కార్గిల్‌ @ మైనస్‌ 20.6 | Kargil slips into minus 20.6 | Sakshi
Sakshi News home page

కార్గిల్‌ @ మైనస్‌ 20.6

Published Wed, Jan 3 2018 10:50 AM | Last Updated on Wed, Jan 3 2018 10:50 AM

Kargil slips into minus 20.6 - Sakshi

జమ్ము/శ్రీనగర్‌:  జమ్ముకాశ్మీర్‌ లడఖ్‌ రీజియన్‌లోని కార్గిల్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఎముకల్ని కొరికేసే అంతటి చలి వాతావరణం నెలకొంది. బుధవారం ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్‌ 20.6గా డిగ్రీలుగా నమోదైంది. శీతల గాలులు కొనసాగుతున్నాయి. జమ్ము నగరం సైతం ఈ సీజన్‌లో అత్యంత శీతల రాత్రిగా నమోదైంది. ఇక్కడ ఉష్ణోగ్రత 4.3 డిగ్రీలుగా ఉంది. గురు, శుక్రవారాల్లో మరింత చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లేహ్‌లో ఈ సీజన్‌లో మరోసారి అత్యంత తక్కువ ఉష్ణోగ్రత మైనస్‌ 16.6 డిగ్రీలుగా నమోదైంది. పెహల్గాంలో మైనస్‌ 6.1, గుల్‌మార్గ్‌లో మైనస్‌ 6.8, కత్రాలో 6.2, బటోట్‌లో 2, బన్నిహిల్‌లో 0, భదేర్‌వా మైనస్‌ 0.1, ఉధంపూర్‌లో 3 డిగ్రీల సెల్సియస్‌ ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement