ప్లేబాయ్ మోడల్తో సల్మాన్ | Salman is seen in the film with the Playboy model | Sakshi
Sakshi News home page

ప్లేబాయ్ మోడల్తో సల్మాన్

Published Thu, Apr 13 2017 11:59 AM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

ప్లేబాయ్ మోడల్తో సల్మాన్

ప్లేబాయ్ మోడల్తో సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సూపర్ హిట్ సినిమా ఏక్తా టైగర్ సీక్వల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైగర్ జిందాహై అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. మాజీ ప్రియురాలు కత్రినాతో మరోసారి జతకడుతున్న ఈ సినిమాకు మరింత గ్లామర్ యాడ్ చేస్తున్నాడు సల్మాన్. ఈ సినిమాలో ప్లేబాయ్ మోడల్ రొంజా ఫోర్చెర్ కీలక పాత్రలో నటిస్తోందట.

ఇప్పటి వరకు చిత్రయూనిట్ నుంచి మాత్రం రొంజా పాత్రపై ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే టైగర్ సెట్స్లో రొంజా సందడి చేయటం, సల్మాన్తో కలిసి రొంజా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో సల్మాన్ మరో హాట్ బ్యూటీని బాలీవుడ్కి పరిచయం చేస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 2017లో పబ్లిష్ అయిన ప్లేబాయ్ మ్యాగజిన్లో న్యూడ్గా కనిపించిన రొంజాకు ఆస్ట్రియన్ టీవీ యాక్ట్రస్గానూ అనుభవముంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement