‘టైగర్‌’ బతికే ఉంది కానీ.. పాపం కృష్ణజింక..! | social media comments on Tiger Zinda Hai trailer | Sakshi
Sakshi News home page

‘టైగర్‌’ బతికే ఉంది కానీ.. పాపం కృష్ణజింక..!

Published Wed, Nov 8 2017 12:05 PM | Last Updated on Wed, Nov 8 2017 1:18 PM

social media comments on Tiger Zinda Hai trailer - Sakshi

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సల్మాన్‌ ఖాన్‌ తాజా సినిమా ’టైగర్‌ జిందా హై’ సినిమా ట్రైలర్‌ మంగళవారం విడుదలైంది. ఎనిమిదేళ్ల కిందట వచ్చిన ’ఏక్‌ థా టైగర్‌’ సినిమాకు ఇది సీక్వెల్‌. భారీ యాక‌్షన్‌, రొమాంటిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సల్మాన్‌ టైగర్‌గా, కత్రినా కైఫ్‌ జోయాగా సూపర్‌ గూఢచారి పాత్రలను పోషిస్తున్నారు. భారీ యాక‌్షన్‌ సీన్లతో కూడిన ఈ సినిమా ట్రైలర్‌ ఆన్‌లైన్‌లో దుమ్మురేపుతోంది. ఈ సినిమాలో సల్మాన్‌, కత్రిన వీరోచిత యాక‌్షన్‌ సీన్లపై సోషల్‌ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలామంది ఈ సినిమా ట్రైలర్‌పై పాజిటివ్‌ కామెంట్‌ చేస్తున్నారు.

’ట్యూబ్‌లైట్‌’తో ఈ ఏడాది భారీ ఫ్లాప్‌ను అందుకున్న సల్మాన్‌ ’టైగర్‌ జిందా హై’తో మరో సూపర్‌హిట్‌ను అందుకోవడం ఖాయమని ఆయన అభిమానులు అంటున్నారు. ట్రైలర్‌పై ప్రశంసలు సంగతి ఎలా ఉన్నా.. కొందరు నెటిజన్లు మాత్రం ఈ సినిమా టైటిల్‌పై ఆసక్తికర ఛలోక్తులు విసురుకుతున్నారు. ’ టైగర్‌ బతికుంది కానీ.. పాపం కృష్ణజింకే లేదు’ అంటూ జోకులు, పంచ్‌ డైలాగులు విసిరుతున్నారు. ’షికార్‌ థో సబ్‌ కర్తే హై లేకిన్‌ టైగర్‌ సే బెహ్‌తర్‌ కోహి నహి కర్తా’ (అందరూ వేటాడుతారు కానీ, పులి కన్నా మెరుగ్గా ఎవరూ వేటాడలేరు’ అంటూ ఈ సినిమాలో సల్మాన్‌ చెప్పిన డైలాగ్‌ను కూడా కృష్ణజింక కేసు విషయంలో ఉదహరిస్తున్నారు. కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్‌ ఖాన్‌ కొన్నాళ్ల కిందటి వరకు నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement