Kargil Sector
-
IAF: కార్గిల్‌లో నైట్ ల్యాండింగ్
భారత వాయుసేన (ఐఏఎఫ్) అరుదైన ఘనత సాధించింది. సముద్ర మట్టానికి ఏకంగా 10,500 అడుగుల ఎత్తున హిమాలయ పర్వతాలపై ఉన్న కార్గిల్ అడ్వాన్స్డ్ ల్యాండ్ గ్రౌండ్‌పై సి–130జే సూపర్ హెర్క్యులస్ రవాణా విమానాన్ని రాత్రి పూట సురక్షితంగా ల్యాండింగ్ చేసింది. దీనికి సంబంధించి వాయుసేన ‘ఎక్స్’లో పోస్టు చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఐఏఎఫ్ బాహుబలిగా చెప్పే ఈ విమానం పాక్ సరిహద్దులో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలోని ఈ ఎయిర్ స్ట్రిప్‌పై రాత్రి సమయంలో దిగడం ఇదే తొలిసారి! గరుడ్ కమాండోలకు శిక్షణలో భాగంగా ఇటీవలే ఈ విన్యాసం నిర్వహించినట్లు వాయుసేన వర్గాలు వెల్లడించాయి. అంతేగాక ఐఏఎఫ్ శక్తిసామర్థ్యాలను ప్రదర్శించడానికి రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు వివరించాయి. నిజానికి రక్షణ శాఖలో రవాణా విమానాన్ని ఇలా రాత్రి పూట ల్యాండింగ్ చేయడం అత్యంత అరుదు. కొండలపై ఉన్న రన్‌వేపై భారీ విమానాన్ని క్షేమంగా దించడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. హిమాలయ పర్వతాల్లో వాయుసేన ఆధ్వర్యంలో ఎయిర్ర్స్టిప్లు సేవలందిస్తున్నాయి. ఎల్ఏసీ సమీపంలో దౌలత్ బేగ్ ఓల్డీ అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్(ఏఎల్జీ) సముద్ర మట్టానికి 16,700 అడుగుల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎయిర్‌ఫీల్డ్ కావడం గమనార్హం. వాయుసేన వద్ద 12 సి–130జే విమానాలున్నాయి. ఇవి సైనికుల తరలింపు, సహాయక సామగ్రి రవాణాలో ఉపయోగపడుతున్నాయి. – న్యూఢిల్లీ -
మన భూభాగాన్ని చైనా కాజేసింది
కార్గిల్/న్యూఢిల్లీ: మన భూభాగాన్ని చైనా కాజేసిన విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసునని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. అంగుళం భూమి కూడా ఆక్రమణకు గురికాలేదంటూ ప్రధాని మోదీ చెబుతున్న మాటలు అబద్ధమని ఆయన విమర్శించారు. ఈ నెల 17 నుంచి లద్దాఖ్‌లో పర్యటిస్తున్న కాంగ్రెస్ నేత శుక్రవారం ఇక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘వారం రోజులుగా లద్దాఖ్‌లో బైక్‌పై పర్యటిస్తున్నా. లద్దాఖ్ వ్యూహాత్మక ప్రదేశం. భారత్‌కు చెందిన వందలాది కిలోమీటర్ల ప్రాంతాన్ని చైనా లాక్కున్న విషయం పాంగోంగ్ సరస్సు వద్దకు వెళ్లినప్పుడు అర్థమయ్యింది. ఇక్కడి భూమిని అంగుళం కూడా చైనా ఆర్మీ ఆక్రమించుకోలేదంటూ ప్రధాని మోదీ చెప్పిందంతా పూర్తిగా అసత్యం. ప్రధాని నిజం చెప్పలేదు, చైనా మన భూభాగాన్ని కబ్జా చేసిందనే విషయం లద్దాఖ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు’అని రాహుల్ అన్నారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్‌కు ఆయన మద్దతు ప్రకటించారు. చైనా ఆక్రమణలతోపాటు లద్దాఖ్ ప్రజల సమస్యలపై పార్లమెంట్లో మాట్లాడతానన్నారు. రాహుల్ అంతకుముందు ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకాన్ని సందర్శించారు. 1999 ఇండో–పాక్ యుద్ధంలో అమరులైన జవాన్లకు ఘనంగా నివాళులర్పించారు. లద్దాఖ్‌లో పర్యటన ముగించుకున్న రాహుల్ బైక్‌ను వదిలి, కారులో శ్రీనగర్ చేరుకున్నారని, శనివారం తిరిగి ఢిల్లీకి చేరుకుంటారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. -
కార్గిల్ @ మైనస్ 20.6
జమ్ము/శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ లడఖ్ రీజియన్‌లోని కార్గిల్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ఎముకల్ని కొరికేసే అంతటి చలి వాతావరణం నెలకొంది. బుధవారం ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత మైనస్ 20.6గా డిగ్రీలుగా నమోదైంది. శీతల గాలులు కొనసాగుతున్నాయి. జమ్ము నగరం సైతం ఈ సీజన్లో అత్యంత శీతల రాత్రిగా నమోదైంది. ఇక్కడ ఉష్ణోగ్రత 4.3 డిగ్రీలుగా ఉంది. గురు, శుక్రవారాల్లో మరింత చల్లటి గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. లేహ్‌లో ఈ సీజన్లో మరోసారి అత్యంత తక్కువ ఉష్ణోగ్రత మైనస్ 16.6 డిగ్రీలుగా నమోదైంది. పెహల్గాంలో మైనస్ 6.1, గుల్మార్గ్లో మైనస్ 6.8, కత్రాలో 6.2, బటోట్‌లో 2, బన్నిహిల్లో 0, భదేర్వా మైనస్ 0.1, ఉధంపూర్‌లో 3 డిగ్రీల సెల్సియస్ ఉంది. -
కార్గిల్ సెక్టార్లో జవాను మిస్సింగ్
జమ్మూకశ్మీర్: జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఒక జవాను కనిపించకుండా పోయాడు. సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది ఒక జవానును మాత్రం రక్షించగలిగారు. కానీ, రెండో సైనికుడి జాడ మాత్రం తెలియడం లేదు. రెండు రోజుల కిందట కార్గిల్ సెక్టార్ లో ఏర్పడిన స్వల్ప ప్రకంపనల కారణంగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.