మాడవీధుల్లో కూల్ పెయింట్ వేస్తున్న సిబ్బంది
తిరుమల: భానుడి ప్రతాపంతో జనాలు విలవిలలాడుతున్నారు. తిరుపతిలో సుమారు నలభై డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇక తిరుమలలో మునుపెన్నడూ లేని విధంగా సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. ఈ సీజన్‌లో బుధవారం 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శేషాచలంకొండల్లోనూ వడగాడ్పులు, ఉక్కపోత తీవ్రమయ్యాయి. దీంతో శ్రీవారి భక్తులు అవస్థలు పడుతున్నారు. ఆలయానికి వెళ్లిన భక్తులు ఎండలో నడిచేందుకు కష్టాలు పడుతున్నారు. గుడ్డిలో మెల్లగా టీటీడీ చేపట్టిన చర్యలు భక్తులకు కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి.
వేసవిని తట్టుకునేలా...
తిరుమల నాలుగు మాడ వీధుల్లో పాదరక్షలు నిషేధం. దీంతో భక్తులు భానుడి తాపం తట్టుకునేందుకు వీలుగా చలువ పెయింట్స్, నీరు ఎప్పటికప్పుడు చల్లుతూ కొంతవరకు ఉపశమనం ఇస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వేసవికి తగ్గట్టుగానే ఉపశమన చర్యలు చేపట్టారు. నాలుగు మాడ వీధుల్లో వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద తాగునీటితో పాటు పరిసర ప్రాంతాల్లో చలువ పందిళ్లను సిద్ధం చేశారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో కూడా భక్తులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment