రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8-9 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో అనేక చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. మూడు చోట్ల 5 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గారుు. ఖమ్మం, మెదక్, నల్లగొండల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా, హైదరాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్‌లలో 3 డిగ్రీలు తక్కువగా రికార్డయ్యాయి.