భగభగల మధ్య హైదరాబాద్‌లో భారీ వర్షం!
హైదరాబాద్: భానుడి భగభగలతో అల్లాడుతున్న నగరవాసులకు అనుకోనిరీతిలో ఊరట లభించింది. అనూహ్యరీతిలో మంగళవారం సాయంత్రం నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ముంచెత్తింది. సూరారం, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్‌లో వడగళ్ల వాన కురిసింది. కూకట్‌పల్లి, బాలానగర్, భరత్‌నగర్, సనత్‌నగర్, ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో భారీగా వర్షం పడింది. కూకట్‌పల్లి కేపీహెచ్‌బీలో వడగళ్ల వాన కురిసింది. ఈదురుగాలులు దుమారం రేపాయి.
అనుకోకుండా పలుకరించిన వానతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు ఎండ, ఉక్కపోతతో అల్లాడిన నగర వాసులు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో కాస్తా సేదదీరారు. పాతబస్తీలోని పలు చోట్ల, రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు మండలలోనూ వర్షం కురిసింది.