‘ఆ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి’ | Shilpa Shetty apologises for her 'Bhangi' Comment | Sakshi
Sakshi News home page

‘ఆ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగిస్తే క్షమించండి’

Published Sun, Dec 24 2017 3:24 PM | Last Updated on Mon, Aug 20 2018 2:50 PM

 Shilpa Shetty apologises for her 'Bhangi' Comment - Sakshi

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఓ రియాలిటీ డ్యాన్స్‌ షోలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు తెలిపింది. ‘టైగ‌ర్ జిందా హై' చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొన్న శిల్పాశెట్టి ఓ డ్యాన్స్‌ ప్రదర్శనకు  వాల్మీకి వర్గాన్ని కించపరిచే విధంగా  కామెంట్‌ చేసింది. ఈ వ్యాఖ్యలు వివాదస్పదం కావడంతో తప్పును గుర్తించిన ఈ బాలీవుడ్‌ భామ ట్విట్టర్‌ వేదికగా క్షమాపణలు కోరింది.

ఆ ఇంటర్వ్యూలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, ఒకవేళ తన వ్యాఖ్యలు ఎవరికైనా ఇబ్బంది కలిగించే ఉంటే  క్షమించాలని ఆ ట్వీట్ లో కోరింది. భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమైన భారతదేశంలో పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని శిల్పా పేర్కొంది. ఈ రియాలిటీ షో కు హీరో సల్మాన్‌తో పాటు శిల్పాశెట్టి పాల్గొన్నారు. ఇప్పటికే ఈ వ్యాఖ్యలపై వాల్మీకి వర్గం ఫిర్యాదు మేరకు ఈ ఇద్దరిపై కేసునమోదైంది. ఈ ఘటనపై సల్మాన్ ఖాన్ ఇంకా స్పందించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement