిన మంచునీరు ఓ టన్నెల్ ద్వారా భాండాగారంలో పోటెత్తింది. అయితే, విత్తనాలను దాచి ఉంచిన ప్రదేశంలోకి నీరు చేరలేదని తెలిసింది. భాండాగారంలో మిగిలిన ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వాస్తవానికి విత్తన వాల్ట్‌లో అన్ని పనులను కంప్యూటర్లే నిర్వర్తిస్తాయి(మనుషులు ఎవరూ అందులో ఉండరు). కానీ ఈ అనుకోని సంఘటనతో కొందరు అధికారులు అక్కడికి చేరుకుని పరిస్ధితిని పర్యవేక్షిస్తున్నారు. -
వడదెబ్బకు ముగ్గురు మృతి
ఓర్వకల్లు: రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో జిల్లాలో మరో ముగ్గురు వడదెబ్బకు గురై మృతి చెందారు. ఓర్వకల్లు గ్రామంలో స్థానిక పెండేకంటి నగర్లో నివాసముంటున్న జల్ల నాగరాజు (46) 15 సంవత్సరాల నుంచి స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో చిరు వ్యాపారం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పది రోజుల నుంచి పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా ఎండ తీవ్రతకు తట్టుకోలేక మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నాడు. శనివారం.. రోజు మాదిరిగానే మళ్లీ బస్టాండ్‌కు చేరుకుని వ్యాపారం చేస్తుండగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య సరోజమ్మ ఉన్నప్పటికీ కుటుంబ కలహాలతో వేర్వేరుగా నివసిస్తున్నారు. పది రోజుల్లో కుమారుడి పెళ్లి.. వడదెబ్బతో తండ్రి మృతి వెల్దుర్తి రూరల్: పది రోజుల్లో కుమారుడి పెళ్లి ఉండగా వడదెబ్బతో తండ్రి మృతి చెందాడు. ఈ విషాద ఘటన నర్సాపురంలో శనివారం చోటు చేసుకుంది. నర్సాపురం గ్రామ పంచాయతీ 4వ వార్డు మెంబర్ దేవనకొండ కిష్టన్న(60)కు భార్య రామలక్ష్మమ్మ, ముగ్గురు కూతుర్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల్లో కుమారుడి పెళ్లి నిశ్చయమైంది. ఓ వైపు పెండ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పొలంలో కంది కొయ్యలు పాస్తుండడంతో శనివారం కిష్టన్న ఉదయం పొలానికి వెళ్లాడు. సాయంత్రానికి ఇంటికి తిరిగి వస్తూ ఎండవేడికి అస్వస్థతకు గురై గ్రామ శివారులో పడిపోయాడు. గమనించిన గ్రామస్తులు.. కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో అతడిని కర్నూలు ప్రభుత్వాస్పుత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. ఉపాధి కూలీ మృతి పత్తికొండ రూరల్: పెద్దహుల్తి గ్రామంలో వడదెబ్బతో ఉపాధి కూలీ అయ్యన్న (62) వడదెబ్బకు గురై మృతి చెందాడు. శనివారం రోజులాగానే ఉపాధి పనులకు Ððవెళ్లి ఎండవేడిమితో అస్వస్థతకు గురై ఇంటికొచ్చాడు. కొద్ది సేపికి సొమ్మసిల్లి పడిపోవడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. మృతుడు అయ్యన్నకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
నిప్పుల వాన..రక్షణ తోవ
-
నిప్పుల కొలిమి
- ఉపశమన చర్యలు నామమాత్రమే కర్నూలు(అగ్రికల్చర్): భానుడు భయపెడుతున్నాడు..రోజు రోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నారు. తీవ్రమైన వడగాల్పులు ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. జిల్లాలో ఒక్క వడదెబ్బ మరణం కూడా ఉండరాదని 20 రోజులుగా జిల్లా యంత్రాంగం హడావుడి చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికే జిల్లాలో 10 మందికి పైగా వడదెబ్బతో మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక ఉష్ణోగ్రతులు నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండలు భగ్గుమంటున్నాయి. సాయంత్రం 5గంటల వరకు వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఎండల కారణంగా మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు ప్రధాన పట్టణాల్లో రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల వరకు ఉండేవి. ఈ సారి మార్చినెల చివరిలోనే ఉష్ణోగ్రత 42.4 డిగ్రీలకు చేరింది. ఏప్రిల్, మేనెలల్లో ఎండలు ఇంకా ఎక్కువగా ఉంటాయని ప్రజలు భయపడుతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతులు సైతం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండడతో ప్రజలు ఉక్కపోత భరించలేకపోతున్నారు. గత ఏడాది వేసవి 45 డిగ్రీల గరష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సారి అది 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వర్షాలు తగ్గడం వల్లే.. వర్షాలు పూర్తిగా తగ్గిపోవడం, చెరువులు, కుంటల్లో చుక్క నీరు లేకపోవడం, అడవులు అంతరిస్తుండటం, చల్లదనాన్ని ఇచ్చే వృక్షాలు తగ్గిపోవడం తదితర కారణాల వల్ల ఉష్ణోగ్రతలు జిల్లాలోనే ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ప్రజలు దాహార్తితో అల్లాడుతున్నారు. నోరులేని మూగజీవులకు తాగడానికి చుక్కనీరు కరువు అయింది. చర్యలు శూన్యం.. వడదెబ్బ మరణాలు పెరుగుతున్నా కర్నూలు సహా ఎక్కడ చలువ పందిళ్లు లేవు. అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థలు.. చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలో చలివేంద్రాలు, చలువ పందిళ్లు ఏర్పాటు కార్యరూపం దాల్చలేదు. లక్ష కరపత్రాలు ముద్రించడం, వేసవి జాగ్రత్తలపై ప్లెక్సీ బ్యానర్లు ఏర్పాటు చేయడం మినహా ప్రభుత్వ చర్యలు కానరావడం లేదు. బతుకుదెరువు కోసం పనులకు వెళ్లి కూలీలు వడదెబ్బకు గురవుతున్నారు. శుక్రవారం ఒక్కరోజే ఐదుగురు మృత్యవాత పడ్డారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి... ––––––––––––––––––––––––– తేదీ పగలు రాత్రి మార్చి 27 40.7 24.7 మార్చి 28 41.1 25.8 మార్చి 29 41.0 27.0 మార్చి 30 41.7 27.7 మార్చి 31 42.4 26.4 ఏప్రిల్ 1 42.0 27.6 ఏప్రిల్ 2 42.0 29.2 ––––––––––––––––––––––––