Pathaan beats Tiger Zinda Hai and becomes second biggest bollywood film ever - Sakshi
Sakshi News home page

Pathaan Movie: కలెక్షన్ల జోరు.. భారీ వసూళ్లతో ఆ రికార్డులు పటాపంచలు

Published Thu, Feb 2 2023 6:47 PM | Last Updated on Thu, Feb 2 2023 7:14 PM

Pathaan Beats Tiger Zinda Hai Become Second Biggest Bollywood Film Ever - Sakshi

బుల్లెట్‌ ట్రైన్‌ కంటే వేగంగా కలెక్షన్స్‌ సాధిస్తోంది పఠాన్‌. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్‌ మీద దండయాత్ర చేస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్‌ బాలీవుడ్‌ అన్నవారి నోళ్లు మూయించింది. షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రం రూ.417 కోట్ల గ్రాస్‌(రూ.348.50 కోట్ల నెట్‌) రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.250 కోట్లు వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా పఠాన్‌ రూ.667 కోట్ల మేర కలెక్షన్స్‌ సాధించింది.

కాగా బాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా దంగల్‌(రూ.374.53 కోట్లు), రెండో స్థానంలో టైగర్‌ జిందా హై(రూ.339 కోట్లు), మూడో స్థానంలో పీకే (రూ.337.72 కోట్లు) ఉండేది. కానీ తాజాగా పఠాన్‌ రూ.348 కోట్ల నెట్‌ వసూళ్లు రాబట్టడంతో పీకే, టైగర్‌ జిందా హై సినిమాలను దాటేసి రెండో స్థానానికి చేరుకుంది. పఠాన్‌ దూకుడు చూస్తుంటే అతి త్వరలో దంగల్‌ను దాటేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్‌ చిత్రంగా రికార్డు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

చదవండి: నాతో స్టార్‌ హీరో సీక్రెట్‌ అఫైర్‌.. నటి
పెళ్లికి ఆ డ్రెస్‌లో వేస్తావా? వేరే దొరకలేదా?: కీర్తి సురేశ్‌పై ట్రోలింగ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement