Cold weather
-
పెట్ లవర్స్.. బీ కేర్‌ఫుల్..!
పెంపుడు జంతువులు.. మన జీవన శైలిలో ఓ భాగం. అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు. కంటికి రెప్పలా కాస్తూ.. విడదీయరాని మైత్రి బంధాన్ని కొనసాగించే వారు మరికొందరు. మనుషుల్లానే చలికాలంలో వాటికీ రక్షణ అవసరమే.. అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల మాదిరిగానే వాటికీ సీజనల్ వ్యాధులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటి ఆరోగ్యానికీ ఢోకా ఉండదని చెబుతున్నారు కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా, తెలంగాణలోని సనత్ నగర్‌కి చెందిన కెనైన్ అసోసియేషన్ కార్యదర్శి విశాల్ సూదం. మనుషులకే కాదు.. పెంపుడు జంతువులకూ చలికాలంలో వేడి పుట్టించే వివిధ రకాల యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చాయి. కుక్కలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వాష్ చేసుకునేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్, రౌండ్ బెడ్లు దొరుకుతున్నాయి. కుక్కలు, పప్పీస్ చలి తీవ్రతను వీటి ద్వారా అరికట్టవచ్చు. దీంతోపాటు ప్రత్యేక స్వెట్టర్లు జంతువులకు రక్షణ నిలుస్తున్నాయి. అన్ని సైజుల కుక్కలకూ అనువుగా ఉండేలా వివిధ మోడళ్లతో ఊలుతో తయారుచేసిన స్వెట్టర్లు లభిస్తున్నాయి. ఇవి కూడా వాటి సైజు, నాణ్యత ఆధారంగా వివిధ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే. కాళ్లకు రక్షణ కలిగించే రీతిలో శీతాకాలంలో షూష్ అందుబాటులో ఉన్నాయి.శీతాకాలంలో మంచు కారణంగా గాలిలో తేమ శాతం కారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. దీంతో పెంపుడు జంతువులు వాయు కాలుష్యం బారిన పడి శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే బయటకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. పెట్స్ ఆరోగ్యంగా ఉండడానికి రెగ్యులర్‌గా గ్రూమింగ్ చేయడం అవసరం. నీళ్లు తాగించేందుకు ఉపయోగించే గిన్నెలు, పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సీజనల్ వ్యాధులు.. శీతాకాలలో వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ. చలి కాలంలో ఫ్లీస్, టిక్, మైట్స్ (గోమర్లు) అనే బాహ్య పరాన్నజీవులు కుక్కల చర్మంపై చేరతాయి. దీంతో జుట్టు రాలిపోవడం, టిక్ ఫీవర్ రావడం, బ్లడ్ లాస్ కావడం, దురదలు కారణంగా కుక్కలు వాటంతట అవే శరీరాన్ని కొరుక్కుంటాయి. గాలి సంక్రమణ ద్వారా ఒక కుక్క నుంచి మరో కుక్కకు పాకుతుంటాయి. అందుకోసం ముందుగానే నిపుణుల సలహా మేరకు బెల్టు టైపులో ఉండే యాంటీ టిక్ కాలర్ ఏర్పాటు చేయడం రక్షణగా ఉంటుంది. అలాగే తరచూ యాంటీ రాబీస్, సెవన్ ఇన్ వన్ వంటి టీకాలను వేయించాలి. షాంపో, పౌడర్, స్ప్రేస్తో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధ అవసరం..శీతాకాలంలో మంచుకురిసే అవకాశం ఉన్నందున సాధ్యమైంత వరకూ పెంపుడు జంతువులకు ప్రత్యేక షెల్టర్ గానీ, ఇంట్లో వెచ్చని ప్రదేశాన్ని గానీ కేటాయిస్తే బాగుంటుంది. ముఖ్యంగా పప్పీస్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటి దినచర్యలో ఏవైనా మార్పులు వస్తే.. వైద్యుల సలహా పాలించాలి. – విశాల్ సూదం, కెనైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
పిట్టంత పిపీలికం.. హమ్మింగ్ బర్డ్ సైజులో ఉండే చీమ శిలాజం గుర్తింపు
చీమ.. ఓ అల్పజీవి. కానీ.. ఒకప్పుడు పరిమాణంలో హమ్మింగ్ బర్డ్ అంత పెద్ద చీమలు పిపీలిక సామ్రాజ్యాన్ని ఏలాయట. ఇటీవల లభించిన చీమ శిలాజాన్ని బట్టి 47 మిలియన్ ఏళ్ల కిందట మహా భారీ చీమలు ఉండేవని శాస్త్రవేత్తలు తేల్చారు. చీమ జాతుల్లో ఏకంగా 30 ఏళ్లు జీవించేవి కూడా ఉండటం విశేషమే. కాగా.. చీమలు వేడి వాతావరణంలోనే జీవించడానికి ఇష్టపడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వర్షాకాలం, శీతాకాలంలో చలికి తట్టుకోలేక మన ఇళ్లల్లోకి చొరబడి తలదాచుకుంటాయని.. వంటింట్లోని ఆహార పదార్థాలను దోచుకుపోతాయని వెల్లడించారు. సాక్షి, అమరావతి: అమెరికాలోని వయోమింగ్ రాష్ట్రంలో 47 మిలియన్ ఏళ్ల కిందట భారీ మాంసాహార చీమలు అక్కడి కాలనీలను పాలించినట్టు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. హమ్మింగ్ బర్డ్ పరిమాణంలో ఉండే రాణి చీమ శిలాజాన్ని 2011లో కనుగొన్నారు. రెండు అంగుళాలకు పైగా సైజులో ఉన్న ఈ శిలాజాన్ని డెన్వర్ మ్యూజియం ఆఫ్ నేచర్ సైన్సెస్‌లో భద్రపరిచారు. అంతకు ముందు టైటానోమైర్మా జాతికి (2 అంగుళాల పొడవు, 16 సెంటీమీటర్ల రెక్కలు) చెందిన చీమ శిలాజాన్ని జర్మనీలో గుర్తించారు. చీమలు చల్లటి రక్తం (కోల్డ్ బ్లడెడ్) కలిగిన జాతికి చెందినవి. వాటి శరీర ఉష్ణోగ్రత పర్యావరణంలోని సూర్యరశి్మపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే.. అవి వెచ్చని వాతావరణంలో ఉండటానికే ఇష్టపడతాయి. గ్లోబల్ వారి్మంగ్ చీమ జాతిని భయపెడుతున్నా.. కొంచెం తేమ ఉన్న ప్రాంతాల్లోనూ ఇవి మనుగడ సాగించగలుతున్నాయి. అందుకే శీతాకాలంలో (డిసెంబర్–జనవరి మధ్య) బయట చీమలు కనిపించవు. ఆహార పదార్థాలు ఉండే ఇళ్లలోకి చొరబడి జీవనం సాగిస్తాయి. డైనోసార్లు అంతరించినా.. ఇవి బతికే ఉన్నాయ్ జీవుల్లో అత్యంత