summer heat
-
సమ్మర్ హీట్‌కి ఈ ఆటో డ్రైవర్ భలే చెక్ పెట్టాడు!
ఈ ఏడాది సమ్మర్ మొదలవ్వక మునుపే ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. అయినప్పటికీ ఏదో ఒక పని మీద బయటకు వెళ్లకుండా పని అవ్వదు. అలాంటి తరుణంలో ఓ ఆటో డ్రైవర్ ఎండ నుంచి రక్షణ కోసం చేసిన ఆలోచన నెటిజన్లు ఫిదా అయ్యారు. వాట్ ఐడియా బాస్ అంటూ అతడిపై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.ఏం చేశాడంటే..?మనసుంటే మార్గం ఉంటుందన్న రూటులో సరికొత్తగా ఆలోచించాడు ఈ ఆటో డ్రైవర్. ఈ ఎండలకు ఏసీ కారు లాంటివి తప్ప సాధారణ బస్సు, ఆటోల్లో ప్రయాణించడం మహా కష్టం. ముఖ్యంగా ఆటోలో ఎడపెడా వేడి గాల్పు కొట్టేస్తుంది. అందుకని ఈ డ్రైవర్ ఆటో చుట్టూతా చక్కగా కవర్ అయ్యేలా మటితో నింపిన గోను ఏర్పాటు చేసి గడ్డి నాట్లు వచ్చేలా చేశాడు.దీంతో ఆటోలో కూర్చొన్న వాళ్లకు మండే ఎండలో చల్లటి వెన్నెల్లో ఉన్న పీల్ కలుగుతుంది. ఆటోలో సహజసిద్ధమైన ఏసీ కదూ ఇది..!నిజంగా ఈ డ్రైవర్ ఆలోచనకు హ్యాట్సాప్ అని చెప్పకుండా ఉండలేం కదూ..!. మొత్తం పల్లె పచ్చదనాన్ని ఆటోతో పట్నంలోకి తీసుకొచ్చాడేమో..! అన్నంత అందంగా ఉంది కదూ ఆ డ్రైవర్ ఐడియా..! View this post on Instagram A post shared by WAHED MIRZA (@wahed_mirza8639) -
తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న ఎండలు (ఫొటోలు)
-
మీరేమో ఉదయం, సాయంత్రం ప్రచారం.. నన్ను మాత్రం మధ్యాహ్నం చేయమంటారా..
మీరేమో ఉదయం, సాయంత్రం ప్రచారం.. నన్ను మాత్రం మిట్ట మధ్యాహ్నం చేయమనడం అన్యాయం.. పొత్తు ప్రచారానికే విరుద్ధం! -
ఉపశమనం.. తెలంగాణకు నాలుగు రోజుల వర్ష సూచన!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎండలు దంచికోడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) రేపు(సోమవారం) రెండు రోజుల పాటు రాష్టానికి తీవ్రమైన ఎండలతో పాటు వడగాల్పుల హెచ్చరికలను ఐఎండీ జారీచేసింది. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు ప్రజలు బయటకు రావద్దని ఐఎండీ హెచ్చరించింది. ఇక.. వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండటంతో ఈరోజు పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులంబ గద్వాల జిల్లాలకు వడగాల్పుల నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు (సోమవారం) రాష్ట్రంలో వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు విచే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు.. ఈరోజు నుంచి రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. కాస్త ఉపశమనం.. నాలుగు రోజుల వర్ష సూచన ఇప్పటికే తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రాష్ట్ర ప్రజలకు కాస్త ఉపశమనం లభించనున్నట్లు తెలుస్తోంది. ఈరోజు(ఆదివారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఈరోజు ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షం పలు జిలాల్లో కురిసే అవకాశం ఉంది, ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచనతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ. రేపు అదిలాబాద్ కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు మెదక్ కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. -
వేసవి తాపాన్ని తగ్గించడంలో మేటి ఈ పప్పు! ఎన్ని ప్రయోజనాలంటే..
పెసరపప్పు ఆరోగ్యానికి ఎంతో మంచిది. వేసవిలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో పెసరపప్పు ఒకటి. వేడిగా ఉండే వాతావరణంలో తేలికపాటి భోజనాలు చేయాలి. పెసరపప్పుతో చేసిన వంటకాలు తినడం వల్ల తేలికగా జీర్ణం అవ్వడమేగాక ఈజీగా బరువు తగ్గుతారు. అలాంటి ఈ పెసరపప్పు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటీ? తాపాన్ని ఎలా పోగొట్టగలదు అంటే.. పెసర పప్పు తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు వేసవి కాలం కాబట్టి.. పెసర పప్పు తినడం చాలా మంచిది. పెసర పప్పుతో కూరలు, స్నాక్స్, బ్రేక్ ఫాస్ట్ వంటివి కూడా తయారు చేస్తారు. అయితే ఈ పెరస పప్పుతో ఏం చేసినా రుచిగానే ఉంటాయి. పెసర పప్పు తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయంటే.. బరువు తగ్గడంలో.. పెసర పప్పును తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే ఇందులో ఫైబర్, ప్రోటీన్లు మెండుగా ఉంటాయి. కాబట్టి కొద్దిగా తిన్నా.. త్వరగా కడుపు నిండుతుంది. దీంతో ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. అంతే కాకుండా చిరు తిళ్లను కూడా తినడం నివారిస్తుంది. అంతే కాకుండా పోషకాలు కూడా అన్నీ శరీరానికి అందుతాయి. అలాగే కొలెస్ట్రాల్ లెవల్స్ కూడా అదుపులో ఉంటాయి. ఇలా ఈజీగా బరువు తగ్గొచ్చు. అలసట, నీరసం నుంచి.. పెసర పప్పులో పోషకాలు అనేవి అధికంగా లభ్యమవుతాయి కాబట్టి.. శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. బాడీలో ఇమ్యూనిటీ లెవల్స్ పెరగడం వల్ల.. సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తి లభిస్తుంది. దీంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. అందులోనూ వేసవిలో ఎక్కువగా అలసట, నీరసం వస్తాయి. పెసరపప్పు తినడం వల్ల.. అలసట లేకుండా ఉండొచ్చు. గుండె జబ్బుల ప్రమాదం.. గుండెకు పెసరపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పెసరపప్పు రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల పెసరపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మ సంరక్షణ కోసం.. పెసరపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు అనేవి అధికంగా ఉండటం వల్ల.. చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. జుట్టు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది. దీంతో జుల్లు రాలడం అనేది తగ్గుతుంది. అదే విధంగా చర్మంపై ముడతలు రాకుండా నిరోధిస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అదీగాక ఈ వేసవి ప్రారంభంలోనే చైత్రమాసం మొదలవుతుంది. తెలుగు వాళ్ల కొత్త సంవత్సరం, శ్రీరామ నవిమి మొదలయ్యేది కూడా ఈ నెలలోనే. అందువల్ల దేవుళ్లకు కూడా పెసరపప్పుతో చేసిన ప్రసాదాలే పెట్టడం జరగుతుంది. బహుశా ఈ కాలానికి తగ్గట్టు ఈ నియమం పెట్టి ఉంటారు. భగభగమండే ఎండల్లో శక్తిని, చలువ నిచ్చే పెసరప్పు మంచిదని గుర్తించే దానితో చేసే వంటకాలను చేసేవారు కాబోలు. (చదవండి: జుట్టు మృదువుగా నిగనిగలాడలంటే గంజితో ఇలా చేయండి!) -
Weather: జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈసారి భగభగలు తప్పనట్టే.. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైనే నమోదు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత.. ఆరు బయట జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. ‘దక్షిణం’లో తీవ్ర వర్షాభావం.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్‌లో మరింత ఎక్కువ ఎండలు.. గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్‌లను జారీ చేస్తాం. ఏప్రిల్ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్ విడుదల చేస్తాం. – నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతల తీరు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 40.8 25.5 భద్రాచలం 40.0 25.0 నిజామాబాద్ 39.9 25.0 ఖమ్మం 39.6 24.0 నల్లగొండ 39.5 24.2 హైదరాబాద్ 39.2 24.6 మహబూబ్‌నగర్ 39.2 25.0 మెదక్ 39.2 21.1 దుండిగల్ 39.1 22.2 హకీంపేట్ 39.0 20.1 రామగుండం 38.6 24.6 హన్మకొండ 38.0 22.5 ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏదైనా పని కోసం బయటికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ నీళ్లు తాగాలని, డీహైడ్రేషన్ తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇంకా వైద్యులు సూచనలు ఇవీ.. బయటికి వెళ్లేవారు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్ వ్రస్తాలు ధరించాలి. తలపై టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలి. ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దు. -
వడదెబ్బ విరుగిడికి సూచనలు ఇవే..
-
ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచన.. ఐడియా భలే ఉందే!
ఎండలతో బయటకు రావాలంటేనే జనం జంకుతున్న పరిస్థితుల్లో.. ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ ఆటోడ్రైవర్ వినూత్నంగా ఆలోచించాడు. బస్తాలో వడ్ల గింజలు వేయడంతో అవి మొలకెత్తాయి. దీంతో నారుతో కూడిన బస్తాలను ఆటో టాప్‌పై వేయగా.. ఎండ వేడి నుంచి ఉపశమనం లభిస్తోందని చెప్పాడు. మహబూబాబాద్ జిల్లా నుంచి అద్దెపై ఖమ్మం వచ్చిన ఆటోడ్రైవర్‌ను పలకరించగా.. గంటకోసారి బస్తాను నీటితో తడుపుతుండడంతో తనతో ప్రయాణికులు సేదదీరుతున్నారని తెలిపాడు. – స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఖమ్మం -
తెలుగు రాష్ట్రాల్లో దడ పుట్టిస్తున్న ఎండలు
-
గ్రేటర్ లో 17రోజుల్లో కోటి బీర్లు సేల్
-
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగ.. వడగాడ్పుల సెగ.. అల్లాడుతున్న జనం
-
రాష్ట్రంలో మంటలు కంటిన్యూ.. గ్రేటర్ మినహా రాష్ట్రమంతా ఆరెంజ్ అలర్ట్ జారీ
ఎండలు మండుతుండటంతో వేరుశనగ పంట తీసేందుకు వెళ్లిన కూలీలు.. ఆ మొక్కలనే గుడిసెగా మార్చు కుని పనిచేసుకుంటున్న దృశ్యమిది. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామశివార్లలో ఈ దృశ్యం కనిపించింది. – సాక్షి ఫొటోగ్రాఫర్ , ఆదిలాబాద్ సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రికార్డుస్థాయిలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టాలన్నా భయపడేలా వడగాడ్పులు వీస్తున్నాయి. గాలిలో తేమశాతం బాగా పెరగడంతో విపరీతంగా ఉక్కపోత ఉంటోంది. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రంలోని చాలాచోట్ల 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 44 డిగ్రీల సెల్సియస్ వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో వడగాడ్పులు సైతం వీస్తాయని వివరించింది. 22 నుంచి కొన్నిరోజులు ఉపశమనం శనివారం (ఈ నెల 22వ తేదీ) నుంచి ఎండలు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని.. కొన్నిచోట్ల సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే చాన్స్ ఉందని వెల్లడించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గవచ్చని అంచనా వేసింది. వాతావరణంలో నెలకొంటున్న పలు మార్పులే దీనికి కారణమని వివరించింది. దాదాపు నాలుగైదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తగ్గిన తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వాయవ్య తెలంగాణ, శుక్రవారం తూర్పు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అప్రమత్తంగా ఉండాలి.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. బయటికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని స్పష్టం చేసింది. వీలైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఇంట్లోనే ఉండాలని పేర్కొంది. ఇక బుధవారం రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 42.3 డిగ్రీలుగా నమోదైనట్టు తెలిపింది. సాధారణం కంటే అధికంగా.. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఖమ్మంలో సాధారణం కంటే ఏకంగా 3.2 డిగ్రీలు అధికంగా నమోదవడం గమనార్హం. నల్లగొండలో 2.4 డిగ్రీలు.. భద్రాచలం, మెదక్‌లలో 1.9 డిగ్రీలు, హన్మకొండలో 1.7 డిగ్రీలు, నిజామాబాద్, రామగుండంలలో 1.6 డిగ్రీల మేర అధికంగా నమోదైనట్టు తెలిపింది. – పగటి ఉష్ణోగ్రతలకు తగినట్టుగా రాత్రి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే ఒకటి, రెండు డిగ్రీలు అధికంగా ఉంటున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలాచోట్ల అర్ధరాత్రి దాటే వరకు కూడా ఉక్కపోత కొనసాగుతోందని వివరించింది. – ఇక జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 44.5 డిగ్రీలు, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 44.5 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం తమ వెబ్సైట్లో తెలిపింది. – ఎండ తీవ్రత కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉదయం పది, పదకొండు గంటల సరికే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. ఏప్రిల్‌లోనే ఈ పరిస్థితి ఉంటే.. మే నెలలో ఎండల తీవ్రత మరెలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా భగభగలు న్యూఢిల్లీ: భానుడి ప్రతాపంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో, ఒడిశాలోని బారిపడలో 44.5 డిగ్రీలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఢిల్లీలో కొన్ని రోజులుగా 40 డిగ్రీలకు పైగానే నమోదవుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఎండ ప్రచండంగా ఉంది. దాంతో త్రిపురలో ‘స్టేట్ స్పెసిఫిక్ డిజాస్టర్’ ప్రకటించారు. కేరళలోనూ ఎండలు మండుతున్నాయి. పశ్చిమ బెంగాల్, ఏపీ, బిహార్ తదితర రాష్ట్రాల్లో తీవ్ర వడగాడ్పులు రెండు రోజులుంటాయని ఏపీలో ఈ నెల 21, 22ల్లో వర్షం పడొచ్చని వాతావరణ శాఖ చెప్పింది. -
ఏపీలో దంచికొడుతున్న ఎండలు - అల్లాడిపోతున్న ప్రజలు ( ఫొటోలు)
-
పట్టన ప్రాంతాల్లో ఎండ దెబ్బకు రోడ్లపై పందిర్లు
-
ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి.. ఫ్యాన్లు గిరాగిర, కూలర్లు, ఏసీలు ఆన్
సాక్షి, హైదరాబాద్: ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు బ్రేక్ పడింది. కానీ.. పక్షం రోజులుగా పొడి వాతావరణం, ఎండలు మండుతుండటంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిరుజల్లులు, మబ్బులతో ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. భానుడి భగభగలతో పగలే కాదు రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతకు తట్టుకోలేక సిటీజనులు అల్లాడిపోతున్నారు. ఉపశమనం కోసం మళ్లీ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఆన్ చేస్తున్నారు. దీంతో నగరంలో విద్యుత్ డిమాండ్ అన్యూహ్యంగా పెరిగింది. వారం రోజుల క్రితం వరకు గ్రేటర్ సగటు విద్యుత్ డిమాండ్ 52–55 మిలియన్ యూనిట్లుగా ఉండగా, తాజాగా 61 ఎంయూలకు పైగా నమోదవుతుండటం విశేషం. ఉక్కపోత కారణంగా కరెంట్ వినియోగం రెట్టింపవడంతో మీటర్లు గిర్రున తిరుగుతూ స్లాబ్‌రేట్లు మారి భారీగా బిల్లులు చేతికి అందుతుండటంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. హీటెక్కుతున్న పీటీఆర్లు ఒక్కసారిగా విద్యుత్ డిమాండ్ పెరగడం, పగటి ఉష్ణోత్రలు కూడా భారీగా నమోదవుతుండటంతో సబ్ స్టేషన్లలోని పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు హీటెక్కుతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక ఫీడర్లు తరచూ ట్రిప్పవుతుండటంతో సరఫరాలో అంతరాయం తప్పడంలేదు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ఇంట్లో కరెంట్ కూడా లేకపోవడం, బహుళ అంతస్తుల సముదాయాల్లో ఏర్పాటు చేసిన జనరేటర్లు కూడా చాలా వరకు వినియోగంలో లేకపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మంచినీటి మోటార్లు, లిఫ్ట్‌లు పని చేయకపోవడంతో మీటర్ రీడింగ్ నమోదు, బిల్లుల జారీ కోసం ఆయా నివాసాలకు వెళ్లిన సిబ్బంది ప్రజాగ్రహానికి గురికావాల్సి వస్తోంది. ఈ సీజన్లో అత్యధికం విద్యుత్ వినియోగం సాధారణంగా వేసవిలో మాత్రమే 60 ఎంయూలు దాటుతుంది. వర్షాకాలం, చలికాలంలో చాలా తక్కువ వాడకం నమోదవుతుంది. కానీ ఇటీవల వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా గత రెండు రోజుల నుంచి డిమాండ్ అనూహ్యంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. గత ఏడాది ఇదే రోజు 2392 మెగావాట్ల డిమాండ్ నమోదు కాగా తాజాగా శుక్రవారం 2984, శనివారం 2998 మెగావాట్లు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం నగరంలో డెంగీ కారక దోమలు విజృంభిస్తున్నాయి. రాత్రి పూట కరెంట్ లేకపోవడంతో ఉక్కపోతకు తోడు దోమలు ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆకస్మిక విరామం వల్లే శుక్రవారం నగరంలో 32.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కాగా, శనివారం 34 డిగ్రీలకు చేరింది. రుతుపవనాల మధ్య విరామమే ఆకస్మిక ఉక్కపోతకు కారణం. ప్రస్తుతం వర్షాకాలమే అయినా రుతుపవనాలు బలహీన పడటం వల్ల అల్పపీడనాలు ఏర్పడడం లేదు. పూర్తిగా పొడి వాతావరణం ఏర్పడి వేడి పెరిగింది. గాలిలో తేమ తగ్గిపోవడం వల్ల అధిక ఉక్కపోత నమోదవుతోంది. రుతుపవనాల మధ్యలో ఆకస్మిక విరామం వస్తే ఈ తరహా పరిస్థితి ఉత్పన్నమవుతుంది. – కె. నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ -
వామ్మో...ఎండలు!
కడప కల్చరల్: ఇవేమి ఎండలలు నాయనా..ఈ మధ్య కాలంలో ఇంత ఎండలు ఎప్పుడూ చూడలేదు...అంటూ భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. దాదాపు నెల రోజులుగా తేలికపాటి వర్షంతో వాతావరణం చల్లగానే ఉంది. వేసవి తాపం నుంచి బయట పడ్డామని భావించిన ప్రజలకు ఇటీవలి ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచినా వెంటనే తీక్షణమైన ఎండ చిటపటలాడిస్తోంది. ఊహించని విధంగా వాతావరణంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంట్లో ఉక్కపోత, బయట తీవ్రమైన ఎండలను భరించలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉభయ జిల్లాల్లో నాలుగు రోజులుగా వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉదయం 9 గంటలకే బయట కొద్దిసేపు తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఈ మూడు రోజులు వాతావరణంలో 35–37 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుదల కనిపిస్తోంది. ఇళ్లలో ఫ్యాను, ఏసీ వాడక తప్పడం లేదు. పాఠశాలల విద్యార్థులు ఉదయం ప్రార్థన చేసేందుకు కూడా ఎండ ఆటంకంగా నిలుస్తోంది. వీధుల్లో వెళ్లే ప్రజలు గొడుగులు, టోపీలు, టవళ్లు వాడక తప్పడం లేదు. ట్రాఫిక్ కూడళ్లలో సిగ్నల్స్ పడేంత వరకు వాహనదారులకు ఎండలో ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం 5 గంటల వరకు ప్రధాన రోడ్లు బోసిపోయి కనిపిస్తున్నాయి. నిపుణులు ఏమంటున్నారంటే.. రుతు పవనాల్లో ఏర్పడిన అంతరాయం వల్లే ఆకస్మిక ఎండలను ఎదుర్కోవాల్సి వస్తోందని యోగివేమన విశ్వవిద్యాలయం ప్రిన్సిపాల్ డాక్టర్ కె.కృష్ణారెడ్డి చెబుతున్నారు.కొద్దిరోజులు వర్షాభావ స్థితి ఉండడం, తాత్కాలికంగా ఈశాన్యం నుంచి వేడిగాలులు వస్తుండడంతో రాయలసీమ ప్రాంతంలో సాధారణ వాతావరణం కంటే రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అంటున్నారు. -
స్కిన్లెస్ చికెన్ ధర కేజీ రూ.320.. మరోవైపు కళ్లు తేలేస్తున్న కోళ్లు
సాక్షి, కోనసీమ: మండుతున్న ఎండలకు కోళ్లు విలవిలలాడుతున్నాయి. వేడిగాలులకు తాళలేక మరణిస్తున్నాయి. పది రోజులుగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిపోయాయి. 42 నుంచి 47 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి వేడిగాలుల తీవ్ర త తోడవుతోంది. ఉష్ణతాపం నుంచి కోళ్లకు ఉపశమ నం కలిగించేందుకు కోళ్ల రైతులు అనేక చర్యలు చేప డుతున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ప్రత్యేక మందులు ఇస్తున్నారు. షెడ్లలోకి వేడిగాలులు రాకుండా చుట్టూ గోనె సంచులు కట్టి, స్ప్రింక్లర్లతో తడుపుతున్నారు. లోపలి వేడిగాలి బయటకు పోయే విధంగా పైకప్పులో ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. అయినప్పటికి రికార్డు స్థాయిలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని పౌల్ట్రీల్లో గుడ్లు పెట్టే కోళ్లు 1.3 కోట్ల వరకూ, మిగిలిన దశల్లోని కోళ్లు 80 లక్షల వరకూ ఉన్నాయి, సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.10 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, 25 వేల నుంచి 30 వేల వరకూ కోళ్లు చనిపోతుంటాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో మునుపెన్నడూ లేని విధంగా కోళ్ల మరణాలు సంభవిస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 3 లక్షల వరకూ కోళ్లు మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వలన సుమారు రూ.200 మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఈ లెక్కన కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.6 కోట్ల నష్టం వాటిల్లుతోంది. పైకప్పు చల్లబర్చేందుకు స్ప్రింక్లర్లతో నీటిని చల్లుతున్న దృశ్యం మరోపక్క గుడ్ల ఉత్పత్తి 20 శా తం మేర తగ్గిపోయింది. ప్రస్తుతం రోజుకు 88 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. 22 లక్షల గుడ్లు ఉత్పత్తి తగ్గిపోవడంతో నెక్ ప్రకటిత రైతు ధర రూ.4.60 చొప్పున రోజుకు రూ.1.01 కోట్ల వరకూ రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇలా కోళ్ల మరణాలు, గుడ్లు డ్రాపింగ్ రూపాల్లో మూడు జిల్లాల్లోని పౌల్ట్రీ పరిశ్రమకు రోజుకు రూ.7.01 కోట్ల మేర నష్టం వాటిల్లుతోందని పౌల్ట్రీవర్గాలు చెబుతున్నాయి. దిగిరాని చికెన్ ధర తూర్పు గోదావరి జిల్లా రాజానగరం, కోరుకొండ, గోకవరం, కొవ్వూరు.. కోనసీమ జిల్లా అమలాపురం, రావులపాలెం.. కాకినాడ జిల్లా తుని, తొండంగి ప్రాంతాల్లో 440 ఫారాల వరకూ ఉండగా 7 లక్షల కోళ్ల పెంపకం జరుగుతోంది. కోళ్ల మరణాలు ఎక్కువగా ఉండటంతో ఎండలకు జడిసి రైతులు కొత్త బ్యాచ్‌లు వేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కోళ్ల పెంపకం లేకపోవడం, అధిక శాతం ఫారాలు కంపెనీల అధీనంలోనే ఉండటంతో బ్రాయిలర్ చికెన్ ధర కొన్నాళ్లుగా దిగి రావడం లేదు. రెండు నెలలుగా స్కిన్లెస్ చికెన్ కిలో రూ.320 నుంచి రూ.350 వరకూ పలుకుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ధర ఇప్పుడప్పుడే తగ్గే అవకాశం లేదని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. వాతావరణం చల్లబడాలి ఎండల తీవ్రత పెరిగిపోవడంతో కోళ్ల మరణాలు పెరిగిపోయాయి. గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయింది. ఆయా కారణాలతో పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. వర్షాలు కురిసి వాతావరణం చల్లబడితే మరణాలు తగ్గి, ఉత్పత్తి పెరుగుతుంది. – పడాల సుబ్బారెడ్డి, పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్తమూరు -
వడదెబ్బ నుంచి తప్పించుకోండి ఇలా..
ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 గంటలకే ఎండల తీవ్రత ఎక్కువ అవుతోంది. సాయంత్రం 6 కానిదే తగ్గడం లేదు. దీనికితోడు ఉక్కపోత, వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వేసవి తాపానికి జనం బయటకు రాలేని పరిస్థితి. ఇంట్లో ఏసీలు, కూలర్లు 24 గంటల పాటు వినియోగించాల్సి వస్తోంది. అయితే అందరూ ఇంట్లో ఉంటే కుదరదు కదా? అలాగని ఎండ బారిన పడితే వచ్చే అనర్థాలను తట్టుకునే పరిస్థితి ఉండదు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రాష్ట్ర విపత్తుల నివారణ, వైద్య ఆరోగ్య శాఖలు తెలిపాయి. – డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) జాగ్రత్తలు.. ► ఆరుబయట పని చేసే వారు సూర్యరశ్మి నుంచి కాపాడుకునేందుకు జాగ్రత్తలు తీసుకోవాలి. ► తరచూ నీళ్లు తాగుతూ ఉండాలి. బయటకు వెళ్లే ముందు నుంచి నీళ్లు వెంట తీసుకెళ్లాలి. ► ఎక్కువగా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు తాగుతూ ఉండాలి. ► అవసరాన్ని బట్టి ఓఆర్ఎస్ ద్రవణం తీసుకోవాలి. పండ్ల రసాలు, గంజి, మజ్జిగ, జావ వంటివి ఎక్కువగా తీసుకుంటే మేలు. ► తెలుపు లేత రంగుల్లో ఉన్న పలుచని కాటన్ దుస్తులు ధరించాలి. ► లకు ఎండ తగలకుండా టోపీ, రుమాలు చుట్టుకోవాలి. వడదెబ్బ ప్రమాదం ► ఎండలు, వడగాడ్పుల సమయంలో బయట తిరగడం వల్ల వడదెబ్బకు గురవుతారు. ► తక్కువగా నీరు తాగడం, ద్రవపదార్థాలు తీసుకోకపోవడం, చల్లదనం ఇవ్వని దుస్తులు ధరించడం, చెమటను పీల్చని దుస్తులు, మద్యం సేవించడం వల్ల వడదెబ్బ సోకుతుంది. ► వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు దీని బారిన పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వైద్యు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ► శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా 104.9 డిగ్రీల వరకు పెరిగిపోయి, దానిని నియంత్రించే శక్తి కోల్పోవడమే వడదెబ్బగా పరిగణిస్తారు. దీనిని చాలా మంచి జ్వరంగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. లక్షణాలు.. ► రక్తప్రసరణ తగ్గి బీపీ డౌన్ అవుతుంది ► శరీరంతో పాటు పెదాలు, గోర్ల రంగు మారుతుంది. ► ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. ► కీళ్ల నొప్పులు అధికంగా ఉంటాయి. ► నరాల సమస్యలు ఉత్పన్నమవుతాయి. ► స్పృహ కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుంది ► మాటల్లో స్పష్టత తగ్గుతుంది. ► ఇతరులు చెప్పే మాటలను కూడా వినలేకపోతారు ► కొంత మంది కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది ► విపరీతమైన తలనొప్పి రావడం, హృదయ స్పందన బాగా పెరగడం, శ్వాస తీసుకోవడం కష్టమవడం, చర్మం బాగా కందిపోయి మంటగా ఉండటం, బుగ్గలు, మెడ, గొంతు, మోచేతులు, ఛాతి బాగాలు ఎరుపెక్కడం మొదలైనవి.. నివారణ చర్యలు.. ► తక్షణమే శరీర ఉష్ణోగ్రతను తగ్గించే చర్యలు చేపట్టకపోతే అవయవాలు శాశ్వతంగా పనికి రాకుండా పోయే ప్రమాదం ఉంది. ► వారిని వెంటనే చల్లని ప్రదేశానికి చేర్చాలి. శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చే వరకు అలానే చేయాలి. ► చల్లని నీరు తాగడం వల్ల శరీర ఉష్ణాగ్రత తగ్గుముఖం పడుతుంది. బాత్‌టబ్‌లో ఐదు నుంచి పది నిమిషాలు గడపాలి. లేదా చల్లని దుప్పటిని శరీరమంతా కప్పాలి. ఆ తరువాత ఐస్ ముక్కలలతో శరీరమంతా అద్దాలి. ఇలా చేస్తే శరీరం వణుగు తుగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ► తీవ్రతను బట్టి ఆలస్యం చేయకుండా వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి. వెంటనే చికిత్స ప్రారంభం అయితే ప్రమాదం నుంచి గట్టెక్కవచ్చు. ఏం తినాలి.. వడదెబ్బ సోకిన వారు ఆహారం తీసుకోవడంలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కువగా తాజా పండ్లు, కూరగాయలు, అదనంగా ద్రవపదార్థాలు, పండ్ల రసాలు, శక్తినిచ్చే శీతలపానీయాలు, మజ్జిగ తాగాలి. అలాగే చిరుధానాయలు తీసుకోవాలి. షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా వడదెబ్బ తీవ్రతను తగ్గిస్తాయి. -
మండిపోతున్న ఎండలు.. అమ్మకాల్లో దుమ్మురేపుతున్న ఏసీలు
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి తాళలేక పోతున్నారు జనం. ఎన్నడూ లేనిది ఏప్రిల్‌లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో సూర్యుడి వేడి నుంచి తప్పించుకునేందుకు అవకాశం ఉన్న వారు ఎయిర్ కండీషనర్లు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో 2022 ఏప్రిల్‌లో ఏసీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. 2022 ఏప్రిల్‌లో ఎన్నడూ లేనంతగా 17.50 లక్షల ఏసీలు అమ్ముడైనట్టు కన్సుమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (సీమా) తెలిపింది. 2021 ఏడాదితో పోల్చితే అమ్మకాలు రెట్టింపు అయినట్టు వెల్లడించింది. జనాలందరూ ఇళ్లకే పరిమితమైన 2020తో పోల్చినా ఈ అమ్మకాలు ఎక్కువే నంటూ ప్రకటించింది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలలకు సంబంధించి సీమా ముందుగా వేసుకున్న అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 85 లక్షల నుంచి 90 లక్షల ఏసీ యూనిట్లు అమ్ముడయ్యే అవకాశం ఉంది. కానీ మార్చి చివరి నుంచే ఎండలు మండిపోతుండటంతో ఏప్రిల్‌లో ఒక్కసారిగా అమ్మకాలు జోరుగా సాగాయి. దీంతో ఈ సీజన్ ముగిసే సరికి కోటికి పైగా ఏసీ యూనిట్లు అమ్ముడైపోయినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇప్పుడున్న డిమాండ్ కనుక మే, జూన్లలో కూడా కొనసాగితే మార్కెట్లో ఉన్న అన్ని ఏసీ యూనిట్లు అమ్ముడై అవుటాఫ్ స్టాక్ బోర్డు పెట్టుకోవాల్సి వస్తుంటున్నారు. మిగిలిన అన్ని విభాగాల మాదిరిగానే ఏసీలకు కూడా చిప్ సెట్ల కొరత, ఇతర ముడి పదార్థాల సరఫరా సమస్య ఎదురవులోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్ తగ్గక పోతే ఏసీ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీలు కూడా చేతులెత్తేసే పరిస్థితి ఉందని సీమా అంటోంది. గడిచిన రెండేళ్లలో ఏసీల ధరలు 15 శాతం మేర పెరిగినా డిమాండ్ ఏమాత్రం తగ్గకపోవడం ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. చదవండి: Summer Care: ఏసీ గదిలో ఎక్కువసేపు గడుపుతున్నారా.. జాగ్రత్త! -
బాబోయ్.. ఎండలు.. ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త! ఇవి మాత్రం వద్దు!
