lowest temperature
-
ఆదిలాబాద్ @ 4.7 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే సగటున 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.7డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఇక్కడ ఈ సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 8.1 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.పటాన్చెరు, హకీంపేట్, హనుమకొండ, మెదక్, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్‌కు పైబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు పతనమైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్య దిశనుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న రెండ్రోజులు ఉదయం పూట పొగమంచు ఏర్పడుతుందని, దీంతో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.రానున్న మూడురోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 4డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ప్రాంతాలు ఆదిలాబాద్ : 4.7 డిగ్రీలు, అర్లి : 6.3డిగ్రీలు, తండ్ర: 6.6 డిగ్రీలు, తిర్యాణి: 6.7 డిగ్రీలు, కొహిర్: 6.8డిగ్రీలు, జుక్కల్: 7.6డిగ్రీలు, కొట్గిరి: 7.7 డిగ్రీలు, శివంపేట్: 8 డిగ్రీలు, మల్లాపూర్: 8 డిగ్రీలు, మోమీన్‌పేట్: 8.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలను వణికిస్తున్న చలి
-
ఏజెన్సీ గజగజ
సాక్షి, పాడేరు: ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలను చలిగాలులు వణికిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచే చలిగాలులు విజృంభిస్తుండటంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరుకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినుములూరు కేంద్ర కాఫీ బోర్డులో గురువారం 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అరకులోయ కేంద్ర కాఫీ బోర్డులో 11.3, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైంది. ఏజెన్సీలో అర్ధరాత్రి నుంచి పొగమంచు దట్టంగా కురుస్తోంది. పాడేరులో గురువారం ఉదయం 10 గంటల వరకు మంచు తెరలు వీడలేదు. పొగమంచుతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు.2 -
చలితో గజ గజ! ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: ఉత్తర భారతంలో చలి తీవ్రత ఉధృతమవుతోంది. దేశ రాజధాని ఢిల్లీ చలికి గజ గజ వణుకుతోంది. ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. వెలుతురులేమి కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని సఫ్తార్‌జంగ్ ప్రాంతంలో అత్యల్పంగా 1.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితులు కొనసాగనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా 20 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని ఢిల్లీ ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు.. సఫ్తార్‌జంగ్ (1.9), పాలమ్(5.2), లోథిరోడ్ (2.8), రిడ్జ్(2.2), అయా నగర్(2.6) డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు.. గాలి నాణ్యత సైతం ప్రమాదకరస్థాయిలోనే ఉంది. గాలినాణ్యత సూచీ 359గా ఉన్నట్లు అధికారులు తెలిపారు. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్న క్రమంలో నిరాశ్రయుల కోసం ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసింది ఢిల్లీ ప్రభుత్వం. తమ ప్రాంతాల్లోని శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. పంజాబ్‌లోని అమృత్సర్, పాటియాలా, అంబాలా, చండీగఢ్, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో చలి తీవ్రత అధికంగా ఉంది. పొగమంచు కారణంగా వెలుతురులేమితో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. Delhi | Severe cold wave and fog conditions continue to prevail in the national capital. Visuals from Kartavya Path pic.twitter.com/hpahVIAtXY — ANI (@ANI) January 8, 2023 ఇదీ చదవండి: స్తోమత లేక బడి మానేసి బీడీలు.. ఇప్పుడు అమెరికాలో జడ్జీగా తీర్పులు -
అదిలాబాద్ జిల్లాలో పడిపోతున్న ఉష్ణొగ్రతలు
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
-
గజగజా వణికిపోతున్న ఐరోపా
-
కార్గిల్ @ మైనస్ 20.6
జమ్ము/శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లడఖ్ రీజియన్‌లోని కార్గిల్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఎముకల్ని కొరికేసే అంతటి చలి వాతావరణం నెలకొంది. బుధవారం ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 20.6గా డిగ్రీలుగా నమోదైంది. శీతల గాలులు కొనసాగుతున్నాయి. జమ్ము నగరం సైతం ఈ సీజన్లో అత్యంత శీతల రాత్రిగా నమోదైంది. ఇక్కడ ఉష్ణోగ్రత 4.3 డిగ్రీలుగా ఉంది. గురు, శుక్రవారాల్లో మరింత చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లేహ్‌లో ఈ సీజన్లో మరోసారి అత్యంత తక్కువ ఉష్ణోగ్రత మైనస్ 16.6 డిగ్రీలుగా నమోదైంది. పెహల్గాంలో మైనస్ 6.1, గుల్మార్గ్లో మైనస్ 6.8, కత్రాలో 6.2, బటోట్‌లో 2, బన్నిహిల్లో 0, భదేర్వా మైనస్ 0.1, ఉధంపూర్‌లో 3 డిగ్రీల సెల్సియస్ ఉంది. -
చలి గుప్పిట్లో రాష్ట్రం
- ఆదిలాబాద్‌లో 5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత - ఈ సీజన్లో ఇదే తక్కువ.. - మెదక్‌లో 9 డిగ్రీలు నమోదు - జగిత్యాల జిల్లా అయిలాపూర్‌లో చలి తీవ్రతకు వృద్ధురాలి మృతి - ఏపీలోనూ పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు... చింతపల్లిలో 4 డిగ్రీల నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో ప్రజలు ఆ సమయాల్లో బయటకు రావడానికి వణికిపోతున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు తక్కువగా నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈ సీజన్లో ఇంత తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఆ తర్వాత మెదక్‌లో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హన్మకొండ, హైదరాబాద్, రామగుండంలలో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. హన్మకొండ, ఖమ్మం, నల్లగొండల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీలు తక్కువగా నమోదు కావడం గమనార్హం. ఖమ్మంలో 12 డిగ్రీలు, నల్లగొండలో 13 డిగ్రీలు కనిష్టంగా నమోదయ్యాయి. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో రానున్న రోజుల్లో చలి తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. -
మన్యంలో పెరిగిన చలితీవ్రత
-
రాష్ట్రవ్యాప్తంగా చలిగాలులు
మెదక్‌లో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 2 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. మెదక్‌లో 12 డిగ్రీల అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా రికార్డయింది. ఖమ్మంలో 5 డిగ్రీలు తక్కువగా 15 డిగ్రీల ఉష్ణోగ్రత, నిజామాబాద్‌లో 13, హైదరాబాద్, ఆదిలాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రాత్రి వేళ నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత రికార్డయింది. నల్లగొండలో సాధారణం కంటే 4 డిగ్రీలు తక్కువగా 17 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, రాబోయే నాలుగు రోజుల్లో చలి గాలుల తీవ్రతకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. -
మన్యంలో పెరిగిన చలితీవ్రత
విశాఖ: ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల వల్ల మన్యంలో ఉష్ణోగ్రతలు మరింత పడిపోతున్నాయి. దీంతో ఎజెన్సీ ప్రాంతాలు మంచు దుప్పటిని కప్పుకున్నాయి. ఉదయం పది గంటలైనా.. పొగమంచు వీడకపోవడంతో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటి ల్లుతుండటంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆదివారం రాత్రి లంబసింగిలో 4 డిగ్రీలు, చింతపల్లి, పాడేరులో 5 డిగ్రీలు, అరకులో 7.5 డిగ్రీలు, పోతురాజుగుడి వద్ద 6 డిగ్రీలు, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాష్ట్రంపై చలి పంజా
మెదక్‌లో అత్యంత తక్కువగా 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. రెండ్రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం ఆరు దాటిందంటే చలి దాడి చేస్తోంది. ఉదయం ఏడు గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. మరో రెండ్రోజులు రాష్ట్రంపై చలిగాలుల తీవ్రత కొనసాగుతుం దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత 24 గంటల్లో మెదక్‌లో అత్యంత తక్కువగా 9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ సాధారణం కంటే ఏడు డిగ్రీలు తగ్గడం గమనార్హం. హైదరాబాద్, ఆదిలాబాద్, నిజా మాబాద్‌లో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణో గ్రతలు రికార్డు అయ్యాయి. ఖమ్మం, నల్ల గొండల్లో సాధారణం కంటే 6 డిగ్రీల చొప్పు న ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖమ్మంలో 14 డిగ్రీలు, నల్లగొండలో 15 డిగ్రీల సెల్సియస్ కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో జనం స్వెట్టర్లు, జర్కిన్లు, ఇతరత్రా ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్తున్నారు. పిల్లలు, పెద్దలు చలికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. -
2.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అత్యల్ప ఉష్ణోగ్రత!
ఢిల్లీ:ఎముకలు కొరికే చలిగాలులు, పొగ మంచు ప్రభావంతో హస్తిన జనజీవనం అస్తవ్యస్తమైంది. మంచినీళ్లు సైతం గడ్డకట్టే స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీలో 2.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు కావడంతో ఢిల్లీ వాసుల కష్టాలు అంతా ఇంతా కాదు. గత ఐదేళ్లలో తొలిసారి కనిష్టస్థాయికి చేరిన ఉష్ణోగ్రతలతో ఢిల్లీ అల్లాడుతోంది.మరోవైపు పొగమంచు కారణంగా ఢిల్లీలో పలు విమాన సర్వీసులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో 73 విమాన, 70 రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. 50 మీటర్ల వరకే వాహనాలు కనిపిస్తుండటంతో సాధారణ ట్రాఫిక్‌కు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. సోమవారం కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. -
చలిపులి