సంపన్నమైన (సోషల్ ఇంజనీరింగ్), శక్తివంతమైన సమూహాలలో చీమలకు ప్రత్యేక స్థానం ఉంది. భూగ్రహంపై డైనోసార్లు అంతరించిపోయినా.. వాటితో కలిసి జీవించిన చీమ జాతులు మాత్రం ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి. చీమలకు 130 మిలియన్ సంవత్సరాల చరిత్ర ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మూడేళ్ల కిందట మయన్మార్‌లో 99 మిలియన్ సంవత్సరాల క్రితం ‘హెల్ యాంట్’ పేరుతో జీవించిన చీమ నమూనాను గుర్తించారు. ఇదే క్రమంలో భూమిపై చీమల సంఖ్యపై హాంకాంగ్ విశ్వవిద్యాలయం, జర్మనీలోని వుర్జ్బర్గ్లోని జూలియస్ మాక్సిమిలియన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇందులో భూమిపై 20 క్వాడ్రిలియన్ (20 వేల ట్రిలియన్) చీమలు ఉన్నట్టు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ జర్నల్ ప్రొసీడింగ్స్‌లో ప్రచురించింది. వీటి సంఖ్య గతంలో కంటే రెండు నుంచి 20 రెట్లు పెరిగినట్టు పేర్కొంది. ప్రపంచంలో ప్రతి వ్యక్తికి 2.5 మిలియన్ చీమల జనాభా ఉండటం గమనార్హం. వీటి బరువు 12 మిలియన్ టన్నులు ప్రపంచంలో సుమారు 12 వేల నుంచి 15 వేలకు పైగా రకాల చీమ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అడవి పక్షులు, క్షీరదాల కంటే చీమల బరువు (చీమల బయోమాస్ 12 మిలియన్లు) ఎక్కువగా ఉంటుంది. ఇది మానవుల బయోమాస్‌లో దాదాపు 20 శాతం. బయోమాస్ అనేది జీవుల్లోని కర్బనాల మొత్తం బరువుగా కొలుస్తారు. చీమలు మొక్కల విత్తనాల పంపిణీలో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ సంచార ప్రాంతాలతో పోలిస్తే అడవుల్లో, ఆశ్చర్యకరంగా శుష్క ప్రాంతాల్లో చీమలు సమృద్ధిగా పెరుగుతున్నాయి. 30 ఏళ్ల జీవన కాలం చీమలు కందిరీగల నుంచి ఉద్భవించినట్టు పలు పరిశోధనల్లో తేలింది. పరిమాణంలో 0.07–2 అంగుళాల మధ్యలో ఉండే చీమలు అంటార్కిటికా, ఐస్‌ల్యాండ్, గ్రీన్‌ల్యాండ్ మినహా ప్రపంచంలోని ప్రతిచోట కనిపిస్తున్నాయి. మగ కారి్మక చీమల జీవిత కాలం మూడేళ్లలోపు (కొన్ని కారి్మక చీమలు స్వల్పకాలమే జీవిస్తాయి) ఉంటుంది. చీమల్లో కూడా తేనెటీగల మాదిరిగానే రాణీ చీమ కాలనీ స్థాపకురాలు. రాణి ఫలదీకరణం చేసిన తర్వాత కాలక్రమేణా మిలియన్ల గుడ్లు పెట్టగలదు. అమెరికాలోని ఇడాహోలోని తన సహజ నిర్మాణంలో ఓ రాణి చీమ 30 ఏళ్లపాటు నివసించింది. క్వీన్ బ్లాక్ గార్డెన్ చీమలు ల్యాబ్ సెట్టింగ్‌లలో 28 సంవత్సరాల వరకు జీవించినట్టు గుర్తించారు. మారికోపా హార్వెస్టర్ చీమకు 12 తేనెటీగలు కలిసి కఠినంగా కుట్టగలిగే సామర్థ్యం ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనదిగా భావిస్తారు. చీమల్లో ఆశ్చర్యకరంగా రెండు పొట్టలు ఉంటాయి. ఒకటి తన ఆహారం తీసుకోవడానికి, రెండోది ఇతర చీమలను పోషించడానికి (ట్రోఫాలాక్సిస్ ప్రక్రియ) ఉపయోగిస్తాయి. ఏడాదిలో 50 టన్నుల మట్టి తరలింపు చీమలు తమ శరీర బరువు కంటే 50 రెట్లు ఎక్కువ బరువును మోయగలవని అంచనా. చీమల జట్టు ఒక సంవత్సర వ్యవధిలో 50 టన్నుల మట్టిని ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి తరలిస్తుంది. ఇది ప్రకృతికి మేలు చేయడంలో వానపాముల కంటే ఎక్కువ ప్రాముఖ్యతను కలిగిఉందని పర్యావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. చీమలకు ఊపిరితిత్తులు, సాధారణ శ్వాసకోశ వ్యవస్థ లేదు. శరీరంలోని రంధ్రాల వ్యవస్థను (స్పిరకిల్స్) శ్వాస పీల్చుకునేందుకు ఉపయోగిస్తాయి. అందుకే ఇవి నీటి అడుగులో 24 గంటల పాటు జీవించగలవు. ఇదే అతిపెద్ద చీమల కాలనీ ఐరోపా, జపాన్, అమెరికా అంతటా అతిపెద్ద చీమల కాలనీ వ్యాపించింది. తొలుత వీటిని మూడు ప్రత్యేక కాలనీలుగా భావించారు. ఇక్కడ అర్జెంటీనా చీమ జాతి ఒక్కటే ఉండటంతో మనుగడ కోసం ఒకదానితో మరొకటి పోరాడుకోవడానికి నిరాకరించడంతో కాలనీ చాలా పెద్దదిగా పెరిగినట్టు భావిస్తున్నారు. ఈ కాలనీ 3,750 మైళ్ల మేర విస్తరించి ఉందని.. అందులో 370 మిలియన్ చీమలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. -
చలితో గజ గజ! ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో చలి తీవ్రత ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజ గజ వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. వెలుతురులేమి కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని సఫ్తార్‌జంగ్ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు.. సఫ్తార్‌జంగ్ (1.9), పాలమ్(5.2), లోథిరోడ్ (2.8), రిడ్జ్(2.2), అయా నగర్(2.6) డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. గాలి నాణ్యత సైతం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. గాలినాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. తమ ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్‌లోని అమృత్సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా వెలుతురులేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY — ANI (@ANI) January 8, 2023 ఇదీ చదవండి: స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు -
వణుకు ఆయనకు రావట్లే.. యాత్ర గురించి చెప్పినప్పుడల్లా మీకు వస్తోంది..!
వణుకు ఆయనకు రావట్లే.. యాత్ర గురించి చెప్పినప్పుడల్లా మీకు వస్తోంది..! -
బాబోయ్ చలి.. ఈ డివైజ్ చేతుల్లో పట్టుకుంటే చాలు, క్షణాల్లో..
అసలే ఇది చలికాలం. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోతుంటాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అరచేతులు చల్లబడిపోవడం అందరికీ ఎదురయ్యే సమస్యే! చేతులు వెచ్చబరచుకోవడానికి చలిమంటల ముందు కూర్చుంటుంటారు. పనుల మీద బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటే, చలిమంటల ముందు గంటల తరబడి కూర్చోవడం సాధ్యం కాదు కదా! ఈ ఆలోచనతోనే చేతులు వెచ్చగా ఉంచడానికి తగిన పరికరాన్ని అమెరికన్ కంపెనీ ‘ఒకూపా’ అందుబాటులోకి తెచ్చింది. ఇది రీచార్జబుల్ హ్యాండ్ వార్మర్. దీనిని చేతుల్లో పట్టుకుంటే చాలు, అరచేతులు క్షణాల్లోనే వెచ్చబడతాయి. అరచేతుల్లో పట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే, గ్లోవ్స్‌లో దీనిని పెట్టేసుకున్నా సరిపోతుంది. ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. మోడల్స్ బట్టి దీని ధర 28.99 నుంచి 42.99 డాలర్ల వరకు (రూ.2389 నుంచి రూ.3543)వరకు ఉంటుంది. చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో! -
వడగాలి.. చల్లబడుతోంది
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా రాష్ట్రంలో అధిక వేడి (వడ గాలి, హీట్ వేవ్) నమోదవుతున్న రోజుల సంఖ్య తగ్గుతున్నట్లు కేంద్ర పర్యావరణ గణాంకాల నివేదిక – 2022 వెల్లడించింది. ఇదే సమయంలో చలి వాతావరణం ఉండే రోజుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చలి రోజుల్లో కొంత హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో సంవత్సరాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రోజులు, చలి వాతావరణం ఉన్న రోజుల వివరాలను నివేదిక వివరించింది. ► రాష్ట్రంలో 2014 సంవత్సరంలో 16 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవగా, ఆ తర్వాతి సంవత్సరాల్లో కొంత తగ్గాయి. 2019 సంవత్సరంలో 13 రోజుల పాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. 2020లో 3 రోజులు, 2021లో నాలుగు రోజులు మాత్రమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక తెలిపింది. ► అత్యల్ప ఉష్ణోగ్రతలు 2014లో మూడు రోజులు మాత్రమే. 2021లో ఒక రోజే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. కానీ ఈ సంఖ్య 2018లో 8 రోజులు, 2020లో 6 రోజులుగా ఉంది. ► ఇతర రాష్ట్రాల్లో 2014లో ఒడిశాలో అత్యధికంగా 17 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో 12 రోజులు చొప్పున, రాజస్థాన్‌లో 11 రోజులు, మధ్యప్రదేశ్‌లో 10 రోజులు, తెలంగాణలో రెండు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత 2019లో ఎక్కువ రాష్ట్రాల్లో ఎక్కువ రోజులపాటు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు నివేదిక పేర్కొంది. గత రెండేళ్లుగా అన్ని రాష్ట్రాల్లోనూ వేడి రోజులు తగ్గిపోయినట్లు తెలిపింది. హీట్ వేవ్ అంటే.. ఏదైనా ప్రదేశంలో వరుసగా రెండు రోజులు 45 డిగ్రీలు అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే హీట్ వేవ్ పరిస్థితులుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో 2016 మే 2వ తేదీన ప్రకాశం జిల్లా వెలిగండ్లలో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2017 మే 17వ తేదీన ప్రకాశం జిల్లా టంగుటూరులో అత్యధికంగా 47.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 2020 మే 23న ప్రకాశం జిల్లా కనిగిరిలో 47.8 డిగ్రీలు, 2021 మార్చి 31 ప.గో. జిల్లా పెదపాడులో 45.9 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సమయంలో వేడిగాలులు వీస్తాయని అధికారులు చెబుతున్నారు. -
చలికాలంలో ‘ఫన్నీ’ స్నానం.. వీడియో వైరల్
శీతాకాలంలో సాధారణంగా స్నానం చేయడానికే ఇష్టపడరు కొంతమంది! పైగా చన్నీటి స్నానం అంటే ఆమడ దూరం పరిగెడతారు. అలాంటి చలికాలంలో చలిని తప్పించకుంటూ చన్నీటి స్నానం చేసే ట్రిక్కి సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. అసలు విషయంలోకెళ్తే.. ఆ వీడియోలో ఒక వ్యక్తి నది లేదా చెరువులో స్నానం చేస్తున్నట్లు కనిపించింది. అయితే ఆ వ్యక్తి చలిని తప్పించుకునే నిమిత్తం ముందు ఒక పెద్దప్లేటులో చలిమంట ఏర్పాటు చేసుకున్నాడు. నదిలో ఒక మునక వేస్తూ గజగజ వణికిపోతున్నాడు. మళ్లీ తన ముందున్న చలిమంట వైపు చేతులు చాచి చలి కాచుకుంటూ మళ్లీ ఇంకో మునక.. ఇలా ఫన్నీ ఫన్నీగా స్నానం చేశాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియోకి ‘మై ఇండియా ఈజ్ గ్రేట్... ప్రామిసింగ్ ఇండియా’ అనే క్యాప్షన్‌ని జోడించి మరీ ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లు ‘ఇది చన్నీటి ట్రిక్’ అని ఒకరు, మరోకరేమో ‘భారతీయులను ట్రిక్స్‌లో ఎవరూ ఓడించలేరు’ అంటూ రకరకాలుగా ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. Mera Bharat Mahaan.....☺️😊 होनहार भारत.....☺️☺️😊😊😊😊 pic.twitter.com/Ixnq5H1YY3 — Rupin Sharma (@rupin1992) January 11, 2022 (చదవండి: సెల్ఫీలతో మిలీనియర్ అయిన స్టూడెంట్.. ఎలా ఎదిగాడో తెలుసా?) -
వణికిస్తున్న చలి.. పలుకరించిన చిరుజల్లులు
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మబ్బులు కమ్మి ఉండటంతో పలు ప్రాంతాల్లో సూర్యుడి దర్శనం కనిపించలేదు. దీంతో చలి తీవ్రత పెరిగింది. దీనికి తోడు చిరుజల్లులు పలుకరించాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, ఖైరతాబాద్‌లో చిరుజల్లులు కురిశాయి. అటు అంబర్పేట్, నాగోల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, తదితర ప్రాంతాల్లోనూ చిరుజల్లులు పడ్డాయి. చలికితోడు చిరుజల్లులు పలుకరించడంతో నగరవాసులు మరింతగా చలికి వణికిపోయారు. -
చలికాలంలో ఇంటిపంటల రక్షణ ఇలా..!
శీతాకాలం చలి వాతావరణంలో ఉష్ణోగ్రత తక్కువగా, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. రసం పీల్చే పురుగులు, వైరస్ తెగుళ్ల వ్యాప్తికి ఇది అనువైన కాలం. కుండీల్లో, పెరట్లో ఆకుకూరలు, టమాటా, చిక్కుడు, వంగ, మిరప, బీర, ఆనప తదితర పంటలు చీడపీడల బారిన పడకుండా చూసుకోవడానికి ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలి. చీడపీడలు రానీయని టీకాలన్నమాట. జనవరి ఆఖరులో చలి తగ్గేవరకు వీటిని పాటించాలి. ► జీవామృతంను 1:10 పాళ్లలో నీటిలో కలిపి ప్రతి 10–15 రోజులకోసారి క్రమం తప్పకుండా పిచికారీ చేస్తుంటే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. చీడపీడలను తట్టుకునే శక్తి పెరుగుతుంది. ► ఆచ్ఛాదన (మల్చింగ్): కుండీలు, మడుల్లో కూరగాయ మొక్కలు/చెట్ల చుట్టూ గడ్డీ గాదంతో ఐదారు అంగుళాల మందాన ఆచ్ఛాదనగా వేస్తే మంచిది. ► ఇంటిపంటల్లో పెద్ద పురుగులు కనిపిస్తే వాటిని చేతితో ఏరేయడం ఉత్తమం. శీతాకాలంలో పంటలనాశించే కొన్ని పురుగులు: టమాటా, వంగ, ఆకుకూరలతోపాటు మందారం, చామంతి, గులాబీ వంటి పంటలపై పిండినల్లి(మీలీ బగ్), తామర పురుగు(త్రిప్స్) తరచూ కనిపిస్తుంటాయి. వీటితోపాటు పేనుబంక, దీపపు పురుగులు, తెల్లదోమ, ఎర్రనల్లి కూడా ఆశిస్తుంటాయి. పిండినల్లి: పిండినల్లి మొక్కలను ఆశించి రసం పీల్చుతుంటుంది. అందువల్ల మొక్క పెరుగుదల నిలిచిపోతుంది. ఇది సోకినప్పుడు పళ్లు తోముకునే బ్రష్‌ను ముంచి తుడిచేస్తే పోతుంది. కలబంద రసం లేదా వేపనూనె లేదా సబ్బు నీళ్లలో బ్రష్‌ను ముంచి తుడిచేయాలి. పేనుబంక: దీన్నే మసిపేను అని కూడా అంటారు. కంటికి కనిపించనంత చిన్న పేన్లు బంకవంటి తీపి పదార్థాన్ని విసర్జిస్తుంటాయి. ఈ తీపి కోసం చీమలు చేరతాయి. మొక్కల మీద చీమలు పారాడుతూ ఉంటే పేనుబంక లేదా పిండినల్లి సోకిందన్నమాటే. పచ్చదోమ: ఆకుపచ్చగా ఉండే చిన్న దోమలు ఆకుల నుంచి రసం పీల్చుతుంటాయి. పచ్చదోమ ఆకుల చివర్ల నుంచి పని మొదలు పెడతాయి. కాబట్టి ఇది సోకిన ఆకులు కొసల నుంచి లోపలి వరకు ఎండిపోతూ ఉంటాయి. బీర, ఆనప వంటి పెద్ద ఆకులుండే పంటలను పచ్చదోమ ఎక్కువగా ఆశిస్తూ దిగుబడిని తగ్గించేస్తాయి. తామర ‡పురుగు: తామర పురుగు సోకిన మిరప ఆకులకు పైముడత వస్తుంది. మిరప కాయలు వంకర్లు తిరుగుతాయి. వాటిపై చారలు ఏర్పడతాయి. దీన్ని గజ్జి తెగులు, తామర తెగులు అని కూడా అంటారు. బూడిద తెగులు: చల్లని వాతావరణంలో శిలీంద్రం వేగంగా వ్యాపించడం వల్ల బూడది తెగులు వస్తుంది. ఇది సోకిన పంటల ఆకులపై తెల్లని పొడి కనిపిస్తుంది. మిరప, వంగ, టమాటా, ఆకుకూరలపై ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది. రసంపీల్చే పురుగులు: ముందుజాగ్రత్త పిచికారీలు రసం పీల్చే పురుగులు పంటల జోలికి రాకుండా ముందుగానే జాగ్రత్తపడడం ఉత్తమం. వేపాకు రసం లేదా వావిలి ఆకుల కషాయం లేదా వేప నూనె లేదా వేపపిండి కషాయంను (వీటిలో ఏదైనా ఒక దాన్ని గానీ లేదా ఒక దాని తర్వాత మరొక దాన్ని మార్చి మార్చి గానీ) ప్రతి 7–10 రోజులకోసారి పిచికారీ చేయాలి. వేపాకు రసం: పావు కిలో వేపాకులు రుబ్బి + 5 లీటర్ల నీటిలో కలిపి అదే రోజు పంటలపై చల్లాలి(10 కిలోల వేపాకులు రుబ్బి 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరంలో పంటలకు చల్లవచ్చు). వావిలి ఆకుల కషాయం: 2 లీటర్ల నీటిలో 350 గ్రాముల వావిలి ఆకులు వేసి 2 లేదా 3 పొంగులు వచ్చే వరకు మరిగించి.. చల్లార్చిన తర్వాత ఆ కషాయంలో 10 లీటర్ల నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయాలి(5 కిలోల వావిలి ఆకుల కషాయాన్ని 100 లీటర్ల నీటిలో కలిపితే ఎకరానికి సరిపోతుంది). వేప నూనె: మార్కెట్లో దొరుకుతుంది. సీసాపై ముద్రించిన సాంద్రతకు తగిన మోతాదులో పిచికారీ చేయాలి. వేపకాయల పిండి రసం: 10 లీటర్ల నీటిలో అర కేజీ వేపకాయల పిండి(వేపగింజల పిండి 300 గ్రాములు చాలు)ని పల్చటి గుడ్డలో మూటగట్టి.. 4 గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత మూటను నీటిలో నుంచి తీసి పిండాలి. ఇలా అనేకసార్లు ముంచుతూ తీస్తూ పిండాలి. అదే రోజు పిచికారీ చేయాలి లేదా రోజ్ క్యాన్ ద్వారా మొక్కలపై చల్లవచ్చు. ఈ కషాయాలు, రసాలను పిచికారీ చేసేముందు 10 లీటర్లకు 5 గ్రాముల(100 లీటర్లకు 200 గ్రాముల) సబ్బుపొడి లేదా కుంకుడు రసాన్ని కలపాలి. నూనె పూసిన ఎరలు: నూనె పూసిన ఎరలు(స్టిక్కీ ట్రాప్స్) వేలాడదీస్తే పురుగులను ఆకర్షించి నశింపజేస్తాయి. తామర పురుగులను ఆకర్షించడానికి తెలుపు, తెల్లదోమలను నీలం, పచ్చదోమలను పసుపుపచ్చ ఎరలను వాడాలి. టమాటా, వంగ, మిర్చి వంటి ప్రతి 20 కూరగాయ మొక్కలకు ఒక్కో రకం ఎరలను రెండేసి చొప్పున వేలాడదీయాలి. ఎరలను మార్కెట్లో కొనొచ్చు. లేదా ఆయా రంగుల డబ్బాలు లేదా ప్లాస్టిక్ షీట్లు ఉంటే వాటికి నూనె లేదా గ్రీజు రాసి వేలాడదీయవచ్చు. రసంపీల్చే పురుగుల తీవ్రత ఎక్కువగా ఉంటే? రసంపీల్చే పురుగులు ఇప్పటికే మొక్కలకు తీవ్రస్థాయిలో ఆశించి ఉంటే పైన పేర్కొన్న పిచికారీలు కొనసాగిస్తూనే.. తెల్లటి షేడ్‌నెట్‌ను మొక్కలపై గ్రీన్హౌస్ మాదిరిగా రక్షణగా ఏర్పాటు చేయాలి. ఇనుప తీగతో డోమ్ ఆకారం చేసి దానిపై తెల్లని షేడ్‌నెట్ చుట్టేస్తే సరి.? సేంద్రియ ఇంటిపంటల సాగుపై సికింద్రాబాద్ తార్నాక (రోడ్డు నంబర్ ఒకటి, బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర)లోని సుస్థిర వ్యవసాయ కేంద్రం కార్యాలయంలో కనీసం 10 మంది కోరితే వారాంతంలో శిక్షణ ఇస్తున్నారు. పుస్తకాలు, విత్తనాలు, వర్మీకంపోస్టు లభిస్తాయి. వివరాలకు.. డా. గడ్డం రాజశేఖర్ – 83329 45368 ∙సిఎస్ఎ కార్యాలయంపై టెర్రస్ గార్డెన్లో డా. రాజశేఖర్ ∙ఎల్లో స్టిక్కీ ట్రాప్ -
అమ్మంటే.. పెన్షన్ డబ్బు కాదు!
‘అమ్మ’ంటే ఆట బొమ్మకాదు..అవసరాలు తీర్చే ‘ఆయా’ కానేకాదు..ప్రేమకు ప్రతి‘రూపం’.. సృష్టిలో అపురూపంతరాలు మారినా ఆధునికత పెరిగినా మనిషిలోనైనా మట్టి ముద్దలోనైనా.. ఏ వయసులోనైనా అమ్మ దేవత.ఆకలేస్తే ఉగ్గు పాలలో అమ్మ.. నిద్దరొస్తే జోలపాట అమ్మ..దయాగుణంలో ధరిత్రిలా.. ప్రేమానురాగాల పవిత్రమూర్తి..అమ్మ శాశ్వతం.. ఆమె ప్రేమ శాశ్వతం..అమ్మ అనాథ కాదు..అద్దంలో రూపం కాదు.. మాంసం ముద్ద అసలే కాదు..‘అమ్మ’ను విస్మరిస్తే శాపం..లోకం క్షమించదు ఈ పాపం. గుంతకల్లు: కుమారుడి ఆదరణ లేక ఓ తల్లి తనువు చాలించిన ఘటన పట్టణంలోని శాంతినగర్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రిటైర్డు ఆర్పీఎఫ్ సూర్యనారాయణ, పార్వతీబాయి(72) దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమారుడు మోహన్‌రావు బళ్లారిలోని ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. రెండో కుమారుడు వెంకోబ మతిస్థిమితం లేక ఊరూరు తిరిగేవాడు. ఐదేళ్ల క్రితం సూర్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో పార్వతీబాయి భర్త పెన్షన్‌తో జీవిస్తుండేది. పెళ్లి అయిన మోహన్ భార్యాపిల్లలతో వేరు కాపురం పెట్టాడు. నెల నెలా మొదటి వారంలో తల్లి పార్వతీబాయిని బ్యాంకుకు పిలుచుకువెళ్లి పెన్షన్ సొమ్ము డ్రా చేసుకొని తల్లిని ఇంటి వద్ద వదిలివెళ్లేవాడు. ఆమె బాగోగులు పట్టించుకునే వాడు కాదు. మూడు రోజులుగా చలితీవ్రత ఎక్కువ కావడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె గురువారం ఉదయం మృతి చెందింది. స్థానికులు వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కుమారుడు మోహన్‌ను పిలిపించి అంత్యక్రియలు పూర్తి చేయించారు. -
గడ్డకట్టిన అమెరికా సూపర్ ఫోటోలు చూడండి
-
ఢిల్లీ @ 2.6 c
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ప్రజలను చలిపులి వణికిస్తోంది. ఢిల్లీలో శనివారం ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 2.6 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. ఇది ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం గమనార్హం. మరోవైపు పొగమంచు కారణంగా దృశ్యత 1,500 మీటర్లకు పడిపోయింది. ఇక పాలెం విమానాశ్రయంలో 800 మీటర్ల దూరంలోని వస్తువులు సైతం కనిపించకుండా మంచు దుప్పటి కమ్మేసింది. ఈ విషయమై భారత వాతావరణశాఖ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు సాధారణ స్థాయిలోనే కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం దట్టంగా కురుస్తోందని తెలిపారు. ఆకాశం నిర్మలంగానే ఉన్నప్పటికీ చలిగాలుల తీవ్రత మాత్రం కొనసాగుతుందని వెల్లడించారు. హరియాణా, ఢిల్లీ, చండీగఢ్‌లోని చాలా ప్రాంతాల్లో సోమవారం వరకూ చలిగాలులతో పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయనీ, మిగిలిన కొన్ని చోట్ల మాత్రం తీవ్రమైన చలిగాలులు వీస్తాయని పేర్కొన్నారు. పంజాబ్‌తో పాటు ఉత్తర, పశ్చిమ రాజస్తాన్‌లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు ఢిల్లీలో శనివారం వాయు నాణ్యత సూచీ 398 పాయింట్లకు చేరుకున్నట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) తెలిపింది. కశ్మీర్లో మైనస్ ఉష్ణోగ్రతలు.. ఇక జమ్మూకశ్మీర్‌లోని లేహ్, కార్గిల్ ప్రాంతాల్లో ఈ సీజన్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. రాష్ట్ర వేసవి రాజధాని శ్రీనగర్‌లో ఉష్ణోగ్రత మైనస్ 7.2 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. ఇది గత మూడు దశాబ్దాల్లోనే అత్యల్ప ఉష్ణోగ్రత కావడం గమనార్హం. కాజీగంద్లో మైనస్ 6.2, కుప్వారాలో మైనస్ 6, అమర్నాథ్ యాత్రికులకు బేస్ క్యాంప్‌గా ఉన్న పెహల్గామ్లో మైనస్ 8.3 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రత నమోదయింది. -
చలి మంటే చితిమంటైంది!
