హిందీలో అత్యధిక వసూళ్లు చేసిన 2వ సినిమా కేజీయఫ్‌ 2, తొలి సినిమా ఏదో తెలుసా? | KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser Movie 1st Is Baahubali 2 | Sakshi
Sakshi News home page

KGF 2: రూ. 400 కోట్ల క్లబ్‌లోకి కేజీయఫ్‌ 2, హిందీలో ఈ 2 దక్షిణాది సినిమాలే టాప్‌

Published Fri, May 6 2022 6:38 PM | Last Updated on Fri, May 6 2022 7:22 PM

KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser Movie 1st Is Baahubali 2 - Sakshi

KGF 2 Becomes All Time Second Highest Hindi Grosser: ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కేజీయఫ్‌ 2 కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ మూవీ విడుదలై మూడు వారాలకు పైగా గడుస్తున్న ఇప్పటికీ థియేటర్లో ఈ మూవీ హావా కొనసాగుతూనే ఉంది. యశ్‌ హీరోగా, ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజే విడుదలైన అన్ని భాషల్లో (కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ) భారీ వసూళ్లను రాబట్టింది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ బాలీవుడ్‌లో అరుదైన ఘనతను సాధించింది. 

చదవండి: విరాట పర్యం రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, ఆ రోజే బిగ్‌స్క్రీన్‌పై సందడి

విడుదలైన 22 రోజుల్లోనే ఈ మూవీ దంగల్‌ లైఫ్‌టైం కలెక్షన్స్‌ను దాటేసి అప్పటికి వరకు ఉన్న ఆ మూవీ రికార్డును చెరిపేసింది. ‘దంగల్’ చిత్రం లైఫ్‌టైం రన్‌లో రూ. 387.40 కోట్లు వసూలు చేయగా... కేవలం 22 రోజుల్లోనే ఆ రికార్డును 'కేజీఎఫ్2' అధిగమించింది. ఇక నిన్నటి(మే 5) వరకు కేజీయఫ్‌ 2 బి-టౌన్‌ బాక్సాఫీసు వద్ద రూ. 391.65 కోట్లు వసూలు చేసింది. ఈ రోజు(మే 6) కలెక్షన్స్‌తో రూ. 400 కోట్ల పైగా వసూలు చేసే అవకాశం ఉందని గురువారం ప్రముఖ ట్రెడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ వెల్లడించగా.. రమేశ్‌ బాలా అనే మరో ట్రెడ్‌ అనలిస్ట్‌ నేటితో కేజీయఫ్‌ 2 రూ. 400 కోట్ల క్లబ్‌లోకి చేరిందని తెలిపాడు.

చదవండి: ఉపాసన.. నా మైండ్‌లోనూ అదే ఉంది, కానీ మనం కొద్ది రోజులు ఆగాల్సిందే!

దీంతో హిందీలో అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో సౌత్‌ సినిమాగా కేజీయఫ్‌ 2 నిలిచింది. ఇప్పటి వరకు హిందీలో అత్యధిక వసూళు చేసిన దక్షిణాది సినిమాల్లో బాహుబలి 2 మొదటి స్థానంలో ఉంది. బాహుబలి 2 హిందీ వెర్షన్‌ అక్కడ రూ. 511.30 కోట్లు వసూలు చేసింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే హిందీలో ఇప్పటి వరకు కేవలం రెండు చిత్రాలు మాత్రమే రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. ఆ రెండూ దక్షిణాది చిత్రాలే (బాహుబలి2, కేజీఎఫ్2) కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement