ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుండి 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలి మరింత తీవ్రమయ్యింది. గంగాతీరంలోని మైదాన ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. దీని కారణంగా రైళ్లు, రహదారి రవాణాకు తీవ్ర ఆటంటాలు ఎదురువుతున్నాయి.
హర్యానా, రాజస్థాన్, పంజాబ్‌లలోని చాలాచోట్ల చలి విపరీతంగా ఉన్నదని ఢిల్లీ, ఉత్తర మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇటుంటి పరిస్థితులే ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 10 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యింది.
హర్యానాలోని అంబాలాలో గరిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7.5 డిగ్రీలు తక్కువ. పంజాబ్‌లోని పాటియాలాలో ఉష్ణోగ్రత 11.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్‌లో సగటు కంటే 7.5 డిగ్రీల సెల్సియస్ తక్కువ.
రాజస్థాన్‌లోని సికార్‌లో ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇది ఈ సీజన్‌లో సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువ. మధ్యప్రదేశ్‌లోని గుణాలో గరిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువ.
పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని, ఫలితంగా చలి మరింత తీవ్రం అవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment