తగ్గేది లేదు! | Salman Khan, Katrina Kaif to Reunite Onscreen for 'Tiger Zinda Hai' | Sakshi
Sakshi News home page

తగ్గేది లేదు!

Published Fri, Sep 16 2016 11:40 PM | Last Updated on Mon, Sep 4 2017 1:45 PM

తగ్గేది లేదు!

తగ్గేది లేదు!

కత్రినా కైఫ్‌కి రాజీపడడం ఇష్టం ఉండదు. అది వ్యక్తిగతమైనా... వృత్తి జీవితమైనా. రాజీపడలేరు  కాబట్టే.. ప్రియుడు రణబీర్ తీరు నచ్చక అతనికి దూరమయ్యారు. సినిమాల విషయానికొస్తే.. ఒకప్పుడు అసలు నటనే రాదనే ముద్ర పడింది ఆమె మీద. ఆ తర్వాత అద్భుతంగా నటించి, అందరి నోళ్లు మూయించేశారు. చివరికి యాక్షన్ సీన్స్ కూడా చేసేస్తున్నారు. ‘ఏక్ థా టైగర్’లో రిస్కీ యాక్షన్ సీన్స్ చేశారు. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాల్లో ఫైట్ సీన్స్‌లో నటించారు. ఇప్పటివరకూ చేసిన ఫైట్స్ అన్నీ ఒక ఎత్తై ఇప్పుడు ‘టైగర్ జిందా హై’లో చేయనున్న ఫైట్స్ మరో ఎత్తు అనేలా ఉంటాయట.
 
 నాలుగేళ్ల క్రితం సల్మాన్‌ఖాన్, కత్రినా నటించిన ‘ఏక్ థా టైగర్’కి ఇది సీక్వెల్. కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా నిర్మించిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇటీవల సల్మాన్‌తో ‘సుల్తాన్’ చిత్రాన్ని తెరకెక్కించిన అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ఈ సీక్వెల్‌ని నిర్మించనున్నారు. ఇందులో సల్మాన్ ఖాన్ భారతీయ గూఢచారి టైగర్‌గా, కత్రినా పాకిస్తాన్ గూఢచారి జోయాగా నటించనున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు.
 
  ఇందులో రిస్కీ ఫైట్స్ ఉంటాయి కాబట్టి, కత్రినా కైఫ్ ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోనున్నారు. ‘రిస్క్ ఎందుకు? సినిమాని వదులుకుంటే ఏం పోతుంది’ అని సన్నిహితులు అన్నప్పటికీ ‘తగ్గేది లేదు’ అని కత్రినా అన్నారట. ఇదిలా ఉంటే, ‘ఏక్ థా టైగర్’లో సల్మాన్, కత్రినాల కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. మరోసారి ఈ జంట మెస్మరైజ్ చేస్తారనే అంచనాలు ఉన్నాయి. వచ్చే డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement