దేశంలోని ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. 37 నగరాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌లోని ఫలోడి వరుసగా రెండో రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 49.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతకు ముందురోజు ఇక్కడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
ఢిల్లీలోని ఎనిమిది చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యాయి. ముంగేష్‌పూర్, నజఫ్‌గఢ్‌లలో వరుసగా 48.3 డిగ్రీల సెల్సియస్, 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నాల్‌లో 47 డిగ్రీల సెల్సియస్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాజస్థాన్‌లోని బార్మర్‌లో 49 డిగ్రీల సెల్సియస్, బికనీర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్, జైసల్మేర్‌లో 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అకోలా, యవత్మాల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.2 డిగ్రీల సెల్సియస్, 46.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మే 29 వరకు వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment