మరింతగా పడిపోతున్న రాత్రి ఉష్ణోగ్రతలు
మెదక్ @ 10 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8-9 గంటల వరకు కూడా చలి తీవ్రత కొనసాగుతోంది. రానున్న రోజుల్లో చలి ఇంకా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు గత 24 గంటల్లో అనేక చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యాయి. మూడు చోట్ల 5 డిగ్రీల వరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గారుు. ఖమ్మం, మెదక్, నల్లగొండల్లో సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా, హైదరాబాద్, హన్మకొండ, మహబూబ్‌నగర్‌లలో 3 డిగ్రీలు తక్కువగా రికార్డయ్యాయి.
మెదక్‌లో రాష్ట్రంలోనే అత్యంత తక్కువగా రాత్రి వేళ 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్‌లో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. శీతాకాలం మొదలైనప్పటి నుంచి మెదక్‌లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నారుు. అక్కడ ఈ సీజన్లోనే 9 డిగ్రీలకు కూడా రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయారుు. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
పెరిగిన చలి.. హైదరాబాద్ గజగజ
మరోవైపు హైదరాబాద్‌లో చలి తీవ్రత మరింత పెరిగింది. శనివారం నగరంలో 12.7 డిగ్రీలతో ఈ సీజన్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డరుుంది. సాయంత్రం ఐదు గంటల నుండి చలిగాలులు వీచారుు. 2007 నవంబర్ 25న 11.3 డిగ్రీలు, 2012 నవంబర్ 18న నగరంలో అత్యల్పంగా 12.4 డిగ్రీల ఉష్ణోగ్రత అనంతరం మళ్లీ 12.7 డిగ్రీలకు పడిపోవటం ఇదే మొదలు. గత ఏడాది నవంబర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలుగా నమోదైంది.