అసలే ఇది చలికాలం. కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు మరీ దారుణంగా పడిపోతుంటాయి. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు అరచేతులు చల్లబడిపోవడం అందరికీ ఎదురయ్యే సమస్యే! చేతులు వెచ్చబరచుకోవడానికి చలిమంటల ముందు కూర్చుంటుంటారు. పనుల మీద బయటకు వెళ్లాల్సిన పరిస్థితులు ఉంటే, చలిమంటల ముందు గంటల తరబడి కూర్చోవడం సాధ్యం కాదు కదా! ఈ ఆలోచనతోనే చేతులు వెచ్చగా ఉంచడానికి తగిన పరికరాన్ని అమెరికన్ కంపెనీ ‘ఒకూపా’ అందుబాటులోకి తెచ్చింది.
ఇది రీచార్జబుల్ హ్యాండ్ వార్మర్. దీనిని చేతుల్లో పట్టుకుంటే చాలు, అరచేతులు క్షణాల్లోనే వెచ్చబడతాయి. అరచేతుల్లో పట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే, గ్లోవ్స్‌లో దీనిని పెట్టేసుకున్నా సరిపోతుంది. ఒకసారి పూర్తిగా చార్జ్ చేసుకుంటే, దాదాపు ఆరుగంటల వరకు పనిచేస్తుంది. మోడల్స్ బట్టి దీని ధర 28.99 నుంచి 42.99 డాలర్ల వరకు (రూ.2389 నుంచి రూ.3543)వరకు ఉంటుంది.
చదవండి: పాల ప్యాకెట్ తెచ్చిన అదృష్టం..వందల కోట్లు సంపాదిస్తున్న పేటీఎం సీఈవో!
Comments
Please login to add a commentAdd a comment