Tiger Zinda Hai
-
వసూళ్ల ఊచకోత.. మరో రికార్డు బద్ధలు కొట్టిన పఠాన్
బుల్లెట్ ట్రైన్ కంటే వేగంగా కలెక్షన్స్ సాధిస్తోంది పఠాన్. రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తోంది. కోట్లకు కోట్లు కొల్లగొడుతూ బాయ్‌కాట్ బాలీవుడ్ అన్నవారి నోళ్లు మూయించింది. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె జంటగా నటించిన ఈ చిత్రం రూ.417 కోట్ల గ్రాస్(రూ.348.50 కోట్ల నెట్) రాబట్టింది. ఓవర్సీస్లో రూ.250 కోట్లు వసూలు చేసింది. అంటే ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రూ.667 కోట్ల మేర కలెక్షన్స్ సాధించింది. కాగా బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు రాబట్టిన మొదటి చిత్రంగా దంగల్(రూ.374.53 కోట్లు), రెండో స్థానంలో టైగర్ జిందా హై(రూ.339 కోట్లు), మూడో స్థానంలో పీకే (రూ.337.72 కోట్లు) ఉండేది. కానీ తాజాగా పఠాన్ రూ.348 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టడంతో పీకే, టైగర్ జిందా హై సినిమాలను దాటేసి రెండో స్థానానికి చేరుకుంది. పఠాన్ దూకుడు చూస్తుంటే అతి త్వరలో దంగల్ను దాటేసి అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ చిత్రంగా రికార్డు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. #Pathaan ki party continues 🎉🎉🎉 Book your tickets now! https://t.co/SD17p6x9HI | https://t.co/VkhFng6vBj Celebrate #Pathaan with #YRF50 only at a big screen near you, in Hindi, Tamil and Telugu. pic.twitter.com/kc1FjITfRy — Yash Raj Films (@yrf) February 2, 2023 చదవండి: నాతో స్టార్ హీరో సీక్రెట్ అఫైర్.. నటి పెళ్లికి ఆ డ్రెస్‌లో వేస్తావా? వేరే దొరకలేదా?: కీర్తి సురేశ్‌పై ట్రోలింగ్ -
టాప్ సాంగ్!
గతేడాది డిసెంబర్లో రిలీజైన సల్మాన్‌ఖాన్ ‘టైగర్ జిందా హై’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ కథానాయికగా నటించారు. అంతేకాదు ‘ఏక్ తా టైగర్’ సినిమా తర్వాత ఐదేళ్లు గ్యాప్ ఇచ్చి సల్మాన్, కత్రినా కలిసి చేసిన చిత్రమిదే కావడం విశేషం. అలాగే ఈ సినిమాలోని ‘స్వాగ్ సే స్వాగత్’ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో మంచి స్పందన వస్తోంది. ఇప్పటికే ఈ సాంగ్‌కు యూ ట్యూబ్‌లో 600 మిలియన్ (60 కోట్లు) వ్యూస్ వచ్చాయి. ఈ ఫీట్‌ను సాధించిన తొలి ఇండియన్ సాంగ్ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలోని పాటలకు విశాల్–శేఖర్ ద్వయం సంగీతం అందించారు. ‘స్వాగ్ సే స్వాగత్’ పాటకు విశాల్, నేహా గాత్రం అందించారు. ఇర్షాద్ కామిల్ లిరిక్స్ అందించారు. వైభవి మర్చెంట్ కొరియోగ్రాఫర్. ఇప్పటికే 600 మిలియన్స్‌ను టచ్ చేసిన ఈ పాట ప్యూచర్లో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అలాగే అలీ అబ్బాస్ జాఫర్–సల్మాన్ ఖాన్–కత్రినా కాంబినేషన్లోనే రూపొందుతున్న ‘భారత్’ చిత్రం వచ్చే ఏడాది రంజాన్‌కు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
కత్రినాపై సల్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, ముంబయి : మాజీ లవర్ కత్రినా కైఫ్‌తో తన అనుబంధం ఎలాంటిదో మరోసారి గుర్తు చేశాడు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్. మాజీ ప్రేమికులు మంచి స్నేహితులేనని నిరూపించేలా దబాంగ్ సిరీస్ టూర్లో భాగంగా అమెరికాలో ఖాన్ భాయ్ కత్రినాతో సన్నిహితంగా వ్యవహరించాడు. కత్రినాను తన బేబీగా పిలిచిన సల్మాన్ వీడియో ఇంటర్నెట్లో క్షణాల్లో వైరల్‌గా మారింది. మీడియా సమావేశంలో కత్రినాను ఉద్దేశించి తన బేబీ బర్త్‌డే ఈనెల 16న అంటూ చమత్కరించి అందరినీ ఉత్కంఠకు లోను చేశాడు. బాలీవుడ్ మన్మధుడు రణ్‌బీర్ కపూర్‌తో డేటింగ్‌కు ముందు కత్రినా సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా మెలిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి అనుబంధంపై బాలీవుడ్లో భారీ ప్రచారమే సాగింది. టైగర్ జిందా హై మూవీతో కత్రినా, సల్మాన్ అనుబంధంపై బాలీవుడ్లో మరోసారి హాట్ డిబేట్ నడిచింది. -
పీకేను బీట్ చేసిన టైగర్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌లు నటించిన టైగర్ జిందా హై వసూళ్లలో దుమ్మురేపింది. 2012లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఏక్ థా టైగర్‌కు సీక్వెల్‌గా వచ్చిన టైగర్ బాక్సాఫీస్ వద్ద గట్టిగానే గర్జించింది. ఓవరాల్ వసూళ్లలో ఈ మూవీ హిందీ మూవీస్‌లో అమీర్‌ఖాన్ నటించిన పీకేను వెనక్కినెట్టి టాప్ 3 ప్లేస్‌ను ఆక్రమించింది. ప్రముఖ మూవీ విశ్లేషకులు రమేష్ బాల ఈ విషయం వెల్లడిస్తూ ట్వీట్ చేశారు. అత్యధిక నెట్ వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో బాహుబలి 2 అగ్రస్ధానంలో ఉండగా, దంగల్ రెండో స్ధానంలో, టైగర్ జిందా హై మూడవ స్ధానంలో నిలిచాయని చెప్పారు. పీకే నాలుగోస్ధానంలో భజరంగీభాయ్‌జాన్ టాప్ 5లో చోటుదక్కించుకున్నాయని తెలిపారు. టైగర్ జిందా హై ఇప్పటికే గత ఏడువారాల్లో రూ 339 కోట్ల వసూళ్లు రాబట్టి సల్మాన్ మూవీల్లో అత్యధిక గ్రాసర్‌గా నిలిచింది. -
కలిసి పోరాడితే..!
