సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్‌లలో 40 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి. హైదరాబాద్‌లో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వడదెబ్బకు నలుగురు మృతి
వడదెబ్బతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్‌లో ఐదుగురు మృతిచెందారు. మంచిర్యాల దండెపల్లి మండలం తాళ్లపేటకు చెందిన ఖమ్రొద్దీన్ (46), నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన కుంచెపు నడి పన్న (47), మామడ మండలం కమల్‌పూర్ గ్రామానికి చెందిన గనిమెన సా యన్న (60) వడదెబ్బతో మృతిచెందారు. ఖానాపూర్ మండలం రాజూరా గ్రా మానికి చెందిన మేకల కాపరి చిలివేరి వెంకట్రాములు(40) వడదెబ్బతో సోమ వారం రాత్రి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) గ్రామానికి చెందిన బానోత్ గోబ్రియా(50) మంగళవారం వడ దెబ్బతో మరణించాడు. అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో వర్షం కురువడంతో శనగ పంటకు స్వల్పంగా నష్టం చేకూరింది.
వివిధ పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు
పట్టణం గరిష్టం
రామగుండం 42
ఆదిలాబాద్ 42
నిజామాబాద్ 42
భద్రాచలం 41.6
మెదక్ 40.5
మహబూబ్‌నగర్ 40.2
ఖమ్మం 40
హన్మకొండ 39.5
హైదరాబాద్ 39.4
నల్లగొండ 39.2
ఏపీలో
రెంటచింతల 43.6
విజయవాడ 39.5
తిరుపతి 39
విశాఖపట్నం 37
Comments
Please login to add a commentAdd a comment