సాక్షి, ఖమ్మం: ఎండలు తీవ్రంగా మండుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉదయం 10 గంటలకే ఎండ తీవ్రత పెరిగిపోతుండటంతో బయటకు వెళ్తే ముచ్చెమటలు పడుతున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో చాలామంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇక వచ్చే మే నెలలో మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉండటంతో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న వేడి నేపథ్యంలో ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పెరగనున్న ఉష్ణోగ్రతలతో వడదెబ్బ బారినపడి చిన్నాపెద్ద అల్లాడిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వడదెబ్బ లక్షణాలు, నివారణ మార్గాల గురించి తెలుసుకుందాం. లక్షణాలు ఇవీ.. కళ్లు తిరగడం, శరీరంలో నీటి శాతం కోల్పోవడం, శరీర కండరాలు పట్టుకోవడం, కాళ్లు వాపులు రావడం, తీవ్ర జ్వరం వంటివి కనిపిస్తాయి. అధిక చెమట పట్టడం, తల తిరిగి పడిపోవడం వంటివి జరుగుతుంటాయి. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండ సమస్యలు కలిగి ఉన్నవారి శరీరం సూర్యరశ్మి వలన త్వరగా డీహైడ్రేషన్‌కు గురై వడదెబ్బ తీవ్రత అధికంగా ఉంటుంది. ప్రాథమిక చికిత్స.. ►వడదెబ్బ తగిలిన వ్యక్తి వెంటనే నీడకు తీసుకెళ్లాలి. చల్లని నీరు, ఐస్‌తో ఒళ్లంతా తుడవాలి. ►వదులుగా ఉన్న నూలు దుస్తులు వేయాలి. ►చల్లని గాలి తగిలేలా చూడాలి. ►ఉప్పు కలిపిన మజ్జిగ లేదా కొబ్బరి బొండాం నీరు, చిటికెడు ఉప్పు, చక్కర కలిపిన నిమ్మరసం, గ్లూకోజు ద్రావణం లేదా ఓరల్ రీ హైడ్రేషన్ ద్రావణం(ఓఆర్ఎస్) తాగించవచ్చు. ►వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్తే దగ్గరలోని ఆస్పత్రికి తరలించాలి. జాగ్రత్తలు.. ►ఎండలో వెళ్లేటప్పుడు కళ్లకు సన్ గ్లాసెస్, తలకు టోపి వంటివి ధరించాలి. ►ఉదయం, సాయంత్రం సమయాల్లో మాత్రమే బయటకు వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలి. ►హారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ►వదులైన నూలు దుస్తులు ధరించాలి. ►వేసవి కాలంలో డీహైడ్రేషన్ అధికంగా ఉంటుంది. రోజుకు కనీసం 15 గ్లాసుల నీరు తాగాలి. భోజనం మితంగా చేయాలి. ►మాంసామారం తగ్గించి, తాజా కూరగాయల్ని ఎక్కువగా భోజనంలో తీసుకోవాలి. ►నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలను ఆహారంగా తీసుకోవాలి. పుచ్చకాయలు, కీర, తాటి ముంజలు, బీర పొట్టు వంటి వాటిలో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. వీటి ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. దీంతో కడుపు నిండినట్లుగా ఉండి డైట్ కంట్రోల్ అవుతుంది. ►వేసవిలో ఆకలి తక్కువగా, దాహం ఎక్కువగా ఉంటుంది. సరైన డైట్ పాటించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు తీసుకోవాలి. చేయకూడని పనులు.. ►మండు వేసవిలో తీవ్ర ఉష్ణోగ్రత సమయంలో ఎక్కువగా తిరగరాదు. ►రోడ్లపై చల్లగా ఉండే రంగు పానీయాలు తాగొద్దు. ►రోడ్లపై విక్రయించే కలుషిత ఆహారం తినకూడదు. ఇంట్లో వండుకున్నవే తినాలి. ►శీతల పానీయాలు అధికంగా షుగర్ వేసిన జ్యూస్‌లు తీసుకుంటే కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. -
Photo Feature: సీను మార్చిన సూర్యుడు
వాన చినుకులు ముద్దాడిన వేళ పుడమి తల్లి పచ్చదనాల కోక కట్టింది. పచ్చని పొలాల మధ్య రైలు కోయిలై కూత పెడుతుంటే మనసు పరవశించిపోయింది. పల్లె పల్లెంతా మెరిసిపోయింది. ఇది నిన్నటి కథ. మరి నేడు?.. భానుడి ప్రతాపానికి పల్లె కళ తప్పింది. వాగూవంకా ఎండిపోయింది. చెట్టూచేమా మాడిపోయింది. రైలు పరుగు తీస్తుంటే మది మూగబోయింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కోసాయి గ్రామంలోనిదీ దృశ్యం. - సాక్షి ఫొటోగ్రాఫర్/ఆదిలాబాద్ -
మండే ఎండల్లో ఈ డ్రింక్స్ గురించి తెలిస్తే..
-
వేసవి ప్రారంభంలోనే రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు
-
మండుతున్న ఎండలు... వడదెబ్బ తగలకుండా ఉండాలంటే
ప్రచండ భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. మార్చిలోనే విరుచుకుపడుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాడు. అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడి సెగలతో జిల్లా వాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏటా ఏప్రిల్ నెలాఖరులో అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యేవి. కానీ.. వాతావరణ సమతుల్యత లోపించిన కారణంగా మార్చి నెలాఖరులోనే సూర్యుడు మండిపోతున్నాడు. గత నాలుగేళ్లతో పోల్చితే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు నెల రోజుల ముందే అమాంతంగా పెరిగిపోవడంతో జనం ఆందోళన చెందుతున్నారు. ఫిబ్రవరి ఆరంభంలో 31 డిగ్రీలుగా నమోదైన ఉష్ణోగ్రత.. ఆ నెల చివరికే 36 డిగ్రీలుగా నమోదైంది. అదే వేగంతో పెరుగుతూ మార్చి నెల చివరి వారంలో 41 డిగ్రీలకు చేరుకుంది. దీనికి తోడు వడగాల్పులు అధికమయ్యాయి. పగలంతా ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతూ కూలర్ల ముందే సేదతీరుతున్నారు. సాక్షి – కరీంనగర్ ఉదయం 10 గంటలకే... వారం రోజులుగా ఉదయం 10 గంటలకే ఎండలు మండుతుండడంతో జిల్లా వాసులు బయటకు రావాలంటేనే అల్లాడిపోతున్నారు. ఒకవేళ వచ్చినా 11 గంటలకల్లా నీడను ఆశ్రయిస్తున్నారు. దీంతో 12 కొట్టే సరికి రోడ్లన్నీ బోసిపోతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే టవర్‌సర్కిల్, బస్టాండ్ రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వారం రోజుల్లోనే ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో ఇబ్బంది తలెత్తింది. ఏప్రిల్ ఆరంభం కాకముందే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక సెగలు కక్కే ‘మే’ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. వడదెబ్బ తగలకుండా.. చెమటపట్టకపోవడం.. శరీర ఉష్ణోగ్రతలు పెరగడం.. వణుకు పుట్టడం.. ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి రావడం వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ తగలకుండా ఉండాలంటే తీవ్ర ఉష్ణోగ్రతలు ఉండే సమయంలో ఎక్కువగా ఎండలో తిరగద్దు. రోడ్ల వెంట విక్రయించే చల్లని రంగు పానీయాలు, కలుషిత ఆహారానికి దూరంగా ఉండాలి. మద్యం, మాంసం తగ్గించాలి. నీరు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి. ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు వాడడం, టోపీ ధరించడం మంచిది. నిర్లక్ష్యం చేయవద్దు.. వడదెబ్బ తగిలిన వ్యక్తిని వీలైనంత త్వరగా చల్లని గాలి తగిలే ప్రదేశానికి చేర్చాలి. ఉప్పు కలిపిన మజ్జిగ, గ్లూకోజు ద్రావణం లేదా ఓఆర్ఎస్ తాగించాలి. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మరింత జాగ్రత్త తీసుకోవాలి. వడదెబ్బ తగిలి అపస్మారక స్థితిలోకి వెళ్లిన వ్యక్తికి బీపీ హెచ్చుతగ్గుల వల్ల కార్డియాక్ అరెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వెంటనే ఆసుపత్రికి తరలించాలి. – డాక్టర్ కొండపాక కిరణ్, కార్డియాలజిస్టు -
అమ్మో! ఎండ వేడి...రికార్డు స్థాయిలో విద్యుత్ వాడకం.. ఇదే అత్యధికం
సాక్షి, హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువయ్యాయి. గ్రేటర్ జిల్లాల వాసులు ఉపశమనం కోసం ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫలితంగా ఇంట్లోని కరెంట్ మీటరు గిరగిరా తిరుగుతోంది. కేవలం వ్యక్తిగత వినియోగం మాత్రమే కాదు గ్రేటర్ సగటు విద్యుత్ వినియోగం కూడా రికార్డు స్థాయిలో నమోదవుతోంది. తాజాగా శనివారం 64.5 మిలియన్ యూనిట్లకు చేరుకుంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఇప్పటికే డిస్కం గృహ విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య విద్యుత్ వినియోగంపై యూనిట్‌కు రూపాయి చొప్పున పెంచింది. ఏప్రిల్ నెల నుంచి పెంచిన బిల్లులను అమల్లోకి తెస్తున్నట్లు ప్రకటించింది. ఫీడర్లు, డీటీఆర్లపై ఒత్తిడి.. ►గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో 55 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 45.50 లక్షలు గృహ, 7.30 లక్షల వాణిజ్య, 44 వేల పారిశ్రామిక, 1.40 లక్షల వ్యవసాయ, 45 వేల వీధి దీపాల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2019 మే 30న అత్యధికంగా 73.9 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం నమోదైంది. 2021 మే నెలలో అత్యధికంగా 68 ఎయూలు నమోదైంది. ►ఐటీ అనుబంధ రంగాలతో పాటు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తున్నాయి. కేవలం గృహ విద్యుత్ విని యోగం మాత్రమే కాకుండా వాణిజ్య, పారిశ్రామిక వినియోగం కూడా రెట్టింపైంది. ఫలితంగా ప్రస్తుతం రోజు సగటు విద్యుత్ వినియోగం 60 యూనిట్లు దాటింది. ఏప్రిల్ చివరి నాటికి 75– 80 ఎంయూలకు చేరే అవకాశం లేకపోలేదు. చదవండి: హైదరాబాద్: మోస్ట్ వాంటెడ్ దొంగ.. ఆఖరికి ఓ చిన్న తప్పుతో.. -
భానుడి భగ భగలు..
-
తెలంగాణలో భానుడి భగ భగలు.. కారణం ఇదేనా!
హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వడగాడ్పులు, ఉక్కపోత పెరగడంలో జనం విలవిల్లాడుతున్నారు. బుధవారం భద్రాచలంలో రాష్ట్రంలోనే అధికంగా 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని.. ప్రస్తుత సీజన్లో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో 38.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 3.9 డిగ్రీలు ఎక్కువగా నమోదుకావడం గమనార్హం. హైదరాబాద్, వరంగల్, దుండిగల్, హకీంపేట కేంద్రాల్లో మినహా రాష్ట్రమంతటా 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఆదిలాబాద్‌లో తక్కువగా 19.2 డిగ్రీలు నమోదైంది. మిగతా అంతటా 20 డిగ్రీల కంటే ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉత్తరాది నుంచి వడగాడ్పులు రాష్ట్రానికి ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. ఎత్తు తక్కువగా ఉండడం, వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఇవి వడగాడ్పులుగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ గ్రామీణం, వరంగల్ పట్టణం, జనగామ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరో నాలుగు రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలి.. మండుతున్న ఎండలు, వడగాడ్పుల ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించాలని.. చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి విశ్రాంతి ఇవ్వాలని సూచించింది. ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీళ్లను తాగించాలని.. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఎండల తీవ్రతను తట్టుకొనేందుకు.. నూలు దుస్తులు ధరించడం, కళ్లజోడు పెట్టుకోవడం, బయటికి వెళ్లినప్పుడు గొడుగుని ఉపయోగించడం, చర్మానికి సన్‌స్క్రీన్ లోషన్ రాసుకోవడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిక ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ 2, 3, 5 తేదీల్లో కోస్తా ఆంధ్ర, యానాంలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయిని.. 30, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. -
మరో 4 రోజులు సెగలే..
సాక్షి,సిటీబ్యూరో: సీజన్ మారినా..ప్రచండ భానుడి తీవ్రత తగ్గకపోవడంతో గ్రేటర్ సిటీజన్లు విలవిల్లాడుతున్నారు. మరో నాలుగు రోజుల పాటు పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టేఅవకాశాలు లేవని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. సముద్రం నుంచి వీస్తున్న వేడిగాలుల కారణంగా రుతుపవనాల రాక ఆలస్యమైనట్లు తెలిపింది. కాగా మంగళవారం నగరంలో గరిష్టంగా 37.7 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈనెల 22(శనివారం)వరకు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయి లో నమోదవుతాయనిప్రకటించింది. ఈనెల 23 (ఆదివారం)నుంచి తెలంగాణ ప్రాంతాన్ని నైరుతి పలకరించి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. జూన్‌లోనూ రికార్డు ఎండలు..నీటికొరత గతంలో ఎన్నడూ లేనిరీతిలో గ్రేటర్ పరిధిలో జూన్ నెలలోనూ మండుటెండలు నగరవాసులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. మే నెలలో 42 డిగ్రీలకు పైగా నమోదైన పగటి ఉష్ణోగ్రతలు..జూన్ మూడోవారం సైతం 38–40 డిగ్రీల మేర నమోదవుతుండడంతో సిటీజనులు సొమ్మసిల్లుతున్నారు. ఇంటి ఆవరణ, పెరట్లో నూతనంగా మొక్కలు పెంపకం, గార్డెనింగ్ ప్రారంభిద్దామనుకున్నవారు సైతం మండుటెండలు, వర్షాల లేమి కారణంగా ఈ పనులు వాయిదావేయడం గమనార్హం. ఇప్పటికే గ్రేటర్ సిటీలో సుమారు 22 లక్షల బోరుబావులకుగాను..సుమారు 50 శాతం బోరుబావులు చుక్కనీరు లేక బావురుమంటున్నాయి. దీంతో ఇళ్లలో గార్డెనింగ్ అవసరాలకు సైతం నీటికొరత తీవ్రంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలమండలి సరఫరా చేస్తున్న నల్లానీరు ఏమూలకూ సరిపోకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ నీళ్లను ఆశ్రయించి వినియోగదారులు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ప్రతి ఐదువేల లీటర్ల ట్యాంకర్ నీళ్లకు ప్రాంతం, డిమాండ్‌ను బట్టి ప్రైవేట్ ట్యాంకర్ యజమానులు రూ.1000–1500 వరకు వసూలు చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. పలు ప్రాంతాల్లో వాల్టా చట్టానికి తూట్లు పొడుస్తూ..భూగర్భజలాల కోసం వెయ్యి అడుగుల లోతువరకు బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూయంత్రాంగం చోద్యం చూస్తోంది. -
వడదెబ్బకు పదిమంది మృత్యువాత
జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలో వడదెబ్బ మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గురువారం రాత్రి, శుక్రవారం పదిమంది మృత్యువాత పడ్డారు.వివరాలిలా ఉన్నాయి. పొదలకూరు: మండలంలోని ఆల్తుర్తి గ్రామానికి చెందిన షేక్ ఇమామ్‌సాహేబ్ (72) వడదెబ్బకు గురై మృతిచెందాడు. ఎండల వేడికి తీవ్ర అనారోగ్యానికి గురైన ఇమామ్‌సాహేబ్‌ను పొదలకూరు ఆస్పత్రికి తరలించేలోగానే తుదిశ్వాస విడిచినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఇంకా పద్మావతి నగర్‌కు చెందిన మద్దిరెళ్ల నర్సమ్మ (65) వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ♦ దగదర్తి: మండలంలోని కట్టుబడిపాళెం గ్రామానికి చెందిన వృద్ధుడు వేముల రాగయ్య (80) వడదెబ్బతో మృతిచెందినట్టుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ♦ గూడూరు పట్టణంలోని అశోక్‌నగర్‌లో నివాసం ఉంటున్న పాముల ఆదిలక్ష్మి (73) అనే వృద్ధురాలు వడదెబ్బకు గురై గురువారం రాత్రి మృతిచెందినట్టుగా కుటుంబ సభ్యులు శుక్రవారం తెలిపారు. ఆమె ఇంట్లో ఉన్న సమయంలో వేసవి తాపానికి గురై సొమ్మసిల్లి పడిపోయిందని, అనంతరం మృతిచెందినట్టు వారు తెలియజేశారు. ♦ తడ: వడదెబ్బకు గురైన మండల కేంద్రమైన తడ బీసీకాలనీకి చెందిన కె.రామయ్య (65) గురువారం అర్ధరాత్రి మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించాడు. అదేవిధంగా తడకండ్రిగ హైస్కూల్ రోడ్డులో నివసిస్తున్న ఎన్.బుజ్జయ్య (67) ఎండ వేడిమికి తాళలేక గురువారం అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న బుజ్జయ్య శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడని వారు తెలిపారు. ♦ వింజమూరు: స్థానిక కొత్తూరుకు చెందిన తిప్పిరెడ్డి సుజాత వడదెబ్బకు మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. వారంరోజులుగా కాస్తున్న ఎండకు తాళలేక ఆమె వడదెబ్బకు గురైంది. శుక్రవారం ఆరోగ్యం విషమించి మృతిచెందింది. మృతురాలికి భర్త, ఇద్దరు కుమారులున్నారు. ♦ సీతారామపురం: మండల కేంద్రమైన సీతారామపురంలోని ఎస్కే జులేఖాబీ (58) అనారోగ్యానికి గురై మృతిచెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. జులేఖాబీ బజారుకు వెళ్లి ఇంటికి సరుకులు తీసుకువస్తుండగా ఎండ తీవ్రతను తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బాధితురాలిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మరణించినట్లు తెలియజేశారు. ♦ వెంకటగిరిరూరల్: వెంకటగిరి మండలం యాతలూరు గ్రామానికి చెందిన వైఎస్సాసీపీ నాయకుడు దంపెళ్ల రామకృష్ణ తండ్రి, మాజీ సర్పంచ్ దంపెళ్ల చిన అంకయ్య (70) ఎండలు అధికంగా ఉండడంతో అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంకటగిరిలో చికిత్స కూడా చేయించారు. అయితే పరిస్థితి విషయమించి శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందినట్లు వారు తెలిపారు. అదేవిధంగా పట్టణంలోని పెరియవరంలో సుబ్రహ్మణ్యంనాయుడు ఎండ కారణంగా అనారోగ్యానికి గురయ్యాడు. ఈక్రమంలో గురువారం రాత్రి మృత్యువాత పడినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
పౌల్ట్రీకి వడదెబ్బ
తూర్పుగోదావరి, మండపేట: మండుతున్న ఎండలు కోళ్ల రైతులకు గుబులు పుట్టిస్తున్నాయి. పరిశ్రమను సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. వేడిగాలులు తాళలేక కోళ్లు కళ్లు తేలేస్తున్నాయి. ఎండల తీవ్రతతో జిల్లా వ్యాప్తంగా రోజుకు దాదాపు 5.6 లక్షల కోళ్లు మృత్యువాత పడుతుండగా, 15 శాతం మేర గుడ్లు ఉత్పత్తి పడిపోయింది. గడిచిన ఐదు రోజుల్లో పౌల్ట్రీ పరిశ్రమకు రూ. 58.97 కోట్లమేర నష్టం వాటిల్లినట్టు అంచనా. మరో నాలుగు రోజులపాటు ఎండల తీవ్రత ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. జిల్లాలో 400 వరకు పౌల్ట్రీలు ఉండగా, వివిధ దశల్లో సుమారు 2.8 కోట్లు కోళ్లున్నాయి. వీటిలో గుడ్లు పెట్టే కోళ్లు 1.30 కోట్లున్నాయి. రోజుకు సాధారణంగానే 0.05 శాతం ఉండే కోళ్ల మరణాలు ప్రస్తుత ఎండలతో రెండు శాతానికి పెరిగాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. గత ఐదు రోజులుగా 45 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో ముందెన్నడూ లేనంతగా ఈ ఏడాది మరణాలు పెరిగాయని కోళ్ల రైతులు అంటున్నారు. రోజుకు 5.6 లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయంటున్నారు. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున సుమారు రూ. 200 మేర నష్టం వాటిల్లుతుందని అంచనా. ఈ మేరకు గత ఐదు రోజుల వ్యవధిలో కోళ్ల మరణాలు రూపంలో జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమకు రూ.56 కోట్లు మేర నష్టం వాటిల్లింది. మరోపక్క ఎండల తీవ్రతతో గుడ్ల ఉత్పత్తి 15 శాతం మేర తగ్గిపోయింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు కోటి 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుండగా ఎండల తీవ్రతతో సుమారు 93.5 లక్షలు గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకు 16.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ. 3.6 పైసలుండగా రోజుకు రూ. దాదాపు రూ. 59.4 లక్షలు చొప్పున గత ఐదు రోజుల్లో రూ.2.97 కోట్లు మేర పౌల్ట్రీకి నష్టం వాటిల్లింది. కోళ్ల మరణాలు, గుడ్లు ఉత్పత్తి పడిపోవడం ద్వారా గత ఐదు రోజుల్లో రూ. 58.97 కోట్లు మేర పరిశ్రమకు నష్టం వాటిల్లింది. ఈ నెల 12వ తేదీ వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే కోళ్ల మేతకు వినియోగించే సోయా, డీఓబీ, మొక్కజొన్న, జీఎన్సీ, నూకల ధరలు గత నెల రోజుల వ్యవధిలో 40 నుంచి 60 శాతం మేర పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవక నష్టాల్లో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమను అధిక ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిసి మోపెడవుతున్న నిర్వహణ భారం అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా కోళ్లకు ప్రత్యేక మందులు ఇవ్వడం, వేడిగాలులు తగలకుండా ఫారాలు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్లు ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లుతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. పాత నిల్వలనుకోళ్ల రైతులకు ఇవ్వాలి ప్రస్తుత ఎండలు పౌల్ట్రీని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వం ఆదుకోకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న కోళ్ల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోతోంది. సివిల్ సప్లై ఎఫ్‌సీఐ గోదాముల్లోని మనుషులు తినడానికి పనికిరాకుండా నిల్వ ఉన్న గోధుమలు, మొక్కజొన్న, నూకలను తక్కువ ధరపై కోళ్ల రైతులకు అందజేయాలి. ఈ విషయమై రాష్ట్ర అసోసియేషన్ ద్వారా ఇప్పటికే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. రైతులను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.– పడాల సుబ్బారెడ్డి, రాష్ట్ర పౌల్ట్రీ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి, నెక్ జాతీయ కమిటీ సభ్యుడు, అర్తమూరు, మండపేట మండలం. -
‘సన్’డశాసనుడు
పశ్చిమగోదావరి, ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో భానుడి విశ్వరూపం చూపిస్తున్నాడు. ప్రచండశాసనుడై నిప్పులు చెరుగుతున్నాడు. ప్రజలపై కక్ష కట్టినట్టు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతూ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఫొనీ తుపాను ప్రభావంతో నాలుగు రోజుల క్రితం జిల్లాలో మబ్బులు కమ్ముకుని కొద్దిగా ఎండ వేడిమి తగ్గి కాస్త ఉపశమనం కలిగినా తుపాను తీరం దాటిన తరువాత భానుడు తిరిగి ప్రజలపై నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. గురువారం తాడేపల్లిగూడెంలో నమోదైన 47 డిగ్రీల ఉష్ణోగ్రతే గత దశాబ్దకాలంలో జిల్లాలో అత్యధికమని వాతావరణ శాఖ చెబుతోంది. జిల్లాలోని ఇతర పట్టణాల్లోనూ భారీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏలూరు నగరంలోనూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. .ఏలూరు నగరంతోపాటు నరసాపురం, భీమవరం, పాలకొల్లు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, తణుకు, తదితర ప్రాం తాల్లో గురువారం 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ముఖ్యమైన పనులు ఉంటే తప్ప ఇళ్ళలోనుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. రాబోయే రెండు రోజుల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని ఆర్టీజీఎస్ ప్రకటించడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. వచ్చే రెండు రోజుల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉండబోతోందని, పిడుగులు పడబోతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. చంటి పిల్లలు, వృద్ధులు ఉంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. కాగా ఈ నెల 12 నుంచి ఉష్ణోగ్రతల తీవ్రత కాస్త తగ్గుతుందని ఆర్టీజీఎస్ ప్రకటించడంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు. -
ఎండదెబ్బతో పోల్ డౌన్
సాక్షి, భూపాలపల్లి: గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ములుగు, భూపాలిపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ప్రస్తుత ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గింది. పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశించిన అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి రాకపోవడం, పోలింగ్ స్లిప్పులను పంచకపోవడం, ఎండలు తీవ్రంగా ఉండడం వంటి అంశాలు గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం పడినట్లు తెలిసింది. మహబూబాబాద్ ఎంపీ పరి«ధిలోని ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో 66.08 శాతం, వరంగల్ ఎంపీ పరిధిలోని భూపాలపల్లి అసెంబ్లీ నియోజకర్గంలో 52 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. పెద్దపల్లి ఎంపీ పరిధిలోని మంథని అసెంబ్లీ సెగ్మెంట్లో 58.25 శాతం ఓట్లు పోలయ్యాయి. రెండూ ఒకే సారి రాకపోవడమే.. రాష్ట్రంలో 2014లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఒకే సారి నిర్వహించారు. ఈ సారి సీఎం కేసీర్ఆర్ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లడంతో ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలపై ప్రజలు ఆసక్తి చూపించలేదనే విషయం స్పష్టమవుతోంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 80 శాతానికి మించి పోలింగ్ నమోదైంది. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. వరుసగా ఎన్నికలు రావడం కూడా లోక్‌సభ ఎన్నికలపై తీవ్రప్రభావం పడింది. ముఖ్యంగా దూర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నవారితో పాటు విద్యార్థులు సొంత ఊళ్లకు రావడానికి విముఖత చూపినట్లు సమాచారం. భానుడి భగభగ.. ఓటింగ్ శాతంపై ఎండలు తీవ్ర ప్రభావం చూపాయి. రెండు జిల్లాల్లో ఉదయం ఓటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మందకొడిగానే సాగింది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటడంతో జనాలు మధ్యాహ్నం పూట బయటకు రావడానికి జంకారు. దీంతో ములుగు, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లతో ఓటింగ్ శాతం తగ్గింది. ఎండ తీవ్రత కారణంగా ఉదయం 7 గంటల నుంచి నుంచి 11 గంటల వరకే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు చాలా తక్కువగా పోలింగ్ నమోదైంది. 3 గంటల తర్వాత పోలింగ్ ముగిసే వరకు మళ్లీ పోలింగ్ ఊపందుకుంది. అంతంత మాత్రంగా ప్రచారం.. పల్లెల్లో ఎన్నికల వాతావరణంకనిపించలేదు. గత అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో గ్రామాల్లో పండగ వాతావరణం కనిపించింది. ఈసారి మాత్రం గ్రామాల్లో ఆ జోషే లేదు. చాలా వరకు అభ్యర్థుల ప్రచారాలు, రోడ్ షోలు పట్టణాలకే పరిమితమయ్యాయి. దీంతో గ్రామాల్లోని రాజకీయ పార్టీల కార్యకర్తలు కానీ, నేతలు కానీ కనీసం ప్రచారం కూడా చేయలేదు. దీంతో పల్లెల్లో ఎన్నికల కళ తప్పింది. గత ఎన్నికల్లో ఇంటింటికి వచ్చి ఓటేశారా లేదా అని ఆరా తీసిన నేతలు ప్రస్తుతం మొహం చాటేశారు. పోలింగ్ కేంద్రాల దగ్గర పార్టీల సందడే కనిపించలేదు. గ్రామాల్లో కనీసం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లు కూడా తెలియని పరిస్థితి ఉంది. నియోజకవర్గాల పరిధి పెద్దది కావడంతో ఈసారి గ్రామాల్లో కార్యకర్తలను, నేతలను అభ్యర్థులు పట్టించుకోలేదనే వాదన నేతల్లో ఉంది. గడిచిన అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. ఈసారి ఆ పరిస్థితి కనపడలేదు. ఇన్ని కారణాలతో కిందిస్థాయి కార్యకర్తలు, నేతలు లోక్‌సభ ఎన్నికలపై ఆసక్తి చూపించలేదు. -
పెరుగుతున్న‘భానుడి’.. భగభగలు
సాక్షి, మెదక్‌జోన్: మెతుకుసీమపై సూర్యుడు విశ్వరూపం చూపుతున్నాడు. పది రోజులుగా ఎండలు దంచి కొడుతున్నాయి. వేసవి తీవ్రతకు జనం విలవిల్లాడుతున్నారు. ఉపాధికూలీలు ఎండలోనే పనులు చేస్తూ ఆందోళనకు గురవుతున్నారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండడంతో మధ్యాహ్నం వేళ ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు. మార్చి రెండో వారంలోనే 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో వచ్చే ఏప్రిల్‌లో 45డిగ్రీల కు చేరే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గతేడాది 40 డిగ్రీలు మాత్రమే నమోదు కాగా ఈయేడు మరో 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వైద్యులు పేర్కొం టున్నారు. ముఖ్యంగా షుగరు, బీపీ లాంటి వ్యాధిగ్రస్తులతో పాటు చిన్నపిల్లలు, వయోవృద్ధులు, మహిళలు మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. -
మాట తప్పిన సర్కార్
గార్లదిన్నె మండలం మర్తాడుకు చెందిన వడ్దే రామచంద్ర గొర్రెల కాపరి. గొర్రెలు మేపేందుకు వెళ్లిన అతను వడదెబ్బకు గురై 2016 ఏప్రిల్ 27 అడవిలోనే మృతి చెందాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. కుమారుడు అప్పటికే వేరుగా వెళ్లి పోయాడు. దీంతో రామచంద్ర ఇద్దరు కూతుళ్లు, భార్య జీవనం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ యాజమాని మృతి చెందడంతో ఉన్న 30 గొర్రెలు అమ్ముకున్నారు. దీనికి తోడు రామచంద్ర భార్య శివమ్మకు అనారోగ్యం గురికావడంతో వైద్యఖర్చులకు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం మంజూరు చేస్తామన్న లక్షరూపాయలు కూడా అందలేదు. గార్లదిన్నె: మండే ఎండలతో వడదెబ్బ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో ఉపాధి కూలీలు, గొర్రెల కాపరులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషియా అందించి ఆదుకుంటామని తెలుగుదేశం ప్రభుత్వం ప్రకటించింది. రెండేళ్లుగా ఎదురు చూస్తున్న బాధిత కుటుంబాలకు నిరాశే ఎదురైంది. ఈ వేసవిలో కూడా వడదెబ్బ మరణాలు నమోదవుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదు గత రెండేళ్లుగా మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో జనం పిట్టల్లా రాలిపోయారు. జిల్లాలోనే శింగనమల మండలం తరిమెల గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రతలు దాదాపు 47 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వడ దెబ్బ మృతుల విషయానికి వస్తే నియోజకవర్గంలో 25 మంది దాకా మృత్యువాత పడ్డారు. జిల్లా వ్యాప్తంగా 226 మంది వేసవిలో ఎండ తీవ్రతకు ప్రాణాలొదిలారు. ప్రతి పాదనలకే పరిమితం వడ దెబ్బతో చనిపోయిన కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం లక్ష రూపాయలు ఎక్స్‌గ్రేషి యా ఇస్తామని చెప్పింది. జిల్లాలో వడ దెబ్బతో మృతి చెందిన వారి వివరాలు అధికారులు సేకరించారు తప్ప ఇప్పటికీ మృతుల కుటుంబాలకు ఒక్క పైసా పరిహారం అందలేదు. మరి కొంతమంది ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాల వద్దకు తిరుగుతున్నా ఎవ్వరికీ పట్టడం లేదు. ఒక్క రూపాయి పరిహారం రాలేదు పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన చింతమాను పెద్ద నారాయణ 2016 ఏప్రిల్ 13న కట్టెల కోసం కొండకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో ఎండవేడిమికి వడదెబ్బ బారినపడ్డాడు. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెదుక్కుంటూ రాగా మార్గమద్యలో పెద్ద నారాయణ మృతదేహం కనిపించింది. తీవ్రమైన ఎండ వేడిమికి అతని శరీరమంతా బొబ్బలు వచ్చి మరణించాడు. వడదెబ్బకు గురై మరణించిన కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందించి ఆదుకుంటామని చెప్పిన చంద్రబాబు మాటలు నేటికీ కార్యరూపం దా ల్చలేదని మృతుడి భార్య అంకాళమ్మ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎవరూ పట్టించుకోవడం లేదు 2017 సంవత్సరంలో నా భర్త సాకే రామన్న ఇంటి వద్ద గుడిసెకు మరమ్మతులు చేస్తుండగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండడంతో వడ దెబ్బ తగిలి చనిపోయాడు. అప్పట్లో వీఆర్వో మిగతా అధికారులు వచ్చి వివరాలు అన్నీ తీసుకెళ్లారు. ఇంత వరకు ప్రభుత్వం పరిహారం అందించలేదు.– ఉత్తమ్మ, బుక్కరాయసముద్రం -
తాడిమర్రి @ 40
అనంతపురం అగ్రికల్చర్: చలికాలం పూర్తి కాకుండానే భానుడు ఉగ్రరూపం దాలుస్తున్నాడు. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కనిపించాల్సిన పరిస్థితి ఫిబ్రవరిలోనే కనిపిస్తోంది. వేసవి రాక మునుపే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు డిగ్రీలు అధికంగా నమోదువుతున్నాయి. తాడిమర్రిలో గురువారం అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 34 నుంచి 38 డిగ్రీల వరకు నమోదయ్యాయి. అగళిలో 14.8 డిగ్రీల కనిష్టం ఉండగా.. మిగతా మండలాల్లో 16 నుంచి 22 డిగ్రీల మధ్య కొనసాగింది. గాలిలో తేమశాతం ఉదయం 72 నుంచి 78, మధ్యాహ్నం 22 నుంచి 34 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 6 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ ఏడాది వేసవితాపం తారస్థాయిలో ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. -
భానుడు భగభగ
ఈనెల మొదటి వారంలో వాతావరణం చల్లబడినట్లు కనిపించినా మళ్లీ భానుడు ప్రతాపం చూపుతున్నాడు.నైరుతి రుతు పవనాలు తొందరగా వచ్చినా ఫలితం కనిపించలేదు.గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం జూన్ ఆరంభం వేడి ప్రభావంతక్కువగానే ఉంది. అంతేకాకుండాకొద్దో గొప్పో చినుకులూ పడ్డాయి.దీంతో రైతులు ఖరీఫ్ పనులనుప్రారంభించారు. ఉన్నట్లుండి నాలుగైదు రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగి బెంబేలెత్తిస్తున్నాయి. మేనెల మాదిరిగావడగాల్పులు కూడా వీస్తున్నాయి. తిరుపతి తుడా: ఎండలు భగ భగ మండుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా భానుడు చెలరేగుతున్నాడు. జిల్లా నిప్పుల కొలిమిలా మారింది. ఎండ తీవ్రత మే నెలను తలపిస్తోంది. ప్రజలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. సోమవారం రాయల సీమ జిల్లాలతో పోలిస్తే తిరుçపతిలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వారం క్రితం వరకు తగ్గుముఖం పట్టిన ఉష్ణోగ్రతలు నాలుగు రోజులుగా పెరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ఐదారు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో పగలంతా వేడి సెగలుగా ఉంది. తక్కువ రోజుల వ్యవధిలో ఎక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. నాలుగు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రంపై రుతుపవనాలు బలంగా లేనందున ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రంపై పెద్దగా ప్రభావం చూపడం లేదని అంచనా. మరోపక్క ఈశాన్య గాలులు ప్రభావం అధి కంగా ఉండటం, రుతుపవనాలకు అల్పపీడనం తోడవ్వకపోవడంతో ఆశించిన స్థాయిలో తొలకరి జల్లులు లేవు. రుతుపవనాలు వచ్చినా అల్పపీడనం బలంగా తోడైతేనే వర్షాలు పడే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడేవరకు పరిస్థితి ఇలానే కొనసాగుతుందంటున్నారు. ఇందుకు మరో మూడు, నాలుగు రోజులు పట్టవచ్చు. అంత వరకు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగే అవకాశముంది. ఎండకు ఉక్కిరి బిక్కిరి.. ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరంగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జూన్ మూడో వారంలోనూ 40.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవి సెలవులు పూర్తి చేసుకుకోవడంతో విద్యార్థులంతా బడిబాట పట్టారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5.50 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా విద్యార్ధులు బడులకు వచ్చి వెళ్లే సమయంలో మాడిపోతున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభా వంతో జూన్ మొదటి నుంచి ఉష్ణోగ్రతలు జిల్లావ్యాప్తంగా తగ్గుముఖం పట్టడంతో ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొం దారు. ఈ ప్రభావం ఎక్కువ రోజులు కనిపిం చలేదు. గడిచిన నాలుగు రోజులుగా 39 డిగ్రీలకు మించి నమోదువుతున్నాయి. రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇలానే కొనసాగే అవకాశం ఉండటంతో ఎండల్లోనే కార్యకలాపాలు సాగిం చాల్సిన పరిస్థితి నెలకొంది. -
పాపం..పావురం..!
సాక్షి ఫొటోగ్రాఫర్ విజయవాడ :ప్రచండ భానుడి ప్రతాపానికి సకల జీవరాశులు అల్లాడుతున్నాయి. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో పావురాలు ఇలా ప్లాస్టిక్ టబ్‌లో నీటితో దాహార్తి తీర్చుకున్నాయి. చెరువుల్లో నీరు అడుగంటడంతో ప్రజలంతా డాబాలపై పక్షుల కోసం చిన్న చిన్న టబ్బుల్లో నీరు పోసి పెడితే బాగుంటుంది కదూ..విజయవాడ స్టేట్ గెస్ట్ హౌస్ ఆవరణలో కనిపించిన ఈ దృశ్యాన్ని ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. -
నగరానికి ఎక్కిళ్లు !
