temeperature
-
రాష్ట్రంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ సీజన్ ప్రారంభంలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోగా వాతావరణంలో మార్పుల కారణంగా మళ్లీ కాస్త పెరుగుతూ వచ్చాయి. దీంతో గత వారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళల్లో ఉక్కపోత కూడా కనిపించింది. కానీ ఒక్కసారిగా పొడి వాతావరణం నెలకొనటంతో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఆదిలాబాద్‌లో గడచిన 24 గంటల్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
మరో 2 రోజులు చలి తీవ్రత
3 నుంచి 5 డిగ్రీలు పడిపోయే అవకాశం సాక్షి, హైదరాబాద్: హిమాలయాల నుంచి శీతల గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గుతున్నారుు. దీంతో వచ్చే రెండు రోజులు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల మేరకు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని.. అది బలహీనపడితే ఉష్ణోగ్రతలు పడిపోతాయని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తనం బలపడితే మేఘాలు కేంద్రీకృతమై ఉష్ణోగ్రతలు కాస్తంత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల తర్వాత చలి తీవ్రత ఎలా ఉండబోతుందనేది ఉపరితల ఆవర్తనంపైనే ఆధారపడి ఉందని పేర్కొంటున్నారు. ఇక గత 24 గంటల్లో మెదక్‌లో అత్యంత తక్కువగా 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, ఖమ్మంలలో 4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. హన్మకొండలో 13 డిగ్రీలు, ఖమ్మంలో 14 డిగ్రీలు రికార్డయ్యాయి. నిజామాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యారుు. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో సాయంత్రం 6:00 దాటిందంటేచాలు చలితో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతోపాటు చలిగాలులు కూడా వీస్తుండటంతో ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశాలున్నారుు. వృద్ధులు, పిల్లలు చలి నుంచి రక్షణ పొందకపోతే ఇబ్బందులు ఏర్పడుతాయని వైద్యులు సూచిస్తున్నారు. జలుబు, ఆస్తమా వంటివి తీవ్రమయ్యే అవకాశం ఉందంటున్నారు. చలి తీవ్రతతో రాష్ట్రంలో విద్యుత్ వాడకం కూడా తగ్గింది. ఏసీలు, ఫ్యాన్ల వాడకం తగ్గగా.. గీజర్ల వాడకం మాత్రం పెరిగింది. -
మరింతగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
మెదక్ @ 10 డిగ్రీలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8-9 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో అనేక చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. మూడు చోట్ల 5 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గారుు. ఖమ్మం, మెదక్, నల్లగొండల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా, హైదరాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్‌లలో 3 డిగ్రీలు తక్కువగా రికార్డయ్యాయి. మెదక్‌లో రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా రాత్రి వేళ 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శీతాకాలం మొదలైనప్పటి నుంచి మెదక్‌లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. అక్కడ ఈ సీజన్లోనే 9 డిగ్రీలకు కూడా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయారుు. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పెరిగిన చలి.. హైదరాబాద్ గజగజ మరోవైపు హైదరాబాద్‌లో చలి తీవ్రత మరింత పెరిగింది. శనివారం నగరంలో 12.7 డిగ్రీలతో ఈ సీజన్లో అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డరుుంది. సాయంత్రం ఐదు గంటల నుండి చలిగాలులు వీచారుు. 2007 నవంబర్ 25న 11.3 డిగ్రీలు, 2012 నవంబర్ 18న నగరంలో అత్యల్పంగా 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత అనంతరం మళ్లీ 12.7 డిగ్రీలకు పడిపోవటం ఇదే మొదలు. గత ఏడాది నవంబర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలుగా నమోదైంది. -
మరింతగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
-
చలి తీవ్రం.. తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు
-
చలి తీవ్రం.. తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు
4 డిగ్రీల వరకు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. పగటి వేళల్లోనూ చలి తీవ్రత పెరిగింది. 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోద వుతాయని వెల్లడించింది. గత 24 గంటల్లో ఖమ్మం, మెదక్‌తో పాటు వివిధ చోట్ల 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్‌లో 11 డిగ్రీల అత్యంత తక్కువ ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామా బాద్, రామగుండంలోనూ 14 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
వణికిస్తున్న చలి.. తగ్గిన ఉష్ణోగ్రతలు
ఖమ్మం, నల్లగొండల్లో తగ్గిన ఉష్ణోగ్రతలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఖమ్మం, నల్లగొండల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు తగ్గాయి. ఖమ్మంలో 14 డిగ్రీలు, నల్లగొండలో 15 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్‌లో 4 డిగ్రీలు తక్కువగా 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డవగా హైదరాబాద్‌లో సాధారణం కంటే 3 డిగ్రీలు తక్కువగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్, రామగుండంలో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.