రాష్ట్రంలో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. ఈ సీజన్ ప్రారంభంలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోగా వాతావరణంలో మార్పుల కారణంగా మళ్లీ కాస్త పెరుగుతూ వచ్చాయి. దీంతో గత వారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళల్లో ఉక్కపోత కూడా కనిపించింది.
కానీ ఒక్కసారిగా పొడి వాతావరణం నెలకొనటంతో గత రెండు రోజులుగా తగ్గుతూ వచ్చిన ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. ఆదిలాబాద్‌లో గడచిన 24 గంటల్లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.