బెజవాడలో భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. రోజురోజుకు ఎండలు మండుతున్నాయి. 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదైంది. ఓ పక్క మండుటెండతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరో పక్క గుక్కెడు నీరు దొరక్క నగరవాసుల గొంతులెండిపోతున్నాయి. ట్యాంకర్ల వద్ద బిందెడు నీరు పట్టుకోవాలంటే భగీరధ ప్రయత్నం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో నివసించే వారి పరిస్థితి దయనీయంగా ఉంది. రెండు మూడు రోజులకొకసారి కూడా నీళ్లు రాకపోవడంతో రోజువారీ అవసరాలూ తీర్చుకోలేకపోతున్నామని వాపోతున్నారు. గొంతు తడవక ఎక్కిళ్లు వస్తున్నాయంటున్నారు. సాక్షి, అమరావతి బ్యూరో : రాజధాని నేపథ్యంలో నగరంలో ప్రస్తుత జనాభా దాదాపు 15 లక్షల వరకు చేరింది పెరుగుతున్న జనాభాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి సంఖ్య క్రమేపీ పెరగటం, శివారు ప్రాంతాల్లో నూతన గృహ సముదాయాలు ఏర్పడటంతో తాగునీటి డిమాండ్ పెరిగింది. శివారు ప్రాంతాల్లోని రామలింగేశ్వరనగర్, ప్రకాష్‌నగర్, భవానీపురం, కరెన్సీనగర్‌లో ఇటీవల కాలంలో భవన నిర్మాణాలు ఎక్కువయ్యాయి. పెరిగిన జనాభాకు అనుగుణంగా నీటి సరఫరా కావడం లేదు. కొండప్రాంతాలైన వన్‌టౌన్‌లోని ఆంజనేయవాగుసెంటర్, చిట్టినగర్, భవానీపురం, ఎర్రకట్ట, గుణదల గంగిరెద్దుల దిబ్బ ప్రాంతం, మాచవరం, గుణదల, మొగల్రాజపురం, క్రీస్తురాజపురం ప్రాంతాలతోపాటు పటమట, ఆటోనగర్, భవానీపురం, కృష్ణలంక, ప్రకాష్‌నగర్, సింగ్‌నగర్‌లోని ఇందిరానాయక్‌నగర్ ప్రాంతంలో తాగునీటి కోసం జనం అలమటిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో పాత పైపులైన్లు ద్వారానే నీటి సరఫరా కొనసాగుతోంది. డిమాండ్‌కు అనుగుణంగా నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. చాలా ప్రాంతాల్లో మూడు–నాలుగు అంగుళాల పైపులే ఉంటున్నాయని, వీటిని తొలగించి ఆరు అంగుళాల పైపులు మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పురోగతి లేని పనులు... కార్పొరేషన్ పరిధిలోని 59 డివిజన్లలో అ«ధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్‌ను అధికారులు సిద్ధం చేసినప్పటికీ పూర్తిస్థాయిలో నీటి ఎద్దడిని నిరోధించటంలో అధికారులు విఫలమయ్యారని విమర్శలొచ్చాయి. 14వ ఫైనాన్స్ కమిటీ నుంచి నిధులు ఖర్చు చేయటానికి పాలకపక్షం సిద్ధమయినప్పటికీ కొండప్రాంతాల్లో, స్లమ్ ఏరియాల్లో రిజర్వాయర్ల నిర్మాణం, వాటర్‌ట్యాంకుల నిర్మాణాల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కొందరు కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై ఇటీవల మేయర్ కోనేరు శ్రీధర్‌కు కార్పొరేటర్ల నుంచి పలు ప్రతిపాదనలు వచ్చాయి. 32వ డివిజన్లో 5 ఎంజీడీ ప్లాంట్‌కు ఇన్‌టెక్‌వెల్ నిర్మాణం, హెడ్ వాటర్‌వర్క్స్‌లోని 5 ఎంజీడీ ప్లాంట్ నిర్మాణం, 28వ డివిజన్లోని హౌసింగ్‌బోర్డు కాలనీలో 1500 కేఎల్ఎస్ఆర్ నిర్మాణం, 53వ డివిజన్లో ఎక్సెల్‌ప్లాంట్ హౌసింగ్, పక్కనే ఉన్న గద్దె వెంకటరామయ్యనగర్లో 1000 కేఎల్ కెపాసిటీ తాగునీటి నిర్మాణం చేయాలని తలపెట్టారు. ఇప్పటి వరకు పనుల పురోగతి లేదు. 2వ డివిజన్లోని కనకదుర్గా నగర్ కాలనీ, రామచంద్రనగర్, ఇతర క్రాస్ రోడ్లకు 400 ఎంఎం డయాట్రంక్లైన్ వేయటం, 12వ డివిజన్లోని పటమట లంకలోని 1500 కెఎస్ఎస్ఆర్ నిర్మాణం, 2వ డివిజన్లోని గురునానక్‌కాలనీలో 1000 కేఎల్ కెపాసిటీ ఈఎల్ఎస్ఆర్ నిర్మాణం, 19వ డివిజన్లోని నిమ్మతోట కొండ ప్రాంతంలో 200 కేఎల్ కెపాసిటీ జీఎల్ఎస్ఆర్ నిర్మాణం చేపట్టేదుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. వేసవి ముగుస్తున్నా ఇప్పటి వరకు అక్కడ తలపెట్టిన పనుల్లో ఎలాంటి çపురోగతిలేదు. కొండపైకి నీరు కష్టమే... ఆయా ప్రాంతాల్లో సమ్మర్ యాక్షన్‌ప్లాన్ కింద రూ. 15 కోట్లు నిధులు ఖర్చుచేస్తున్నట్లు పాలకులు చేసిన ప్రకటనలు నీటి మూటలుగా మిగిలిపోయాయి. ఇప్పటి వరకు సమ్మర్ యాక్షన్‌ప్లాన్‌లో కొండప్రాంతాల్లో నీరు కొండపైకి ఎక్కేందుకు బూస్టర్లు కొత్తవి ఏర్పాటు చేయటం, పాతవి మరమ్మతులుకు చేయాలని ప్రకటించారే తప్పా వాటి ఆయా యంత్రాలు యథాతథంగా మరమ్మతులు జరుగుతునే ఉన్నాయి. ఆయా పనులకు, బూస్టర్ల కొనుగోలు/మరమ్మతులు, ఇతర పనులకు ఇప్పటి వరకు రూ. కనీసం రూ. 5 కోట్లు కూడా ఖర్చుచేసిన దాఖలాలు లేవని ప్రతి పక్ష సభ్యులు ఆరోపిస్తున్నారు. కొండ ప్రాంతవాసులంటే చులకన కొండప్రాంతవాసులంటే ప్రభుత్వానికి, అధికారులకు చులకన భావం ఉన్నట్లుంది. రెక్కాడితే గానీ డొక్కాడని ప్రజలు నివసించే ప్రాంతంలో అర్ధరాత్రిపూట తాగునీరు సరఫరా చేస్తున్నారు. దీనికితోడు నీళ్లు ఇచ్చేది కూడా గంట మాత్రమే. అవసరమైన మేరకు నీరు సరఫరా చేయటంలో అధికారులు విఫలమయ్యారు. వేసవిలో ట్యాంకర్లను ఏర్పాటు చేయాల్సి ఉన్న మూడు–నాలుగు రోజులకు ట్యాంకర్లు వస్తున్నాయి. మా గోడు పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. – కె. ఆంజనేయులు, చిట్టినగర్ -
మీ బండిని ఎండలో పార్క్ చేస్తున్నారా..
గుంటూరు: వాతావరణంలో చోటుచేసుకున్న మార్పులతో ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పెరిగిపోయాయి. సాయంత్రం ఆరు గంటల వరకు చల్లదనం మాటే వినిపించడంలేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనతో పాటు మన వాహనాలను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. లేనిపక్షంలో ఎండ తీవ్రతకు అవి దెబ్బతిన మన జేబులను ఖాళీ చేయిస్తాయి. ఈ నేపథ్యంలో కొద్దిపాటి జాగ్రత్తలతో వాహనాలను ఎలా సంరక్షించుకోవాలో చూద్దాం రండి.. ద్విచక్ర వాహనాల విషయంలో ఇలా... ♦ ద్విచక్ర వాహనాలను ఎక్కువ సేపు ఎండలో ఉంచకూడదు. ♦ అలా ఉంచడం వల్ల ట్యాంకులోని పెట్రోలు ఆవిరైపోతుంది. ♦ అతినీలలోహిత కిరణాల ప్రభావంతో వాహనం రంగు వెలిసిపోతుంది. ♦ పార్కింగ్‌లో ఎక్కువ సేపు ఉంచాల్సి వస్తే తప్పనిసరిగా కవర్లు కప్పాలి. ♦ రాత్రి వేళల్లో పెట్రోలు కొట్టించాలి. ఆ సమయంలో వేడి తీవ్రత తక్కువగా ఉండి ఆవిరి కాకుండా ఉంటుంది. ♦ అధిక వేడి వల్ల తరచూ టైర్లలో గాలి తగ్గిపోతుంది. అది గమనించి సరైన మోతాదులో గాలి నింపుకోవాలి. ♦ ద్విచక్ర వాహనాలపై సుదూర ప్రయాణం చేయకపోవడం ఉత్తమం. ♦ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే ప్రతి 20 కిలోమీటర్లకు ఒకసారి బండి ఆపాలి. ♦ సుమారు 5 నుంచి 10 నిమిషాల పాటు ఇంజిన్ ఆపివేయాలి. దీని వల్ల ఇంజన్ చల్ల బడి అధిక మన్నిక వస్తుంది. ♦ వేసవిలో ఇంజిన్ ఆయిల్ త్వరగా శక్తి కోల్పోతుందని గమనించండి. ♦ కనుక ఇంజిన్ ఆయిల్ ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ♦ వారంలో ఒక్కసారైన బ్రేక్ షూలు, రబ్బరు విడిభాగాలు చెక్ చేసుకోవాలి. ♦ అధిక వేడి వల్ల రబ్బరు విడిభాగాలు త్వరగా దెబ్బతింటాయి. నాలుగు చక్రాల విషయంలో ఇలా... ♦ కార్లు, ఇతర భారీ వాహనాల విషయంలో రేడియేటర్లో నీటిని తరచూ చెక్ చేసుకోవాలి. ♦ నిర్లక్ష్యం చేస్తే ఇంజిన్ ఫ్రీజ్ అయ్యే ప్రమాదం ఉంది. ♦ రేడియేటర్లో నీళ్లకంటే కూలెంజ్ ఆయిల్ వాడడం మంచిది. ♦ ఇంజిన్ ఆయిల్ తగ్గే అవకాశాలు ఉంటాయి. కనుక తరచూ ఆయిల్ లెవల్ చెక్ చేసుకోవాలి. ♦ ఎండకాలం పూర్తయ్యే వరకూ కొత్త టైర్లు వాడాలి. ♦ వేసవిలో టైర్లు వేయించాల్సి వస్తే సెకండ్స్, చైనా, రీబటన్ టైర్లు జోలికి వెళ్లకపోవడం మంచిది. ♦ వాహనాన్ని పార్కింగ్ చేసేటప్పుడు నీడలో ఉంచేలా జాగ్రత్త తీసుకోవాలి. ♦ లేనిపక్షంలో కవర్ కప్పి ఉంచాలి. ఎక్కువ సేపు ఎండలో ఉంటే వాహనం రంగు పాలిపోతుంది. ♦ ఇప్పుడు వస్తున్న వాహనాలన్ని ప్యూజిల్ కంప్యూటర్లతో అనుసంధానమై ఉంటున్నాయి. ♦ కనుక వాహనాల్లోని వైరింగ్ వ్యవస్థను ప్రతి 15 రోజులకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ♦ కార్లకు పెట్రోల్ స్థానంలో ఎల్పీజీ గ్యాస్ కిట్లు అమర్చుకుని వాటిని ఉపయోగించే వారు ఈ వేసవిలో వాటికి దూరంగా ఉండటం ఉత్తమం. ♦ వంట గ్యాస్ అసలు వినియోగంచరాదు. ♦ అధిక ఉష్ణోగ్రతల వల్ల గ్యాస్ పీడనానికి గురయ్యే ప్రమాదం ఉంది. ♦ తప్పని సరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఉదయం, సాయంత్రం ఎండతీవ్రత లేని వేళల్లో వాడటం మంచిది. ♦ కారులో ఏసీ నిలబడేందుకు సెడ్ అద్దాలకు ఫిల్మ్ లేని వారు అద్దాలకు సరిపడా క్లాత్ మ్యాట్స్ లభిస్తున్నాయి. వాటిని అద్దాలకు అమర్చుకోవచ్చు. -
పగలు ఎండ.. సాయంత్రం వాన
అనంతపురం అగ్రికల్చర్: వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటుండడంతో జిల్లా వ్యాప్తంగా మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడు ఉగ్రరూపం చూపుతుండగా.. సాయంత్రానికి వరుణుడు కరుణిస్తున్నాడు. ఆదివారం తాడిమర్రిలో 42.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా రొళ్లలో 21.8 డిగ్రీల కనిష్ట ఉష్ణగ్రత నమోదైంది. మిగతా మండలాల్లో 36 నుంచి 41 డిగ్రీల మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు...22 నుంచి 25 డిగ్రీల మధ్య కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంటకు 8 నుంచి 14 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మరికొన్ని మండలాల్లో గాలివేగం ఎక్కువగా రికార్డయింది. పలు మండలాల్లో వర్షం శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 42 మండలాల పరిధిలో 3.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. యాడికిలో 22.5 మి.మీ, పుట్లూరులో 18.8 మి.మీ, పెద్దవడుగూరులో 16.7 మి.మీ, శింగనమలలో 15.5 మి.మీ, గుంతకల్లులో 13.9 మి.మీ, విడపనకల్లులో 13.8 మి.మీ, బొమ్మనహాళ్‌లో 12.4 మి.మీ, డి.హీరేహాళ్‌లో 11.4 మి.మీ వర్షం కురవగా మిగతా మండలాల్లో తేలికపాటి నుంచి జల్లులు పడ్డాయి. ఇక ఆదివారం సాయంత్రం కూడా హిందూపురం, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో చిరుజల్లుల నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. -
కొక్కిరి బిక్కిరి
తూర్పుగోదావరి ,మండపేట: జిల్లాలోని పౌల్ట్రీల్లో వివిధ దశల్లో సుమారు 2.4 కోట్ల కోళ్లు ఉండగా వీటిలో గుడ్లు పెట్టేవి 1.30 కోట్లు ఉన్నాయి. సాధారణ పరిస్థితుల్లో రోజుకు 1.1 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. రోజుకు 25 నుంచి 28 వేల వరకూ కోళ్లు మృత్యువాత పడుతుంటాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. ఐదు రోజులుగా 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం, వేడిగాలుల ప్రభావంతో కోళ్ల మరణాలు ముందెన్నడూ లేనంతగా పెరిగాయని రైతులు అంటున్నారు. జిల్లావ్యాప్తంగా రోజుకు 1.5 లక్షల వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు అంచనా. ఆయా దశల కోళ్లను బట్టి ఒక కోడి చనిపోవడం వల్ల సగటున రూ.100 వరకు నష్టం వాటిల్లుతుంది. ఈ మేరకు కోళ్ల మరణాల రూపంలో రోజుకు రూ.1.5 కోట్ల నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు ఆరు రోజులుగా రూ. తొమ్మిది కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఎండలు మరింత ముదిరితే మరణాల సంఖ్య పెరిగిపోతుందన్న ఆందోళనలో కోళ్ల రైతులు ఉన్నారు. మరోపక్క నాలుగు రోజులుగా గుడ్లు ఉత్పత్తి 15 శాతం మేర పడిపోయింది. సాధారణ పరిస్థితుల్లో రోజుకు కోటి 10 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ఎండల తీవ్రతతో సుమారు 93.5 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రోజుకు 16.5 లక్షల గుడ్లను రైతులు కోల్పోవాల్సి వస్తోంది. ప్రస్తుతం గుడ్డు రైతు ధర రూ.3.4 పైసలు ఉండగా రోజుకు రూ.దాదాపు రూ.56 లక్షలు చొప్పున ఆరు రోజుల్లో రూ.3.36 కోట్ల మేర పౌల్ట్రీకి నష్టం వాటిల్లింది. ఆయా రూపాల్లో ఆరు రోజుల్లోను పౌల్ట్రీ పరిశ్రమకు రూ.12.36 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు పౌల్ట్రీ వర్గాలంటున్నాయి. జిల్లా నుంచి ప్రధానంగా ఎగుమతులు జరిగే పశ్చిమబెంగాల్, ఒడిశాలలో వినియోగం తగ్గడంతో గుడ్డు ధర పతనం బాట పట్టనుందని కోళ్ల రైతులు అంటున్నారు. నిర్వహణ భారం తడిసి మోపెడు అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం తడిసిమోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా వాటికి ప్రత్యేక మందులు ఇవ్వడం, కోళ్లకు వేడిగాలులు తగలకుండా ఫారాలు చుట్టూ గోనె సంచులు కట్టి వాటికి వాటరింగ్ చేయడం, స్ప్రింక్లర్లు ఏర్పాటు తదితర జాగ్రత్తలకు తోడు పెరిగిన మేత ధరలు, కూలీ రేట్లతో నిర్వహణ భారం పెరిగిపోతోంది. ఇటీవల ఈదురుగాలుల ప్రభావం పరిశ్రమకు అపారనష్టాన్ని కలుగజేసింది. అర్తమూరు, ద్వారపూడి, అనపర్తి ఏరియాల్లోని పౌల్ట్రీ ఫారాల్లో షెడ్ల రేకులు ఎగిరిపోయి రైతులు నష్టపోవాల్సి వచ్చింది. గోదాముల్లోని కోడిమేతలు తడిసిపోయాయి. అధిక ఉష్ణోగ్రతలతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం, జనరేటర్లు సరిగా పనిచేయకపోవడం తదితర కారణాలతో విద్యుత్ సమస్యలు తోడవుతున్నాయి. ఈ తరుణంలో కోళ్ల మరణాలు, ఉత్పత్తి పడిపోవడం, గుడ్డు ధర తగ్గడం పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందుముందు ఎండలు మరింత ముదరనుండటంతో పరిశ్రమ మరింత నష్టాల్లో కూరుకుపోతుందని కోళ్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాలి ఎండల తీవ్రతతో కోళ్ల పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కోళ్ల మరణాలు, గుడ్ల ఉత్పత్తి తగ్గిపోయి కుదేలైపోయిన కోళ్ల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. లేకపోతే ప్రత్యక్ష్యంగా, పరోక్షంగా ఈ రంగాన్నే నమ్ముకున్న వేలాది మంది బతుకులు రోడ్డున పడే ప్రమాదముంది. పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. – పడాల సుబ్బారెడ్డి, నెక్ జిల్లా చైర్మన్,పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెక్ జాతీయ కమిటీ సభ్యుడు, అర్తమూరు -
కోళ్లకూ భానుడి ఎఫెక్ట్
జిల్లాలో మండుతున్నఎండలు కోళ్ల రైతులకుఊపిరాడకుండా చేస్తున్నాయి. ఫారాల్లోని కోళ్లు ఎండ ధాటికి పిట్టల్లా రాలిపోతున్నాయి. వ్యయప్రయాసల కోర్చి ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదు. గత నెల 30వ తేదీన ఎండ 43 డిగ్రీలుగా నమోదైంది. ఆ రోజు ఎండతీవ్రతను తట్టుకోలేక జిల్లాలో మూడు వేల కోళ్లు మృత్యువాత పడ్డాయి. కొడవలూరు: ఈ ఏడాది వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండటంతో జిల్లాలో రోజుకు వెయ్యి నుంచి రెండువేల కోళ్లు దాకా చనిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రత మరో నెల ఇదేవిధంగా కొనసాగుతూ మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు చెబుతుండటంతో కోళ్ల రైతులు అయోమయంలో పడ్డారు. జిల్లాలో మూడు లక్షల కోళ్లు జిల్లాలోని కొడవలూరు మండలం తలమంచి, కోవూరు మండలం పాటూరు, నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ, అల్లీపురంలో కోళ్ల ఫారాలున్నాయి. వీటన్నింటిలో సుమారు మూడు లక్షల కోళ్లు ఉన్నాయి. వీటిలో సింహభాగం తలమంచిలోనే 1.50 లక్షల కోళ్లున్నాయి. గుడ్లు ఉత్పత్తి లక్ష్యంగా వీటిని కోళ్ల ఫారాల్లో పెంచుతున్నారు. రోజుకు సగటున రెండు లక్షల గుడ్లు దాకా జిల్లాలోని కోళ్ల ద్వారానే ఉత్పత్తి చేస్తున్నారు. రోజుకు 10 లక్షల గుడ్లు దాకా జిల్లాలో వినియోగం ఉన్నా, మిగిలిన గుడ్లను హైదరాబాద్, విజయవాడ, తమిళనాడులోని నమ్మకల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ముందు జాగ్రత్తలు ♦ ఎండ తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడకుండా వ్యయ ప్రయాసలకోర్చి రైతులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కోళ్ల ఫారం చుట్టూ గోతపు పట్టలు కప్పి నిత్యం వాటిని నీటితో తడుపుతున్నారు. ♦ పైకప్పు రేకులపై స్పింక్లర్లు ఏర్పాటు చేసి ఎండ సెగను తగ్గించేందుకు యత్నిస్తున్నారు. ♦ కోళ్ల తాగునీటి కోసం ఏర్పాటు చేసిన చానల్స్‌లో నీళ్లు నిల్వ ఉండకుండా నిత్యం సరఫరా అయ్యేలా చూస్తున్నారు. ♦ ఎండకు కోళ్లు మేత తక్కువగా తింటుండడంతో గుడ్ల పరిమాణం తగ్గుతోంది. దీనిని పెంచేందుకు హైప్రొటీన్, హై ఎనర్జీ, ఎక్స్ట్రా కాల్షియం, గ్లూకోజ్‌లు అదనంగా ఇస్తున్నారు. ♦ కోళ్ల ఫారాలు లోపల వేడిని తగ్గించేందుకు నీటిని మంచు వలె చల్లే ఫాగర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఫారాల్లో ప్రత్యేక ఫ్యాన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. తీవ్ర నష్టమే ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ నష్టాన్ని నివారించలేకపోతున్నారు. రోజుకు సగటున జిల్లాలో వెయ్యి కోళ్లు దాకా మృతి చెందుతున్నాయి. ఏప్రిల్ 30వ తేదీన ఎండ తీవ్రమవ్వడంతో తలమంచిలోనే వెయ్యి కోళ్లు మృతి చెందాయి. మిగిలిన అన్ని చోట్ల కలిపి రెండు వేల దాకా మృతి చెందాయి. పాటూరులో 30 వేల కోళ్లకు గానూ ఆ ఒక్క రోజే 500 మృతి చెందాయి. తగ్గిన గుడ్ల ఉత్పత్తి ♦ రోజుకు రెండు లక్షల గుడ్ల ఉత్పత్తి రావాల్సి ఉండగా, కేవలం 1.50 లక్షల గుడ్ల ఉత్పత్తే వస్తోంది. ♦ చిన్న పరిమాణం గుడ్లు 50 శాతం ఉంటున్నాయి. పరిమాణం పెద్దగా ఉంటే రూ.3.50 పైసల వంతున విక్రయిస్తున్నారు. చిన్నవిగా ఉంటే మాత్రం రూ.2.50 పైసల వంతునే విక్రయించాల్సి వస్తోంది. ♦ వేసవి పరిస్థితుల దృష్ట్యా గుడ్డు ధర పెంచాలంటే ధర నిర్ణయం రైతుల చేతుల్లో లేదు. దేశ వ్యాప్త మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ముంబయిలో ధర నిర్ణయం జరుగుతోంది. దీనికితోడు వేసవిలో జిల్లాలోనూ గుడ్ల వినియోగం తగ్గుతోంది. సాధారణం కంటే 10 నుంచి 15 శాతం వినియోగం తగ్గుతోంది. ఈ నేపథ్యంలో ధర పెంచడం కుదరదని ధర నిర్ణేతలే ప్రకటిస్తున్నారు. పెరిగిన బ్రాయిలర్ కోళ్ల మృతుల శాతం ఫారాల్లో మాంసం కోసం పెంచే బ్రాయిలర్ కోళ్లకూ వేసవి షాక్ తగులుతోంది. వీటి మృతుల సంఖ్య వేసవిలో గణనీయంగా పెరుగుతోంది. సాధారణ పరిస్ధితుల్లో వీటి మరణాలు 4 నుంచి 5 శాతం ఉంటే వేసవిలో 10 నుంచి 15 శాతం ఉంటున్నాయి. ఫలితంగా వీటి మాంసం ధర గణనీయంగా పెరుగుతోంది. జిల్లాలో నెలకు ఆరు లక్షల కోళ్లు అవసరం ఉంది. ఒక్క కోడి నుంచి సగటున రెండు కిలోల మాంసం వస్తుంది. ఈ లెక్కన జిల్లాలో నెలకు ఆరు లక్షల కిలోల బ్రాయిలర్ మాంసం అవసరం ఉంది. వేసవిలో వీటి మరణాలు అధికంగా ఉండటంతో వేసవి కాలంలో జిల్లాలో వీటి పెంపకాన్ని పూర్తిగా వదిలేశారు. ప్రస్తుతం జిల్లాకు అవసరమైన బ్రాయిలర్ కోళ్లను చిత్తూరు జిల్లా పలమనేరు, తమిళనాడులోని కృష్ణగిరి, కర్ణాటకలోని కోలార్ నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. జిల్లాకు అవసరమైన కోళ్లన్నీ ఇతర ప్రాంతాల నుంచి వస్తుండడంతో రవాణాలోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. మే, జూన్ మాసాల్లోనైతే 15 శాతానికి తగ్గకుండా మరణాలుంటున్నాయి. ఫలితంగా వీటి మాంసం ధర వేసవిలో ఆకాశాన్నంటుతోంది. గురువారం కిలో బ్రాయిలర్ మాంసం చర్మంతో కలిపి రూ.176 ఉండగా, చర్మం లేకుండా(స్కిన్లెస్) రూ.208గా ఉంది. -
కాలిపోతున్న ‘ఉపాధి’ కూలీ
డక్కిలి: జిల్లాలోని 46 మండలాల్లో 939 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 33, 428 గ్రూపుల్లో 5.87,125 మందికి జాబ్‌కార్డులు జారీ చేయగా ఇందులో 5,34,513 మంది కూలీలు ఉన్నారు. వీరిలో రోజుకు లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాల్సి ఉంటే.. 70 వేలు నుంచి 80 వేలు మంది మాత్రమే కూలీలు ఉపాధి హామీ పనులు చేస్తున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద పనిచేస్తున్న ప్రదేశాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టమైన ఆదేశాల జారీ చేసింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతోన్నాయి. కొద్ది రోజులుగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా కూలీలు ఎండలో పనిచేసేందుకు జంకుతున్నారు. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రతలు 40–46 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కూలీలు పనిచేసే చోట మెడికల్ కిట్లతో పాటు దాహం తీర్చడానికి మంచి నీరు, మజ్జిగను సరఫరా చేయాల్చి ఉంది. విధిగా టెంట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉన్నా..అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. డక్కిలి మండలంలోని 27 గ్రామ పంచాయతీల్లో 2 వేల మందికి పైగా కూలీలు పని చేస్తున్నారు. ఇక్కడ అధికారులు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. కనీసం తాగేందుకు నీళ్లు కూడా లేవు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా లేకపోవడం చూస్తే కూలీలపై అధికారులకు ఉన్న భద్రత అద్దం పడుతుంది. పనుల వద్ద వసతులు లేకపోవడం, ఎండ తీవ్రత, సకా లంలో బిల్లులు రాకపోవడంతో కూలీల హాజరు రోజు రోజుకు తగ్గుతుంది. కనిపించని మెడికల్ కిట్లు విధిలేని పరిస్థితుల్లో ఎండలోనే పనిచేస్తున్న ఉపాధి కూలీలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఉదయం 7 నుంచి సూర్యుడి ఉగ్రరూపం దాల్చుతున్నాడు. ఉపాధి కూలీలుకు వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు ప్రథమ చికిత్స చేసేందుకు అవసరమైన మెడికల్ కిట్లు ఏర్పాటు చేయాల్చి ఉన్నా.. ఎక్కడ కూడా కనిపంచడం లేదు. కొన్ని ప్రాంతాల్లో రెండేళ్ల క్రితం అందజేసిన మెడికల్ బాక్స్‌లనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వీటిలో ఒక్క అయోడిన్ మినహ అన్నీ కాలం చెల్లడంతో ప్రథమ చికిత్స బాక్స్‌లను మూలన పడేశారు. ఈ పరిస్థితుల్లో వడదెబ్బ తగిలితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పగటి ఉష్ణోగ్రత భారీగా పెరుగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు కాలు బయట పెట్టేందుకూ జంకే పరిస్థితి. అత్యవసరమైతే తప్ప..బయటకు రావద్దని జిల్లా అధికారులే హెచ్చరికలు చేస్తున్నారు. కానీ ఉపాధి హామీ పనులు చేసే చోట కూలీలు ఎండకు కాలిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకం పనులు చేపట్టే చోట ఎండాకాలంలో నీడ, మంచినీళ్లు, మజ్జిగ వంటి ఉపశమన చర్యలతో పాటు మెడికల్ కిట్లు కూడా అందుబాటులో ఉంచాల్సి ఉంది. అధికారులు పని ప్రాంతంలో ఎలాంటి వసతి కల్పించకపోవడంతో కూలీలు చుక్కలు చూడాల్చి వస్తుంది. -
వడదెబ్బతో ఆరుగురి మృత్యువాత