భారత్, పాకిస్తాన్ ఒక ఇంటి పిల్లలు. తర్వాత వేర్వేరు ఇళ్లు కట్టుకున్నారు. అంతటితో ‘వేరు వారు’ అయిపోతారా? అందుకని ఇద్దరి కుటుంబాల్లో వైరం కాపురం చెయ్యాలా?! దశాబ్దాలుగా ఈ వైరాన్ని ఇతరులు వాడుకుంటున్నారు. కలిసి పోరాడితే రెండిళ్లూ చల్లగా ఉంటాయి. మాటల్లేవ్. మాట్లాడుకోవడాల్లేవ్. ఆటల్లేవ్. ఆట్లాడుకోవడాల్లేవ్. పాటల్లేవ్. పాడుకోవడాల్లేవ్. అటువైపు కవ్వా ఇటువైపు, ఇటువైపు కాకి అటువైపు.. ‘వాఘా’ బోర్డర్ దాటి వాలిపోవడానికి లేదు. దారి తప్పి వాలిందా? దాహమయ్యి వాలిందా? దేహం తూలి వాలిందా? దేశ బంధమే పట్టి లాగిందా? ఎవరిక్కావాలి?మన పగ మనక్కావాలి. మన ప్రతీకారం మనక్కావాలి. ఎవరి సావరినిటీ వారిది. ఎవరి శతఘ్నులు వారివి. ఎవరి ఎమోషన్స్ వారివి. ఉమ్మడిగా ఉన్నది... ఎవర్గ్రీన్ నేషనల్ సాంగ్ ఒకటే. ‘‘సమరమే.. నా కనులను సూటిగ చూస్తే. నా ఎదుటకు నేరుగ వస్తే. నా పిడికిలి వాడిగ వేస్తే.. యేయ్యే...’’ బోర్డర్ దగ్గర ఇదే సాంగ్. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్లో ఇదే సాంగ్. ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’లో ఇదే సాంగ్. ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్’లో ఇదే సాంగ్. యునైటెడ్ నేషన్స్లోనూ ఇదే సాంగ్! ‘పుట్టినిల్లు–మెట్టినిల్లు’ సినిమాలో శోభన్‌బాబు.. స్టేజెక్కి పాడుతుంటాడు. ‘ఇదే పాట.. ప్రతీచోటా.. ఇలాగే పాడకుంటానూ..’ అని. అలా పాడుకుంటున్నాం. పలుకలేని వలపులన్నీ ఆ పాటలో దాచుకుంటాడు శోభన్‌బాబు. మనమూ అంతేనా! మనసుల్లో ప్రేమను దాచుకుని దేశం కోసం లేని ద్వేషాన్ని పాడుకుంటూ తిరుగుతున్నామా? కట్లిప్పితే, గేట్లు తెరిస్తే, పహారా కాస్తున్న తుపాకుల్ని తిరగదిప్పి భూమిలోకి పాతేస్తే.. పరుగున వెళ్లి మనిషిని హత్తుకుంటామా? గట్టిగా ఆలింగనం చేసుకుంటామా? జ్ఞాపకాల మూటను విప్పి ఒక్కో బంగారు వరహా తీసి ‘మిఠాయి కొనుక్కో పో’ అని మురిపెంగా పిల్లల చేతిలో పెట్టి పంపించి, విభజనకు ముందునాటి స్నేహితుడి చేతిని గబుక్కున లాక్కుని.. మట్టిలో ఆడుకోవడానికి పిల్లల్లా పరుVð త్తి వెళ్లిపోతామా? ‘అల్లాయే దిగివచ్చి, ఆవ్ మియా.. ఏమి కావాలంటే..’ ఒకే దేశమై నిలిచే నిప్పులాంటి మనిషిగా మార్చమంటామా? అవును! కచ్చితంగా అవును. రెండు దేశాలు కావు మనవి. రెండు ఇళ్లు. ఇరుగిళ్లు కావు. పొరుగిళ్లు కావు. పుట్టినిల్లు. మెట్టినిల్లు. రెండూ మన సొంతం. రెండూ మన బంధం. మాటలు బంద్ అయినంత మాత్రాన, మనసులు బంద్ అయిపోతాయా?! మ్యాచిలు బంద్ అయినంత మాత్రాన, మమతలే లేకుండా పోతాయా?! చర్చలు బంద్ అయినంత మాత్రాన, ‘రీయూనియన్’ సమాధి అయిపోతుందా? మమకారపు మెమరీలు మంచులా గడ్డకట్టి అలా ఏళ్లకు ఏళ్లు ఉండిపోతే పోవచ్చు. వాటికి కొద్దిపాటి వెచ్చదనం చాలు. కరిగి కన్నీళ్లవడానికి. రెండు దేశాల మధ్య నాలుగు యుద్ధాలు జరిగాయి. అవెవరికీ గుర్తు లేవు. 2013లో ‘రీయూనియన్’ గూగుల్ యాడ్ వచ్చింది. అది గుర్తుంది. అంతకుముందు 2012లో ‘ఏక్ థా టైగర్’ రిలీజ్ అయింది. అది గుర్తుంది. 2017లో ‘టైగర్ జిందా హై’ గాండ్రించింది. అదీ గుర్తుండిపోయేలా ఉంది. రెండు దేశాల మధ్య రోజూ ఓ మాటల యుద్ధం జరుగుతోంది. అవేవీ గుర్తుండేవి కావు. మోదీ సడన్‌గా లాహోర్‌లో ల్యాండ్ అయి, అక్కడి నుంచి నేరుగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంటికెళ్లి ఆయనకు బర్త్‌డే విషెస్ చెప్పాడు. అది గుర్తుంది. ఎం.ఎస్.ధోనీ.. కెప్టెన్ సర్ఫ్రాజ్ అహ్మద్ కొడుకుని ముద్దుగా చేతుల్లోకి ఎత్తుకున్నాడు. అది గుర్తుంది. అతిఫ్ అస్లాం, సోనూ నిగమ్ కలిసి సరిగమలకు సరిహద్దులు లేవని, రాగాలకు రాజకీయాలు తెలియవని కచేరీ ఇచ్చారు. అది గుర్తుంది. పొరపాటున బోర్డర్ దాటిన గీత అనే అమ్మాయిని తిరిగి ఇండియా చేర్చడం కోసం రెండు దేశాలూ కలిసి పనిచేశాయి. అది గుర్తుంది. కరాచీ నుంచి ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఒక అమ్మాయి కోసం ముంబై ప్రజలు నాలుగున్నర లక్షల రూపాయాలు విరాళలు సేకరించారు. అది గుర్తుంది. అంటే.. ప్రేమ బతికే ఉంది! ప్యార్ జిందా హై. మరెందుకు మనం కలిసి పోరాడకూడదు? ‘రీయూనియన్’ యాడ్‌లో.. ఇండియాలో ఉన్న బలదేవ్మెహ్రా అనే ఆయన మనవరాలు, గూగుల్‌లో సెర్చ్ చేసి, లాహోర్‌లో ఉన్న తన తాతగారి చిన్ననాటి స్నేహితుడు యూసుఫ్‌ను వెదికిపట్టి, అక్కడ ఆ స్నేహితుడి మనవడి సహాయంతో యూసుఫ్‌ని బలదేవ్ బర్త్‌డేకి ఢిల్లీ రప్పిస్తుంది. వస్తూ వస్తూ ఆ స్నేహితుడు బలదేవ్కి చిన్నప్పుడు ఇష్టమైన స్వీట్స్‌ని తెస్తాడు. బలదేవ్ ఫీలింగ్స్ చూడాలి అప్పుడు! ఇద్దరూ హత్తుకుంటారు. మనం కళ్లొత్తుకుంటాం. అంత ఎమోషన్ కురుస్తుంది ఆ బాండింగ్‌లో. ఈ యాడ్ తర్వాత రెండు దేశాల మధ్య దూరం కొద్దిగానైనా తగ్గి ఉంటుంది అని ‘వాషింగ్టన్ పోస్ట్’ రాసింది! ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందా హై’ లు కూడా అంతే! సీక్వెల్స్ ఇవి. సల్మాన్, కత్రీనా హీరో హీరోయిన్లు. సల్మాన్‌ది ఈ దేశం. కత్రీనాది ఆ దేశం. సల్మాన్ ‘రీసెర్చ్ అండ్ ఎనాలిస్ వింగ్’లో (రా) స్పై. కత్రీనా ఐ.ఎస్.ఐ. ఏజెంట్. ముఖ్యమైన టాస్క్‌లో వేరే దేశంలో కలుస్తారు. లవ్‌లో పడతారు. ఆ తర్వాత రెండు దేశాలను లవ్‌లో పడేసే పనిలోనూ పడిపోతారు! అపనమ్మకాలతో, అనుమానాలతో, అర్థంలేని ఆధిక్యభావనలతో.. రక్షణ కోసం, ఆయుధాల కోసం ఈ రెండు దేశాలు చేస్తున్న లక్షల కోట్ల రూపాయల ఖర్చును పిల్లల కోసం, మహిళల కోసం, విద్యకోసం, అభివృద్ధి కోసం వినియోగిస్తే.. ‘రా’లతో, ‘ఐ.ఎస్.ఐ’ లతో పనేముంది అంటారు హీరోహీరోయిన్లు. ఆ రెండింటితోనూ అవసరం రోజు మాత్రమే తిరిగి వస్తామని వాళ్ల వాళ్ల దేశాలకు చెప్తారు. ఆ రోజు ఎప్పుడొస్తుంది? బయటి శత్రువులతో కలిసి పోరాడితే వస్తుంది. దేశాలన్నాక సరిహద్దులు ఉండకపోవు. చట్టాలు ఉండకపోవు. ప్రభుత్వాలు ఉండకపోవు. పాత మనస్తాపాలు ఉండకపోవు. అలాగని విడిపోయిన దేశాల్లోని మనుషుల మధ్య బంధాలు, బాంధవ్యాలు లేకుండాపోవు. కలిసి పోరాడితే అవి మరింత బలపడతాయి. ఇరుదేశాల్లో స్నేహ కుసుమాలు వికసిస్తాయి. శాంతి విప్లవించి, సుస్థిరత పరిఢవిల్లుతుంది. ఉగ్రవాదాలు, అగ్రరాజ్య స్వార్థ ప్రయోజనాలు బొరియల్లోకి వెళ్లిపోతాయి. కళ్లల్లో నీళ్లు తిరిగాయి ‘‘ఫస్ట్‌టైమ్ నేను పాకిస్తాన్‌కు వెళ్లింది 2005, కాలేజ్‌డేస్‌లో. నేను, నా ఫ్రెండ్ ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం పాకిస్తాన్ వెళ్లిరావాలని. మా ఇంట్లో వాళ్లు భయపడ్డారు. శత్రుదేశం వెళతారా? అని వారించారు. వెళితేనే కదా తెలిసేది వాళ్లు శత్రువులు కాదు మిత్రులు అని. అందుకే వెళ్లాం. ఢిల్లీ నుంచి లాహోర్‌కు బస్‌లో బయలుదేరాం. బస్‌లో మా పక్కన కూర్చున్న పాకిస్తానీయులు.. మేమిద్దరమే లాహోర్‌కు వెళ్తున్నామని, అదీ ఫస్ట్ టైమ్ అని తెలిసీ వాళ్లింట్లో ఉండమని కోరారు. బస్ దిగాక కూడా మా ఇంటికి రండి అంటూ చాలాసేపు అడిగారు. సున్నితంగా తిరస్కరించి హోటల్లో ఉన్నాం. ఎక్కడా ఏ ఇబ్బంది ఎదురు కాలేదు. లాహోర్‌లోని అనార్కలీ మార్కెట్లో మేం తిరుగుతుంటే.. అక్కడున్న చాయ్, సమోసా హోటళ్లు వాళ్లు మేం ఇండియా నుంచి వచ్చామని తెలుసుకొని ‘‘అరే హిందుస్తాన్ నుంచి మా చెల్లెళ్లు వచ్చారు గరంగరం సమోసా, చిక్కటి చాయ్ తెండి’’ అంటూ బాయ్స్‌కు ఆర్డర్ వేశారు. అక్కడున్న మూడు రోజులు మాకు ఫ్రీ సమోసా, ఫ్రీ చాయ్ ఇచ్చారు. ఎంతో మంది స్నేహితులయ్యారు. అందరూ వాళ్లింట్లో ఉండమని ఆతిథ్యమిస్తుంటే కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత పదేళ్లకు 2015లో మళ్లీ పాకిస్తాన్ వెళ్లాల్సి వచ్చింది ఓ సినిమా వర్క్ మీద. పదేళ్ల కింద ఫ్రెండ్స్ అయిన వాళ్లంతా అదే ఆప్యాయతతో పలకరించారు, ఇంటికి రమ్మని ఇన్వైట్ చేశారు. ఈసారి అందరి ఇళ్లకూ వెళ్లాను. పాకిస్తాన్లో ఉన్నవాళ్లంతా శత్రువులు కాదు. ఆ దేశమూ మిగిలిన దేశాల్లాంటిదే. మన దేశంలో మంచివాళ్లు, చెడ్డవాళ్లూ ఉన్నట్టే అక్కడా ఉంటారు. నన్నైతే సాదరంగా ఆహ్వానించారు. ఆప్యాయంగా ఆతిథ్యమిచ్చారు. అందుకే అనిపిస్తుంది నాకు దేశం పాలసీల కన్నా ప్రజలే మిన్న అని. పాకిస్తాన్ వెళితేనే తెలిసింది నాకు.. ఊహాగానాలు వేరు వాస్తవం వేరు అని. పీపుల్ ఫస్ట్ నేషన్ నెక్ట్స్’’ – స్వరాభాస్కర్, బాలీవుడ్ నటి (తను వెడ్స్ మను, లిజన్ అమాయా, నిల్ బట్టి సన్నాటా ఫేం) -
ఇమేజ్ను పక్కనబెట్టి సల్మాన్ కొత్త ప్రయోగం?
సాక్షి, ముంబై : తాజా సినిమా ‘టైగర్ జిందా హై’ సూపర్‌హిట్‌తో సల్మాన్ ఖాన్ మంచి జోష్‌లో ఉన్నాడు. 2017లో బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'టైగర్' రికార్డులకెక్కింది. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో జాఫర్‌తో మరో సినిమాకు సల్మాన్ రంగం సిద్ధం చేశాడు. ఇప్పటికే వీరి కాంబినేషన్లో వచ్చిన ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’ సినిమాలు సూపర్‌హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి ఈ ఇద్దరు కలిసి ‘భరత్’ సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది రంజాన్ పండుగకు ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. 2014లో కొరియాలో వచ్చిన ‘అడ్ టు మై ఫాదర్’ సినిమా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. సల్మాన్ తన ఇమేజ్ను పూర్తిగా పక్కనపెట్టి ఈ సినిమాలో డిఫరెంట్ రోల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది, సల్మాన్ తరహా యాక్షన్, కామెడీ కాకుండా కొత్త తరహాలో ఈ పాత్ర ఉండబోతందని సమాచారం. -
మేకింగ్ ఆఫ్ మూవీ - టైగర్ జిందా హై
-
రూ . 300 కోట్ల దిశగా టైగర్
సాక్షి,న్యూఢిల్లీ: బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా అలరించిన టైగర్ జిందా హై బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోంది. 2012లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన ఏక్ థా టైగర్‌కు సీక్వెల్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన టైగర్ జిందా హై వసూళ్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబర్ 22న విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ 285 కోట్లు పైగా వసూలు చేసి రూ 300 కోట్ల క్లబ్లో చేరేందుకు ఉరకలేస్తోంది. సల్మాన్ గత చిత్రాలు భజరంగిభాయ్‌జాన్ (రూ 320 కోట్లు) సుల్తాన్ (రూ 300 కోట్లు) వసూళ్లను టైగర్ సులభంగా అధిగమిస్తుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. మరోవైపు సినిమాకు వసూళ్లు భారీగా దక్కినా ఈ మూవీ ఏక్ థా టైగర్‌లా ఆకట్టుకోదని, కేవలం ఫ్యాన్స్‌ను అలరించేలా ఉందని సినీ విమర్శకులు పేర్కొంటున్నారు. ఇక టైగర్ సక్సెస్‌తో ఊపుమీదున్న సల్మాన్ రేస్ 3 షూటింగ్‌కు సిద్ధమవుతున్నాడు. -
దూసుకెళ్తున్న ‘టైగర్’
సల్మాన్‌ఖాన్ సినిమా అంటే చాలు కథతో సంబంధం అవసరం లేకుండా హిట్ అవుతుంటాయి. ఇప్పుడు బాలీవుడ్లో టైగర్ జిందా హై హవా కొనసాగుతోంది. రెండో వారంలోకి అడుగు పెట్టినా..కలెక్షన్లు ఏ మాత్రం తగ్గడంలేదు. వీకెండ్లో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. ఈ సినిమా కలెక్షన్లపై సినిమా ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్లో స్పందించారు. భజరంగీ భాయిజాన్ (రూ.320కోట్లు), సుల్తాన్(రూ.300కోట్లు) రికార్డును ఈ సినిమా ఛేజ్ చేస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా 200కోట్లు దాటిపోయింది. వీకెండ్ , న్యూ ఇయర్ వల్ల ఈ సినిమా కలెక్షన్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఏక్తా టైగర్‌కు స్వీకెల్‌గా వచ్చిన ఈ సినిమాకు విమర్శకుల నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. సల్మాన్ అభిమానులను మాత్రమే అలరించేలా ఉందని అంటున్నారు. సల్మాన్.. తర్వాత రెమో డిసౌజా దర్శకత్వంలో ‘రేస్-3’, ముచ్చటగా మూడోసారి అలీ అబ్బాస్ డైరెక్షన్లో ‘భరత్’ సినిమాలో నటిస్తారు. #TigerZindaHai maintains a STRONG TREND... Now chasing the score set by #BajrangiBhaijaan [₹ 320.34 cr] and #Sultan [₹ 300.45 cr]… Biz expected to jump again on Sat [today], Sun and Mon [1 Jan]… [Week 2] Fri 11.56 cr. Total: ₹ 217.60 cr. India biz. #TZH — taran adarsh (@taran_adarsh) 30 December 2017 -
బాక్సాఫీస్ దగ్గర సల్మాన్ దూకుడు
-
భాయ్.. బాలీవుడ్‌ను బతికించాడు!
ప్రతిసారీ రంజాన్‌కు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ది ఒక సినిమా రావడం, అది సూపర్‌హిట్ అవ్వడం సర్వసాధారణం. ఈ ఏడాది జూన్‌లో, రంజాన్ సీజన్లో ‘ట్యూబ్‌లైట్’ అనే సినిమాతో వచ్చాడు సల్లూభాయ్! అయితే అది డిజాస్టర్. సల్మాన్ ఖాన్ సినిమా పరిస్థితి ఇలా అయినా మిగతా సినిమాలన్నా ఆడతాయిలే అనుకున్నారంతా! కానీ ఆ మిగతా సినిమాలూ అంతంతే ఆడాయి. దీంతో ఈ ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ డీలా పడిపోయింది. తెలుగు సినిమా ‘బాహుబలి–2’ అక్కడ డబ్ అయి పెద్ద హిట్ అవ్వడం తప్పితే, స్ట్రెయిట్ బాలీవుడ్ సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఉన్నవాటిల్లో బాగా ఆడిందంటే, ఒక్క ‘గోల్మాల్ అగైన్’ మాత్రమే! ఈ నేపథ్యంలో బాలీవుడ్‌కు 2017 బ్యాడ్ ఇయర్ అని ట్రేడ్ చెప్పుకుంటూ ఉంటే, మళ్లీ భాయే స్వయంగా వచ్చి కొత్తగా ఊపిరి పోశాడు. అదీ తన కొత్త సినిమా ‘టైగర్ జిందా హై’తో! జూన్‌లో పోతోనేమి, డిసెంబర్లో వచ్చి బాక్సాఫీస్‌ను గట్టిగానే కొల్లగొడుతున్నాడు. ఔట్ అండ్ ఔట్ యాక్షన్ సినిమా అయిన ‘టైగర్ జిందా హై’ గత శుక్రవారం విడుదలై, అందరి అంచనాలను అందుకుంటూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సల్మాన్ ఖాన్ గత చిత్రం ‘ట్యూబ్‌లైట్’ ఇండియాలో మొత్తం రన్లో 120 కోట్ల రూపాయలు వసూలు చేస్తే, ‘టైగర్ జిందా హై’ ఐదే ఐదు రోజుల్లో 173.07 కోట్ల రూపాయల నెట్ వసూళ్లు రాబట్టింది. క్రిస్మస్ లాంగ్ వీకెండ్ సినిమాకు బాగా కలిసొచ్చింది. దీంతో వంద కోట్ల క్లబ్లో ఎక్కువ సినిమాలున్నా (12) స్టార్‌గా సల్మాన్ ఖాన్ అవతరించాడు. వీక్డేస్లోనూ కలెక్షన్స్ ఏమాత్రం తగ్గకపోవడంతో మూడువందల కోట్ల క్లబ్‌లోనూ ‘టైగర్ జిందా హై’ చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. ఇప్పటికే సల్మాన్ ఖాతాలో రెండు మూడు వందల కోట్ల వసూళ్లు సాధించిన సినిమాలున్నాయి. అవి భజ్రంగీ భాయ్‌జాన్ (320.34 కోట్లు), సుల్తాన్ (300.45 కోట్లు). డబుల్ సెలెబ్రేషన్..! ఇక ‘టైగర్ జిందా హై’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూంటే, సల్మాన్‌ఖాన్ ఆనందానికి అవధుల్లేవు. ఈ జోరులోనే ఆయన తన పుట్టినరోజును (డిసెంబర్ 27) కూడా గ్రాండ్‌గా జరుపుకున్నాడు. సన్నిహితులు, ‘టైగర్ జిందా హై’ టీమ్‌తో కలిసి తన ఫామ్‌హౌస్‌లో సల్మాన్ బర్త్‌డే చేసుకున్నాడు. బర్త్‌డే సర్ప్రైజ్..! బర్త్‌డే సందర్భంగా తాను కొత్తగా చేయబోతున్న సినిమాను అనౌన్స్ చేసి, అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు సల్మాన్. ‘సుల్తాన్’, ‘టైగర్ జిందా హై’లతో తనకు బ్లాక్‌బస్టర్ హిట్స్ ఇచ్చిన అలీ అబ్బాస్ జాఫర్తోనే సల్మాన్ కొత్త సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాకు ‘భరత్’ అన్న టైటిల్‌ను ఖరారు చేశారు. అతుల్ అగ్నిహోత్రి, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా భాయ్ సెంటిమెంట్ ప్రకారం.. అభిమానులకు పండగ కానుకగా వచ్చే ఏడాది రంజాన్‌కు విడుదల కానుంది. కేక్ కట్ చేస్తూ... కత్రినాతో... ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో... -
రికార్డులు తిరగరాస్తున్న 'టైగర్'.. భారీ వసూళ్లు!
ముంబై: సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'టైగర్ జిందా హై' రికార్డులు తిరగరాస్తూ.. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. మూడురోజుల్లోనే వందకోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టేసింది. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మూడోరోజుల్లో రూ. 114.93 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్ సినీ చరిత్రలో అత్యధిక ప్రారంభ వసూళ్లు సాధించిన రెండో సినిమాగా 'టైగర్ జిందా హై' ఘనత సొంతం చేసుకుంది. 'బాహుబలి-2' తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మొత్తానికి వరుస ప్లాపులతో డీలాపడిన బాలీవుడ్‌కు కొత్త జీవం నింపేలా ఈ కలెక్షన్లు ఉండటం గమనార్హం. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సల్మాన్ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు శుక్రవారం రూ. 33 కోట్లు, రెండోరోజు శనివారం రూ. 34.10 కోట్లు తన ఖాతాలో వేసుకోగా.. ఆదివారం ఏకంగా 45.53 కోట్లు కలెక్ట్ చేసి.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. నేడు క్రిస్మస్ సందర్భంగా సోమవారం కూడా సెలవు కావడంతో ఈ సినిమా ప్రారంభ వసూళ్లు మరింతగా దుమ్మురేపే అవకాశం కనిపిస్తోంది. ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్నిచోట్ల దూసుకుపోతున్న 'టైగర్ జిందా హై' సినిమా మూడురోజుల్లో రూ. 114.93 కోట్లు వసూలుచేసిందని తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. అసాధారణరీతిలో వసూళ్లు రాబడుతున్న 'టైగర్ జిందా హై'.. ఇప్పటికే సల్మాన్ ఖాన్ సినిమా 'సుల్తాన్' రికార్డులను తిరగరాసింది. సుల్తాన్ మూడురోజుల్లో రూ. 104 కోట్లు వసూలుచేయగా.. టైగర్ అంతకుమించి రాబట్టడం గమనార్హం. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ తెరకెక్కిన ’టైగర్ జిందా హై’ .. ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్. -
టైగర్ దూకుడు.. అత్యంత భారీగా వసూళ్లు!
ముంబై: సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'టైగర్ జిందా హై' బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. అంచనాలకు మించి వసూళ్లు రాబడుతూ.. త్వరలోనే వందకోట్ల క్లబ్బులోకి అడుగుపెట్టే దిశగా దూసుకుపోతోంది. ఈ సినిమా తొలి రెండురోజుల కలెక్షన్స్ వివరాలు కళ్లు చెదిరేలా ఉన్నాయి. మొత్తానికి వరుస ప్లాపులతో డీలాపడిన బాలీవుడ్లో కొత్త జోష్ నింపేలా ఈ కలెక్షన్లు ఉండటం గమనార్హం. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సల్మాన్ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు రూ. 33 కోట్లు రాబట్టగా.. రెండోరోజు శనివారం ఏకంగా రూ. 34.10 కోట్లు తన ఖాతాలో వేసుకుంది. మొత్తం మీద రెండురోజుల్లో రూ. 69.40 కోట్లు కలెక్ట్ చేసిన ‘టైగర్ జిందా హై’... నేడు, రేపు మరో రెండురోజులు సెలవులు ఉండటంతో అతిత్వరలోనే వందకోట్ల మార్కును అందుకునే అవకాశముందని సినీ ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. మూడురోజుల్లోనే ఈ సినిమా వందకోట్ల మార్కును దాటితే.. అత్యంత వేగంగా వందకోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా ’టైగర్ జిందా హై’ నిలువనుంది. ఇప్పటికే, బాహుబలి-2 తర్వాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'టైగర్ జిందా హై' రికార్డు సాధించింది. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా అలీ అబ్బాస్ తెరకెక్కిన ’టైగర్ జిందా హై’ .. ఏక్ థా టైగర్ చిత్రానికి సీక్వెల్. -
‘ఆ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి’
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఓ రియాలిటీ డ్యాన్స్ షోలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపింది. ‘టైగర్ జిందా హై' చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ డ్యాన్స్ రియాలిటీ షోలో పాల్గొన్న శిల్పాశెట్టి ఓ డ్యాన్స్ ప్రదర్శనకు వాల్మీకి వర్గాన్ని కించపరిచే విధంగా కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో తప్పును గుర్తించిన ఈ బాలీవుడ్ భామ ట్విట్టర్ వేదికగా క్షమాపణలు కోరింది. ఆ ఇంటర్వ్యూలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించే ఉంటే క్షమించాలని ఆ ట్వీట్ లో కోరింది. భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమైన భారతదేశంలో పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని శిల్పా పేర్కొంది. ఈ రియాలిటీ షో కు హీరో సల్మాన్‌తో పాటు శిల్పాశెట్టి పాల్గొన్నారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై వాల్మీకి వర్గం ఫిర్యాదు మేరకు ఈ ఇద్దరిపై కేసునమోదైంది. ఈ ఘటనపై సల్మాన్ ఖాన్ ఇంకా స్పందించాల్సి ఉంది. I apologize if they have. I’m proud to belong to a country that boasts of diverse castes and creeds and I respect each one of them.🙏🙏 — SHILPA SHETTY KUNDRA (@TheShilpaShetty) 23 December 2017 -
దుమ్మురేపుతున్న టైగర్.. భారీగా వసూళ్లు!
ముంబై: ఈ ఏడాది పెద్ద సూపర్హిట్లు లేక డీలాపడిన బాలీవుడ్‌కు సల్మాన్ ఖాన్ తాజా సినిమా 'టైగర్ జిందా హై' సంవత్సరాంతంలో కొత్త ఊపిరినిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు యావరేజ్ రివ్యూలు వచ్చినా.. సల్మాన్ ఛరిష్మా కారణంగా భారీ వసూళ్లు రాబడుతోంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ మౌత్‌టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా తొలిరోజు రికార్డు వసూళ్లు సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 5700 థియేటర్లలో విడుదలైన 'టైగర్ జిందా హై' సినిమా మొదటిరోజు రూ. 33 కోట్లు కలెక్షన్లు రాబట్టిందని సినీ ట్రేడ్ నిపుణుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో తెలిపారు. బాహుబలి-2 తర్వాత తొలిరోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'టైగర్ జిందా హై' రికార్డు సాధించింది. ఇటు ఇండియాలోనే కాదు అటు ప్రపంచవ్యాప్తంగా 'టైగర్' బాక్సాఫీస్ వద్ద గర్జిస్తోందని, యూఏఈలో రూ. 6 కోట్లు, ఆస్ట్రేలియాలో రూ. 1.01 కోట్లు, న్యూజిల్యాండ్‌లో రూ. 38.54 లక్షలు వసూలు చేసిందని, అయితే, కువైట్‌లో ఈ సినిమా విడుదలను నిషేధించడంతో రెండు కోట్ల వరకు నష్టపోయిందని తరణ్ ఆదర్శ్ వివరించారు. ఈ ఏడాది తొలిరోజు అత్యధికంగా వసూలుచేసిన టాప్-5 సినిమాలు ఇవే 1. బాహుబలి 2 - రూ. 41 కోట్లు 2. టైగర్ జిందా హై - రూ.33.75 కోట్లు 3. గోల్మాల్ అగైన్ - రూ.30.14 కోట్లు 4. ట్యుబ్లైట్ - రూ.21.15 కోట్లు 5. రాయిస్ - రూ.20.42 కోట్లు -
సల్మాన్‌ఖాన్ సినిమాపై వివాదం
సాక్షి, ముంబై: సల్మాన్‌ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘టైగర్ జిందా హై’ ఈ నెల 22న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాపై వివాదం నెలకొంది. సినిమా విడుదలను నిలిపివేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే థియేటర్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. ముందు మరాఠీ సినిమాలకే థియేటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరాఠీ సినిమాలను కాదని బాలీవుడ్ సినిమాలు విడుదల చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు. తాజాగా సల్మాన్ తన ట్విటర్ ద్వారా ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. టైగర్ ను చూడడానికి తప్పకుండా థియేటర్ కు రండి అని ట్వీట్ చేశారు. జిందా హై అంటూ సాగిన ఈ పాటలో సల్మాన్ ఫైట్ సీన్స్ తో పాటు, కత్రినా కైఫ్ గన్ చేతబట్టి విలన్ల మీద ఫైర్ చేయడం హైలైట్ గా ఉన్నాయి. -
కంట్రోల్ తప్పితే...
... దూసుకెళ్లారు కత్రినా కైఫ్. ఏ రేసులో పాల్గొంది అనుకుంటున్నారా? దూసుకెళ్లింది రేసులో కాదండి బాబు. తను నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ జిందా హై’ షూటింగ్లో. ఇదో హై వోల్టేజ్ యాక్షన్ మూవీ అని మనకు తెలిసిన విషయమే. సినిమాలో ఒక కీలక సన్నివేశంలో వచ్చే కార్ చేజ్ సీక్వెన్స్‌లో భాగంగా కారు తను చెప్పిన మాట వినలేదట. అదేనండీ కంట్రోల్ అవ్వలేదట. చివరకు కార్‌ను తీసుకెళ్ళి ఓ గోడకు ఢీ కొట్టారట కత్రినా. ‘‘సినిమా ముందర కొద్దిగా శిక్షణ తీసు కున్నప్పటికీ మొరాకోలోని చిన్న వీధులు నన్ను కన్ఫ్యూజ్ చేసేశాయి. నేను కారుని గోడకు ఢీ కొట్టాక.. మా టీమ్ నాకు ఏమైందో అని కంగారు పడకుండా నా కారుకు తగిలించిన ఎక్స్పెన్సివ్ కెమెరాకు ఏమైందో అని కంగారుపడ్డారు’’ అని నవ్వేశారు కైఫ్. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ కానుంది. -
పద్మావతి ఎఫెక్ట్.. సల్మాన్‌కీ కష్టాలు తప్పవా?
సాక్షి, న్యూఢిల్లీ : పద్మావతి సెన్సార్ సర్టిఫికేషన్ వివాదం ఇప్పుడు బాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. సెన్సార్ నిబంధనల కారణంగా చిత్రం ఖచ్ఛితంగా పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మరోవైపు పాత నిబంధనలను తిరగదోడిన సీబీఎఫ్సీపై బాలీవుడ్ నిర్మాతలు మండిపడుతున్నారు. చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ జారీ కావాలంటే మేకర్లు 68 రోజుల ముందుగానే సెన్సార్ బోర్డు వద్ద దరఖాస్తు చేసుకోవాలన్న నిబంధన ఉంది. అయితే కొన్నేళ్లుగా ఆ రూల్‌ను బోర్డు పక్కనపడేసింది. ఇప్పుడు పద్మావతి చిత్రం వివాదాల్లో నానుతున్న నేపథ్యంలో అనూహ్యంగా మళ్లీ ఆ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. దీనికితోడు మేకర్లు అందించిన డాక్యుమెంట్లు అసంపూర్తిగా ఉన్నాయంటూ సర్టిఫికెట్ జారీచేయకుండా వెనక్కి తిప్పి పంపించి వేసింది. ఇప్పుడు ఆ ప్రభావం సల్మాన్ ఖాన్ కొత్త చిత్రం టైగర్ జిందా హై చిత్ర విడుదలపై పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. సల్మాన్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ఈ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కొద్దికాలంగా బాలీవుడ్ సినిమాలు కేవలం 22 రోజుల ముందుగానే సర్టిఫికెట్ కోసం సెన్సార్‌కు వెళ్తున్నాయి. కానీ, పాత నిబంధన మళ్లీ తెరపైకి రావటంతో ఇంత తక్కువ టైంలో టైగర్ జిందా హై చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ రావటం అనుమానంగా కనిపిస్తోంది. దీంతో సెన్సార్ తీరుపై బాలీవుడ్ నిర్మాతలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఈ మధ్య కాలంలో 68 రోజుల పద్ధతిని పాటించి విడుదలైన చిత్రాల జాబితాను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో సర్టిఫికెట్ జారీ విషయంలో పెనువివాదాలే చోటు చేసుకున్నాయి. గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ నటించిన మెసేంజర్ ఆఫ్ గాడ్ చిత్రానికి ఒక్క రోజు ముందుగానే సర్టిఫికెట్ ఇవ్వటం.. అది కాస్త తీవ్ర విమర్శలకు దారితీయటంతో అప్పుడు చైర్‌పర్సన్‌గా ఉన్న లీలా శామ్సన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. -
100 మంది డ్యాన్సర్లు... 4 దేశాలు!
ఒక సాంగ్‌ను సూపర్‌గా షూట్ చేయాలనుకుంటే రిచ్ లొకేషన్స్ కోసం విదేశాలను సెలెక్ట్ చేస్తారు దర్శక–నిర్మాతలు. అక్కడి లోకల్ జూనియర్ ఆర్టిస్టులనే తీసుకుంటారు. కానీ, అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా రూపొందిన ‘టైగర్ జిందా హై’ సినిమాలోని ‘స్వాగ్ ఇన్ స్వాగ్ సే స్వాగత్..’ సాంగ్ కోసం 4 దేశాల నుంచి 100 మంది డ్యాన్సర్లను రప్పించి, షూట్ చేశారు. సాంగ్ షూట్ లేట్ అవ్వకూడదని గ్రీస్, ఫ్రాన్స్, ఇటలీ, ట్రినిడాడ్ దేశాల నుంచి రప్పించిన జూనియర్ ఆర్టిస్టులకు ముందుగానే డ్యాన్స్ రిహార్సల్స్ నిర్వహించారు. వీళ్లతో పాటు సల్మాన్, కత్రినా వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉంటాయట. ‘‘ఈ సినిమాకి ఈ పాట కీలకంగా ఉంటుంది. ‘సెలబ్రేటింగ్ పీస్’ అన్న కాన్సెప్ట్‌తో సాంగ్‌ను రూపొందించాం. అందుకే ఇలా నాలుగు దేశాలకు చెందిన ఆర్టిస్టులతో ప్లాన్ చేసి షూట్ చేశాం’’ అని పేర్కొన్నారు దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్. 2012లో వచ్చిన ‘ఏక్తా టైగర్’ సినిమాకు ‘టైగర్ జిందా హై’ చిత్రం సీక్వెల్ అన్న సంగతి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో కత్రినా యాక్షన్ సీక్వెన్స్‌లో నటించారు. డిసెంబర్ 22న చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
టైగర్ జిందాహై ఆన్ లోకేషన్ స్టిల్స్
-
నాకు పెళ్లైతే మీకేంటి లాభం?
బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హీరో ఎవరంటే సల్మాన్ ఖాన్ అని టక్కున చెప్పేస్తారు. ‘ప్రేమకు సై.. పెళ్లికి నై’ అన్నది ఈ కండల వీరుడి సిద్ధాంతం అని జోక్లేస్తారు కూడా. మరి.. సల్మాన్ లవర్స్ లిస్ట్ తక్కువేం కాదు కదా! సంగీతా బిజ్లానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్, ప్రస్తుతం లూలియా వంతూర్... ఇలా చాలా మందితో ఈయనగారు ప్రేమాయణం సాగించారు. బట్.. పెళ్లి? ఊహూ! మూడు ముళ్లు వేసేదాకా ఏ ప్రేమనూ కొనసాగించలేదు. అందుకే సల్మాన్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడగకుండా ఉండరు. తాజాగా ఇదే ప్రశ్న మరోసారి ఈ కండలవీరుడికి ఎదురైంది. సల్మాన్, కత్రినా జంటగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందిన ‘టైగర్ జిందా హై’ డిసెంబరు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా ముంబైలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. మెజారిటీ ఫ్యాన్స్ సల్లూభాయ్ పెళ్లి విషయాన్ని పదే పదే ప్రస్తావించారు. ఇందుకు సల్మాన్ స్పందిస్తూ– ‘‘నా పెళ్లి గురించి మీరందరూ ఆలోచిస్తుండటం సంతోషంగా ఉంది. పెళ్లి టైమ్ వస్తే అయిపోతుంది. లేకుంటే లేదు. పెళ్లి గురించి ప్రత్యేకంగా ఆలోచించడం లేదు. నాకు పెళ్లి అయితే మీకేం లాభమో నాకర్థం కావడం లేదు. అయినా నేనిప్పుడు చాలా హ్యాపీగా ఉన్నా’’ అంటూ ఎప్పటిలానే పెళ్లెప్పుడో చెప్పకుండా దాటేశారు. -
బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసిన సల్మాన్
ఇటీవల వరుస ఫ్లాప్ లతో ఇబ్బందుల్లో పడ్డ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ జిందాహై. గతంలో ఘనవిజయం సాధించిన ఏక్తా టైగర్ కు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ నెలాఖరున రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ట్రైలర్ గత చిత్రాల డిజిటల్ రికార్డులన్నింటినీ చెరిపేస్తూ దూసుకుపోతోంది. తాజాగా యూట్యూబ్‌లో అత్యధిక లైక్‌లు సాధించిన భారతీయ చిత్ర ట్రైలర్‌గా రికార్డ్ సృష్టించింది టైగర్ జిందాహై. గతంలో ఐదున్నర లక్షల లైకులతో బాహుబలి 2 ట్రైలర్ పేరిట ఉన్న రికార్డ్‌ను 7 లక్షలకు పైగా లైకులతో టైగర్ జిందాహై ట్రైలర్ బ్రేక్ చేసింది. అంతేకాదు ఇప్పటికే మూడు కోట్ల వ్యూస్‌కు చేరువలో ఉన్న ఈ ట్రైలర్, త్వరలో అత్యధిక వ్యూస్ సాదించిన ట్రైలర్‌గా కూడా రికార్డ్ సృష్టింస్తుందని భావిస్తున్నారు. సల్మాన్ సరసన కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు, యష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. అయితే ట్రైలర్ల లిస్ట్ లో బాహుబలి, ట్రైగర్ జిందాహైలు ముందున్నా.. తమిళ సినిమా ‘మెర్సల్’ టీజర్ 10లక్షలకు పైగా లైకులు సాదదించి ఎవరికీ అందని స్థాయిలో నిలిచింది. -
ముద్దంటే చేదా?
ము.. ము.. ము.. ము.. ముద్దంటే చేదా.. నీకా ఉద్దేశం లేదా... అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ని ఉద్దేశించి. గతంలో ఎప్పుడూ పెదవి ముద్దులకు అడ్డుచెప్పని సల్లూభాయ్ ఇప్పుడు బుద్ధిమంతుడిలా మారిపోయారట. ముద్దంటే చేదే? అంటున్నారట. అసలు సంగతికొస్తే.. సల్మాన్‌ఖాన్, పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ మాజీ ప్రేమికులన్న సంగతి తెలిసిందే. గతంలో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వీరు ఆ తర్వాత విడిపోయారు. లవ్ బ్రేకప్ అయిన చాన్నాళ్లకు ఇద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘టైగర్ జిందా హై’. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ డిమాండ్ చేయడంతో ఈ చిత్రంలో సల్మాన్–కత్రినా మధ్య ఓ లిప్‌లాక్ ప్లాన్ చేశారట దర్శకుడు. అయితే, తన మాజీ లవర్ని ముద్దు పెట్టుకునేందుకు సల్లూభాయ్ నో అనేశారట. ముద్దు విషయంలో దర్శకుడు ఎంతగా కన్విన్స్ చేసేందుకు ప్రయత్నించినా ‘సారీ.. కుదరదు’ అన్నారట కండలవీరుడు. దీంతో చేసేదేం లేక ముద్దు సన్నివేశం లేకుండానే షూటింగ్ కానిచ్చేశారట. డిసెంబర్ 22న ఈ సినిమా విడుదలవుతోంది. ఇంతకీ సల్మాన్ ముద్దు ఎందుకు వద్దన్నారు? తాజా లవర్ లూలియా వంటూర్ వద్దన్నారా? అయ్యే ఉంటుంది. -
‘టైగర్’ బతికే ఉంది కానీ.. పాపం కృష్ణజింక..!
