దీపావళికి సల్మాన్ గిఫ్ట్..! | Tiger Zinda Hais trailer be Ali Abbas Zafars Diwali gift | Sakshi
Sakshi News home page

దీపావళికి సల్మాన్ గిఫ్ట్..!

Published Thu, Oct 12 2017 12:23 PM | Last Updated on Thu, Oct 12 2017 12:23 PM

Tiger zinda Hai

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం టైగర్ జిందాహై. ఇటీవల విడుదలైన ట్యూబ్ లైట్ ఆశించిన స్ధాయి విజయం సాధించకపోవటంతో ఈ సినిమాతో మరోసారి సత్తా చాటాలని భావిస్తున్నాడు సల్మాన్. ఈ సినిమా గతంలో ఘనవిజయం సాధించిన ఏక్తా టైగర్ సినిమాకు సీక్వల్ కావటంతో టైగర్ జిందాహై పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో సల్మాన్, కత్రినాలు మరోసారి టైగర్ జోయా పాత్రల్లో దర్శనమివ్వనున్నారు. సల్మాన్ కు సూపర్బ్ రికార్డ్ ఉన్న క్రిస్టమస్ సీజన్ లోనే ఈ సినిమాను కూడా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈలోగా అభిమానుల్లో అంచనాలు పెంచేందుకు ఈ దీపావళి ఓ గిప్ట్ ఉందంటూ ఊరిస్తున్నాడు దర్శకుడు జాఫర్. అయితే ఆ గిఫ్ట్ టీజరే అయి ఉంటుందని భావిస్తున్నారు ఫ్యాన్స్.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement