crosses
-
37 నగరాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
దేశంలోని ఉత్తరాదిన ఎండలు మండిపోతున్నాయి. 37 నగరాల్లో ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదైంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్‌లోని ఫలోడి వరుసగా రెండో రోజు దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 49.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అంతకు ముందురోజు ఇక్కడి ఉష్ణోగ్రత 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది. ఢిల్లీలోని ఎనిమిది చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదయ్యాయి. ముంగేష్పూర్, నజఫ్‌గఢ్‌లలో వరుసగా 48.3 డిగ్రీల సెల్సియస్, 48.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హర్యానాలోని నార్నాల్లో 47 డిగ్రీల సెల్సియస్, పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.రాజస్థాన్‌లోని బార్మర్‌లో 49 డిగ్రీల సెల్సియస్, బికనీర్‌లో 48.6 డిగ్రీల సెల్సియస్, జైసల్మేర్‌లో 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అకోలా, యవత్మాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.2 డిగ్రీల సెల్సియస్, 46.6 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మే 29 వరకు వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. -
పైసా వసూల్, జీఎస్టీ పన్ను లక్షకోట్లను దాటేసింది!
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ క్రియాశీలత ఉత్తేజాన్ని ప్రతిబింబిస్తూ, వరుసగా రెండవనెల ఆగస్టులోనూ వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు లక్ష కోట్లకు అధిగమించాయి. రూ.1,12,020 కోట్లుగా నమోదయ్యాయి. 2020 ఆగస్టుతో (రూ.86,449 కోట్లు) పోల్చితే ఈ నిధులు 30 శాతం అధికం కావడం గమనార్హం. కోవిడ్ ముందస్తు స్థాయి ఆగస్టు 2019 (రూ.98,202 కోట్లు) కన్నా కూడా ఈ నిధులు 14 శాతం అధికం కావడం మరో విషయం. జులై, ఆగస్టు మాసాల్లో తిరిగి రూ. లక్ష కోట్లకు పైగా జీఎస్టీ వసూళ్లు నమోదవడం ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సంకేతమని ఆర్థిక శాఖ విశ్లేషించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడంతోపాటు ఎగవేతదారులపై చర్యలు తీసుకోవడం వంటి కారణాలు కూడా జీఎస్టీ వసూళ్లలో పెరుగుదలకు కారణమైనట్లు తెలిపింది. ప్రభుత్వం ఈ మేరకు బుధవారం తాజా గణాంకాలను విడుదల చేసింది. వేర్వేరుగా ఇలా... ►సెంట్రల్ జీఎస్టీ రూ.20,522 కోట్లు ►స్టేట్ జీఎస్టీ రూ.26,605 కోట్లు ► ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (రాష్ట్రాల మధ్య వస్తు, సేవల రవాణాకు సంబంధించి వసూళ్లు– ఐజీఎస్టీ) రూ.56,247 కోట్లు. (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.26,884 కోట్లుసహా) ► సెస్ రూ.8,646 కోట్లు (వస్తు దిగుమతులపై వసూలయిన రూ.646 కోట్లుసహా). అప్పడానికి జీఎస్టీ వర్తించదు కాగా అప్పడానికి జీఎస్టీ వర్తించబోదని పరోక్ష పన్నులు, కస్టమ్స్ సుంకాల కేంద్ర బోర్డ్ (సీబీఐసీ) వివరణ ఇచ్చింది. పేరు లేదా ఆకారంతో సంబంధం లేకుండా.. పాపడ్‌కు జీఎస్టీ వర్తించబోదని స్పష్టం చేసింది. ‘‘గుండ్రంగా ఉన్న పాపడ్‌కు జీఎస్టీ నుండి మినహాయింపు ఉంది. చదరపు పాపడ్‌కు జీఎస్టీ వర్తిస్తుందని మీకు తెలుసా? నాకు ఈ లాజిక్ అర్థం అయ్యేలా మంచి చార్టర్డ్ అకౌంటెంట్ని ఎవరైనా సూచించగలరా?’’ అని ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ హర్షా గోయెంకా మంగళవారం చేసిన ట్వీట్ నేపథ్యంలో సీబీఐసీ తాజా వివరణ ఇచ్చింది. చదవండి: ఫేస్బుక్లో హింస ఈ రేంజ్లో ఉందా!? -
మంతి నిజాయితీ!
పనివేళల్లో సరిగా పనిచేయకుండా ముచ్చట్లతో కాలక్షేపం చేసే ఈ రోజుల్లో ‘మంతి కుమారి’ నదులు, గుట్టలు దాటి అడవుల్లోకి సైతం కాలినడకన వెళ్లి విధులు నిర్వర్తిస్తోంది. జార్ఖండ్‌లో కాంట్రాక్ట్ ఏఎన్ఎమ్గా పనిచేస్తోన్న మంతి కుమారి తన ఏడాదిన్నర పాపను వీపున కట్టుకుని పసిపిల్లల్లో రోగనిరోధకతను పెంచే టీకాలు వేస్తున్నారు. వయసు, సీజన్‌ను బట్టి చిన్నారులకు రెగ్యులర్‌గా అందించాల్సిన మందులను వైద్య సదుపాయంలేని మారుమూల ప్రాంత చిన్నారులకు అందించేందుకు బుర్రా నదిని దాటి మరీ సేవలందిçస్తుండడం విశేషం. గతేడాది జనవరిలో చెట్మా హెల్త్ సబ్ సెంటర్లో ఉద్యోగంలో చేరిన మంతి కుమారి అప్పటినుంచి వ్యయప్రయాసలను ఎదుర్కొంటూ విధులు నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ కాలంలో మంతి భర్త సునీల్ ఓరాన్ ఉద్యోగం పోవడంతో మంతి ఉద్యోగమే కుటుంబ పోషణకు ఆధారం అయ్యింది. దీంతో మంతి చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాల వారికి ఆరోగ్య సేవలందిస్తున్నారు. తిసియా, గోరియా, సుగబంద్ గ్రామాలకు నెలకు ఒక్కసారైనా వెళుతుంది. ఈ గ్రామాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా నది దాటాల్సి వస్తుంది. కొంత దూరం వరకు తన భర్త బండిమీద దింపినప్పటికీ..మిగతా దూరం తను ఒక్కటే ప్రయాణిస్తోంది. ‘‘నేను విధులు నిర్వర్తిస్తోన్న ప్రాంతంలో సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల తప్పనిసరిగా నదులు దాటాల్సి వస్తుంది. అయితే ఈ నదులు లోతు తక్కువగా ఉండడం వల్ల ధైర్యంగా దాటగలుగు తున్నాను. వర్షాకాలంలో నదిలో నీళ్లు ఎక్కువైతే అప్పుడు ఆయా గ్రామాలకు వెళ్లను. రోజూ నా డ్యూటీలో భాగంగా మహద్నార్ మొత్తం 25 కిలోమీటర్లు పరిధిలోని గ్రామాలను కవర్ చేస్తాను. వారానికి ఆరు రోజులు నేను డ్యూటీ చేయాల్సి ఉంటుంది. దట్టమైన అడవులు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వైద్యసదుపాయాలు తక్కువగా ఉంటాయి. నాలాంటి ఏఎన్ఎమ్ సేవలైనా వాళ్లకు అందాలన్న ఉద్దేశ్యంతో కాస్త కష్టమైనా ముందుకు సాగుతున్నాను’’ అని మంతి కుమారి వివరించింది. ‘‘చుట్టుపక్కల ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం వల్ల ఆరోగ్య కార్యకర్తలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. మంతి తన కూతుర్ని వీపుపై కట్టుకుని ప్రయాణించి మరీ విధులు నిర్వర్తించడం నిజంగా ప్రశంసనీయం’’అని చెట్మా హెల్త్ సబ్‌సెంటర్ మెడికల్ ఆఫీసర్ చెప్పారు. -
బాహుబలి-2కి రెహ్మాన్ టార్గెట్ ఎంతో తెలుసా?