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్ తాజా సినిమా ’టైగర్ జిందా హై’ సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ’ఏక్ థా టైగర్’ సినిమాకు ఇది సీక్వెల్. భారీ యాక్షన్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్ టైగర్‌గా, కత్రినా కైఫ్ జోయాగా సూపర్ గూఢచారి పాత్రలను పోషిస్తున్నారు. భారీ యాక్షన్ సీన్లతో కూడిన ఈ సినిమా ట్రైలర్ ఆన్లైన్లో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో సల్మాన్, కత్రిన వీరోచిత యాక్షన్ సీన్లపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ఈ సినిమా ట్రైలర్‌పై పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. ’ట్యూబ్‌లైట్’తో ఈ ఏడాది భారీ ఫ్లాప్‌ను అందుకున్న సల్మాన్ ’టైగర్ జిందా హై’తో మరో సూపర్‌హిట్‌ను అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు. ట్రైలర్‌పై ప్రశంసలు సంగతి ఎలా ఉన్నా.. కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికర ఛలోక్తులు విసురుకుతున్నారు. ’ టైగర్ బతికుంది కానీ.. పాపం కృష్ణజింకే లేదు’ అంటూ జోకులు, పంచ్ డైలాగులు విసిరుతున్నారు. ’షికార్ థో సబ్ కర్తే హై లేకిన్ టైగర్ సే బెహ్తర్ కోహి నహి కర్తా’ (అందరూ వేటాడుతారు కానీ, పులి కన్నా మెరుగ్గా ఎవరూ వేటాడలేరు’ అంటూ ఈ సినిమాలో సల్మాన్ చెప్పిన డైలాగ్‌ను కూడా కృష్ణజింక కేసు విషయంలో ఉదహరిస్తున్నారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ కొన్నాళ్ల కిందటి వరకు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. Tiger zinda hai per hiran nahi. 😂#TigerZindaHai — Razi (@Frstrated_Engnr) November 7, 2017 Shikar to Sab karte hai, par tiger se behtar shikar koi nahi kar sakta.#tigerzindahai#22nddecember2017 — Vish Tailor (@beingvishal123) November 7, 2017 -
టైగర్ జిందాహై : ఫుల్ యాక్షన్
కండల వీరుడు సల్మాన్‌ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న అడ్వంచరస్ యాక్షన్ మూవీ ‘టైగర్ జిందాహై’.ఈ సినిమాలో కత్రినా కైఫ్ మరోసారి సల్మాన్‌తో జోడి కడుతోంది. అలీ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. సల్మాన్ కు తిరుగులేని రికార్డ్ ఉన్న క్రిస్టమస్ సీజన్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇరాక్ లో కిడ్నాప్ కు గురైన 25 మంది నర్సులను కాపాడేందుకు ఓ భారతీయ ఏజెంట్, పాకిస్తాన్ స్పై ఎలాంటి సాహసాలు చేశారన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. పూర్తి యాక్షన్ సీన్స్‌తో రూపొందించిన టైగర్ జిందాహై ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
టైగర్ జిందాహై : ఫుల్ యాక్షన్
-
7న టైగర్ ట్రైలర్
సాక్షి,న్యూఢిల్లీ:బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. వీరిద్దరూ చాలా కాలం తర్వాత స్క్రీన్‌ను పంచుకున్న టైగర్ జిందా హై ట్రైలర్ విడుదల తేదీ వెల్లడైంది. నవంబర్ 7న ఈ ప్రతిష్టాత్మక మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 2012 సూపర్ హిట్ ఏక్ థా టైగర్‌కు టైగర్ మూవీ సీక్వెల్‌గా రూపొందింది. ఇటీవల విడుదలైన టైగర్ జిందా హై మూవీ స్టిల్స్ నెట్లో వైరల్ అయ్యాయి. ఈ స్టిల్స్‌లో సల్మాన్ చేతిలో ఎంజీ 42 గన్స్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీపై బాలీవుడ్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి అనంతరం ఆ స్థాయి వసూళ్లతో బాలీవుడ్ మూవీ ఇంతవరకూ రాకపోవడంతో అందరి చూపూ టైగర్పైనే నెలకొంది. మరి కండలవీరుడు ఈ మూవీతో మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడేమో చూడాలి. -
యాక్షన్ మోడ్ లో సల్మాన్, కత్రినా
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా ఏక్తా టైగర్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సినిమాలో నటిస్తున్నాడు సల్మాన్. తొలి భాగంలో సల్మాన్ భారత రా ఏజెంట్ గా, కత్రినా పాకిస్తాన్ ఐఎస్ ఐ ఏజెంట్ గా నటించారు. సీక్వల్ లో వారి పాత్రలో ఎలా ఉండబోతున్నాయో అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఫస్ట్ పార్ట్ కు మించి యాక్షన్ ఎపిసోడ్స్ అలరిస్తాయని తెలుస్తోంది. తాజా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా యాక్షన్ కు సంబంధించిన సీన్స్ తోనే డిజైన్ చేయటంతో సినిమా మీద అంచానలు భారీగా పెరిగిపోతున్నాయి. గత రెండు చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవటంతో టైగర్ జిందాహైతో బిగ్ హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు సల్లూ భాయ్. -
దెబ్బతిన్న పులిలా ఎవరూ వేటాడలేరు!!
ఈ ఏడాది 'ట్యూబ్‌లైట్' సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన సల్మాన్ ఖాన్.. 'టైగర్ జిందా హై' సినిమాతో సూపర్‌హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులను పలుకరించనుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా సల్మాన్ తన అభిమానులతో పంచుకున్నాడు. 'గాయపడ్డ పులిలా ఎవరూ వేటాడలేరు' అన్న క్యాప్షన్‌తో చేతిలో గన్, తీక్షణమైన లుక్‌తో ఈ పోస్టర్లో సల్మాన్ ఆకట్టుకున్నాడు. 2012లో వచ్చిన ఏక్ థా టైగర్ సినిమాకు ఇది సీక్వెల్. సల్మాన్ మాజీ ప్రియురాలిగా ముద్రపడిన కత్రినా కైఫ్ ఈ సినిమాలో కండలవీరుడితో రొమాన్స్ చేయబోతున్నది. అలీ అబ్బాస్ జఫార్ దరకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 22న విడుదల కానుంది. Diwali Gift.... pasand aaya? Ab Christmas pe milna... #tigerzindahai A post shared by Salman Khan (@beingsalmankhan) on Oct 17, 2017 at 10:00pm PDT -
దీపావళికి సల్మాన్ గిఫ్ట్..!
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ జిందాహై. ఇటీవల విడుదలైన ట్యూబ్ లైట్ ఆశించిన స్ధాయి విజయం సాధించకపోవటంతో ఈ సినిమాతో మరోసారి సత్తా చాటాలని భావిస్తున్నాడు సల్మాన్. ఈ సినిమా గతంలో ఘనవిజయం సాధించిన ఏక్తా టైగర్ సినిమాకు సీక్వల్ కావటంతో టైగర్ జిందాహై పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సల్మాన్, కత్రినాలు మరోసారి టైగర్ జోయా పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. సల్మాన్ కు సూపర్బ్ రికార్డ్ ఉన్న క్రిస్టమస్ సీజన్ లోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోగా అభిమానుల్లో అంచనాలు పెంచేందుకు ఈ దీపావళి ఓ గిప్ట్ ఉందంటూ ఊరిస్తున్నాడు దర్శకుడు జాఫర్. అయితే ఆ గిఫ్ట్ టీజరే అయి ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్. Arre bhai Sabko pata hai 22 Dec ko @TigerZindaHai as rahi hai.Bahut kaam chal raha hai,abhi Diwali aa rahi hai... kuch gift toh milega 😉 — ali abbas zafar (@aliabbaszafar) 11 October 2017 -
షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బాలీవుడ్ బ్యూటీస్ లో కత్రినాకైఫ్ ముందు వరుసలో ఉంటుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో రెగ్యులర్ గా అప్ డేట్స్ ఇచ్చే కత్రినా తాజాగా ఓ షాకింగ్ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై షూటింగ్లో బిజీగా ఉన్న కత్రినా ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియో ఒకటి తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తెగ పుష్అప్స్ చేస్తున్నట్లుగా కనిపించింది కత్రినా. ముందు రెండు చేతులు నేల మీద ఆన్చి పుష్ అప్స్ చేసిన క్యాట్, తరువాత ఒక చేతిని మాత్రమే ఆన్చి చేస్తుంది. తరువాత రెండు చేతులు నేల మీద ఆన్చకుండానే పుష్ అప్స్ చేస్తుంది. ఇదిలా సాధ్యం అంటూ షాక్ అయ్యే లోపే ఆ సీక్రెట్ ఏంటో రివీల్ చేసేసింది. కత్రినా పోస్ట్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే లక్షల కొద్ది వ్యూస్ వేల కొద్ది కామెంట్స్ వచ్చాయి. -
షాక్ ఇస్తున్న కత్రినా పుష్ అప్స్
-
కష్టాల్లో సల్మాన్ కొత్త సినిమా..!
ప్రస్తుతం సినీరంగం బిజినెస్‌గా మారిపోయింది. అంతా సక్సెస్ వెంటే పరిగెడుతున్నారు. ముఖ్యంగా మంచి ఫాంలో ఉన్న హీరోలతో దీర్ఘకాలిక ఒప్పందాలు చేసుకుంటున్న సంస్థలు తరువాత ఆ తారలకు ఫ్లాప్స్ రావటంతో ఆ ఒప్పందాలను సవరించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సల్మాన్ తాజా చిత్రం ట్యూబ్‌లైట్ నిరాశపరచటంతో ఆ ప్రభావం తదుపరి చిత్రాలపై పడింది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న టైగర్ జిందాహై సినిమా బిజినెస్ ట్యూబ్‌లైట్ రిలీజ్‌కు ముందే పూర్తయ్యింది. కానీ ట్యూబ్‌లైట్ రిజల్ట్ తరువాత డిస్ట్రిబ్యూటర్లు ఆలోచనలో పడ్డారు. పాత అగ్రిమెంట్లను సవరించాలను సల్మాన్‌పై వత్తిడి తెస్తున్నారు. సల్మాన్ సినిమాల శాటిలైట్స్ రైట్స్‌ను ఒకేసారి భారీ మొత్తానికి తీసుకున్న టీవీ చానల్ కూడా అగ్రిమెంట్లో మార్పులు చేయాలని కోరుతుందన్న ప్రచారం జరుగుతోంది. మరి ఈ సమస్యల నుంచి బయట పడాలంటే సల్మాన్ ఓ బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాల్సిందే. ఏక్తా టైగర్‌కు సీక్వల్గా తెరకెక్కుతున్న టైగర్ జిందాహై సల్మాన్‌ను తిరిగి నిలబెడుతుందేమో చూడాలి. -
'టైగర్ జిందా హై' మూవీ స్టిల్స్
-
ప్లేబాయ్ మోడల్‌తో సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సూపర్ హిట్ సినిమా ఏక్తా టైగర్ సీక్వల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైగర్ జిందాహై అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. మాజీ ప్రియురాలు కత్రినాతో మరోసారి జతకడుతున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నాడు సల్మాన్. ఈ సినిమాలో ప్లేబాయ్ మోడల్ రొంజా ఫోర్చెర్ కీలక పాత్రలో నటిస్తోందట. ఇప్పటి వరకు చిత్రయూనిట్ నుంచి మాత్రం రొంజా పాత్రపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే టైగర్ సెట్స్‌లో రొంజా సందడి చేయటం, సల్మాన్‌తో కలిసి రొంజా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సల్మాన్ మరో హాట్ బ్యూటీని బాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 2017లో పబ్లిష్ అయిన ప్లేబాయ్ మ్యాగజిన్లో న్యూడ్‌గా కనిపించిన రొంజాకు ఆస్ట్రియన్ టీవీ యాక్ట్రస్గానూ అనుభవముంది. -
బ్రాండ్... కత్రినా
హీరోయిన్ కాక ముందు కత్రినా కైఫ్ మోడల్‌గా పనిచేశారు. 14 ఏళ్ల వయసులో మోడల్‌గా కెరీర్ స్టార్ట్ చేశారామె. లేటెస్ట్ ఫ్యాషన్స్, స్టైల్స్, ట్రెండ్స్‌పై చాలా అవగాహన ఉంది. ఇప్పుడు హీరోయిన్గా ఇండియాలో మంచి పాపులారిటీ ఉంది. ఈ పాపులారిటీని క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. బ్రాండ్ కత్రినా పేరుతో ఓ ఫ్యాషన్ లేబుల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే.. దుస్తులు అమ్మడం అన్నమాట. లాస్ట్ టైమ్ లండన్ వెళ్లినప్పుడు ఫ్యాషన్ లేబుల్ గురించి అక్కడ నిపుణులతో డిస్కస్ చేశారట. సోనమ్ కపూర్, దీపికా పదుకునే, కరీనా కపూర్, బిపాసా బసు, అలియా భట్, లారా దత్తాలు... ఎప్పుడో తమ పేరు మీద ఫ్యాషన్ లేబుల్ స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో మనసులో ఈ ఆలోచన ఉన్నప్పటికీ.. కత్రినా కైఫ్ కాస్త లేటుగా స్టార్ట్ చేస్తున్నారు. ‘‘నిజమే... నా పేరుతో ఫ్యాషన్ లేబుల్ స్టార్ట్ చేస్తున్నా. వివరాలు ఇప్పుడే చెప్పలేను. త్వరలో అధికారికంగా ప్రకటిస్తా’’ అన్నారు కత్రినా కైఫ్. మాజీ ప్రేమికులు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ నాలుగేళ్ల తర్వాత ‘ఏక్ థా టైగర్’ సీక్వెల్ ‘టైగర్ జిందా హై’లో జంటగా నటించనున్నారు. ఈ నాలుగేళ్లలో నా జీవితంతో పాటు ఈ ప్రపంచంలో చాలా మార్పులొచ్చాయన్నారు. ఈ మాటలకు కారణం మధ్యలో రణ్‌బీర్ కపూర్‌తో లవ్, బ్రేకప్ అంటారా! -
తగ్గేది లేదు!
కత్రినా కైఫ్‌కి రాజీపడడం ఇష్టం ఉండదు. అది వ్యక్తిగతమైనా... వృత్తి జీవితమైనా. రాజీపడలేరు కాబట్టే.. ప్రియుడు రణబీర్ తీరు నచ్చక అతనికి దూరమయ్యారు. సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు అసలు నటనే రాదనే ముద్ర పడింది ఆమె మీద. ఆ తర్వాత అద్భుతంగా నటించి, అందరి నోళ్లు మూయించేశారు. చివరికి యాక్షన్ సీన్స్ కూడా చేసేస్తున్నారు. ‘ఏక్ థా టైగర్’లో రిస్కీ యాక్షన్ సీన్స్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో ఫైట్ సీన్స్‌లో నటించారు. ఇప్పటివరకూ చేసిన ఫైట్స్ అన్నీ ఒక ఎత్తై ఇప్పుడు ‘టైగర్ జిందా హై’లో చేయనున్న ఫైట్స్ మరో ఎత్తు అనేలా ఉంటాయట. నాలుగేళ్ల క్రితం సల్మాన్‌ఖాన్, కత్రినా నటించిన ‘ఏక్ థా టైగర్’కి ఇది సీక్వెల్. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల సల్మాన్‌తో ‘సుల్తాన్’ చిత్రాన్ని తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ఈ సీక్వెల్‌ని నిర్మించనున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ భారతీయ గూఢచారి టైగర్‌గా, కత్రినా పాకిస్తాన్ గూఢచారి జోయాగా నటించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు. ఇందులో రిస్కీ ఫైట్స్ ఉంటాయి కాబట్టి, కత్రినా కైఫ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోనున్నారు. ‘రిస్క్ ఎందుకు? సినిమాని వదులుకుంటే ఏం పోతుంది’ అని సన్నిహితులు అన్నప్పటికీ ‘తగ్గేది లేదు’ అని కత్రినా అన్నారట. ఇదిలా ఉంటే, ‘ఏక్ థా టైగర్’లో సల్మాన్, కత్రినాల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ జంట మెస్మరైజ్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. వచ్చే డిసెంబర్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. -
మళ్లీ జంటగా మాజీ ప్రేమికులు!
సుల్తాన్ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న సల్మాన్ ఖాన్.. మరోసారి తన మాజీ ప్రేయసి కత్రినా కైఫ్‌తో కలిసి సినిమా చేస్తున్నాడు. వీళ్లిద్దరూ జంటగా 2012లో వచ్చిన యాక్షన్ రొమాంటిక్ సినిమా 'ఏక్ థా టైగర్'. ఆ సినిమాకు సీక్వెల్ గానే ఇప్పుడు 'టైగర్ జిందా హై' అనే సినిమా తీస్తున్నారు. పాత సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించగా.. ఈసారి మాత్రం సుల్తాన్ దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ మెగాఫోన్ పడుతున్నారు. యశ్‌రాజ్ ఫిలింస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బక్రీద్ సందర్భంగా దర్శకుడు జాఫర్ ట్విట్టర్లో ఈ కొత్త సినిమా పోస్టర్ విడుదల చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించాడు. ఈ సినిమా అంటే కాస్త భయంగాను, మరోవైపు ఉత్సాహంగాను కూడా ఉందని తెలిపాడు. ఒక ఇండియన్ ఏజెంటు, పాకిస్థానీ గూఢచారి.. ఇద్దరూ ఒకే శత్రువుపై పోరాటం చేస్తారన్న విషయం పోస్టర్లో టైటిల్ కింద ఉంది. ఏక్‌థా టైగర్ సినిమాలో కూడా భారతీయ గూఢచారి టైగర్.. పాకిస్థానీ గూఢచారి కత్రినాతో ప్రేమలో పడతాడు. ఈ సినిమా వచ్చే ఏడాది క్రిస్మస్ నాటికి విడుదల అవుతుందట. సల్మాన్, కత్రినా కలిసి ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశారు. 'మైనే ప్యార్ క్యోం కియా', 'పార్ట్నర్', 'యువరాజ్', 'ఏక్ థా టైగర్'. ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్లో ఇది ఐదో సినిమా కానుంది. Tiger Zinda Hai @BeingSalmanKhan #katrina kaif. Nervousness and excitement. pic.twitter.com/c8tHrBenIe — ali abbas zafar (@aliabbaszafar) 13 September 2016