మోత్కూరు (తుంగతుర్తి) : మండల కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌కు చెందిన ఎడ్లబండి కార్మికుడు గాలి నర్సయ్య(28) వడదెబ్బతో సోమవారం తెల్లవారుజామున మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నర్సయ్య కుటుంబాన్ని సాకేందుకు.. ఎడ్ల బండే జీవనాధారంగా బతుకుతున్నాడు. అతనికి తల్లిదండ్రులు, భార్య, ముగ్గురు పిల్లలను ఎడ్లబండి తోలగా వచ్చిన కిరాయితోనే.. సాకుతున్నాడు. వారంరోజులుగా ఎండలు తీవ్రం కావడంతో ఎడ్ల బండిద్వారా ఇసుక తరలిస్తూ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆదివారం సాయంత్రం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి మృతిచెందాడు. నర్సయ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్ని అంబేద్కర్యువజన సంఘం మండల కన్వీనర్ గుంటిదేవ కోరాడు. నకిరేకల్‌లో.. కూలీ నకిరేకల్ : వడదెబ్బతో నకిరేకల్ పట్టణంలోని మార్కెట్ రోడ్డుకు చెందిన సరికొండ జానయ్య(40) సోమవారం మృతిచెందాడు. జానయ్య రోజువారిగా కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో వడదెబ్బకు గురై సోమవారం మృతి చెందాడు. మృతదేహాన్ని సర్పంచ్ పన్నాల రంగమ్మ రాఘవరెడ్డి సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. వారివెంట వార్డు సభ్యుడు ఏశబోయిన కిరణ్ ఉన్నారు. లక్ష్మిదేవికాల్వలో.. సెంట్రింగ్ కార్మికుడు అడ్డగూడూరు : మండల పరిధిలోని లక్ష్మిదేవికాల్వ గ్రామానికి చెందిన చింత సైదులు(34) వడదెబ్బకు గురై మృతి చెందాడు. సైదులు సెంట్రింగ్ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎండ తీవ్రతకు రెండు రోజుల నుంచి అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం సోమవారం తిరుమలగిరి తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే మృతిచెందాడు. సైదులు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. గొల్లగూడెంలో వృద్ధురాలు.. బీబీనగర్ : మండలంలోని గొల్లగూడెం గ్రామంలో వడదెబ్బకు సోమవారం ఓ వృద్ధురాలు మృతి చెందింది. గ్రామానికి చెందిన గుండెబోయిన యాదమ్మ(65) గ్రామ శివారులోని నర్సరీలో పనిచేసేందుకు వెళ్లగా మధ్యాహ్న సమయంలో ఎండవేడిమికి తట్టుకోలేక అక్కడికక్కడే మృతి మృతిచెందింది. కోదాడలో స్వాతంత్య్ర సమరయోధురాలు.. కోదాడఅర్బన్ : పట్టణంలోని 8వ వార్డు గోపిరెడ్డినగర్కు చెం దిన స్వాతంత్య్ర సమరయోధురాలు పోనుగోటి రంగనా యకమ్మ(95) వడదెబ్బతో సోమవారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని పలువురు సందర్శించి నివాళులర్పించారు. రాజేంద్రనగర్‌లో వ్యవసాయ కూలీ త్రిపురారం : మండలంలోని రాజేంద్రనగర్ గ్రామానికి చెందిన ఇస్లావత్ కృష్ణ(32) సోమవారం వడదెబ్బతో మృత్యువాత పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇస్లావత్ కృష్ణ వ్యవసాయ కూలీ. గత రెండు రోజులుగా వీస్తున్న వడగాల్పులతో కృష్ణ అస్వస్థతకు గురయ్యాడు. ఇంటి వద్ద చికిత్స పొం దుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి బార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
దంచికొట్టిన ఎండలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్‌లలో 40 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి. హైదరాబాద్‌లో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వడదెబ్బకు నలుగురు మృతి వడదెబ్బతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్‌లో ఐదుగురు మృతిచెందారు. మంచిర్యాల దండెపల్లి మండలం తాళ్లపేటకు చెందిన ఖమ్రొద్దీన్ (46), నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌కు చెందిన కుంచెపు నడి పన్న (47), మామడ మండలం కమల్పూర్ గ్రామానికి చెందిన గనిమెన సా యన్న (60) వడదెబ్బతో మృతిచెందారు. ఖానాపూర్ మండలం రాజూరా గ్రా మానికి చెందిన మేకల కాపరి చిలివేరి వెంకట్రాములు(40) వడదెబ్బతో సోమ వారం రాత్రి మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కొత్తూరు(జీ) గ్రామానికి చెందిన బానోత్ గోబ్రియా(50) మంగళవారం వడ దెబ్బతో మరణించాడు. అక్కడక్కడ చిరుజల్లులు పడ్డాయి. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో వర్షం కురువడంతో శనగ పంటకు స్వల్పంగా నష్టం చేకూరింది. వివిధ పట్టణాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పట్టణం గరిష్టం రామగుండం 42 ఆదిలాబాద్ 42 నిజామాబాద్ 42 భద్రాచలం 41.6 మెదక్ 40.5 మహబూబ్‌నగర్ 40.2 ఖమ్మం 40 హన్మకొండ 39.5 హైదరాబాద్ 39.4 నల్లగొండ 39.2 ఏపీలో రెంటచింతల 43.6 విజయవాడ 39.5 తిరుపతి 39 విశాఖపట్నం 37 -
భగభగల మధ్య హైదరాబాద్‌లో భారీ వర్షం!
హైదరాబాద్: భానుడి భగభగలతో అల్లాడుతున్న నగరవాసులకు అనుకోనిరీతిలో ఊరట లభించింది. అనూహ్యరీతిలో మంగళవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తింది. సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో వడగళ్ల వాన కురిసింది. కూకట్పల్లి, బాలానగర్, భరత్‌నగర్, సనత్‌నగర్, ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. కూకట్పల్లి కేపీహెచ్బీలో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులు దుమారం రేపాయి. అనుకోకుండా పలుకరించిన వానతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు ఎండ, ఉక్కపోతతో అల్లాడిన నగర వాసులు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కాస్తా సేదదీరారు. పాతబస్తీలోని పలు చోట్ల, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు మండలలోనూ వర్షం కురిసింది. -
మృత్యుగాలి.. మళ్లీ వస్తుందా?
- రెండేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన వడగాడ్పులు - 2015 మే చివర్లో ఆంధ్ర, తెలంగాణలో 2,500 మంది మృత్యువాత - భూతాపం కారణంగా పదేళ్లకోసారి పునరావృతమయ్యే ప్రమాదం - కొంతమేరకైనా కాపాడుతున్న హైదరాబాద్‌పై కాలుష్యం దుప్పటి - లేకుంటే రెండేళ్లకోసారి పెను వడగాడ్పుల విజృంభణ - వడగాడ్పులపై భారత్, విదేశీ వాతావరణ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి - ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధం కావాలంటున్న పరిశోధకులు సరిగ్గా రెండేళ్ల కిందట.. వేసవిలో మే చివరి వారం.. ఒక్కసారిగా వడగాడ్పులు ఉధృతమయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో జనం పిట్టల్లా రాలిపోయారు. ఏకంగా 2,500మంది వడగాడ్పుల దెబ్బకు అసువులుబాశారు. ఈ ప్రాంతంలో ఆ స్థాయి వడగాడ్పులు వందేళ్లకోసారి వస్తాయని అంచనా. కానీ భూతాపం పెరగడం వల్ల ఈ ప్రమాదం ఏకంగా పది రెట్లు పెరిగిపోయిందని వాతావరణ నిపుణుల అంచనా. అంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రతి పదేళ్లకోసారి ఆ స్థాయి వడగాడ్పులు వీచే ప్రమాదం పొంచి వుంది. ఇంకా చెప్పాలంటే హైదరాబాద్ మహానగరం, పరిసరాల మీద నింగిలో దట్టంగా ఆవరించి ఉండే కాలుష్యం దుప్పటి తొలగిపోతే.. ఆ భీకర వడగాడ్పుల ముప్పు ప్రతి రెండేళ్లకోసారి ముంచుకొస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముందుగా గుర్తించ గలిగితే ప్రయోజనం వడగాడ్పులు, భూతాపానికి సంబంధం ఉందని సూత్రప్రాయంగా చెప్పటం సరిపోదని.. ఇటువంటి పెను వడగాడ్పులు ఏ నెలలో రావచ్చు, ఎన్ని రోజులు కొనసాగవచ్చు అనేది ముందస్తుగా అంచనా వేయగలిగితే ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోగలదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగ అధికారి నాగేంద్ర కె. బియానీ ఈ సమావేశంలో పేర్కొన్నారు. ఏదేమైనా వడగాడ్పులను ఎదుర్కోవడానికి తాము ఎప్పుడూ ప్రణాళికలు రచిస్తామని చెప్పారు. కానీ ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల వల్ల జబ్బుపడుతున్న వారు, మరణిస్తున్న వారి సంఖ్యను చూస్తే.. ఈ ప్రణాళికలు సరిపోవట్లేదన్నది స్పష్టమవుతోంది. ‘అహ్మదాబాద్ వడగాడ్పు కార్యాచరణ ప్రణాళిక’ మంచి మార్గదర్శకమని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అక్కడ 2010లో వడగాడ్పుల మరణాల సంఖ్య 700గా ఉంటే 2015 నాటికి అది 20కి తగ్గిపోయింది. అటువంటి ప్రణాళికనే విజయవాడ కోసం అభివృద్ధి చేసినట్లు బియానీ తెలిపారు. అయితే ఈ విషయంలో వివిధ మంత్రిత్వశాఖలు, నగర పాలక సంస్థలోని వివిధ విభాగాల మధ్య చాలా సమన్వయం అవసరమవుతుందన్నారు. తేమ శాతం పెరిగితే మరింత తీవ్రం... గాలిలో తేమ శాతం (హ్యుమిడిటీ) ఎక్కువగా ఉండటం వల్ల వడగాడ్పుల ప్రభావం మరింత తీవ్రమవుతుందని ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకుడు కృష్ణా అచ్యుతరావు వివరించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎట్ బర్కిలీ, లారెన్స్ బర్కిలీ నేషనల్ లేబొరేటరీ పరిశోధకులతో కలసి తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు చెప్పారు. 2015 మే నెలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పెను వడగాడ్పుల వెంటనే పాకిస్తాన్‌లోని కరాచీలోనూ అదే తరహా వడగాడ్పులు విజృంభించాయి. అక్కడ 700 మంది మృత్యువాతపడ్డారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో వడగాడ్పుల సమయంలో నమోదైన ఉష్ణోగ్రతల కంటే కరాచీలో వడగాడ్పుల సమయంలో ఉష్ణోగ్రతలు ఐదారు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. అయినా కరాచీలో వడగాడ్పుల తీవ్రతకు ప్రధాన కారణం.. అక్కడ వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటమే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆ తేమ శాతం 20 శాతంగా ఉంటే.. కరాచీలో 35 శాతం నుంచి 70 శాతం వరకూ నమోదైంది. తేమ శాతం ప్రభావంపై ఉత్తర అమెరికా, యూరప్ దేశాల్లో ప్రత్యేక సూచికలు ఉంటాయి. కానీ అవి దక్షిణాసియా దేశాలకు వర్తించవు. ఈ నేపథ్యంలో దక్షిణాసియాకు వర్తించేలా ఉష్ణోగ్రత, హ్యుమిడిటీ తదితర వివరాలతో కూడిన వేడి సూచికలను అభివృద్ధి చేయడానికి పరిశోధకులు కృషి చేస్తున్నారు. ఇటువంటి సూచికలు ప్రభుత్వాలు తగిన ప్రణాళికలు రూపొందించడానికి దోహదపడతాయి. మానవ కల్పిత భూతాపంతో లింకు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను గడగడలాడించిన 2015 నాటి భీకర వడగాడ్పుల మీద అధ్యయనం చేసిన భారత, విదేశీ వాతావరణ నిపుణులు మూడు ప్రధాన సూత్రీకరణలకు వచ్చారు. ఆ పరిశోధకుల బృందంలో ఒకరైన యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ కార్స్టెన్ హాస్టీన్.. ‘ఆ పెను వడగాడ్పులకు మనుషుల వల్ల జరిగిన వాతావరణ మార్పుకు సంబంధం ఉంద’నేందుకు బలమైన ఆధారాలు కనుగొన్నట్లు చెప్పారు. వాతావరణ ప్రమాదాలపై అవగాహన పెంపొందించే అంశం మీద ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఢిల్లీలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ అధ్యయన నివేదికను అమెరికన్ మెటియోరాలాజికల్ సొసైటీ బులెటిన్‌లో ప్రచురణ కోసం సమర్పించారు. కాలుష్య దుప్పటిని తొలగిస్తే మరింత వేడి... ‘మున్ముందు ఇప్పటికన్నా మరింత తీవ్రమైన వడగాడ్పులు వచ్చే ప్రమాదం ఉంది. వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వాలు సిద్ధం కావాల్సి ఉంది. అలాగే పారిశ్రామిక కార్యకలాపాలు, రవాణా వాహనాల ద్వారా వాతావరణంలోకి విడుదలయ్యే కాలుష్యాలను శుభ్రం చేసినట్లయితే.. మరింత బలమైన వడగాడ్పులు వస్తాయి. గతంలో ఉత్తర అమెరికా, యూరప్‌లలో ఇదే విధంగా జరిగింది’ అని ఆ సమావేశంలో పరిశోధకులు హెచ్చరించారు. దక్షిణాసియా భూభాగాన్ని ఎక్కువగా కప్పి ఉంచే కాలుష్యం దుప్పటి.. సూర్యుడి వేడిమిలో కొంతైనా భూ ఉపరితలాన్ని తాకకుండా నిరోధిస్తోంది. అయితే దీనర్థం గాలి కాలుష్యం మంచిదని కాదు. గాలి కాలుష్యం ఏటా ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మందిని బలితీసుకుంటోంది. వర్షపాతంపైనా ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ కాలుష్యాన్ని శుభ్రం చేసే క్రమంలో మరింత అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనేందుకు ముందుగా సిద్ధం కావాలి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ (దథర్డ్పోల్.నెట్ సౌజన్యంతో) -
వేసవి ముందే బానుడి భగభగ