రాయపర్తి: చలి మంటే ఓ వృద్ధుడి పాలిట చితిమంటైంది. చలి తీవ్రతను తట్టుకోలేక ఇంట్లోనే చలికాగుతూ ప్రమాదవశాత్తు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యాడు. ఈ ఘటన బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ లక్ష్మణ్‌రావు కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కుంట మారయ్య (85), మల్లమ్మ దంపతులకు ముగ్గురు కొడుకులు ఒక్క కూతురు. అందరి వివాహాలు చేశారు. భార్య మల్లమ్మ మృతితో మారయ్య ఒంటరిగానే ఉంటున్నాడు. రెండు నెలల క్రితం అనారోగ్యం బారిన పడి కాళ్లు చచ్చుపడిపోయాయి. చలిని తట్టుకోలేక మంచం పక్కనే మంట పెట్టుకుని పడుకున్నాడు. మధ్యరాత్రి గొంగడికి నిప్పంటుకోగా.. కాళ్లు సహకరించకపోవడంతో లేవలేని పరిస్థితిలో అక్కడికక్కడే ఆహుతయ్యాడు. చలికి 18 మంది మృతి సాక్షి నెట్వర్క్: చలి తీవ్రతకు బుధవారం 18 మంది మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మంది, కరీంనగర్ జిల్లాలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. పెథాయ్ తుపాను ప్రభావంతో వీస్తున్న చలిగాలులతో జనం బయటకు రావాలంటే జంకుతున్నారు. -
ఐ ఫోన్10 మొండికేస్తోందట? ఎందుకు?
శాన్ఫ్రాన్సిస్కో: ఆపిల్ అత్యంత ప్రతిష్టాత్మకంగా, అత్యంత ఖరీదులో లాంచ్ చేసిన ఐఫోన్ 10పై మరొకటి వార్త వెలుగు చూసింది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్ మొదటి టెస్ట్‌లో కింద పడినపుడు పగిలిందన్న వార్తలకు తోడు ఇపుడు ఐ ఫోన్ అతి చల్లటి వాతావరణంలో పనిచేయడంలేదన్న వార్త ఐ ఫోన్ లవర్స్‌కు షాకింగ్ న్యూసే. ఎలాంటి వాతావారణంలోనైనా పనిచేయాల్సిన స్మార్ట్‌ఫోన్ తీవ్రమైన శీతల పరిస్థితుల్లో పనిచేయనని మొండికేస్తోందట. ఈ సమస్యపై ఆపిల్ కూడా స్పందించింది. త్వరలోనే దీన్ని పరిష్కరిస్తామని చెప్పింది. అత్యంత ఖరీదు పెట్టి కొన్న ఐఫోన్10 అతి చల్లటి వాతావరణంలో పనిచేయడం లేదని కొంతమంది యూజర్లు ఫిర్యాదు చేశారు. చల్లటి వాతావరణంలోకి వెళ్లిన తరువాత రెండు సెకన్లకే టచ్ స్క్రీన్ పనిచేయలేదని ఒక వినియోగాదారుడు వాపోయాడు. అయితే ఇలాంటి సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని,కానీ, కొద్ది సెకన్ల తరువాత పూర్తిగా యథావిధిగా ఉంటోందని ఆపిల్ పేర్కొంది. రాబోయే సాఫ్ట్వేర్ అపడేట్లో దీన్ని సవరించనున్నట్టు తెలిపింది. అంతేకాదు 0-35 డిగ్రీల సెల్సియస్ మధ్య వాడాలని కూడా సూచించింది. అతిశీతల, అతి ఉష్ణ వాతావరణంలో ఈ డివైస్ బ్యాటరీ కూడా తాత్కాలికంగా బలహీనపడే అవకాశం ఉందని, అయితే సాధారణ వాతావరణంలోకి వచ్చిన తరువాత మళ్లీ మామూలు స్థితికి వస్తుందని చెప్పింది -
రాష్ట్రంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ సీజన్ ప్రారంభంలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోగా వాతావరణంలో మార్పుల కారణంగా మళ్లీ కాస్త పెరుగుతూ వచ్చాయి. దీంతో గత వారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళల్లో ఉక్కపోత కూడా కనిపించింది. కానీ ఒక్కసారిగా పొడి వాతావరణం నెలకొనటంతో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఆదిలాబాద్‌లో గడచిన 24 గంటల్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
మరో 2 రోజులు చలి తీవ్రత
3 నుంచి 5 డిగ్రీలు పడిపోయే అవకాశం సాక్షి, హైదరాబాద్: హిమాలయాల నుంచి శీతల గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతున్నారుు. దీంతో వచ్చే రెండు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. అది బలహీనపడితే ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం బలపడితే మేఘాలు కేంద్రీకృతమై ఉష్ణోగ్రతలు కాస్తంత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల తర్వాత చలి తీవ్రత ఎలా ఉండబోతుందనేది ఉపరితల ఆవర్తనంపైనే ఆధారపడి ఉందని పేర్కొంటున్నారు. ఇక గత 24 గంటల్లో మెదక్‌లో అత్యంత తక్కువగా 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, ఖమ్మంలలో 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. హన్మకొండలో 13 డిగ్రీలు, ఖమ్మంలో 14 డిగ్రీలు రికార్డయ్యాయి. నిజామాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యారుు. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో సాయంత్రం 6:00 దాటిందంటేచాలు చలితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతోపాటు చలిగాలులు కూడా వీస్తుండటంతో ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలున్నారుు. వృద్ధులు, పిల్లలు చలి నుంచి రక్షణ పొందకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, ఆస్తమా వంటివి తీవ్రమయ్యే అవకాశం ఉందంటున్నారు. చలి తీవ్రతతో రాష్ట్రంలో విద్యుత్ వాడకం కూడా తగ్గింది. ఏసీలు, ఫ్యాన్ల వాడకం తగ్గగా.. గీజర్ల వాడకం మాత్రం పెరిగింది. -
మరింతగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
మెదక్ @ 10 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8-9 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో అనేక చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. మూడు చోట్ల 5 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గారుు. ఖమ్మం, మెదక్, నల్లగొండల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా, హైదరాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్‌లలో 3 డిగ్రీలు తక్కువగా రికార్డయ్యాయి. మెదక్‌లో రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా రాత్రి వేళ 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శీతాకాలం మొదలైనప్పటి నుంచి మెదక్‌లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. అక్కడ ఈ సీజన్లోనే 9 డిగ్రీలకు కూడా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయారుు. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెరిగిన చలి.. హైదరాబాద్ గజగజ మరోవైపు హైదరాబాద్‌లో చలి తీవ్రత మరింత పెరిగింది. శనివారం నగరంలో 12.7 డిగ్రీలతో ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డరుుంది. సాయంత్రం ఐదు గంటల నుండి చలిగాలులు వీచారుు. 2007 నవంబర్ 25న 11.3 డిగ్రీలు, 2012 నవంబర్ 18న నగరంలో అత్యల్పంగా 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత అనంతరం మళ్లీ 12.7 డిగ్రీలకు పడిపోవటం ఇదే మొదలు. గత ఏడాది నవంబర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలుగా నమోదైంది. -
మరింతగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
-
చలి తీవ్రం.. తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు
-
చలి తీవ్రం.. తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు
4 డిగ్రీల వరకు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. పగటి వేళల్లోనూ చలి తీవ్రత పెరిగింది. 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోద వుతాయని వెల్లడించింది. గత 24 గంటల్లో ఖమ్మం, మెదక్‌తో పాటు వివిధ చోట్ల 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్‌లో 11 డిగ్రీల అత్యంత తక్కువ ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామా బాద్, రామగుండంలోనూ 14 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
వణికిస్తున్న చలి.. తగ్గిన ఉష్ణోగ్రతలు
ఖమ్మం, నల్లగొండల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం, నల్లగొండల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తగ్గాయి. ఖమ్మంలో 14 డిగ్రీలు, నల్లగొండలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో 4 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డవగా హైదరాబాద్‌లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
సంక్రాంతి వరకూ కొనసాగనున్న చలి తీవ్రత
విశాఖపట్నం: కోస్తాంధ్ర, తెలంగాణలో సంక్రాంతి వరకూ చలి తీవ్రత కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ఉత్తరాది నుంచి గాలులు వీచడంతో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఎలాంటి అలజడి లేకపోవడం కూడా మరో కారణమని పేర్కొంది. ఉత్తర తెలంగాణ, కోస్తా, ఒడిశాలలో 4 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. -
శీతకాలం.. ఆలు సాగుకు అనుకూలం
బాల్కొండ : చల్లని వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలం అని వ్యవసాయ శాఖ అధికారి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బంగాళదుంప పెరుగుదలకు వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రత దోహదపడుతుందన్నారు. జిల్లాలో ఆలు సాగు నామమాత్రమే అయినా.. బాల్కొండ ప్రాం తంలో ఈ పంట సాగుకు పలువురు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలుగడ్డ సాగు గురించి వ్యవసాయ అధికారి పలు సూచనలు చేశారు. పంట కాలం.. ఏ నేల అనుకూలం బంగాళదుంప పంట సాగుకు నీటి వసతి గల ఇసుక, ఎర్రగరప నేలలు అనుకూలం. బరువైన నేలల్లో ఈ పంట సాగు చేయవద్దు. అక్టోబర్ రెండో వారం నుం చి నవంబర్ మొదటి వారం వరకు ఆలూ సాగు చేయవచ్చు. ఇది వంద రోజుల్లో చేతికి వచ్చే పంట. సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి పదినుంచి పది హేను టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. నేల తయారీ నేలను నాలుగు నుంచి ఐదు సార్లు దున్నాలి. చివరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్పెట్, 30 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. తర్వాత భూమిని చదును చేసుకోవాలి. బోదెలు చేసుకొని ఆలుగడ్డలు నాటుకోవాలి. విత్తన ఎంపిక 30 నుంచి 40 గ్రాముల బరువుండి, రెండు నుంచి మూడు కళ్లున్న విత్తన దుంపలను ఎన్నుకోవాలి. ఎకరానికి ఆరు క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరం అవుతాయి. భూమి, వాతావరణాన్ని బట్టి నీటి తడులు అందించాలి. సాధారణంగా వారానికి ఒక తడి సరిపోతుంది. దుంపలు ఏర్పడే సమయంలో నాలుగైదు రోజులకు ఒక తడి అందించాల్సి ఉంటుంది. కలుపు పెరగకుండా చూసుకోవాలి. ఎరువులు ఆలుగడ్డలను విత్తిన 30 రోజుల తర్వాత 40 కిలోల యూరియా, 50 రోజులకు మరో 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. సస్యరక్షణ బంగాళదుంప పంటను సాధారణంగా దుంప తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తాయి. రసం పీల్చే పురుగు, పొగాకు లద్దె పురుగు, తెల్లనల్లి కూడా ఆశించే అవకాశాలుంటాయి. ఆకుమాడు తెగులు, మొజాయిక్ వైరస్లతోనూ నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయ అధికారులను సంప్రదించి వీటి నివారణ చర్యలు తీసుకోవాలి. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరగడంతోపాటు పంటలకు తెగుళ్ల బాధ తగ్గుతాయి. అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంప ఆకుపచ్చ రంగుకు మారే అవకాశాలుంటాయి. అందువల్ల విత్తిన 30 రోజుల తర్వాత నుంచి దుంపలపైకి మట్టిని ఎగదోయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేయాలి. -
రాజ్మా పంటకు వేళాయె..
సాగుకు గిరిజనులు సన్నద్ధం చల్లని వాతావరణం అనుకూలం మన్యం సిరుల పంట రాజ్మా చిక్కుళ్లు. దీని సాగుకు గిరిజనులు సన్నద్ధం అవుతున్నారు. కాఫీ తరువాత గిరిజనులు దీనినే ప్రధాన వాణిజ్య పంటగా చేపడతారు. ఏజెన్సీలో 10 వేల హెక్టార్లలో సాగవుతోంది. ఏజెన్సీలో ఏటా సుమారు 16 వేల టన్నుల దిగుబడి వస్తోంది. ఇక్కడ పండిన రాజ్మాను ముంబయ్, ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో ఈ పంటకు మంచి ధర పలుకుతుండటంతో రైతులు లాభాలు ఆర్జిస్తున్నారు. కొద్దిపాటి సస్యరక్షణ చేపడితే ఎక్కువ దిగుబడులు సాధించ వచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చింతపల్లి: ఏజెన్సీలోని చల్లని వాతావరణం రాజ్మా సాగుకు అనుకూలం. ఇది స్వల్పకాలిక పంట. అధిక మంచు, ఉష్ణోగ్రతలను తట్టుకొనలేదు. ఉత్తరాదిలో సూప్‌గా వినియోగించే వీటికి మంచి డిమాండ్. ఇందులో ఆరు రకాలు ఉన్నప్పటికి గిరిజనులు ముఖ్యంగా ఎరుపు, తెలుపు రకాలనే పండిస్తున్నారు. 90 శాతం మంది ఎరుపు రాజ్మానే చేపడుతున్నారు. ఎకరాకు మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఇవి గతేడాది కిలో రూ.60 నుంచి 80లు ధర పలికాయి. పంట కాలపరిమితి 3 నెలలు. ఎరుపు రాజ్మాకు డిమాండ్ ఉండటంతో సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. 50 రోజులలోపు దిగుబడి వచ్చే కంటైండరీ, బౌంట్ఫుల్, ఆర్కాకోమల్, రిమూవర్ వంటి రకాలను రైతులు ఇంటి అవసరాల కోసం పండిస్తున్నారు. సాగు విధానం: ఏజెన్సీలో సెప్టెంబరు నుంచి నవంబరు వరకు దీనిని పండిస్తారు. ఇసుకతో కూడిన గరుకు నేలలు, సారవంతమైన గరపనేలలు, బరువైన నేలలు దీనికి అనుకూలం. ఎకరాకు10 నుంచి 12 కిలోల విత్తనం అవసరమవుతుంది. భూమిని బాగా దున్ని చక్కని పదును వచ్చేట్లు చేయాలి. 30 నుంచి 45 సెం.మీ బోదెలు చేసి వాటిపై 25 నుంచి 30 సెం.మీ దూరంలో విత్తనాలు నాటుకోవాలి. భూమిలో కావలసినంత తేమ ఉండేట్లు చూసుకోవాలి. విత్తన శుద్ధి: రాజ్మా విత్తనాలను రైజోబియం జపానికం అనే బాక్టీరియాతో విత్తన శుద్ధి చేయాలి. ఇలా చేయడం వల్ల వాతావరణంలోని నత్రజని మొక్కలకు లభ్యమవుతుంది. ఎరువుల యాజమాన్యం: ఎకరాకు 10 టన్నుల పశువుల గెత్తం వేసి బాగా కలియదున్నాలి. విత్తనాలు వేసే వారం రోజుల ముందు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ ఆఖరి దుక్కులో వేసుకోవాలి. అంతరకృషి: ఒకటి రెండు సార్లు గొప్పు తవ్వి కలుపు మొక్కలు రాకుండా చూసుకోవాలి. రాజ్మా మొక్కల వేళ్లు పైపైనే ఉంటాయి. అధిక తేమను తట్టుకోలేవు. పూత దశకు ముందు, కాయలు ఏర్పడిన తరువాత రెండుసార్లు నీటి తడులు అందించాలి. ఆశించే కీటకాలు: రసంపీల్చు పురుగులైన తేనెబంక, తెల్లదోమ, కాయతొలుచు పురుగులు ఈ పంటను ఎక్కువగా ఆశిస్తాయి. రైతులు వీటిని సకాలంలో గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలి. ఐదు మిల్లీలీటర్ల పాస్మామిడాన్ లీటరు నీటిలో కలిపి నెల రోజుల తర్వాత పిచికారీ చేయాలి. హెక్టారుకు 450 లీటర్ల మందు ద్రావణం అవసరం అవుతుంది. ప్రధానంగా ఆశించే తెగుళ్లు: వెర్రి తెగులు, కాయకుళ్లు, తుప్పు, ఆకుమచ్చ తెగుళ్లు ఎక్కువగా రాజ్మా పంటను ఆశిస్తుంటాయి. వీటిని సకాలంలో గుర్తించకపోతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. వీటి నివారణకు 30 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ 10 లీటర్లు నీటిలో కలిపి విత్తిన 7 వారాల తర్వాత చేనులో జల్లుకోవాలి. హెక్టార్‌కు 540 లీటర్ల మందు ద్రావణం అవసరం అవుతుంది. సస్యరక్షణ తప్పనిసరి రాజ్మా సాగులో రైతులు సస్యరక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలి. దుక్కులు దున్నేటప్పుడు మొదలుకొని పంట చేతికి అందేంత వరకు ప్రత్యేక దృష్టి సారించాలి. ఏజెన్సీవాతావరణం ఈ సాగుకు అనుకూలంగా ఉండటం వల్ల కొద్దిపాటి జాగ్రతలు తీసుకున్నా మరింత దిగుబడులు సాధించ వచ్చు. - డాక్టర్ ఉమా మహేశ్వరరావు, శాస్త్రవేత్త, చింతపల్లి, 9441075852 మంచి ఆదాయం నాది చింతపల్లి మండలం చిక్కిసలబంద. నాకు ఆరు ఎకరాల భూమి ఉంది. అందులో మూడు ఎకరాల్లో పదేళ్లుగా రాజ్మా పంట చేపడుతున్నాను గతేడాది వెయ్యి కిలోల దిగుబడి వచ్చింది. రూ.65వేలు ఆదాయం సమకూరింది. సేంద్రియ పద్ధతిలో పండించడం, ఇంటిల్లిపాదీ కష్టపడడంతో మదుపులు రూ. 10వేలకు మించలేదు. ఈ ఏడాది శాస్త్రవేత్తల సలహాలతో దిగుబడి పెంచుకునేందుకు కృషి చేస్తున్నాను. - జి.రాజుబాబు మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలి నాది చింతపల్లి మండలం సమ్మగిరి. రెండు ఎకరాలలో గతేడాది పంట చేపట్టాను. ఈ ఏడాదీ అదే స్థాయిలో పంటకు అనుకూలంగా భూములను సిద్ధం చేశాను. రాజ్మ్లాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే మరిన్ని లాభాలు వస్తాయి. ప్రధాన వాణిజ్య పంటగా సాగు చేస్తున్నప్పటికి ప్రభుత్వపరంగా కొనుగోలు చేయడం లేదు. దీంతో దళారులు నిర్ణయించిన ధరలకే విక్రయించాల్సి వస్తోంది. మార్కెటింగ్ ఉంటే మరిన్ని లాభాలు సాధిస్తాం. - వి.వెంకటరావు -
హైదరాబాద్ లో మళ్లీ స్వైన్ ఫ్లూ
మళ్లీ హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ ప్రవేశించింది. వారం రోజుల్లో పది మంది స్వైన్ ప్లూ అనుమానంతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వారిలో ఇద్దరుకి ఆ వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు వారికి చికిత్స ప్రారంభించారు. వైద్యులు మాత్రం స్వైన్ ప్లూ ముందు ఉన్నంత ప్రమాదకరంగా లేదని చెప్పుతున్నారు. 2012 లో 34 చనిపోగా, 2013 లో ఎనిమంది చనిపోయారు. 2014 లో అదికారికంగా ఇద్దరే చనిపోయారని చెప్పుతున్నా, ఏడు మంది వరకు చనిపోయారనే వాదన ఉంది. స్వైన్ ప్లూ లక్షణాలను ముందుగా గుర్తిస్తే ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు. రాబోయే రోజుల్లో అంతా చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తం అవటం చాల అవసరమంటున్నారు.