
సాక్షి,న్యూఢిల్లీ:బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. వీరిద్దరూ చాలా కాలం తర్వాత స్క్రీన్‌ను పంచుకున్న టైగర్ జిందా హై ట్రైలర్ విడుదల తేదీ వెల్లడైంది. నవంబర్ 7న ఈ ప్రతిష్టాత్మక మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. 2012 సూపర్ హిట్ ఏక్ థా టైగర్‌కు టైగర్ మూవీ సీక్వెల్‌గా రూపొందింది.
ఇటీవల విడుదలైన టైగర్ జిందా హై మూవీ స్టిల్స్ నెట్‌లో వైరల్ అయ్యాయి. ఈ స్టిల్స్‌లో సల్మాన్ చేతిలో ఎంజీ 42 గన్స్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. స్టైలిష్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ మూవీపై బాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాహుబలి అనంతరం ఆ స్థాయి వసూళ్లతో బాలీవుడ్ మూవీ ఇంతవరకూ రాకపోవడంతో అందరి చూపూ టైగర్‌పైనే నెలకొంది. మరి కండలవీరుడు ఈ మూవీతో మ్యాజిక్‌ను రిపీట్ చేస్తాడేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment