
సాక్షి, ముంబై: సల్మాన్‌ఖాన్ నటించిన ‘ఏక్ థా టైగర్’ సినిమాకి సీక్వెల్‌గా వస్తున్న ‘టైగర్ జిందా హై’ ఈ నెల 22న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమాపై వివాదం నెలకొంది. సినిమా విడుదలను నిలిపివేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ ఠాక్రే థియేటర్ యజమానులకు వార్నింగ్ ఇచ్చారు. ముందు మరాఠీ సినిమాలకే థియేటర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరాఠీ సినిమాలను కాదని బాలీవుడ్ సినిమాలు విడుదల చేస్తే అంగీకరించే ప్రసక్తే లేదన్నారు.
తాజాగా సల్మాన్ తన ట్విటర్ ద్వారా ఈ సినిమా టైటిల్ సాంగ్ రిలీజ్ చేశారు. టైగర్ ను చూడడానికి తప్పకుండా థియేటర్ కు రండి అని ట్వీట్ చేశారు. జిందా హై అంటూ సాగిన ఈ పాటలో సల్మాన్ ఫైట్ సీన్స్ తో పాటు, కత్రినా కైఫ్ గన్ చేతబట్టి విలన్ల మీద ఫైర్ చేయడం హైలైట్ గా ఉన్నాయి.