బీహార్‌లోకి ‍ప్రవేశించిన చలి | Bihar Weather Cold Has Entered Bihar, IMD Issue Alert For Severe Cold Days | Sakshi
Sakshi News home page

Bihar Weather Update: బీహార్‌లోకి ‍ప్రవేశించిన చలి

Published Sun, Oct 20 2024 11:07 AM | Last Updated on Sun, Oct 20 2024 11:21 AM

Bihar Weather Cold has Entered Bihar

పట్నా: బీహార్‌లోకి చలి అప్పుడే ప్రవేశించింది. మరో రెండు మూడు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని, ఉష్ణోగ్రతలో గణనీయమైన మార్పులు కనిపించబోవని వాతావరణ శాఖ తెలిపింది. అధిక తేమ కారణంగా  రాష్ట్రాంలోని పలు జిల్లాల్లో ఉదయం వేళ పొగమంచు కమ్ముకుంటోంది.

రాజధాని పట్నాతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో దీపావళికి ముందే గాలి నాణ్యత క్షీణించింది. పట్నా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో తుఫాను గాలులు కొనసాగుతున్నాయి. ఫలితంగా బీహార్‌లోని ఈశాన్య ప్రాంతం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది.

గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. గాలి దిశ పశ్చిమం వైపు కొనసాగుతోంది. గరిష్ట ఉష్ణోగ్రత 31 నుండి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 20 నుండి 24 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదైంది.
 

ఇది కూడా చదవండి: పుష్కర కాలానికి పూచే నీలకురంజి పుష్పం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement