న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో చలి తీవ్రత ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజ గజ వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. వెలుతురులేమి కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని సఫ్తార్‌జంగ్ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు..
సఫ్తార్‌జంగ్ (1.9), పాలమ్(5.2), లోథిరోడ్ (2.8), రిడ్జ్(2.2), అయా నగర్(2.6) డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. గాలి నాణ్యత సైతం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. గాలినాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. తమ ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్‌లోని అమృత్‌సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా వెలుతురులేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY
— ANI (@ANI) January 8, 2023
ఇదీ చదవండి: స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు
Comments
Please login to add a commentAdd a comment