చలి తీవ్రం.. తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు | temeperature day by day decreases in telangana | Sakshi
Sakshi News home page

చలి తీవ్రం.. తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు

Published Sat, Nov 26 2016 3:19 AM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

temeperature day by day decreases in telangana

4 డిగ్రీల వరకు తగ్గిన కనిష్ట ఉష్ణోగ్రతలు
 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి. పగటి వేళల్లోనూ చలి తీవ్రత పెరిగింది. 4 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆయా ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోద వుతాయని వెల్లడించింది. గత 24 గంటల్లో ఖమ్మం, మెదక్‌తో పాటు వివిధ చోట్ల 4 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గాయి.

మెదక్‌లో 11 డిగ్రీల అత్యంత తక్కువ ఉష్ణోగ్రత రికార్డయింది. హైదరాబాద్‌లో రెండు డిగ్రీలు తక్కువగా 14 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామా బాద్, రామగుండంలోనూ 14 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement