
రాష్ట్రంపై చలి పంజా
మెదక్‌లో అత్యంత తక్కువగా 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంపై చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. రెండ్రోజులుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం ఆరు దాటిందంటే చలి దాడి చేస్తోంది. ఉదయం ఏడు గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. మరో రెండ్రోజులు రాష్ట్రంపై చలిగాలుల తీవ్రత కొనసాగుతుం దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గత 24 గంటల్లో మెదక్‌లో అత్యంత తక్కువగా 9 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ సాధారణం కంటే ఏడు డిగ్రీలు తగ్గడం గమనార్హం.
హైదరాబాద్, ఆదిలాబాద్, నిజా మాబాద్‌లో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణో గ్రతలు రికార్డు అయ్యాయి. ఖమ్మం, నల్ల గొండల్లో సాధారణం కంటే 6 డిగ్రీల చొప్పు న ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఖమ్మంలో 14 డిగ్రీలు, నల్లగొండలో 15 డిగ్రీల సెల్సియస్ కనిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతతో జనం స్వెట్టర్లు, జర్కిన్లు, ఇతరత్రా ఉన్ని దుస్తులు ధరించి బయటకు వెళ్తున్నారు. పిల్లలు, పెద్దలు చలికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.