చెన్నై: ఆస్కార్ విన్నర్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ "బాహుబలి 2’’పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రికార్డ్ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తున్న బాహుబలి-2 పై తన అంచనాలను సోమవారం వెలిబుచ్చారు. "బాహుబలి 2 (ది కన్‌క్లూజన్) బాక్స్ ఆఫీసు వద్ద రూ.2వేలకోట్లను అధిగమిస్తుందని తెలిపారు. చెన్నైలో ఈ సినిమాను వీక్షించిన రెహ్మాన్ తన ఫేస్బుక్ పేజీలో ఈ బాహుబలి విజయాలన ప్రస్తావించారు. త్వరలోనే బాక్స్ ఆఫీసు వద్ద రూ.2వేకోట్ల రూపాయలను దాటిపోతుందని తాను నమ్ముతున్నాని పేర్కొన్నారు. ప్రపంచంలో భారతీయసినిమాకు ఒక కొత్త గుర్తింపును తీసుకొచ్చారంటూ చిత్రం బృందంపై ప్రశంసలు కురిపించారు. దక్షిణ భారతీయకు వసూళ్ల వరదగేట్లను తెరిచారని కొనియాడారు.దర్శకుడు, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బాహుబలికి కొత్త టార్గెట్‌ను సెట్ చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. మీ అభినందనలు సినిమాకు మరింత వన్నెతెచ్చినట్టు తెలిపారు. కాగా ఎస్. రాజమౌళి దర్వకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన బాహుబలి రెండవభాగం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోఇప్పటికే రూ .1,500 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. To Rajamouli garu, Keeravani garu and the whole team of BB2... Just finished watching it in Chennai. I hope it... https://t.co/3xd19PXNq5 — A.R.Rahman (@arrahman) May 21, 2017 Thanks you very much sir. Your appreciation makes it very special.. -
దుమ్ము రేపుతున్న ’భీమ్’ యాప్
-
ఢిల్లీకి వరద ముప్పు!?
న్యూఢిల్లీః యమునా నది ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. హర్యానాలోని హతిన్ కుంద్ బ్యారేజీ వద్ద భారీ మొత్తంలో నీటిని ఒక్కసారిగా కిందికి వదలడంతో ఢిల్లీ ప్రాంతంలో యమునా నది ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో రాజధాని ఢిల్లీకి వరద ముప్పు ఏర్పడటంతో నిర్వాసితులను ఖాళీ చేయించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక మోటార్ బోట్లను రంగంలోకి దింపింది. ఉత్తర భారతంలో కురిసిన వర్షాల కారణంగా యమునానది పొంగి ప్రవహిస్తోంది. సాధారణ నీటిమట్టం 204.22 మీటర్లను దాటి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో దేశరాజధాని ఢిల్లీకి వరద ముప్పు ఏర్పడింది. ముప్పును ఎదుర్కొనేందుకు అంతా అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యమునా నది నీటిమట్టం సాధారణ స్థాయి 204 మీటర్లు. 204.83 మీటర్లు ప్రమాద స్థాయిగా గుర్తిస్తారు. 1978 సంవత్సరంలో రికార్డు స్థాయిలో యమునానది నీటిమట్టం 207.49 మీటర్లకు చేరింది. ప్రస్తుతం నీటిమట్టం మొదట్లో భారీగా పెరిగినప్పటికీ వర్షాలు అంతగా లేకపోవడంతో క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం హతిన్ కుంద్ బ్యారేజీనుంచి 1,60,000 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసినట్లు వారు వెల్లడించారు. నదీ ప్రవాహంతో హస్తినలో వదర ముప్పు ఉండటంతో గతవారం నగర ఇరిగేషన్ మరియు వరద నియంత్రణ విభాగం బాదర్ పూర్, బురారీ, సోనియా విహార్, జగత్ పూర్, సుర్ ఘర్ వజీర్పుర్, బోట్ క్లబ్, గీతా కాలనీ, షంషాన్ ఘాట్, హైతీ ఘాట్, చిల్లా విలేజ్, మయూర్ విహార్, బట్లా హౌస్, కలింది కుంజ్, బవానా నెహర్ ప్రాంతాల్లో 18 మోటార్ పడవలను మొహరించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ బోట్లను అక్కడినుంచీ తరలించవద్దని హెచ్చరించింది. -
తమ్ముడు కాదన్న చిత్రం..అన్న చేసిన ప్రయోగం