![బాహుబలి-2కి రెహ్మాన్ టార్గెట్ ఎంతో తెలుసా?](/styles/webp/s3/article_images/2017/09/5/81495432146_625x300.jpg.webp?itok=N_OJSvGY)
బాహుబలి-2కి రెహ్మాన్ టార్గెట్ ఎంతో తెలుసా?
చెన్నై: ఆస్కార్ విన్నర్, ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహ్మాన్ "బాహుబలి 2’’పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రికార్డ్ కలెక్షన్లతో సునామీ సృష్టిస్తున్న బాహుబలి-2 పై తన అంచనాలను సోమవారం వెలిబుచ్చారు. "బాహుబలి 2 (ది కన్‌క్లూజన్) బాక్స్ ఆఫీసు వద్ద రూ.2వేలకోట్లను అధిగమిస్తుందని తెలిపారు.
చెన్నైలో ఈ సినిమాను వీక్షించిన రెహ్మాన్ తన ఫేస్‌బుక్ పేజీలో ఈ బాహుబలి విజయాలన ప్రస్తావించారు. త్వరలోనే బాక్స్ ఆఫీసు వద్ద రూ.2వేకోట్ల రూపాయలను దాటిపోతుందని తాను నమ్ముతున్నాని పేర్కొన్నారు. ప్రపంచంలో భారతీయసినిమాకు ఒక కొత్త గుర్తింపును తీసుకొచ్చారంటూ చిత్రం బృందంపై ప్రశంసలు కురిపించారు. దక్షిణ భారతీయకు వసూళ్ల వరదగేట్లను తెరిచారని కొనియాడారు.దర్శకుడు,
రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణిలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా బాహుబలికి కొత్త టార్గెట్‌ను సెట్ చేశారు. దీనికి రాజమౌళి స్పందిస్తూ.. మీ అభినందనలు సినిమాకు మరింత వన్నెతెచ్చినట్టు తెలిపారు.
కాగా ఎస్. రాజమౌళి దర్వకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిన బాహుబలి రెండవభాగం ప్రపంచ వ్యాప్తంగా రికార్డుల వర్షంతో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోఇప్పటికే రూ .1,500 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే.
To Rajamouli garu, Keeravani garu and the whole team of BB2... Just finished watching it in Chennai. I hope it... https://t.co/3xd19PXNq5
— A.R.Rahman (@arrahman) May 21, 2017
Thanks you very much sir. Your appreciation makes it very special..