temparatuare
-
జమ్ముకశ్మీర్‌లో సున్నా డిగ్రీల దిగువకు ఉష్ణోగ్రతలు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉష్ణోగ్రతలు కనిష్టానికి చేరుకున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సున్నాకు దిగువగా నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో చలి మరింతగా పెరవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.శ్రీనగర్‌లో గురువారం కనిష్ట ఉష్ణోగ్రత -0.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. నవంబర్ 23 వరకు కశ్మీర్లో వాతావరణం సాధారణంగానే ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నవంబర్ 24న వాతావరణంలో మార్పులు వచ్చే అవకాశం ఉందని, లోయలోని ఎత్తయిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా తేలికపాటి మంచు కురిసే అవకాశం ఉంది. కాశ్మీర్‌లోని ఖాజిగుండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత -2.0 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, పహల్గామ్లో -3.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. షోపియాన్‌లో-3.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గుల్మార్గ్లో ఉష్ణోగ్రత 0.0 డిగ్రీల సెల్సియస్, కుప్వారాలో -0.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. కోకర్నాగ్లో కనిష్ట ఉష్ణోగ్రత 0.7 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. బందిపొరలో -2.4 డిగ్రీల సెల్సియస్, బారాముల్లా -0.4 డిగ్రీల సెల్సియస్, బుద్గామ్ -2.1 డిగ్రీల సెల్సియస్, కుల్గామ్ -2.6 డిగ్రీల సెల్సియస్, లార్నులో -3.0 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఇది కూడా చదవండి: దేశంలో తగ్గిన సంతానోత్పత్తి రేటు.. ప్రయోజనమా? ప్రతికూలమా? -
37 నగరాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
దేశంలోని ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. 37 నగరాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌లోని ఫలోడి వరుసగా రెండో రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 49.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతకు ముందురోజు ఇక్కడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఢిల్లీలోని ఎనిమిది చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యాయి. ముంగేష్పూర్, నజఫ్‌గఢ్‌లలో వరుసగా 48.3 డిగ్రీల సెల్సియస్, 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నాల్లో 47 డిగ్రీల సెల్సియస్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాజస్థాన్‌లోని బార్మర్‌లో 49 డిగ్రీల సెల్సియస్, బికనీర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్, జైసల్మేర్‌లో 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అకోలా, యవత్మాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.2 డిగ్రీల సెల్సియస్, 46.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మే 29 వరకు వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. -
రాగల రెండు రోజుల్లో చలి మరింత తీవ్రం!
ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శుక్రవారం గరిష్ట ఉష్ణోగ్రత రెండు నుండి 10 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోవడంతో చలి మరింత తీవ్రమయ్యింది. గంగాతీరంలోని మైదాన ప్రాంతాలలో దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. దీని కారణంగా రైళ్లు, రహదారి రవాణాకు తీవ్ర ఆటంటాలు ఎదురువుతున్నాయి. హర్యానా, రాజస్థాన్, పంజాబ్లలోని చాలాచోట్ల చలి విపరీతంగా ఉన్నదని ఢిల్లీ, ఉత్తర మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలో ఇటుంటి పరిస్థితులే ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 10 నుంచి 18 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యింది. హర్యానాలోని అంబాలాలో గరిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇది సాధారణం కంటే 7.5 డిగ్రీలు తక్కువ. పంజాబ్‌లోని పాటియాలాలో ఉష్ణోగ్రత 11.1 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది ఈ సీజన్లో సగటు కంటే 7.5 డిగ్రీల సెల్సియస్ తక్కువ. రాజస్థాన్‌లోని సికార్‌లో ఉష్ణోగ్రత 12.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఇది ఈ సీజన్లో సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువ. మధ్యప్రదేశ్‌లోని గుణాలో గరిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే 10 డిగ్రీలు తక్కువ. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంటుందని, ఫలితంగా చలి మరింత తీవ్రం అవుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. -
గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు!
దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ. డిసెంబర్లో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా శనివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. శనివారం ఢిల్లీలో నాలుగు నుండి 10 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుండి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 28 వరకు ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి దిశలో మార్పు, తగ్గిన వేగం కారణంగా రాజధాని మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జనం కళ్ల మంటలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఎన్‌సిఆర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409గా నమోదయ్యింది. ఇది తీవ్రమైన విభాగంలో ఉంది. ఇది గురువారం కంటే 48 సూచీలు ఎక్కువ. శుక్రవారం మధ్యాహ్నానికి కూడా సూర్యుడు కనిపించలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలోని 24 ప్రాంతాల్లో గాలి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. ఇది కూడా చదవండి: ‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’ -
ఏపీలో భగభగ మండుతున్న ఎండలు
-
తెలంగాణలో కాస్త పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు డిగ్రీల వరకు పెరిగాయి. గత 24 గంటల్లో నల్లగొండ, నిజామాబాద్‌లలో మినహా మిగిలిన ప్రాంతాల్లో పెరిగాయి. ఖమ్మంలో 4 డిగ్రీలు, భద్రాచలంలో 3 డిగ్రీలు ఎక్కువగా 32 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హన్మకొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలలో 1 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా 31 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్, హకీంపేట, నల్లగొండ, నిజామాబాద్‌లలో 29 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీలు నమోదుకాగా, మెదక్‌లో 12, ఖమ్మం, నల్లగొండ, నిజామాబాద్, రామగుండంలలో 14 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి. -
ఎండగా ఉన్న ఉదయం
న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం ఉదయం దాదాపుగా 13.5 డిగ్రీల సెల్సియస్‌గా కనిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని వాతావరణ అధికారి తెలపారు. ఈ సీజన్లో ఆకాశంలో గరిష్ట ఉష్ణోగ్రత రోజుంతా స్పష్టంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రోజు మొత్తంలో దాదాపుగా ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌గా ఉంటుందని వాతావరణ శాఖ అదికారి తెలిపారు. శనివారం ఉదయం 8.30 గంటలకూ వాతావరణంలో తేమ 62 శాతంగా ఉంది. శుక్రవారం ఉన్న గరిష్ట ఉష్ణోగ్రత కన్నా శనివారం ఒక డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగి 26 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.