దెబ్బతిన్న పులిలా ఎవరూ వేటాడలేరు!! | Tiger Zinda Hai first look | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న పులిలా ఎవరూ వేటాడలేరు!!

Published Wed, Oct 18 2017 6:26 PM | Last Updated on Wed, Oct 18 2017 6:33 PM

Tiger Zinda Hai first look

ఈ ఏడాది 'ట్యూబ్‌లైట్‌' సినిమాతో ఫ్లాప్‌ ఇచ్చిన సల్మాన్‌ ఖాన్‌.. 'టైగర్‌ జిందా హై' సినిమాతో సూపర్‌హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకులను పలుకరించనుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను దీపావళి సందర్భంగా సల్మాన్‌ తన అభిమానులతో పంచుకున్నాడు. 'గాయపడ్డ పులిలా ఎవరూ వేటాడలేరు' అన్న క్యాప్షన్‌తో చేతిలో గన్‌, తీక్షణమైన లుక్‌తో ఈ పోస్టర్‌లో సల్మాన్‌ ఆకట్టుకున్నాడు. 2012లో వచ్చిన ఏక్‌ థా టైగర్‌ సినిమాకు ఇది సీక్వెల్‌. సల్మాన్‌ మాజీ ప్రియురాలిగా ముద్రపడిన కత్రినా కైఫ్‌ ఈ సినిమాలో కండలవీరుడితో రొమాన్స్‌ చేయబోతున్నది. అలీ అబ్బాస్ జఫార్‌ దరకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్‌ 22న విడుదల కానుంది.

Diwali Gift.... pasand aaya? Ab Christmas pe milna... #tigerzindahai

A post shared by Salman Khan (@beingsalmankhan) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement