పంజగుట్ట: ప్రస్తుత వాతావరణానికి స్వైన్‌ప్లూ వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్వైన్‌ప్లూ వైద్య నిపుణులు వ్యాకరణం నాగేశ్వరరావు కోరారు. ఎవరికైనా స్వైన్ ప్లూ లక్షణాలు కనిపిస్తే తమ నైటింగేల్ హోంకేర్ స్పెషలిస్టు టోల్‌ఫ్రీ నంబర్ 1800-425-0095కు ఫోన్ చేస్తే సందేహాలు నివృత్తి చేయడమే కాకుండా నర్సులను ఇంటికి వచ్చి ప్రాథమిక చికిత్స చేసి ఉచిత సర్వీస్‌తో పాటు ఆసుపత్రికి తరలించనున్నట్లు పేర్కొన్నారు.
శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నైటింగేల్ రీజనల్ హెడ్ సుధాకర్ జాదవ్‌తో కలిసి మాట్లాడుతూ ... ఎవరికై నా దగ్గు, తుమ్ములు, జ్వరం ఉంటే వాటిని స్వైన్‌ప్లూ లక్షణంగా పరిగణించవచ్చునని వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఇప్పటికే నగరంలో పలు కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాక్సిన్ వేసుకోవడం మంచిదని పేర్కొన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌పై 40 శాతం రాయితీ ఇచ్చేందుకు ఆయా సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు.
ప్రతీ ఒక్కరూ బయటకు వెల్లి వచ్చిన తర్వాత కనీసం 15 సెకన్లు సబ్బుతో గానీ డిటర్జింట్‌తో గానీ చేతులు శుభ్రంగా కడుక్కొవాలని అన్నారు. స్వైన్‌ప్లూ ఉన్న వారికి సుమారు 6 అడుగులు దూరంగా ఉండాలని పేర్కొన్నారు. మాస్క్‌లు తప్పకుండా ధరించాలని, తద్వారా 50 శాతం నివారించవచ్చునన్నారు. తమతో పాటు ఉన్న వారిలో ఎవరికై నా స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి తరలించాలన్నారు. వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే ఎలాంటి హానీ ఉండదని అన్నారు.
స్వైన్‌ప్లూపై సమరానికి టోల్‌ఫ్రీ నంబర్..
Published Sat, Sep 17 2016 6:42 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement