హైదరాబాద్ లో మళ్లీ స్వైన్ ఫ్లూ
మళ్లీ హైదరాబాద్‌లో స్వైన్ ఫ్లూ ప్రవేశించింది. వారం రోజుల్లో పది మంది స్వైన్ ప్లూ అనుమానంతో ఆస్పత్రిలో చేరారు. వారిలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వారిలో ఇద్దరుకి ఆ వ్యాధి ఉన్నట్లు తేలింది. దీంతో వైద్యులు వారికి చికిత్స ప్రారంభించారు.
వైద్యులు మాత్రం స్వైన్ ప్లూ ముందు ఉన్నంత ప్రమాదకరంగా లేదని చెప్పుతున్నారు. 2012 లో 34 చనిపోగా, 2013 లో ఎనిమంది చనిపోయారు. 2014 లో అదికారికంగా ఇద్దరే చనిపోయారని చెప్పుతున్నా, ఏడు మంది వరకు చనిపోయారనే వాదన ఉంది. స్వైన్ ప్లూ లక్షణాలను ముందుగా గుర్తిస్తే ప్రమాదం ఉండదని వైద్యులు అంటున్నారు.
రాబోయే రోజుల్లో అంతా చల్లని వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తం అవటం చాల అవసరమంటున్నారు.