
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మబ్బులు కమ్మి ఉండటంతో పలు ప్రాంతాల్లో సూర్యుడి దర్శనం కనిపించలేదు. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు చిరుజల్లులు పలుకరించాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్‌ఆర్ నగర్, ఖైరతాబాద్‌లో చిరుజల్లులు కురిశాయి. అటు అంబర్‌పేట్, నాగోల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, తదితర ప్రాంతాల్లోనూ చిరుజల్లులు పడ్డాయి. చలికితోడు చిరుజల్లులు పలుకరించడంతో నగరవాసులు మరింతగా చలికి వణికిపోయారు.